ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలు

కాటారం, నేటి ధాత్రి

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలు కాటారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనీయకుడని, ఆయన చూపిన మార్గం ముందుకు సాగాలని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఒక్క మాటతో 1956 విజయదశమి రోజున 5 లక్షల మంది, పరిస్థితి రోజు మూడు లక్షల మంది బౌద్ధమతంలోకి మారారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ను డాక్టర్ అంబేద్కర్ బౌద్ధం నుండే సేకరించినట్లు చెప్తాడని ఈ సందర్భంగా తెలిపారు. బౌద్ధం శాంతిని , అహింసను బోధిస్తుందని అందుకే ప్రపంచానికి భారతదేశం శాంతిని చెబుతుందని పీక కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్, పోచయ్య, ఉమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో యథేచ్చగా కల్తీ కల్లు వ్యాపారం.

ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న కల్తీ కల్లు మాఫీయా.

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖాధికారులు.

నియంత్రించడంలో నిమ్మకు నిరేత్తినట్లుగా వావ్యహారం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్, జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట,కోయిల్ కొండా, హన్వాడ,దేవర కదిర, మండలాలలో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్చగా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖాధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా కల్లు తయారుచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. జిల్లాలో కల్తీకల్లు వ్యాపారం జోరందుకుంది మండలాలలోని ప్రతి గ్రామాలలో గల్లి గల్లి కి వేసవి షర్బత్ సెంటర్ల మాదిరి దుకాణాలు వెలుస్తున్నాయి.సహజ సిద్ధంగా ఈత,తాటి చెట్టు నుంచి వచ్చే కల్లును మాత్రమే అందించవలసి ఉంది కానీ? కొంతమంది వ్యక్తులు అక్రమంగా డబ్బుకు అలవాటు పడి ప్రమాదకరమైన మారకద్రవ్యాలు ఇతర రసాయనాలతో కాల కాలకూట విషం లాంటి కల్తీకల్లు తయారు చేసి సామాన్య కూలీలకు అంటగడుతున్నారు. ఇంత జరిగినా లోపాయికారీ ఒప్పందాలతో చూసి చూడనట్లు ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికారుల్లో కదలిక రావడం లేదు. రోజంతా కష్టపడి అలసటను తీర్చుకునేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు తాగే మద్యం అలవాటు కొందరు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. ఈ కల్తీ కల్లులో అసలు కల్లుకు బదులు నీటిలో అల్పాజోలం, సిట్రిక్ యాసిడ్, డైజోపాం, క్లోరల్ హైడ్రేట్ వంటి విషపదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజంతా కష్టపడ్డ వారికి రూ.15 లతో కల్తీ కల్లు సేవించి మత్తులో జోగుతున్నారు. దీంతో కల్తీ కల్లు తాగుతున్న ప్రజలు వ్యాదుల భారిన పడుతున్న విషయం తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి తనిఖీలు చేస్తే తప్ప జిల్లా అధికారులు తనిఖీలు చేయలేకపోతున్నారు. జిల్లాలో గౌడ సోసైటిలు ఉండగా, గ్రామాల్లో వేయి లల్లో కల్లు దుకాణలు ఉన్నాయి. నగరంలో ఎన్ని కల్లు డిపోలు ఉన్నాయి. ఆడిపో పరిధిలో లైసెన్స్ వున్నవి ఎన్ని దుకాణలు ఉన్నాయో లైసన్స్ లేనివి ఎన్ని ఉన్నాయో కనీసం వాటికి కూడా పొంతనలేదు, మండలాలలోని కల్లు దుకాణాల నుంచి రోజుకు లక్షల లీటర్ల కల్తీ కల్లును యజమానులు విక్రయిస్తున్నారు. గీత కార్మికుల కోసం చెట్ల నుంచి కల్లు తీసేందుకు అనుమతి ఇచ్చారు. విటి పరిధిలో గీత కార్మికులు చెట్లను పెంచుతూ కల్లు అమ్మకాలు చేస్తున్నారు. తాటి చెట్లతో పాటు ఈత చెట్ల నుంచి కల్లును సోసైటిల ద్వారా తీస్తున్నారు. చెట్ల నుంచి తీసిన కల్లును కొన్ని డిపోల పరిధిలో అమ్మకాలు చెస్తున్నారు. కల్లు దుకాణాల ద్వారా ప్రతిరోజు ఈ కల్లును తీసి అమ్ముతున్నారు. జిల్లాలో కొన్ని సోసైటిల పరిధిలో చెట్ల నుంచి తీసిందే కాకుండా కల్తీ కల్లు అమ్మకాలను జోరుగా సాగిస్తున్నారు. రసాయనాల ద్వారా కృత్రిమంగా కల్లు తయారుచేస్తూ ఈ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. చెట్ల నుంచి పారే కల్లును సోసైటిలకు తరలించి అమ్మకాలు చేయాల్సి ఉన్నా కొన్ని చోట్ల రసాయనలతో కల్తీ కల్లును అమ్ముతున్నారు. ఈ కల్తీ కల్లులో అల్పాజోలం, సిట్రిక్ యాసిడ్, డైజోపాం, క్లోరల్ హైడ్రేట్ వంటి నిషేదిత రసాయనాలను కర్ణాటక మహరాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి లక్షల రూపాయలు విచ్చేంచి కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఉపయోగించి కృత్రిమంగా కల్లును తయారుచేస్తున్నారు. ఈ కల్తీ కల్లు తగిన వారికి ఆరోగ్యపరమైన పలు ఇబ్బందులు ఎదరువుతున్న పట్టించుకోనే నాదుడే కరువయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ దుకాణాలను మూసివేసినప్పుడు కల్తీ కల్లు తగేవారు రకరకల జబ్బులు వచ్చి ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ కల్లు తాగిన వారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిగా, ఆసుపత్రుల్లో చేరిన సంఘటనలు ఉన్నాయి. ఈ కల్తీ కల్లు తాగిన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించిన ఎక్సైజ్ శాఖాధికారులు మాత్రం నియంత్రించడంలో నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అధికారుల సహకారంతో యథేచ్చగా కల్తీ కల్లు అమ్మకాలను కల్లు తయారీదారులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లు దుకాణాదారుల నుంచి అధికారులకు పరిచయాలు ఉండడం, వారి అవసరాలు నేరవేరుతుండడంతో పట్టించుకోనే వారు లేకపోవడం గమనార్హం. ఏ దుకాణాల పరిధిలో చెట్ల కల్లు అమ్మకాలు జరుగుతున్నాయో లేదో వివరాలు ఎక్సైజ్ అధికారులకు తెలిసిన కనీస తనిఖీలు చేయడంలేదని విమర్శలు ఉన్నాయి. చివరకు కల్లు నాణ్యత పరిక్షలు కూడా నిర్వహించడం లేదనే తెలుస్తుంది. నగర పరిధిలో ఎక్కువ మొత్తంలో కల్తీ కల్లు అమ్మకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కల్లీ కల్లు విక్రయాలు జరుగుతున్న జిల్లా స్థాయి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర స్థాయిలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కల్లు దుకాణాలను తనిఖీ చేసిన సందర్భాలు ఇటివల లేకుండా పోయింది. దాంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లుపై చర్యలు తీసుకుంటారో లేదో విచే చూడల్సిందే.

గ్రామీణ వైద్యుల పై టిఎస్ఎంసి, ఎన్ఎంసి దాడులు ఆపాలి

ఆర్.ఎం.పి & పి.ఎం.పి జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దుల శ్రీనివాస్

జైపూర్, నేటి ధాత్రి :

ఎన్నో ఏళ్ల తరబడి ప్రథమ చికిత్స సేవలు అందిస్తూ
ఇదే మా జీవనోపాధిగా కొనసాగిస్తూ
గ్రామీణ వైద్యులు లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటారని ప్రతి పల్లెటూరిలో గడప గడపకి వారి ఇంట్లో ఎంత మంది ఉన్నారో గ్రామీణ వైద్యులకు తెలుసు కోడి కూత కూసిన తరువాత బ్యాగు పట్టుకొని ఎలా ఉందమ్మా మీ ఆరోగ్యం అనేది గ్రామీణ వైద్యులే. రాత్రనక పగలనక ఎండ ఆనక వాన ఆనక నిత్యం అందుబాటులో ఉండేది గ్రామీణ వైద్యులే.
కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మూసి వేయడం గ్రామీణ వైద్యులు మాత్రం ధైర్యంగా తగు జాగ్రత్తలు ప్రజలకు చెప్తూ గ్రామీణ వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టీ వైద్యసేవలు అందించారని పేర్కొన్నారు.
క్వాలిపై డాక్టర్లు సెల్ఫ్ ఇంజక్షన్ లు సెలైన్ బాటిల్స్ వ్రాస్తే ఇంజెక్షన్లు ఇచ్చేది గ్రామీణ వైద్యులే దయచేసి గ్రామీణ వైద్యుల పై దాడులు ఆపాలని కోరుతున్నాము.
అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై ఏ స్.రాజశేఖర్ రెడ్డి గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఇచ్చారు.
మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే శిక్షణ తరగతుల మొదలు పెట్టాలని అర్హులైన గ్రామీణ వైద్యులకు 108 లో కానీ పల్లె దావాఖనలో తీసుకోవాలని మంచిర్యాల ఆర్.ఎం.పి, పి.ఎం.పి జిల్లా ప్రధాన కార్యదర్శి బోద్ధుల శ్రీనివాస్ అన్నారు.

పల్లె పకృతి వనాలు, అమ్మఆదర్శ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి గ్రామాలలోని పల్లె పకృతి వనాలను, మోతే గ్రామంలోని అమ్మఆదర్శ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ వర్క్స్, టాయిలెట్ వర్క్స్ మొదలగు పనులు పరిశీలించిన అనంతరం పాఠశాలకు ఈజీఎస్ లో ప్రహరి గోడ ప్రపోజల్ పెట్టమని పిఆర్ఎఈకి తెలియజేయడం జరిగినది. ఈపనులన్నీ త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో పిఆర్ఏఈ సచిన్, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంఈఓ అంబటి వేణు కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ప్రధానోపాధ్యాయులు సునీత, వీవో, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా చైతన్య సాధనలో పీసా మొబిలైజర్,

జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత”” వజ్జరాజు””

ములుగు మండలం : నేటి ధాత్రి

ఎవరు ఎక్కడ పోతే నాకేంటి? నేను నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామా? లేదా? ఒకరికి సేవ చేస్తే నాకేం వస్తది అంటూ వారు ప్రజలకు సేవ చేయకపోగా చేసే వారిని అవహేళన చేస్తూ చూసే ప్రబుద్ధులు ఉన్న నేటి సమాజంలో ములుగు మండల రాయిని గూడెం గ్రామానికి చెందిన ఒక ఆదివాసి గిరిజన యువకుడు పీసా మొబైలైజర్ , దళిత సాహిత్య అకాడమీ వారిచే దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అంబేద్కర్ అవార్డు పొందిన వజ్జరాజు ప్రజా చైతన్య సమాజ నిస్వార్థ సేవలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు . చిన్నతనం నుండి చురుకుగా ఉంటూ ఉన్నత విద్య నభ్యసించి ప్రజలను చైతన్యపరిచి సమాజసేవే పరమావధిగా తనతోపాటు తమ చుట్టుప్రక్కలగల లోతట్టు గ్రామాల గిరిజన, గిరిజనేతర, ఆదివాసి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నాడనుటలో ఎలాంటి సందేహం లేదు మచ్చుకు కొన్ని ఉదా: ములుగు జిల్లాగా ప్రకటించక ముందు ములుగు మండల ఉమ్మడి కొత్తూరు గ్రామపంచాయతీకి చెందిన సుమారు 7 గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించి గ్రామాలా భివృద్ధి లక్ష్యంగా అప్పటి పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయటంలో సైతం కృషిచేసిన విషయం అందరికీ తెలిసినదే లోతట్టు గ్రామాలైన పంచోతుకులపల్లి, కన్నాయి గూడెం, యాపలగడ్డ, కొత్తూరు, రాయినిగూడెం, దుబ్బగూడం ,పెగడపల్లి, సర్వాపూర్, లాలాయ్ గూడెం, జగ్గన్న గూడెం, అంకన్నగూడెం ప్రాంతాల అభివృద్ధికి కృషిలో భాగంగా అన్ని గ్రామాల ప్రజల ను ఏకం చేసి ప్రస్తుత ఆదివాసి ములుగు జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పంచాయతీరాజ్ మినిస్టర్ ( సీతక్క )దనసరి అనసూయను రాయిని గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ఆహ్వానించి సన్మానించిన అనంతరం పైన పేర్కొనబడిన గ్రామాల పరిధిలోగల సమస్యల సాధనకు సీతక్కకు వినతి పత్రాలు అందింపజేసి సానుకూల స్పందన వచ్చేలా కృషి చేశాడు.
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 29 ప్రభుత్వ శాఖలలో గల ఖాళీలను ఆదివాసి గిరిజన నిరుద్యోగ విద్యావేత్తలతో పూరించాలని ఐటీడీఏ ఎదుట సామరస ధోరణితో పరిష్కార మార్గాలను వెతుకుటకు నిరసన దీక్ష తలపెట్టిన సందర్భం కూడా కలదు . ముఖ్యంగా ఆదివాసి ఏజెన్సీ గ్రామాల్లో యువతను చేరదీసి సమ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషిలో భాగంగా తమతో పాటు తమ గ్రామాల అభివృద్ధికి ఎలా కృషి చేయాలో నేర్పుటలో సైతం ముందున్నారు. ప్రజల సంక్షేమం కొరకు ఇటీవల రాయిని గూడెం గ్రామంలో గల భూలక్ష్మి ( బొడ్రాయి ) గ్రామ దేవతను , పోచమ్మ తల్లి ని, ఆంజనేయస్వామి ల విగ్రహాలను వాస్తు ప్రకారం గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో సుమారు వారం రోజులుగా ఆ దేవతలకు పూజ చేస్తూ వేద బ్రాహ్మణుల మధ్య, శాస్త్రోపేతంగా పునర్వ్యవస్థీకరించుటలో తనదైన పాత్ర అమోఘం, సమాజo లోని అస్పృశ్య , ఆకృత్యాలను తొలగించి న్యాయం, ధర్మం కాపాడుటలో కృషి చేస్తున్నందుకు గాను దళిత సాహిత్య అకాడమీ వారు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అంబేడ్కర్ బిరుదునిచ్చి గౌరవంగా సత్కరించారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆయన సేవలను మరింత విస్తృత పరిచి రానున్న రోజులలో మరింత చేయాలని కోరుకుంటూ మామూలు పౌరుడు గానే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి” వజ్జ రాజు ” వచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పాపన్న జగదీశ్వర్ ఆధ్వర్యంలో ముక్తేశ్వర లాడ్జిలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే ఈ రెండు పార్టీలను ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యావంతులు విద్యార్థులు సమస్యల పట్టవు ఎన్నికల వచ్చినప్పుడు ఓట్లు వేయించుకునేందుకు ఆది చేస్తారు హామీలు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం ఈ రెండు పార్టీల నైజం కావున వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నం జగదీశ్వర్ పాపన్న చల్ల నారాయణరెడ్డి శంకర్ నాయకులు పాల్గొన్నారు

కన్నుల పండువగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే గ్రామంలో భోగ లక్ష్మణ్ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించగా మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పుల అంజని ప్రసాద్ కళ్యాణదాతగా వ్యవహరించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు తరలిరాగా పండితుల వేద మంత్రోత్సవాల మధ్య శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా,కన్నుల పండువగా జరిగినది. ఈకళ్యాణానికి ముఖ్యఅతిథిగా చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, కోలా రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

వర్షానికి తడిసిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి.
కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు 40 రోజులు అయిందని , ఇంకొక రైతు 30 రోజులైంది వడ్లు ప్రభుత్వం కొనడం లేదు అని చెబుతున్నారు. ఈటీవీల కురిసిన భారీ వర్షానికి వడ్లు తడిసి మొలకలు వచ్చాయి
చాలామంది రైతులు దాదాపు 100, 200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారంటీల్లో భాగంగా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులను మోసం చేసింది.
మేము 100 రోజుల్లో రైతు భరోసా 7,500 పెంచుతామని చెప్పి మోసం చేసిర్రు.
100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామని అందరూ మోసం చేసిండ్రు. 100 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15000 ఇస్తామని మోసం చేసిండ్రు.రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.
వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం.. పోయిన యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే, కాంగ్రెస్ 30 మెట్రిక్ టన్నుల కూడా కొనలేదు. రైతులు బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది.
బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు 500 బోనస్ ఇస్తామని ఇయ్యాల సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సిఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క సంతకాలు పెట్టారు.
మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులు పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమయిందంటే చేతులు ఎత్తేస్తున్నారు.
రైతులు పండించేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకం. సన్నాలకు బోనస్ ఇస్తామ నడం రైతులని దగా చేయడం, రైతుల గుండెల మీద తనడం తప్ప ఇంకోటి కాదు.
బాధగలిగే విషయం ఏమిటంటే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి అని కొంతమంది మొరుగుతున్నారు అని అంటున్నాడు.
ఇచ్చిన హామీ అమలు చేయమంటే రైతులను పట్టుకొని మొరుగుతున్నారు అంటున్నారు అంటే రైతులను కుక్కలు అంటున్నారా.
రైతుబంధు అదిగితే రైతులను చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి అంటున్నాడు .వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు అంటే రైతులను కుక్కలు అని ఇంకొక మంత్రి అంటూనాడు.
రైతులను అవమానించేందుకేనా మిమ్మల్ని గెలిపించింది. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని రైతులు చెపుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో అయిపోగానే సన్నవడ్లకే బోనస్ అని రైతులను మోసం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ కల్లేపల్లి శోభ రఘుపతిరావు బుర్ర రమేష్ కటకం జనార్ధన్ పూర్ణచందర్ బుర్ర రాజు ప్రవీణ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు

రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డివైఎస్డిఓ

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

దుగ్గొండి మండల కేంద్రంలోని
శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ జరుగుచున్న వేసవి రెజ్లింగ్ శిక్షణ శిబిరాన్ని వరంగల్ (డివైఎస్డిఓ) జిల్లా యూత్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అధికారి టీవీఎల్ సత్యవాణి శిక్షణ శిబిరాన్ని గురువారం సందర్శించారు.
తెలంగాణ స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ డైరెక్టర్ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డివైఎస్డిఓ అనుమతులతో శ్రీ అదర్శవాణి పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరంలో ఉన్న క్రీడాకారులతో అధికారిని ముచ్చటించారు. క్రీడాకారులు సమయాన్ని వృధా చేయకూడదని వేసవిలో తన శిక్షణను కొనసాగించాలని తెలిపారు.ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకుసాగాలని క్రీడాకారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, ప్రిన్సిపల్స్ సుధాకర్ రవి, ఏవో రమేష్, కోచ్ ఇటికాల దేవేందర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

రామాంజపురం ఎరుకల నాంచారమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

వెంకటాపూర్ మండలం లోని రామాంజపురం గ్రామ శివారులో కొలువుదీరిన శ్రీ ఎరుకల నాంచారమ్మ తల్లిని గురువారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకున్నారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎరుకల కులస్తులు ఎమ్మెల్యేకు నాంచరమ్మ తల్లి బుట్టను అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ నాంచరమ్మ ఎరుకల కులస్తుల ఆరాధ్యదైవమని ప్రతీ సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున జాతర జరుపుకోవడం జరుగుతుందన్నారు నూతన ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు వచ్చే రోడ్డు ను తారు రోడ్డును చేయాలని ఎమ్మెల్యే గారిని ఎరుకల కుల పెద్దలు కోరగా మంత్రి సీతక్క గారితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య డైరెక్టర్ కేతిరి సుభాష్ డైరెక్టర్లు కోనేటి రాజు మనుపాటి రమేష్, అంగిడి ప్రశాంత్ కేతిరి రాజేందర్ కుర్ర రవి తదితరులు ఉన్నారు

నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్ నమోదు .జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

నకిలీ విత్తనాలు విక్రయ దారులపై కఠినంగా వ్యవహరించాలి

టాస్క్ ఫోర్స్ టీములు నిరంతరం తనిఖీలు చేపట్టాలి

భూపాలపల్లి నేటిధాత్రి

నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాలులో వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఫెర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నకిలీ విత్తనాలు నియంత్రణ చర్యలపయో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ రైతులకు డీలర్లు, ఫెర్టి లైజర్ షాపు యజమానులు నకిలి, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించొద్దని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లైతే అలాంటి వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం నడుచుకోవాలని రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. మార్కెట్ లోకి నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయాలు జరుగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు జిల్లాలో ఏదో ఒక చోట ఫెర్టి లైజర్ షాపులలో వ్యవసాయ శాక అధికారులు తనిఖీలు చేపట్టి నివేదిక అందజేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టాస్క్ పోర్స్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నకిలి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని కృత్రిమంగా విత్తనాల కొరత సృస్టించే అవకాశం ఉందని అక్రమంగా విత్తనాలు, ఎరువులు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులను రద్ధు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రైతులకు రశీదు తప్పకుండ ఇవ్వాలని రశీదులో రైతు పేరు, ఏ కంపనీ విత్తనాలు అనే విషయాలు తప్పకుండ రాయాలని, రైతు నుండి సంతకం తీసుకోవాలని, పత్తి విత్తనాలు స్టాక్ షాపులోకి రాగానే ఇన్వాయిస్ బిల్లులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పంపించాలని రిజిస్టర్ నిర్వహించాలని అన్నారు. ఓ.ఎల్.ఏం.ఎస్ పోర్టల్ లో విత్తనాల వివరాలు ప్రతి నెల 5వ తేదీన స్టాక్ అమ్మకం వివరాలను నమోదు చేయాలని తెలిపారు. గత సంవత్సరం విత్తనాలు, పురుగు మందులు ఏవైన నిల్వలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లాఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. మన జిల్లా మహా రాష్ట్ర, ఛత్తీష్ ఘడ్ సరిహద్దు జిల్లా కావడంతో కొంత మంది దళారులు ముఠాలుగా ఏర్పడి రైతులకు తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, అలాంటి వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అలాంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని తెలిపారు. సరియైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్ల తో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, వ్యవసాయ అధికారులు, ఫెర్టి లైజర్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య తీవ్రమైన గాయాలతో అపస్మార్క స్థితిలో చికిత్స పొందుతుంది.
కారుణ్య మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ విద్యను ఈ కళాశాలలో అభ్యసిస్తుంది.
ఈరోజు తెల్లవారుజామున తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
కళాశాల వసతి గృహంలో ఈ సంఘటన జరగటం వలన అనుమానాలు కలుగుతున్నాయి.
కళాశాలకు కళాశాల వసతి గృహానికి సరైన రక్షణ చర్యలు లేవు.
ప్రహరి గోడలు కూడా లేవు.
మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య పై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారా?
లేకపోతే బయట వ్యక్తులు హత్య ప్రయత్నం చేశారా?
ర్యాగింగ్ విషయంలో సీనియర్ విద్యార్థులు హత్యా ప్రయత్నం చేశారా?
కారుణ్య 1 నుండి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలో చదువుకున్నది.
పదవ తరగతిలో 10/10 మార్కులతో ఉత్తీర్ణత.
ఇంటర్లో 901 మార్కులతో ఉత్తీర్ణత.
బాగా చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటుందా?
ఈ మిస్టరీని పోలీసులే చేదించాలి.

గంజాయి పట్టుకున్న భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాల్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైన్ ఇంక్లైన్ ఆర్చి వద్ద నమ్మదగిన సమాచారం మేరకు సీఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేయుచుండగా నిగ్గుల రాజు శనిగరం గ్రామం కమలాపురం మండల అను వ్యక్తి టీఎస్ 24C 2236 గ్లామర్ బండి పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతని పట్టుకొని విచారించగా అతడి వద్ద 1 కేజీ 100 గ్రాముల ఎండు గంజాయి లభించగా అతడు విచారణలో భాగంగా కుమ్మరి నాగరాజు అలియాస్ రాజు నడికుడా గ్రామం అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పగా ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన పోలీస్ సిబ్బంది ఈ కేసు లో పూర్తి విచారణ చేస్తున్నామని సీఐ. డీ.నరేష్ కుమార్ తెలియజేశారు

వర్ష బీభత్సానికి విరిగిపడ్డ చెట్టు…. రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలు

ఈ రోడ్డును కాపాడేదెవరు

శాయపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని కుమ్మరి వాడనుండి కొత్తగట్టు సింగారం నుండి వెళ్లే దారి చెట్ల పొదలతో మూసుకుపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు ప్రక్కల ఉండే చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి దీంతో రోడ్డు దారి కనిపించకుండా పోయింది. రోడ్డుకి ఇరువైపులా పొదలు పెరిగి దారి కనిపించని స్థితికి చేరింది. అటువైపు వెళుతున్న వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తీసివేయాలని. రైతులు వాహనదారులు కోరుతున్నారు.

సుడిగాలి పర్యటన చేసిన BRS ఎమ్మెల్యే

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి

గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం
మండలం లో సుడిగాలి పర్యటన చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గంగారం మండలంలొని మడగూడెం గ్రామంలో నూతన వధూవరులు యాపా ప్రభాకర్ వెడ్స్ అనూష లను ఆశీర్వదించిన
ఆసిమాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
అనంతరం దశదిన కర్మలకు హాజరై గంగారం మండలంలోని మర్రిగూడెం గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన సువర్ణపాక సమ్మక్క కుటుంబాన్ని పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో గంగారం మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య జిల్లా నాయకులు జగ్గారావు గంగారం మండల ప్రధాన కార్యదర్శి. జంగాలపల్లి సర్పంచ్ ఇస్లావత్ బాలకృష్ణ ఉమ్మడి కొత్తగూడెం మండలం సీనియర్ నాయకులు ఈసం సమ్మయ్య, ఉప సర్పంచ్ మాధారపు సతీష్ జనగం వెంకన్న దుర్గం నారాయణ దుర్గం కృష్ణ గంగారం మండల సోషల్ మీడియా జనగం రవి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత కంటి వైద్యశిబిరం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని సాదన్ పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాలేశ్వరం మహాదేవపూర్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో సాధన్ పల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సుమారుగా 121 మంది కంటి పరీక్షలు చేపించుకున్నారు కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 40 మంది పేషెంట్లను కంటిలో పొరలు శుక్లములు వచ్చిన వారిగా లయన్స్ క్లబ్ వెంకన్న ఆప్తాలమిక్ గుర్తించి వారికి ఉచితముగా కంటి ఆపరేషన్లు చేపిస్తామని సాధనపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసినారు ఇట్టి కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించినందుకు ప్రజ్వల ఎఫ్ పి సి ఎల్ మరియు లయన్స్ క్లబ్ వారికి సాధనపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి వైద్యశిబిరాలు ముందు ముందు కూడా నిర్వ హించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్ష శిబిరంలో ప్రజ్వల డైరెక్టర్ జంగసమ్మయ్య , ఎఫ్ ఎఫ్ దొడ్డిపాక రవిచందర్ తరాల తిరుపతి ఎఫ్ ఎఫ్ మరియు గ్రామ కారోబార్ కత్తుల రవి పాల్గొన్నారు.

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తాం..

# విత్తన,ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు.
# విత్తన డీలర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి


# వ్యవసాయ అధికారి దయాకర్..

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

రైతులకు కృత్రిమ కొరత సృష్టిస్టించిన,నాసికరం విత్తనాలు విక్రయించిన షాపుల లైసెన్సులు రద్దు చేసి పిడి యాక్ట్ నమోదు చేస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి చిలువేరు దయాకర్ అన్నారు.
దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి మండల కేంద్రంలో గల విత్తనాల, ఎరువుల షాపులను మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండల వ్యవసాయ అధికారి దయాకర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ సమీపిస్తున్నందున మండలంలోని అందరు లైసెన్సు కలిగిన విత్తన డీలర్లు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండి ఎరువులు, విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.ఏదైనా డిమాండ్ ఉన్నటువంటి విత్తనాల రకాలు షాపులో ఉన్నప్పటికీ కృత్తిమ కొరత సృష్టించిన, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించిన,నాసిరకమైన విత్తనాలు అమ్మిన, విడిగా విత్తనాలను రైతులకు అమ్మకాలు చేస్తూ,రైతులకు రసీదు ఇవ్వకున్న చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకొని వారిపై పి.డి చట్టం ,విత్తన చట్టం, నిత్యావసరల సరుకుల చట్టం, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు రద్దు చేస్తామని ఈసందర్భంగా హెచ్చరించారు.అదేవిధంగా ప్రతి ఒక్క విత్తన డీలర్ రైతులకు అమ్మినటువంటి విత్తనాలకు సంబంధించి ఒక రిజిస్టర్ రైతు వారిగా వివరాలను నమోదు చేసి తనిఖీ అధికారులు వచ్చినప్పుడు తప్పనిసరిగా అందజేయాలన్నారు. ధరల పట్టిక, స్టాక్ వివరాలు, స్టాక్ రిజిస్టర్, బిల్ పుస్తకాలు అన్ని సమకూర్చుకొని ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా రైతులకు తోడ్పాటు అందించాలని ఏఓ దయాకర్ తెలియజేశారు.

ఘనంగా హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం

సామూహిక సత్యనారాయణ వ్రతాలు మహా అన్నదానం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం కట్ట పైన ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి 52వ వార్షికోత్సవం సందర్భంగా 150 హనుమాన్ మాల ధారణ గురువారం ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం పౌర్ణమి పర్వదినం సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని దుగ్యాల అమృత ఆగమ రావు, దుగ్యాల స్వరూప వెంకటనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలతో పాటు హనుమాన్ మాల ధారణ భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులు ఆలయ అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు

జాతీయ మానవ హక్కుల మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా కైరి శ్రీనివాస్ గౌడ్ నియామకం

మంచిర్యాల నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ మానవ హక్కుల సంగం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్ అధ్యక్షనలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు ఎల్లవేళలా ముందుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా కైరి శ్రీనివాస్ గౌడ్ ను నియమించి నియామక పత్రాన్ని అందజేశారు ఇట్టి కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షుడు పెసర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

జైపూర్ మండల కేంద్రంలో పర్యటించిన స్పెషల్ కమిషనర్ సైఫ్ ఉల్లా ఖాన్

జైపూర్,నేటి ధ్రాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గురువారం రోజున స్పెషల్ కమిషనర్ సైఫ్ ఉల్లాఖాన్ ఆర్ డి (ఐఎఫ్ఎస్) ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జైపూర్ మండల కేంద్రంలోని సేనిగ్రేషన్ షెడ్లను పరిశీలించి పాటించవలసిన తగు సూచనలను తెలియజేసి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సేంద్రియ ఎరువు పద్ధతిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తడి చెత్త పొడి చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను వేరువేరుగా శుద్ధి చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు ఎల్లవేళలా ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ పనులు జరిగేలా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ, డిపిఓ, ఎంపీడీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రెటరీ పలువురు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version