మల్కచెరువులో.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం.
నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంలో గల మల్కచెరువులు శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైందని స్థానిక ఎస్సై రాజేష్ తెలిపారు. మృతుడు చామన చాయ రంగులో ఉండి, నీలిరంగు ప్యాంట్, నలుపు రంగు డ్రాయర్, ఎడమ చేతి పై సూర్యుడు బొమ్మని పోలిన పచ్చబొట్టు కలిగి ఉన్నాడన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే నిజాంపేట 8712657979, రామాయంపేట 8712657933 లను సంప్రదించాలన్నారు.
