పదవ వార్డు ప్రజల విన్నపం
హుజూర్ నగర్: నేటిధాత్రి.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు నందుగల పదో వార్డు నందు బోర్లన్ని ఎండిపోయి నీటి ఎద్దడి ఏర్పడిందని, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పదవ వార్డు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్ పదో వార్డు నందు గ్రామపంచాయతీ పైపులైను ఉన్నను అది పనిచేయడం లేదని దానిని వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేపించి నీటి ఎద్దడిని తీర్చాలని కార్యదర్శికి రాతపూర్వకంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో కర్నాటి విద్యాసాగర్ రెడ్డి, సవి శేఖర్, మస్తాన్ , రాపోలు రవి, దామెర్ల ఆంజనేయులు, ఉప్పతల్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.