#గుడుంబా తయారుచేసిన, విక్రయించిన వారిపై పీడి యాక్టు నమోదు చేస్తాం.
#ఇన్ఫో సిమెంట్ టాస్క్ఫోర్స్ సిఐ నాగయ్య.
నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫోసిమెంట్ సిఐ నాగయ్య అన్నారు సోమవారం మండలంలోని నందిగామ, గ్రామాలలో విశ్వనీయ సమాచార మేరకు గుడుంబా స్థావరంలపై నల్లబెల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పలువురుపై కేసు నమోదు చేశారు 1300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయగా, 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేయడం జరిగిందని అలాగే తయారుచేసిన విక్రయించిన సంబంధిత నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామని ఆయన అన్నారు. ఈ దాడులలో నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, స్టార్ స్పోర్ట్స్ ఎస్ఐ రమాదేవి, ఎన్ఫోర్మెంట్ ఎస్ఐ శిరీష, స్థానిక ఎస్సై వి .గోవర్ధన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.