రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

పరకాల,నేటిధాత్రి

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పరకాల కాంగ్రెస్ పార్టీ మండల,పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో గురువారం పరకాల క్యాంపు కార్యాలయంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్,మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఆధునిక సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.యువతకు ఓటు హక్కు కల్పించడం, ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేయడం ద్వారా భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దేశ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిన్నాల గోనాధ్, ఎండీ యాకుబ్ పాషా,మండల అధ్యక్షులు కోలపాక చందు,మున్సిపల్ కౌన్సిలర్లు కొయ్యాడా శ్రీనివాస్,బండి శ్రీధర్,అల్లె దశరథం,పాలకుర్తి శ్రీనివాస్,సమన్వయ కమిటీ సభ్యులు ఏకు విద్యాసాగర్,బొచ్చు సాల్మాన్,మేరుగు శ్రీశైలం, ఎండీ రంజాన్ ఆలీ,మార్క రఘుపతి,నల్లెల్ల అనిల్,కొక్కిరాలతిరుపతిరావు,ఎస్సీసెల్ నాయకుడు బొమ్మకంటి చంద్రమౌళి,సోషల్ మీడియా ప్రతినిధి గడ్డం శివకుమార్,ఐలిపెల్లి స్వామి,గొట్టె రమేష్,పసుల శ్రీనివాస్,అజయ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version