మహా న్యూస్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంద శ్యామ్ సుందర్ ఆరోపణ
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శ
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ అవమానకర ప్రసారాలు నిర్వహిస్తున్న మహా న్యూస్ తెలుగు టీవీ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంద శ్యామ్ సుందర్ ఆరోపించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ మరియు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.గత మూడు రోజులుగా “డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి కొడుకులు మంచి వాళ్లా, చెడ్డ వాళ్లా” అనే విధంగా స్క్రోలింగ్లు, ప్రసారాలు నిర్వహిస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమాలు మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయని ఆరోపించారు.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరిన నేపథ్యంలో రాజకీయ కక్షతో ఆయనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంద శ్యామ్ సుందర్ అన్నారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన నాయకుడైన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మహా న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు ఎండీ వంశీ కృష్ణపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, అవమానకర ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్ ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఒంటరు చక్రి, పుష్పత్తులయ, మరపెళ్లి మనోజ్, శనిగరం శ్రీనివాస్, జన్ను హరికృష్ణ, తేళ్లూరి సురేష్, దుడేలా సిద్దు, కొగిలా కిరణ్, మోట్ల మౌనిక, రాజేశ్వరి, అంబాల చింటూ, గుర్రం సుశ్రుథ్ తదితరులు పాల్గొన్నారు.
