ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం గూడెం గ్రామంలో వీధి కుక్కల దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చిలుక అనూష- అశోక్ దంపతుల కుమారుడు రియాన్ష్ (4 సం ) ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడు పై దాడి చేయడం జరిగింది. ముఖంపై తీవ్ర గాయాలైన బాలుడు అపస్మారక స్థితికి వెళ్లడంతో హుటాహుటిన కరీంనగర్ లోని శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు.
బాలుడి ముఖంపై 32 కుట్లు పడ్డాయని , ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చికిత్స చేసిన డాక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈ పేద దంపతులు బాలుడు చికిత్సకోసం ఇప్పటికి 1,50,000 రూపాయలు ఖర్చు చేశారు. రెక్కాడితే తే గాని డొక్కాడని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
గ్రామంలో ఇంతకుముందు కూడా నలుగురు చిన్నారులు ఇలాగే వీధి కుక్కలు దాడిలో గాయపడ్డారని.. పలువురు అధికారులు నాయకులకు విన్నవించినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని .
వీధి కుక్కల నిర్మూలనకు వెంటనే అధికారులు,నాయకులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు