కాలుష్య జలాలతో పంట నష్టం.. నరోత్తం ఆగ్రహం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని యాంత్రిక పశువదశాల నుండి కాలుష్య జలాలను పంటపొలాలకు వదులుతున్నారని, దీనివల్ల పంట నష్టం జరుగుతోందని ఎస్సీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నరోత్తం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, కాలుష్య జలాలను నిలిపివేయాలని ఆయన అధికారులను కోరారు.