18 సంవత్సరాలు చేరుకున్న ఎన్ఆర్ఈజీఎస్
కాంగ్రెస్ జిల్లా నాయకుడు సాయిలి. ప్రభాకర్
వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
గ్రామాల్లో పేద ప్రజలు పనులు దొరకక గ్రామీణ ప్రాంతాల నుండి బస్తీలకు పనుల కోసం వలసలు పోతుంటే పేద కూలీలకు పని కల్పించాలని ఒక సంకల్పంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన దేవత తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సాయిలి ప్రభాకర్ తెలిపారు.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏర్పడిన జాతీయ ఉపాధి హామీ పథకం అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పతాకాన్ని ప్రారంభించారని నేటికీ 18 సంవత్సరాలు పూర్తి అయ్యిందని తెలిపారు.ఈ సందర్బంగా సోనియా గాంధీ,మన్మోహన్ సింగ్ లకు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.