చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ..
ఆర్కెపి ఎస్ఐ ఏ శ్రీధర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంaజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పార్కింగ్ ప్రాంతాలు, ఆటో స్టాండ్లు, హోటల్లు, పాన్ షాపుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గంజాయి సేవించిన వారితో పాటు విక్రయించిన వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు సేవించే వారి వివరాలు తెలియ పరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగ ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.a
