గౌడ కులస్తులపై దాడిచేసిన విడిసీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి :

నిర్మల్ జిల్లా తానూర్ మండలం మహాలింగిలో గౌడ కులస్థులపై దాడి చేసిన విడిసీ లపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.కల్లు వ్యాపారం కోసం విడిసీ(విల్లెజ్ డెవలప్మెంట్ కమిటీ )కి సంవత్సరానికి 4.5 లక్షలు ఒప్పందంతో గీత కార్మికులు చెల్లించారు.ప్రస్తుతం 8 లక్షలు ఇస్తేనే వ్యాపారం చేయాలని, లేని పక్షంలో కల్లు అమ్ముకోకూడదని విడిసి ఆంక్షలు పెట్టడంతో బాధితులు అంత డబ్బులు చెల్లించలేమని తెలిపారన్నారు.వీడీసీ సభ్యులు కల్లు వ్యాపారం చేయొద్దని చెప్పడంతో వ్యాపారం బంద్ చేసి చెట్లు ఎక్కి కల్లు అమ్ముకొని జీవనం సాగిస్తుంటే ఆది కూడా సహించని వీడీసీ పెద్దలు అడ్డుకున్నారని పేర్కొన్నారు. గ్రామంలో వీడీసీ సభ్యులు మరల మీటింగ్ పెట్టి 20 లక్షలు ఇస్తేనే అమ్ముకోవాలని తీర్మానం చేయగా మేము అంత డబ్బులు చెల్లించలేమని చెప్పిన గౌడ కులస్తులపై ఆగ్రహం చెందిన వీడీసీ సభ్యులయిన కృష్ణ పటేల్, గిరి నారాయణ, జరికోట పోశెట్టి, మారుతీ తో పాటు మరో 10 మంది గీత కార్మికుల ఇండ్లపై దాడులు చేయడం జరిగిందని, ఈ దాడిలో సాయినాద్ గౌడ్ గాయపడటం జరిగిందన్నారు. ఇప్పటికైనా గీత కార్మికులపై దాడులు చేసిన వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, గీత కార్మికులకు న్యాయం చేయాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!