గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం పోతిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అంగవైకల్యం కలిగిన ఎట్టి అబ్బయ్య ఇల్లు గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది.రెక్కాడితే గాని డొక్కాడనీ అబ్బయ్య కుటుంబం నిన్న కురిసిన వర్షానికి గ్రామం లోని ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి పించన్ తో జీవనం గడుపుతున్న అబ్బయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే బాధ్యతాయుతంగా ఆదుకోవాలని గుండాల మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పిటిసి వాగబోయినా రామక్క,మాజీ గుండాల సర్పంచ్ కోరం సీతారాములు కోరారు.
డ్రైనేజీలు నిర్మించాలి. మామిడి అశోక్
రోడ్డుకు ఇరువైపులా కాలువలు నిర్మించకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు రోడ్లపై పారుతుంది నివాసాల మధ్య మురుగునీరు నిలుస్తూ దుర్భరం వెదజల్లుడంతో పందులు దోమలు స్వెరా విహారం చేస్తున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు వర్షం పడితే నీళ్లు పోవడానికి మార్గం లేక ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచి జనం బయటకు రాలేని పరిస్థితి ఉంది కొన్ని చోట్ల కాలువల లేక రోడ్లపైనే మురుగునీరు ఏరులై పారుతుంది కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపి కాపాడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైనేజీ లేక ప్రజలు అస్తవ్యస్తం……రోడ్లపైనే మురుగునీరు
మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలకేంద్రం కూడలి నుండి ఆత్మకూరుకు వెళ్లే దారిలో డ్రైనేజ్ లేకుండానే రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీనికితోడు వర్షాలు కురుస్తుండడంతో రహదారుల పైకి మురుగునీరు వచ్చేస్తోంది.అలాగే డ్రైనేజీ లేక వ్యర్థాలు నివాస గృహంలోకి చొచ్చుకవస్తుంది స్థానిక ప్రజలు పడరాన్ని పాట్లు పడుతు న్నారు.చిన్నపాటి వర్షంవస్తే చాలు వరద నీరు రోడ్లపైకి ఏరులై పారుతుంది దీనికి తోడు భరించలేని దుర్వాసన వెదజ ల్లడంతో ప్రజలు ప్రత్యక్ష నరకంగా జీవనం కొనసాగి స్తున్నారు ఇప్పటికైనా మండల కేంద్రంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.
*వాసుదేవ్ రావు హీరోగా “సిల్క్ సారీ ” సినిమా నుంచి డైరెక్టర్ సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ‘చేతులోన స్కాచ్ గ్లాస్” ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
సాయి రాజేష్ గారు మాట్లాడుతూ, సినిమా టైటిల్ సిల్క్ శారీ . లిరికల్ సాంగ్ చూడడానికి చాలా బాగుంది డైరెక్టర్ కి మంచి కమర్షియల్ సినిమా రేంజ్ లో పాట హిట్ అవ్వాలని
కోరుకుంటున్న . అలాగే కమలేష్ కుమార్ గారు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి .ఆయన మొదటి ప్రయత్నంగ చేసిన ఈ సిల్క్ సారీ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అయి ఆయనకి మంచిపేరు రావాలని ఆశిస్తున్నాను .
ఈ చిత్రం కచ్చితంగ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.
డైరెక్టర్ :టి . నాగేందర్
నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్
బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి
కెమెరా : సనక రాజశేఖర్
పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి
సన్నాలు సాధ్యమా!
https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024/2
`పేదలకు సన్న బియ్యం మంచి ఆలోచన!
`తెలంగాణ భూములు అనువేనా!
`సన్నాలకు సమయం ఎక్కువ!
`అంత నీటి సౌలత్ వుందా!
`మూడు పంటల చోట రెండు పంటలతో రైతు బతికేనా!
`సన్నాల సస్య రక్షణ ఖర్చుతో కూడుకున్న పని.
`పంట చేతికొచ్చే సమయంలో రసం పీల్చే చీడతో బెడద.
`గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ఈ ప్రయోగం విఫలం.
`మళ్ళీ సన్నాలంటే రైతులు ముందుకొస్తారా!
`ప్రాంతాల వారిగా ఏ పంటలు వేయాలో రైతులకు తెలుసు.
`బలవంతపు సాగు మొదటికే మోసం.
`ప్రభుత్వం పునరాలోచించాలి.
`రైతు మేలును కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
`సన్నాలు పండిరచేందుకు రైతు ముందుకు రావాలి.
`నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయాలి.
`నకిలీ విత్తనాలు అరికట్టాలి.
`తెలంగాణకు అవసరమైన విత్తనం వుందా!
`సన్నాల సాగు విపరీతమైన ఖర్చు.
`రైతు భరించగలడా?
`అందుకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వుండాలి.
`సన్నాలకు ఎక్కువ చెల్లింపులు జరగాలి.
`అదనంగా బోనస్ అందాలి.
`సన్నాలు నిర్ణీత సమయంలో కొనుగోలు చేయాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇచ్చే యోచన చేస్తున్నామని చెప్పడం శుభ పరిణామం. అదే సమయంలో తెలంగాణలో సన్న వరి పంటలకే బోనస్ అని చెప్పడం ఒక్కసారిగా రైతులకు కలవరపాటుకు గురిచేసింది. ఈ సలహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎవరిచ్చారోగాని, గత ప్రభుత్వ హయాంలో సన్నాలు పండిరచాలని కేసిఆర్ సూచించినప్పుడు వ్యతిరేకించారు. కేసిఆర్ రైతులను ఆగం చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని కూడా అన్నారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నాలను తెరమీదకు తెవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. కారణం తెలంగాణలో సన్న రకాలు చాలా ప్రాంతాల్లో పండేదుకు అవకాశం లేదు. కేవలం విజయవాడకు సమీపంలో వున్న కోదాడ ప్రాంతాలలో మాత్రమే సన్న రకాలు పండేందుకు అనువైన వాతావరణం ఎక్కువగా వుంది. మిగతా ప్రాంతాలు సన్నాలకు అనువైన ప్రదేశాలు కాదు. వాతావరణం విషయంలో సన్నాలకు గాలిలో తేమ ఎక్కువగా వుండాలి. తెలంగాణలో ఎక్కువ భాగం తేమ వుండదు. అందువల్ల సన్నాలు పండేందుకు అనువైన వాతావరణం కాదు. ఇక తెలంగాణలో నీటి వసతులు పుష్కలంగా వున్న సమయంలోనే సన్నాలను పండిరచాలని గత ప్రభుత్వం సూచించి వెనక్కి తీసుకున్నది. రైతులను సన్నాలు పండిరచాలని సూచించి, కేసిఆర్ దొడ్డు రకాలు పండిరచి, రైతులనుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయాలనుకోడం మంచిదే. కాని రైతులు బోనస్ పేరుతో రైతులు సన్నాలు పండిరచాలని సూచించడం వల్ల రైతులు అయోమయంలో పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సన్నాలకే బోనస్ ఇస్తామంటే, రైతులు ఆ బోనస్‌ను కూడా వదులుకునేందుకు సిద్దంగానే వుంటారు. కారణం తెలంగాణ భూములలో ఎక్కువగా దొడ్డురకాలే ఎక్కువగా పండేదుకు ఆస్కారం వుంది. దొడ్డు వడ్లు ఎకరానానికి సుమారు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దాని వల్ల రైతుకు ఎకరాకు రూ.60వేల సంపాదన సమకూరుతుంది. అందులో సగం ఖర్చులు తీసేసినా రూ.30వేలు ఆదాయం వస్తుంది. కాని సన్నాల వల్ల దిగుబడి చాలా తగ్గిపోతుంది. సన్నాలు ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. అందుకు మించి ఒక్క క్వింటాల్ కూడా ఎక్కువ రాదు. కాని అదే దొడ్డు రకంలో కొన్ని రకాలు 40 బస్తాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం వుంది. కాని ఏ సన్నాలలో అలాంటి అవకాశం లేదు.
ఇక దొడ్డు రకం వరికి ఎరువుల ఖర్చు కొంత తక్కువే. చీడల పీడల కోసం వాడే పురుగుల మందుల ఖర్చు సన్న వరికన్నా తక్కువే. అందువల్ల రైతులకు లాభ సాటిగా వ్యవసాయం అంటే కేవలం దొడ్డు వరి మాత్రమే అన్నది అందరికీ తెలుసు. అయినా తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందనేది రైతులకు తెలిసినంతగా ఏ శాస్త్రవేత్తకు తెలియదు. ఎందుకంటే తరతరాలుగా వారి పూర్వీకులు ఏ పంటలు పండిస్తున్నారో చూస్తూనేవున్నారు. తెలంగాణలో గోదుమ సాగు అసలే సాద్యం కాదు. అలా తెలంగాణలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పంటలు పండుతుంటాయి. ఉత్తర తెలంగాణలో వరితోపాటు మొక్కజొన్న, పత్తి ఎక్కువగా పండుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా వరి, మిర్చి, పత్తి పంటలు పండుతుంటాయి. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా కంది, మొక్క జొన్న పండేందుకు భూములు అనువుగా వున్నాయి. దేశంలోనే తాండూరు కందిపప్పుకున్న డిమాండ్ అంతా ఇంతాకాదు. పొరుగున వున్న కర్నాకటలో ఎర్ర కంది పప్పు పండిస్తారు. కాని ఆ పక్కనే వున్న మన తెలంగాణలో మాత్రం ఎర్ర కందిపప్పు పండదు. ఇలా భూముల రకాలను బట్టి, ప్రజల ఆహార అలవాట్లను బట్టి పంటలు పండిరచడం జరుగుతుంది. ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, సాగులో కొత్త కొత్త వంగడాలు వచ్చినా, దిగుబడులు పెరిగే పంటలనే రైతులు సాగు చేస్తారు గాని, దిగుబడి తక్కువ పంటలు పండిరచేందుకు సాహసం చేయరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయమే వాతావరణంతో జూదం లాంటిది. నిజామాబాద్ లాంటి ప్రాంతాలలో ఎర్రజొన్న, చెరుకు పంటలు పండిస్తుంటారు. మరి ఒక్క తెలంగాణలోనే ఇన్ని రకాల పంటలు పండుతున్నాయి. అయితే గతంలో నీటి వసతులు అంతంగా లేనప్పుడు కేవలం వర్షాధార పంటలు పండిచిన సమయంలో నువ్వులు కూడా పండిరచేవారు. కాని తెలంగాణలో ఇటీవల నీటి వసతులు బాగా మెరుగైనందున నువ్వుల సాగు అన్నది జాడ కూడా లేదు. కొన్ని ప్రాంతాలో ఉలువలు పండిరచేవారు. జొన్నలుపండిరచేవారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వాటి జాడ చూద్దామన్నా లేదు. ఇక నగరాలకు సమీపంలో వున్న ప్రాంతాలలో కూరగాయల సాగు, పువ్వుల సాగులకు ఎక్కువ ప్రాదాన్యతిస్తున్నారు.
శాసనసభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని పంటలకు బోనస్ రూ.500 ఇస్తామని చెప్పారు. కాని పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే కేవలం సన్న రకం వడ్లకే బోనస్ ప్రకటించడం అన్నది సరైంది కాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అయితే రైతులు సన్నాలు పండిరచి, వాటిని బియ్యం చేసి అమ్ముకుంటే దొడ్డు బియ్యం కన్నా మేలు. కాని తెలంగాణలో సన్న రకాలలో నాణ్యమైన బియ్యం కేవలం ఖరీఫ్‌లోనే సాధ్యమౌతుంది. ఎందుకంటే ఖరీఫ్‌లో సాగుకు అవసరమైన నీరు పుష్కలంగా అందుతుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా వుంటుంది. కాని రబీ సీజన్‌లో తేమ వుండదు. సన్న రకాల వడ్ల గింజ బలంగా వుండదు. తాలు ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. పైగా దొడ్డు వరికి, సన్న వరికి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలో తేడా లేదు. సన్నవడ్లకు మార్కెట్‌లో ధర లేదు. కాని అదే మిల్లర్లు మాత్రం బియ్యాన్ని మూడు రెట్లకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రైతులకన్నా, వ్యాపారులు ఎక్కువగా లాభపడుతున్నారు. అందుకే రైతులు సన్నాలు పండిరచేందుకు ముందుకు రావడం లేదు. గతంలో కేసిఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నమే విఫలమైంది. అందువల్ల మళ్లీ రైతుల మీద ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని రైతులు కోరుతున్నారు. దొడ్డు వరి రకాల పంట కేవలం 4 నెలల్లో చేతికి వస్తుంది. కాని సన్నాలకు మాత్రం ఆరు నెలల సమయం పడుతుంది. అందువల్ల ఏటా సన్న రకాలతో రెండు పంటలు మాత్రమే పండేందుకు అవకాశం వుంది. కాని అదే దొడ్దు రకం మూడు పంటలు పండుతాయి. దాంతో రైతులకు ఏ రకంగా చూసినా మేలే తప్ప నష్టం లేదు. సన్నాల మూలంగా నష్టమేతప్ప లాభం ఎక్కడా కనిపించడం లేదు. సన్నాలు పొట్టకొచ్చే దశలో రకరకాల చీడలు పంట మీద దాడి చేస్తాయి. వాటిని తట్టుకునే రకాలు ఇంకా అందుబాటులో లేవు. కాని దొడ్డు వరిలో చీడ,పడలను ఎదుర్కొనే రకాలు అనేకం వున్నాయి. ఇక్కడ కూడా రైతులకు మేలు జరిగే అవకాశం లేదు. ఇక తెలంగాణ వ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల్లో సన్న వరి పంట వేసినా, అందుకు అవసరమైన నాణ్యమైన విత్తనం అందుబాటులో వుందా? అన్నది కూడా ఆలోచించుకోవాలి. పైగా అందులోనూ నకిలీ విత్తనాల బెడత అందరికీ తెలిసిందే. వర్షాకాలం మొదలయ్యే ముందు రైతులు విత్తనాలు కొనే సమయంలో ప్రభుత్వాలు నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం అంటారు. కాని ఇన్నేళ్లలో ఏ ఒక్క కంపనీ మీద ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది లేదు. ఏ కంపనీల ప్రతినిధులపై పిడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించింది లేదు. కాని ప్రతీ ఏటా ఇదే విషయం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులాగా ప్రభుత్వాలు చెబుతూనే వుంటాయి. రైతులు వింటూనే వుంటారు. నకిలీ విత్తనాలతో మోస పోతూనే వుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు సాగులో వేలు పెట్టకపోవడమే మంచింది. తమకు వున్న భూమి ఏ పంట అనుకూలమన్నది చెప్పడంలో రైతుకు మించిన శాస్త్రవేత్త మరొకరు వుండరు. అందువల్ల రైతులకు ప్రోత్సాహకాలు పెంచకుండా ఎలాంటి సూచనలు జారీ చేసినా, ఆరు గాలం శ్రమను ఆగం చేసినట్లే అవుతుంది. అందువల్ల ఎన్నికల సమయంలో రైతులకు హమీ ఇచ్చినట్లు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వారి కోరిక న్యాయం కూడా…
బేమాన్ లకే బిఆర్‌ఎస్ టిక్కెట్లు?
https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024
`బీఆర్‌ఎస్ కార్యకర్తలు బహిరంగంగానే అంటున్న మాట.
`కార్యకర్తల కష్టం పట్టించుకోలేదు.
`ఇన్ ఛార్జుల కష్టం వృధా చేశారు.
`రాత్రింబవళ్ళు కష్ట పడిన ఇన్ ఛార్జులకే నామం పెట్టారు.
`పార్టీని నిండా ముంచే వారికే టిక్కెట్లు పంచారు!
`పార్టీ శ్రేణులను అభ్యర్థులు కసురుకున్నంత పని చేశారు.
`సరిగ్గా పోలింగ్‌కు ముందు అభ్యర్థులు చేతులెత్తేశారు.
`మా వల్ల కాదని కార్యకర్తల ముఖం మీదే చెప్పేశారు.
`పార్టీ మాకేమిచ్చిందని అభ్యర్థులే ఎదురు ప్రశ్నించారు.
`పార్టీ టిక్కెట్ ఇచ్చి పరేషాన్ చేసిందని బహిరంగంగానే అన్నారు.
`కార్యకర్తల ముందే అధినేత కేసీఆర్‌ను సైతం తూలనాడిన వాళ్లున్నారు.
`అభ్యర్థులు అసహనం ప్రదర్శిస్తుంటే ఆశ్చర్యపోయిన బీఆర్‌ఎస్ శ్రేణులు.
`అప్పుడేమో టిక్కెట్లు కావాలన్నారు!
`ఇప్పుడేమో టిక్కెట్లు ఎందుకు తీసుకున్నామా? అన్నారు.
`ఇంత కాలం పదవులు అనుభవించిన వారే ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేశారు.
`పార్టీ ఇచ్చిన డబ్బులు దాచుకున్నారు.
`పార్టీ మాకేం చేయలేదని ప్రజల ముందే అని పార్టీ పరువు తీశారు.
`మా కష్టమంతా పార్టీకి దారపోశామని అన్నారు.
`అభ్యర్థుల మాటలు విని శ్రేణులు విస్తుపోయారు.
`కేసీఆర్ ప్రచారం బూడిదలో పోసిన పన్నీరు చేశారు.
`బీజేపీకి ఓట్లు పడేందుకు అభ్యర్థులే పరోక్షంగా సహకరించారు.
`కేసిఆర్ ఆశలు వమ్ము చేశారు.
`ఎన్నికల ముందు ఎక్కడ విన్నా కారే వినిపించింది.
`ఎన్నికలయ్యాక చర్చలేకుండా పోయింది.
`తప్పంతా అభ్యర్థులదే…
`గెలిస్తే అదంతా కేసిఆర్ దయే!
హైదరాబాద్,నేటిధాత్రి:
సద్విమర్శను స్వీకరించాలి. ఆలోచించాలి. అంతర్మధనం చేసుకోవాలి. లేకుంటే ఎప్పుడూ తప్పటడుగులే పడుతుంటాయి. అంతా మాకే తెలుసనుకోకూడదు. ప్రతి సందర్భంలోనూ సొంత నిర్ణయాలు ఫలించవు. ఎంతటి వారికైనా సలహా అవసరం. పది మందితో చర్చ అవసరం. లాభ నష్టాల బేరీజు తప్పని సరి. ముఖ్యంగా రాజకీయాల్లో వున్నవారు, పార్టీల అగ్రనేతలు, అధినేతలకు సలహా సంప్రదింపులు ఎంతైనా అవసరం. అందుకే రాజులైనా, ప్రజాస్వామ్యంలో పాలకులైనా సరే సలహా మండలి ఎంతో ముఖ్యం. కొన్ని సార్లు పదిమందితో చర్చలు జరిగినా వ్యూహాలు విఫలమయిన సందర్భాలు కూడా వుంటతాయి. కాని విజయాలే ఎక్కువగా వుంటాయి. ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు ఎంతో అవసరం. పార్టీ మేలు కోరేవారు చాలా మంది వున్నారు. ఆ పార్టీ బతికి బట్టకట్టాలని ఆశిస్తున్నవారు వేలల్లో వున్నారు. పార్టీని నమ్ముకొని కార్యకర్తలు లక్షల్లో వున్నారు. బిఆర్‌ఎస్ అభిమానులు కోట్లలో వున్నారు. తెలంగాణ గుండెల్లో కేసిఆర్ వున్నాడు. కేసిఆర్ గుండెల్లో తెలంగాణ వుంది. ఇంతవరకు బాగానే వుంది. పార్టీలో ఏం జరగుతోంది. పార్టీ అపజయాల పాలెందుకౌతుంది. రాజకీయ పార్టీ అన్న తర్వాత గెలుపోటములు సహజం. కాని గెలుపు కూడా ఎక్కువ సార్లు పొందిన పార్టీలు అనేకం వున్నాయి. గుజరాత్‌లో బిజేపి వరసుగా ఏడోసారి విజయం సాధించింది. అంతగా జనంలో నిలిచిపోయింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బిజేపి పునాదులు గట్టిగా కావడానికి కారణం గుజరాత్. అలాగే తెలంగాణలో బలమైన పునాదులున్న బిఆర్‌ఎస్‌కు ఏమైంది. ఏంతో మేధో మధనం వున్న కేసిఆర్ నాయకుడుగా వున్నారు. వారసులు రాజకీయంగా ఎంతో వ్యూహాత్మకంగా వున్నారు. పార్టీ నాయకులు ప్రజల్లో ఎంతో గుర్తింపుతో వున్నారు. కింది స్ధాయిదాకా పటిష్టమైన యంత్రాంగం వుంది. కాని లోపం జరుగుతోంది. ఎందుకు వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఇది సగటు బిఆర్‌ఎస్ కార్యకర్తల అనుమానం. భయం. ఎందుకంటే పార్టీ కోసం జీవితాలు త్యాగం చేస్తున్న వాళ్లు కొన్ని వేల మంది వున్నారు. వారి అనుచరలు మెత్తంగా లక్షల్లో వున్నారు. వారి భవిష్యత్తు కూడా పార్టీమీదే ఆధారపడి వుంది. గత శాసన సభ ఎన్నికల్లో ఏం జరిగింది. ఎక్కడ లోపం జరిగింది. అనేది పునశ్చరణ చేసుకున్నామని బిఆర్‌ఎస్ పెద్దలు చెప్పారు. పొరపాట్లు జరక్కుండా చూసుకుంటామన్నారు. శాసన సభ ఎన్నికలకు ఏడాది ముందుగానే నేటిధాత్రి పార్టీ పరిస్ధితి గురించి కొన్ని వందల కథనాలు రాసింది. పార్టీలో ఏం జరుగుతోందన్నదానిపై ఎప్పటికప్పుడు అనేక విశ్లేషణలు అందించింది. కేసిఆర్ పాలన మూలంగా తెలంగాణ ఎంత పచ్చగా వుందనేది కూడా చెబుతూ వచ్చింది. ఒకనాడు ఎడారి లాంటి తెలంగాణ తెలంగాణ రాగానే ఒయాస్సిస్సులాగా మారింది. అలాంటి కేసిఆర్ పాలనను సైతం తెలంగాణ ఎందుకు వద్దనుకున్నది. ప్రజల మనసులో ఏముంది. ప్రజల గుండెల్లో కేసిఆర్ వున్నా, పార్టీకి పరిస్ధితులు బాగా లేవన్న సంగతి నేటిధాత్రి ఏడాది కాలంగా చెబుతూనే వస్తోంది. కనీసం 30 మంది ఎమ్మెల్యేలను మార్చితే మళ్లీ బిఆర్‌ఎస్‌కు తిరుగలేదని పదే పదే నేటిధాత్రి ఎన్నో విలువైన సూచనలు చేసింది. కాని బిఆర్‌ఎస్ పెడ చెవిన పెట్టింది. ఫలితం అనుభవించేదాకా తెచ్చుకున్నది. పట్టుమని పది రోజులు కాకముందే తెలంగాణ మళ్లీ బిఆర్‌ఎస్ వైపు చూసింది. కాని బిఆర్‌ఎస్ ప్రజల వైపు చూడలేదు. కేవలం రాజకీయ ప్రకటనల వరకే పరిమితమైంది. ఉద్యమ కారులకు గుర్తింపునిస్తుందని అనుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వారికి ప్రాదాన్యతనిస్తారని అనుకున్నారు. కాని అదీ జరగలేదు. దాంతో ప్రజల్లో బిఆర్‌ఎస్ మీద ఎంత ప్రేమవున్నా, అభ్యర్ధుల మూలంగా మళ్లీ ప్రజలకు దూరమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.
ఎవరు ఏమనుకున్నా…సరే నేటిధాత్రి చెప్పాల్సింది చెబుతుంది.
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ కొంత మంది బేమాన్‌లకే టిక్కెట్లు ఇచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. కార్యకర్తలు సైతం చెబుతున్న వాస్తవం. ఎన్నికల సమయంలో వారు పడిన వేదన అంతా ఇంత కాదు. వారు ఎదుర్కొన్న యాతన మాటల్లో చెప్పలేము. అంతగా కార్యకర్తలు అభ్యర్ధుల వల్ల బాధపడ్డారు. బిఆర్‌ఎస్ ఎంపిక చేసిన కొంత మంది అభ్యర్థులు టిక్కెట్లు కావాలిన వారు కోరుకున్నారా?..లేక పార్టీ వారికి బలవంతంగా టికెట్ ఇచ్చిందా? అన్నది క్యాడర్‌కు అవసరం లేదు. కాని టికెట్లు వచ్చిన వారిలో కొంత మంది మాత్రం క్యాడర్‌ను పురుగులను చూసిన ట్లు చూసిన వాళ్లున్నారు. క్యాడర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన వారున్నారు. రాత్రింబవళ్లు కష్టపడిన క్యాడర్‌ను యోగక్షేమాలు చూసుకున్నవారు లేరు. మండుటెండల్లో వారు పడుతున్న శ్రమలో అభ్యర్ధులు పది శాతం కూడా పడలేదంటే అతిశయోక్తి కాదు. కేవలం కేసిఆర్ బస్సు యాత్రల సమయంలోనే అభ్యర్ధులు హడావుడి చేశారు తప్ప, మిగతా సమయంలో వాళ్లు ప్రజల వద్దకు వెళ్లింది లేదు. ప్రజలను కలిసి ఓట్లడిగింది లేదు. అటు ఇన్‌చార్జులు, ఇటు నాయకులు, కార్యకర్తలు తమ శాయశక్తులా ప్రయత్నం చేశారు. కాని అభ్యర్ధులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరించారు. అది తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో క్యాడర్ ముక్తకంఠంతో చెబతున్న మాట. ఈ విషయాలు పార్టీ అధిష్టానానికి తెలియాల్సిన అవసరం వుంది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీని ముంచేవారికే టిక్కెట్లు ఇచ్చారని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ టికెట్లు తీసుకొని వెళ్లిపోయిన వారు కొంత మంది వున్నారు. ఇతర పార్టీలలో టిక్కెట్లు తెచ్చుకున్నారు. కేసిఆర్ నాయకత్వాన్నే సవాలు చేశారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పాలంటే ఆయా స్ధానాలలో నిలబడిన అభ్యర్దులు ఎంతో పటిష్టంగా ప్రచారం సాగించాలి. అయినా కేసిఆర్ ప్రచారానికి వచ్చారు. అభ్యర్ధుల తరుపున ప్రచారం విసృతంగా చేశారు. కాని అభ్యర్దులకు ఆ కృతజ్ఞత అసలే లేదు. సరిగ్గా పోలింగ్‌కు ముందు చాలా మంది బిఆర్‌ఎస్ అభ్యర్ధులు చేతులెత్తేశారు. సోషల్ మీడియా ప్రభావాన్ని బలంగా నమ్మారు. ఇతర పార్టీలు దూసుకుపోతున్నాయన్న అసత్య ప్రచారాన్ని బలంగా విశ్వసించారు. కాని వారికి అనుకూలంగా పనిచేసిన మీడియాను పట్టించుకోలేదు. వారిని వాడుకోలేదు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాము కూడా ఓ ముప్పై సోషల్ మీడియాలను ఏర్పాటు చేసుకుంటే బాగుండేది అని చెప్పిన కేటిఆర్ ఆ పని ఎందుకు చేయలేదు. పార్టీకి అనుకూల మీడియా మీద ఎందుకు ఆధారపడలేదు. అయినా పార్టీ కోసం ఇరవై ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్న నేటిధాత్రి లాంటి మీడియాను కూడా ఎందుకు నిర్లక్ష్యం చేసింది. అయినా అన్ని మీడియా సంస్ధలు నేటిధాత్రిలాగా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేయాలని లేదు. పార్టీ కోసం పనిచేసేవారిని అభ్యర్ధులు పట్టించుకోలేదు. పార్టీ కోసం ఎన్నొ త్యాగాలు చేసే మీడియాను పార్టీ పట్టించుకోలేదు. గత శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాటే పార్లమెంటు ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ చేసింది. నిజానికి కేసిఆర్ బస్సు యాత్రతో బిఆర్‌ఎస్‌లో ఒక ఊపు కనిపించింది. ఆ ఊపు పోలింగ్ రోజున ఎందుకు ఒక్కసారిగా చల్లబడిరది. అసలు పోలింగ్ రోజున బిఆర్‌ఎస్ పదమే జనం నుంచి ఎందుకు వినిపించలేదు. పోలింగ్ రోజున క్యాడర్ ఎందుకు అసంతృప్తిగా వుందన్న సంగతి ఏ నాయకుడైనా గుర్తించాడా? లేదు. ఎంత సేపు వారి వ్యక్తిగత స్వార్ధం తప్ప పార్టీ మీద ఏ నాయకుడికి మమకారం లేదు. అభ్యర్ధులకు గెలవాలన్న తపన లేదు. ఆఖరు ఓటు దాకా పోరాటం చేయాలన్న సంకల్పం లేదు. పరుగు పందెంలో విజిల్ వేసేదాక నిలబడి, ఆగిపోయినట్లు చేశారు.
ఇంకా కొంత మంది అభ్యర్ధుల మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.
పార్టీ మాకేం చేసింది. మేమే పార్టీకి ఎంతో చేశాం. జీవితాలు త్యాగాలు చేశాం. ఇలాంటి మాటలు చెప్పిన వారు కొత్తగా టిక్కెట్లు వచ్చిన వారు కాదు. గత పదేళ్ల కాలంగా పార్టీ పదవులు, పార్టీతో ప్రజా ప్రతినిధులైన వారు అన్న మాటలు. వారి మాటల్లో పార్టీ మీద కనీసం ఒక్క శాతం ప్రేమ కనిపించలేదు. పదేళ్లుగా చట్ట సభల్లో వివిధ పదవులు అనుభించిన వారే తమకు పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తే, సామాన్య కార్యకర్తల పరిస్ధితి ఎవరు చెప్పాలి. అంతే కాదు పార్టీ కోసం తాము చేసిన త్యాగాల ముందు పార్టీ ఇచ్చింది అణువంత కాదంటున్నారు. పదేళ్లు పార్టీ అధికారంలో వున్నా తమకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏ రాజకీయ పార్టీలో నైనా గ్రామ స్దాయిలో సర్పంచ్, ఆ తర్వాత మండలం, తర్వాత జిల్లా…అది దాటినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కావాలంటే ఎంతో శ్రమ పడాలి. ఎంతో ఓపిక కావాలి. అదృష్టం కూడా కావాలి. రాజకీయ పార్టీలలో నాయకుడు ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనుకుంటారు. అందుకోసం జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కొంత మంది అవకాశం కోసం పార్టీలు కూడా మారుతుంటారు. ఒక్కసారైనా చట్టసభలో కూర్చోవాలనుకుంటారు. ఆ పదవే అతి పెద్దది. అందుకోసం సర్వం పోగొట్టుకున్నవారు ఎంతో మంది వున్నారు. మరి అలాంటి పదవులు పొందిన వారు కూడా పార్టీ మాకేం చేసింది? అని ప్రశ్నిస్తున్నారంటే బిఆర్‌ఎస్‌లో ఎంత బేమాన్ నాయకులున్నారో అర్ధం చేసుకోవచ్చు. మేం లేకుంటే పార్టీయే లేదన్నంతగా మాటలు మాట్లాడుతున్నారంటే వారి అంకితభావం ఎంత గొప్పదో పార్టీ తెలుసుకోవాలి. శాసన ఎన్నికల్లో ఎంతో మంది ఎమ్మెల్యేల ఓటమికి కారణమైన వాళ్లు కూడా వున్నారు. వారిలో కొందరికి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు వచ్చాయి. ఆనాడు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఈ ఎన్నికల్లో ఇంత ప్రయాస పడాల్సిన అగత్యం వచ్చేది కాదు. కాని వాళ్లను శత్రువులుగా చూశారు. వారి ఓటమికి ప్రధాన కారణమయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్దులు ఎంత బ్రతిమిలాడుకున్నా సాయం చేయని వారు, పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ అదికారంలో వున్ననాడు ఏ ఒక్కరి యోగక్షేమాలు చూడని వారు ఇప్పుడైనా క్యాడర్‌ను పట్టించుకున్నారా? అంటే అదీ లేదు. పార్టీ అగ్రనేతలనే క్యాడర్ ముందు తూలనాడిన అభ్యర్ధులున్నారు. ఇలాంటి వారికి పార్టీ టికెట్ ఇచ్చి ప్రచారం చేయమని చెబితే , క్యాడర్ కూడా ఎంతో విసిగిపోయింది. ఎన్నికల ముందు టికెట్లు కావాలన్నవారే..తర్వాత ఎందుకు ఇచ్చారని మాట్లాడారు. టికెట్లు ఇవ్వగానే సరిపోతుందా? పార్టీ సహాకారం అందించదా? ప్రశ్నించారు. వారి కోసం ఇన్‌ఛార్జులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అభ్యర్ధులు ఒట్టి చేతులు చూపిస్తుంటే పార్టీ కోసం ఇన్‌చార్జులు కోట్లరూపాయలు ఖర్చు చేసిన వారు కూడా వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొంత మంది బేమాన్‌లను ఇంతకష్టపడి గెలిపించినా వారికి ఆ కృతజ్ఞత వుంటుందా? వుండదా? అన్న ప్రశ్నే తలెత్తుతోంది. అంతటా చర్చ జరుగుతోంది. పోలింగ్ రోజును బిఆర్‌ఎస్ గురించి ప్రజలు ఆలోచించకపోవడానికి ప్రధాన కారణం అభ్యర్థులు…ఎందుకంటే బిజేపి నుంచి హైదరాబాద్‌లో పోటీ చేసిన బిజేపి అభ్యర్ధి చేసిన ఎన్నికల పోరాటంలో బిఆర్‌ఎస్ అభ్యర్దులు ఒక్క శాతం కూడా చేయలేదు. గెలవాలన్న కసి బిఆర్‌ఎస్ అభ్యర్దుల్లో పది శాతం కూడా కనిపించలేదు. ఒక వేళ ప్రజల ఆశీర్వాదంతో బిఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలిచినా అది కేవలం కేసిఆర్ దయే అన్నది జీవితంలో మర్చిపోవద్దు. కేసిఆర్ లాంటి నాయకుడి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలకు దూరం చేయొద్దు.
డెంగ్యూ నివారణ మా బాధ్యత సురక్షితమైన రేపటి కోసం
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
మంచిర్యాల నేటిదాత్రి
జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, “డెంగ్యూ నివారణ మా బాధ్యత – సురక్షితమైన రేపటి కోసం” అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ అనిత, జిల్లా సర్వేయలెన్స్ అధికారి డా॥ ఫయాజ్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో కీటక జనిత వ్యాధులు, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని, డెంగ్యూ లాంటి విషజ్వరాల వ్యాప్తిని నివారించేందుకు ప్రజలందరు తమ వంతు బాధ్యత నిర్వహించాలని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి తగిన చికిత్స తీసుకోవాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివాస ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగు కాలువలలో నీరు నిల్వ ఉన్నట్లయితే ఆయిల్ బాల్స్ చల్లాలని, ఇంటి పరిసరాలలో ఎక్కడా చెత్త లేకుండా శుభ్రపర్చుకోవాలని, ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే పాటించి దోమలను లార్వా దశలోనే నిర్మూలించేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద మహిళా ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాధి లక్షణాలను పరిశీలించి, ఉన్నట్లయితే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని, వసతిగృహాలు, పాఠశాలల్లో శుభ్రతపై వివరించడమే కాకుండా పాటించేలా పర్యవేక్షించాలని తెలిపారు. వ్యాధి నిర్ధారణ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన కిట్ల ద్వారా ప్రాథమికంగా నిర్ధారించడం జరుగుతుందని, జిల్లా ఆసుపత్రిలో టి-హబ్లో నిర్ధారణ కొరకు పరీక్షలు చేయించుకోవాలని, ఎలాంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని, డెంగ్యూ నివారణ దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నివాస ప్రాంతాలు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు లహరి, ప్రశాంతి, ఎస్.యు.ఓ.లు, నాన్దేవ్, సత్యనారాయణ, రవీందర్, హెచ్.ఈ. అల్లాడి శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన పలువురు మహిళా నాయకులు దొడ్లను కలవడం జరిగింది.
కూకట్పల్లి మే 16 నేటి ధాత్రి ఇన్చార్జి
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన సంద ర్భంగా 124 డివిజన్ కార్పొరే టర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ని వారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు మర్యాదపూర్వ కంగా కలవడం జరి గింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాం
గ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి విజయం కోసం పనిచేసిన ప్రతిఒక్క
రికి పేరు పేరునా ధన్యవాదాలు తెలి
య చేసా రు.కార్యక్రమంలో రాజ్యల క్ష్మి,పుట్టందేవి,సౌందర్య,అనురాధ,
కృష్ణవేణి,యోగేశ్వరి,నాగలక్ష్మి,నిర్మ
లమ్మ,అన్నపూర్ణ,శ్యామల,లలిత
కుమారి తదితరులు పాల్గొన్నారు.
దశ దిన కార్యక్రమానికి హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్,
# బీజేపీ ఎంపి అభ్యర్థి సీతారాం నాయక్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం గ్రామంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు, సర్వాపురం గౌడ సంఘం అధ్యక్షులు శీలం వీరన్న గౌడ్,4 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ రాంబాబు గౌడ్, రాజు గౌడ్ ల మాతృమూర్తి ఆగమ్మ గౌడ్ దశ దిన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం నకు గౌడ జన హక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆగమ్మ గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బీజేపీ కంటేస్టెడ్ ఎంపి ప్రొపెసర్ అజ్మీర సీతారాం నాయక్, బీజేపీ నాయకులు డా. కే
ప్రతాప్,డా.గోగుల రానాప్రతాప్ రెడ్డి , సొల్తీ రవి గౌడ్,మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు సొల్తీ సారయ్య గౌడ్,మచ్చిక రాజు గౌడ్,మద్దెల సాంబయ్య గౌడ్, డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,నాతి కర్ణాకర్ గౌడ్, ముత్యం శ్రీనివాస్ గౌడ్, గుండె బోయిన సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై వ్యవసాయశాఖ, సహకార శాఖ, తూనికలు కొలతలు, మార్కెటింగ్, డిఆర్డీఏ పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
యసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా117 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 16 వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.
వాతావరణంలో మార్పుల వల్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి పాడవకుండా కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులు తగు రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు 3 వేల టార్పలిన్ లు కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయడం జరిగిందని అన్నారు. మాయిచ్చర్ మిషన్లును కూడా అందించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని వర్షం వల్ల ధాన్యం తడిస్తే తీసుకోవలసిన జాగ్రత్తల పై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
కొనుగోలుకు సంబంధించి ఏ రోజుకారోజు డాటా ఎంట్రీ చేయాలని, రిజిస్టర్స్ నిర్వహించాలని, డాటా ఎంట్రీ చేయని కొనుగోలు కేంద్రాలకు షోకాజ్ నోటీస్ లు జారీ చేయాలన్నారు.
రెండు రోజులలోగా ఓ.పీ.ఎం.ఎస్ లో డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేయాలని,
వరి కోతలు మొదలైనందున ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం జరుగుతుందని అన్నారు. వర్షం కురిసే అవకాశం ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని అన్నారు.
నాణ్యత ప్రమాణాలు ప్రకారం 17 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోవాలని, తాలు, మట్టి పెల్లలు లేకుండా చూసి మిల్లులకు తరలించాలని తెలిపారు. రాబోయే 15 రోజుల చాల కీలకమని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇంకా సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావొచ్చని అప్రమత్తంగా ఉండి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
రైతులు వర్షాల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతుల దగ్గర ధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేక పోతే కొనుగోలు కేంద్రాలకు తరలించి వాటిని టార్పలిన్ల తో కప్పుకోవాలని ఎత్తైన ప్రదేశాలలో ధాన్యాన్ని అరబెట్టాలని, రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల వర్షం వస్తే తరలించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో వరి పండించే రైతులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటి కపుడు వాతావరణ శాఖ జారీ చేయు సూచనలు రైతులకు ఇవ్వాలని అన్నారు. రైతులకు ధాన్యం తడవకుండా అవగాహన కల్పించాలని, వర్షం కురిసే అవకాశం ఉంటే ముందస్తుగా సూచించాలని అన్నారు. కోతలు సమయంలో చేపట్టవలసిన చర్యలు, వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం వివరాలను ఏరోజుకు ఆరోజు నివేదికలు తనకు అందించాలని తెలిపారు.
ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, డిఆర్డిఓ నరేష్, పౌర సరఫరాల అధికారి నర్సింగరావు
జిల్లా సివిల్ సప్లై సంస్థ మేనేజర్ రాఘవేందర్, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీలత, మార్కెటింగ్ శాఖ అధికారి కనక శేఖర్, రైస్ మిల్లర్లు సంఘం సభ్యులు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ శ్వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయం వార్షికోత్సవం.
కుత్బుల్లాపూర్ నేటిదాత్రి ;
శ్రీవాసవికన్యకప్రమేశ్వరి వార్షికోత్సవం సందర్భంగా
రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా సంఘము అధ్యక్షురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి. కల్వ సుజాతను. ఆహ్వానిం చా రు
విద్యుత్ ఆఘాధంతో పాడి గేదె మృతి.
చిట్యాల,నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని చల్లగరిగే గ్రామానికి చెందిన సిరిపెల్లి నరేష్ కు చెందిన పాడిగేదే గురువారం గ్రామ శివారులో మేతకు వెళ్లగా ప్రమాదవశత్తు 11kv విద్యుత్ వైర్ తాకడంతో అక్కడికక్కడే మృతి చెoదింది. గేద విలువ సుమారు 50 వేలు ఉంటుందని, ప్రభుత్వ ఆదుకోవాలని భాదితుడు కోరుతున్నాడు.
ప్రబీరు పురకాయస్థకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల.
ప్రభీరు అరెస్టును తప్పు పట్టిన సుప్రీంకోర్టు.
నిరంకుశ ప్రభుత్వాలకు గుణపాఠం.
సుప్రీంకోర్టు తీర్పును
అభినందించిన సిపిఎం ప్రజా సంఘాలు.
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రబీర్ పురాకాష్ట, బుక్ లేటు విడుదల.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ దాని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రామిక భవన్లో ప్రబీరు పురకాయస్థకు సంబంధించిన బుక్లెట్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీరు పురకాయస్థకు మోడీ సర్కారు గత ఏడు నెలలుగా ఊపారు చట్టాన్ని ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేసి ఏడు నెలలుగా జిల్లాల్లో కుక్కింది. ప్రభీరు అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక విధాలుగా ఆందోళన పోరాటాలు జరిగాయి. రూబీ రూప్ ప్రకాయాస్తను వెంటనే రిడీవ్ చేయాలి అని చెప్పి సిపిఎం దాని ప్రజా సంఘాలు మేధావులు అనేకమంది ఆందోళన పోరాటాలు చేశాయి. అయినా బిజెపి మోడీ సర్కారు పడచేయున పెట్టింది. ఢిల్లీ పోలీసులు, ఈడీ, మోడీ సర్కారు మాటలకు తలోగ్గి రబీర్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆక్రమం. 6 సీట్లు 2250 పేజీలో కాగితాలు ఆరాంశం రాశారు. అరెస్టు తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. తక్షణమే ప్రవీణ్ ను రిలీజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పును సిపిఎం దాని ప్రజా సంఘాలు హర్షిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాల అనుసరించే నిరంకుశ ప్రభుత్వాలకు చెంపపెట్టు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కవులు కళాకారులు ప్రజా సంఘాలు, మేధావులు ఐక్య ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వ విధానాల్ని ఎనక్కి కొట్టాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ప్రజలకు పిలుపునిచ్చాడు.
ఈ కార్యక్రమంలో శేఖరు, మహేందర్, శ్రీకాంత్, మాత, ఆరక్క, తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల స్థానిక ధరియాపూర్ మోడల్ జూనియర్ కాలేజిలో ఇంటర్మీయట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కొరకు దరఖాస్తు స్పీకరిస్తున్నాము అని ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.10 వ తరగతి పాస్ అయిన విద్యార్థినీ,విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరం లో అడ్మిషన్ పొందుటకు మే 9వ తేది నుండి మే 31 తేది వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. ఎంపీసీ,బైపీసీ,సీఈసీ,ఎంఈసి, గ్రూపుల గల నందు 40 సీట్లు చొప్పున మొత్తం 160 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.పదో వ తరగతిలో పొందిన జీపీఏ మార్కుల ఆధారంగా కోరుకున్న కోర్సులు నందు ప్రవేశం లభిస్తుందని అన్నారు.ఆసక్తి గల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన ఆన్లైన్ మెమో,ఆధార్ కార్డు,రెండు పాస్ ఫోటోలతో దడియపూర్ మోడల్ స్కూల్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఫారం తో సమర్పించాలని తెలిపారు.
ప్రజల కోసం వేసిన చేతి పంపు కబ్జా
అడుగుతే తంతా
నానభూతులు తిడుతూ
హంగామా చేస్తున్న బి ఆర్ ఎస్ నాయకుడు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో బి ఆర్ ఎస్ నాయకుడు హల్చల్ చేస్తున్నాడు అడుగుతే తంతా అంతా నా ఇష్టం అంటూ అడిగిన వారిని నానా బూతులు తిడుతూ హంగామా చేస్తున్నాడు ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం ఎస్సి కాలనీ లో కొన్ని సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ప్రజల దాహం తీర్చటానికి చేతి పంపు వేయడం జరిగింది చేతిపంపు వాడుకలో లేకపోయే సరికి ప్రజలు ఎన్ని సార్లు అధికారుల ద్రుష్టికి తీసుకొని వచ్చినప్పటికి వారు పట్టించు కోవడం మానేశారు ఇది చూసిన బి ఆర్ ఎస్ నాయకుడు కి దీన్ని ఎవరు చూడటం లేదు అని ఏకాకంగా బోరింగ్ చుట్టూ చక్కగా తవ్వి సిమెంట్ గాజులు వేసి అందులో బోర్ వేసి ఎవరికీ కనబడ కుండా మూసివేసి ఇంట్లోకి పంపు వేసుకొని వాడుకుంటున్నాడు అందరికి చెందవలసిన చేతి పంపు ధర్జాగా కబ్జాచేసి నన్ను అడిగేవాడు ఎవడు అడుగుతే తంతా అంటూ దుర్భశాలాడుతూ బయ భ్రాంతులకు గురి చేస్తూ హల్చల్ చేస్తున్నాడు పలుమార్లు గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పినప్పటికి కూడా తీయడం లేదు ఇకనైనా అధికారులు కప్పు తీపించి అందరికి ఉపయోగ పడే విధంగా చూడాలి అని ప్రజలు కోరారు
ఈనెల 16న సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్
కూకట్పల్లి, మే 16 న్యూస్ నేస్తం ప్రతినిధి
సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్?రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను సీఎంరేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా విని యోగించనున్నట్లు తెలుస్తోంది.ప్ర స్తుం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే పాలన సాగిస్తున్నా రు.అయితే సమావేశాలకు ఇబ్బంది కరంగా మారడంతో ‘లేక్ వ్యూని వా డాలని ఆయన యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.జూన్ 2 తర్వాత ఆ భవనాన్ని ఏపీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ గా ఏర్పా టు చేయనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మొలుగూరి సదయ్య
నేటి ధాత్రి జమ్మికుంట.
ఈరోజు గాంధీ భవన్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో పోస్ట్ ఎలక్షన్ ఫీడ్బ్యాక్ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ తో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్సి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ మేనేజింగ్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, పుష్పలీల మాజీ మంత్రివర్యులు, రాముల నాయక్ ఎమ్మెల్సీ , వినోద్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మొలుగూరి సదయ్య కోఆర్డినేషన్ చేసిన పనులు పార్లమెంట్ ఆర్గనైజేషన్ గురించి కమిటీ ముందు తెలపడం జరిగింది కమిటీ నివేదిక దీపాదాస్ గారికి మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కి అందించడం జరిగింది
ప్రజలు ప్రజల ప్రాణాలు పణంగా పెట్టిన లక్ష్మీ ఇన్ఫో
రంగారెడ్డి జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు.
ఉప్పల సంతోషి కుమార్ గుప్తా
కుత్బుల్లాపూర్ నేటి రాత్రి :
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు డైరీ ఫార్మ్ రోడ్డు కండ్లకోయ వరకు పనులు జరుగుచున్న సుచిత్రా జంక్షన్ కు సమీపంలో ఉన్న సబ్ రోడ్ లో సెవెన్ హిల్స్ వైన్స్ నుండి మహీంద్రా షోరూం వరకు సబ్ రోడ్ విస్తరణలో భాగంగా సెవెన్ హిల్స్
వైన్స్ ముందు 50 ఫీట్ల నుండి 100 ఫీట్ల గొయ్యి తవ్వడం జరిగింది ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పనులు లక్ష్మి ఇన్ఫోవారు పనులు చేస్తున్నారు వారు
.నిర్లక్ష్యంగా తవ్వకాలు జరపడం వలన అక్కడ ఉన్న మెయిన్ శివరేజి పైప్ లైన్ ధ్వంసం వల్ల సెవెన్ హిల్స్ వైన్స్ నుండి రామరాజు నగర్ వరకు వరదల మురికి నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో సుమారు 10,000 మంది అన్ని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు వాళ్లు చేపట్టిన తప్పుడు తవ్వకాల వల్ల అక్కడి ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడుతూ వాహనాలు రాకపోకలు ఇబ్బందులు జరుగుచున్నవి ఆడవారు పిల్లలు ముసలి వాళ్లు ఈ యొక్క నిర్లక్ష్యం తవ్వకాల వలన రోడ్డు దాటలేక వాళ్ళు మురుగునీల నుండి నడవడం జరుగుతుంది ప్రాణాలు పెట్టి రోడ్డు దాటుతున్న వారి యొక్క పలుకుబడితో మేము ఏమి చేసినా చెల్లుతుందని ఒక అహంకారపు ధరణితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ గతవారం నుండి సుమారు పది నుంచి 20 మంది గోతిగుండా ప్రయాణం చేస్తూ టూ వీలర్స్ మీద నుండి జారిపడి గాయాలపాలు అవుతున్నారు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ యొక్క గోతివలన అక్కడ ఎవరు జారిపడిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క లక్ష్మి ఇన్ఫ్రా వాళ్లువారి యొక్క అనుమతులు సరిగ్గా పొందకుండానే నిర్లక్ష్యంగా పనులు చేపట్టడం వలన ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క అంశాన్ని మొత్తం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఉప్పల సంతోష్ కుమార్ గుప్త గారు ప్రాజెక్టు డైరెక్టర్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు లక్ష్మీ ఇన్ఫ్రా వారిపై కేసు నమోదు చేయించి
పనులు వారం రోజుల్లో పూర్తి పూర్తి చేయకపోతే అక్కడ ఉన్న రామరాజు నగర్ విఘ్నేశ్వర రెసిడెన్సి కాలనీ ప్రజలు నేషనల్ హైవేదిబందించడానికి కూడా వెనుకాడరని డిమాండ్ చేస్తున్నారు
బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ కు ఘన సన్మానం
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో మూడు సంవత్సరాలుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ములుగు జిల్లాకు బదిలీపై వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు ను రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది సైతం ఘనంగా సన్మానించారు, సన్మానించిన వారిలో ఏఎస్ఐ శ్రీనివాస్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
యధావిధిగా యారన్.సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారులు మానుకోవాలని గతంలో మాదిరిగా యధావిధిగా సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందజేయాలని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ బాడీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
