తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఘనంగా జన్మదిన వేడుకలు
వనపర్తి నేటిధాత్రి :
నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ పి ఐ టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని వారు కొనియాడారు .మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో మరెన్నో జన్మదినం వేడుకలు జరుపుకొని ఆయురారోగ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు ఆవుల శ్రీనివాసులు హోటల్ బలరాం కొత్త గొల్ల శంకర్ డి బాలరాజ్ ఎండి ఫారూఖ్ రాజు తెలుగుదేశం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు