కెజిఎఫ్ స్టార్ పై రవితేజ కామెంట్స్… నీపై గౌరవం పోయిందంటూ ఫ్యాన్స్ ఫైర్

రవితేజ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. యష్ ఫ్యాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ హీరో యష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి.

యాంకర్ ఒక్కో సౌత్ ఇండియా స్టార్ పేరు చెబుతూ వాళ్లపై రవితేజ అభిప్రాయం షార్ట్ గా చెప్పాలన్నారు. ముందు రాంచరణ్, ప్రభాస్, విజయ దేవరకొండపై తన అభిప్రాయాన్ని చెప్పారు రవితేజ. చివరిగా యష్ గురించి అడిగింది యాంకర్. ఆయన గురించి నాకు తెలిసింది తక్కువ. యష్ అంటే కెజిఎఫ్. అలాంటి సినిమా ఆయనకు రావడం అదృష్టం అన్నారు.

రవితేజ అభిప్రాయంలో యష్ కేవలం కెజిఎఫ్ వలన స్టార్ అయ్యాడు. ఆ సినిమా అతనికి లక్ తెచ్చిపెట్టింది. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు అన్నట్లుగా ఉంది. టాలెంట్ లేకుండా అదృష్టంతో పైకి వచ్చాడని రవితేజ అన్నట్లు యష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రవితేజపై విమర్శలు వెల్లువెత్తాయి.

రవితేజకు వ్యతిరేకంగా యష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన నీపై గౌరవం ఉండేది. ఇప్పుడు అదిపోయింది. యష్ విషయంలో నువ్వు ఇగో బయటపెట్టావు. యష్ కేవలం కెజిఎఫ్ వలన స్టార్ కాలేదు. అంతకు ముందే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *