వనపర్తి నేటిధాత్రి ;-
వనపర్తి పట్టణంలో మాతా శిశు ప్రభుత్వ ఆస్పటల్ దగ్గర జీవనోపాధి కొరకు ఒక హోటల్ ముందు టిఆర్ఎస్ నాయకురాలు కొమ్ము లక్ష్మి చిన్నపిల్లలకు అవసరమయ్యే వస్తువులను అమ్ముకొనుటకు వ్యాపారం ఏర్పాటు చేసుకున్నదని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు అగ్ని ప్రమాదంలో చిరు వ్యాపారి కొమ్ము లక్ష్మి అమ్ముకోవడానికి ఏర్పాటు చేసుకున్న వస్తువులు కాలి బూడిద అయ్యాయని తెలిపారు . ఈ సంఘటన తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిరు వ్యాపారిని పరామర్శించారు బాధితు రాలికి 10000 వేలు ఆర్థిక సహాయం అందించారని అశోక్ తెలిపారు . దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి లో చిరు వ్యాపారులు బీమా సౌకర్యం చేయించుకోవాలని కోరారు .చిరు వ్యాపారులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు . మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ టిఆర్ఎస్ నేతలు నీల స్వామి సూర్యవంశం గిరి మురళి సాగర్ స్టార్ రహీం విజయ్ కుమార్ గంధం పరంజ్యోతి బాలరాజు టిఆర్ఎస్ నేతలు ఉన్నారు