మున్సిపల్ చైర్ పర్సన్
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రజలకు అందేలా చూడాలని పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ 21 జనవరి నుండి 24జనవరి వరకు నాలుగు రోజులు పరకాల మున్సిపల్ పరిధిలోని 22 వార్డులకు 4 చోట్ల ప్రజా పాలన గ్రామసభలు ఉన్నాయన్నారు.గ్రామ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులలో ఇదివరకు లిస్టులో పేర్లు లేనట్లయితే ఈ గ్రామ సభలో అర్హులైన వారు అందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు.నాయకులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొని పథకాలను ప్రజలకు అందేలా చూడాలని,ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
పథకాలను ప్రజలకు అందేలా చూడాలి
