Temple Theft Accused Arrested
దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు
జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ
ఎస్సై ఆవుల తిరుపతి
వీణవంక, నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని ఎల్బక,గంగారం, కోర్కల్ ,కొండపాక,గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి మరియు పెద్దమ్మ తల్లి దేవాలయంలో దొంగలించిన వ్యక్తి కుంటాల భీమయ్య మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి (40) అతని సహచరుడు నర్సయ్య ( చిరంజీవి) కలిసి దొంగతనాలకు పాల్పడ్డారు గ్రామాల శివారు ప్రాంతాలలో రాత్రి సమయంలో దేవాలయల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు మరియు హుండీ నగదు దొంగతనాలు చేసి దొంగలించిన సొమ్మును తాగుడుకు జల్సాలకు వాడుకుని మరియు కొన్ని వస్తువులు నర్సయ్య దగ్గర ఉన్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. వీరిలో భీమయ్య కాపలా ఉండగా మడక నర్సయ్య దొంగతనాలు చేయడం తేదీ 16-04-2026 మరల దొంగతనం చేయుటకు రెడ్డిపల్లి గ్రామం వైపు తిరుగుతూ రెక్కి చేస్తు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా, భీమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఒక వెయ్యి రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగినది, నర్సయ్య పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి కుంటాల భీమయ్య ను గురువారం సాయంత్రం రిమాండ్ కు పంపారు.
