టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వం నమోదు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టారు. సోమవారం టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి హాజరయ్యారు.అదేవిధంగా మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపూరావు టీఎన్జీవో ఉద్యోగుల సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.మున్సిపల్ కార్పొరేషన్,కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కలసి 97 నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టిఎన్జీవో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు.అనంతరం టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులు,సభ్యులు కలసి ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో మీ యూనిట్లలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులను కలిసి డిసెంబర్ 10 లోగా టీఎన్జీవో సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా నిలవాలని తెలిపారు.ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ అనురాగ్,మున్సిపల్ శాఖ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి,కరుణాకర్ పాల్గొన్నారు.
