అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన సర్పంచి శ్రీకాంత్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది
ధాన్యం తడవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
భూపాలపల్లి రూరల్ మండలం కొంపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి సడల శ్రీకాంత్ ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనాలి అని రైతులకు న్యాయం చేయాలి అని వారు డిమాండ్ చేశారు
