హుజూర్ నగర్ బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రెస్ మీట్.

ఛలో నల్గొండ సభను విజయ వంతం చేయాలి.

హుజూర్ నగర్:నేటిధాత్రి.

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ సాగర్ ఆయకట్టు ఎండతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదు, ఖమ్మం పాలేరు నీటిని తరలించిన విధంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని చెరువులని నింపే విధంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలి. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెడ్ స్టోరేజ్ లో ఉన్నా కానీ సాగర్ ఆయకట్టు రైతులకు నీటి విడుదల చేసి రైతుల పొలాలు ఎండకుండా చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కింది.. మేం నాగార్జునసాగర్ ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని మేము అడిగితే కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాంటి ఓ ప్రాజెక్టును పట్టుకొని అవినీతి జరిగిందంటూ ప్రగాల్పాలు పలుకుతున్నారు.ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్లకే ఉంది టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సభ పెడుతుంటే ఆ సభను చూసి భయపడుతూ మేడిగడ్డ సందర్శన అంటూ చిత్రమైన కార్యక్రమాలను చేపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ రైతులు పొలాలు ఎండుతున్న, ఊర్లలో మూగజీవాలకి నీరు అందక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవేవీ కనిపించడం లేదు.
చలో నల్గొండ సభని విజయవంతం చేసేందుకు రైతులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ గతంలో నీటి కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే ఉద్యమం ప్రారంభించామని నేడు కూడా అదే స్థాయిలో మళ్లీ బీఅర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో నీటి ఉద్యమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల్లోనే ప్రజల్ని ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *