కూకట్పల్లి, జూన్ 28 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ పరిధిలోని ఇండియన్ బ్యాంక్ నుండి ఎల్లమ్మ చెరువు సర్ ప్లస్ నాలా వద్దకు రెండు కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న భూగర్భ పైప్ లైన్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరి గింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని శుభోదయ కాలనీ పరిసర ప్రాంతాలలో రోడ్డు మీద నిలిచి పోతున్న వరద నీరుని ప్రస్తుతం నిర్మిస్తు న్న పైప్ లైన్ల ద్వారా నేరుగా ఎల్ల మ్మచె రువు సర్ ప్లస్ నాలలో కలిసేట ట్లుగా ఏర్పాటుచేసి పైప్ లైన్ నిర్మాణం జరుగు తుందని అన్నారు.చిన్న వర్షానికి కూడా గతంలో చాలాసార్లు ఇండియన్ బ్యాంక్ వద్ద నీరు నిలిచిపోయి పక్కన ఉన్న ఇండ్లలోకి, అపార్టుమెంట్ సెల్లార్ లలోకి నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ భూగర్భ పైప్ లైన్ నిర్మా ణంతో వరద నీటి సమస్య తొలగిపో తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి,శివరాజ్గౌడ్,షౌకత్ అలీ మున్నా,పోశెట్టిగౌడ్,నజీర్,మోజెస్,
వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.