బ్లాక్ మెయిలర్ కావాలా..గోల్డ్ మెడలిస్ట్ కావాలా.. మీరే తేల్చుకోండి.

# కాంగ్రెస్ అభ్యర్థి అఫిడవిట్ లో 56 క్రిమినల్ కేసులు..
# రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం..
# గెలిచిన తర్వాత రైతు రుణమాఫీపై మొదటి సంతకం ఏమైంది.
# కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే 50 వేల మెగా డీఎస్సీ అన్నారు ఎటు పోయింది.


# ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీ అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
# పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కెటిఆర్..


# రాకేష్ రెడ్డి,తీన్మార్ మల్లన్న మధ్య తేడా చూడాలి.
# గతంలో నేను చేసిన అభివృద్ధి కనబడుతున్నది.
# నేను తెచ్చిన అభివృద్ధి నిధులు ఖర్చులు కావాలి.
# నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
# సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,ఎన్నికల పరిశీలకులు రవీందర్ రావు,
# భారీగా హాజరైన గ్రాడ్యుయేట్స్..

నర్సంపేట,నేటిధాత్రి :

బిట్స్ బిలానిలో గోల్డ్ మెడల్ సాధించి, అమెరికాలో మాస్టర్ పూర్తి చేసుకొని గూగుల్ లాంటి అగ్రగామి సంస్థలో ఉద్యోగిగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలా లేక నిత్యం అబద్దాలు బూతు మాటలతో రాజకీయాలు చేస్తూ అందరిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కావాలో గ్రాడ్యుయేట్ సభ్యులు ఒకసారి ఆలోచించి మీరే తేల్చుకోండి అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ఎద్దేవా చేశారు.
వరంగల్,ఖమ్మం,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బాగంగా సన్నాహక సమావేశం నర్సంపేట పట్టణంలో ఆ నియోజకవర్గం పట్టభద్రులతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలో బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా జరిగింది.ముఖ్య అతిథిగా బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కెటిఆర్ హాజరైనారు.రైతుల‌ను న‌ట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతుభ‌రోసా, రుణ‌మాఫీ లాంటి హామీల‌ను తుంగ‌లో తొక్కి.. తాజాగా బోన‌స్‌పై మాట త‌ప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ప్రస్తుతం ఈ ప్ర‌భుత్వం అల‌విగానీ హామీలిచ్చి వంద రోజుల్లో అమ‌లు చేస్తామ‌న్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఐదు అమ‌లు చేశాన‌ని చెబుతున్నాడు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమ‌లు కాలేదని ఆరోపించారు. ఫ్రీ బ‌స్సులో ఆడోళ్లు కొట్టుకుంటున్న‌రు.సీట్లు దొర‌క‌ట్లేద‌ని పురుషులు బాధ‌ప‌డుతున్నారు. ఫ్రీ బ‌స్సు కూడా ఫెయిలైందన్నారు. క్వింటాల్‌కు వరి ధాన్యానికి 500 బోన‌స్ ఇస్తా అన్నడు. నిన్న చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిండు. స‌న్న వ‌డ్ల‌కే బోన‌స్ ఇస్త‌డంట‌. అప్పుడేమో అన్ని వ‌డ్లు అన్నడు.. ఇప్పుడేమో సన్నవ‌డ్లు అంటున్నారు అని ఆ బోనస్ మాట కాస్తా బోగస్ అయ్యింది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
ఇదే బోనస్ మాట ఎల‌క్ష‌న్లు ముందు చెప్పి ఉండాలి క‌దా.. అని రాష్ట్రంలో రైతుకు 95 శాతం దొడ్డు బియ్యం పండిస్తున్నారు. స‌న్న వ‌డ్లు పండించే 5 శాతం మంది కూడా బోన‌స్ తీసుకోరు. ఎందుకంటే స‌న్న వ‌డ్ల‌కు ప్ర‌యివేటు మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 2,500 నుంచి రూ. 3 వేల వ‌ర‌కు ధ‌ర ఉంది. కాబ‌ట్టి గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చే బోన‌స్ వైపు ఎవ‌రూ చూడ‌రని, మోసం చేయ‌డ‌మే కాంగ్రెస్ పార్టీ ప‌ని అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నేత‌లు అర‌చేతిలో వైకుంఠం చూపించారన్నారు. కేసీఆర్ ఉన్న‌ప్పుడు క‌రెంట్ బాగుండేది. ఇవాళ క‌రెంట్ కోత‌లు ఉన్నాయి. విత్త‌నాలు దొర‌క‌డం లేదు. ఎరువులు లేవు. నాట్లు వేసేట‌ప్పుడు ప‌డాల్సిన‌ రైతుబంధు ఓట్లు వేసేట‌ప్పుడు ప‌డుతున్న‌ది. డిసెంబ‌ర్‌లో ప‌డాల్సిన రైతు బంధు మేలో ప‌డుతుంది. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన మ‌హా మార్పు అని కేటీఆర్ విమ‌ర్శించారు. ఉత్త‌ర తెలంగాణ‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్ప‌త్రిలో ఐదు గంట‌ల పాటు సాయంత్రం 4.30 నుంచి 9.30 దాకా క‌రెంట్ లేదు. ఐదు గంట‌లు క‌రెంట్ పోతే ఒక్క జ‌న‌రేట‌ర్ కూడా ప‌ని చేయ‌లేదు. మ‌రి న‌వ‌జాత శిశువుల ప‌రిస్థితి, ఐసీయూలో ఉన్న పేషెంట్ల ప‌రిస్థితి ఏంటి..? ఇదేనా మార్పు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ నిల‌దీశారు.
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలిస్తే టెట్ ఫీజు రూ. 20 వేలు
చేస్త‌రని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మీ ఓటుతో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ఒక గ‌ళాన్ని మండ‌లికి పంపించాలి అని కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తా అన్నాడు. 50 వేల‌తో మెగా డీఎస్సీ అన్నాడు. ఈ రెండు అమ‌లు కాలేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు. లీగ‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆగిపోయాయి. కేవ‌లం కాగితాలు ఇచ్చి తాను ఇచ్చాన‌ని ఊద‌ర‌గొడుతున్నారు.నోటిఫికేషన్ విడుదల చేయకుండా,పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు అని ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచించాలని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు.
ఈ ఎన్నిక‌ల‌ ఫ‌లితంలో ప్ర‌భుత్వం కూలిపోయేది లేదు. తారుమారయ్యేది లేదు. 6 నెల‌ల క్రితం అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. కేసీఆర్‌తో స‌హా అంద‌రం ప్ర‌తి నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాం. ఇప్పటికైనా ద‌య‌చేసి మోస‌పోకండి.. గోస‌ప‌డుతామ‌ని చెప్పాము. కానీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వాగ్దానాలు న‌మ్మి కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు బాధ‌ప‌డుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.చ‌దువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పాల‌న గురించి ఆలోచించాల‌ని కోరుతున్నాను. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ప‌రిస్థితి ఏంటో ఆలోచించండి. ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంద‌మైన నినాదాలు ఎక్క‌డున్నాయో ఆలోచించండి. నాకు ఓటు వేస్తే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ద‌స్త్రంపై డిసెంబ‌ర్ 9న తొలి సంత‌కం చేస్తాన‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అర్జంట్‌గా బ్యాంక్‌కు వెళ్లి 2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకోవాల‌ని కూడా సూచించారు. డిసెంబ‌ర్ 9 పోయింది.. మ‌రో ప‌ది రోజులు అయితే జూన్ 9 వస్త‌ది. ఆరు నెల‌లు గ‌డిచిపోత‌ది. తొలిరోజే సంత‌కం చేస్తాన‌ని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిల‌బెట్టిన అభ్య‌ర్థి ప‌ట్ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో ఆలోచించాల‌ని గ్రాడ్యుయేట్ల‌ను కేటీఆర్ కోరారు.రైతు భ‌రోసా 15 వేలు ఇస్తా, భూయ‌జ‌మాలకు కాదు కౌలు రైతుల‌కు కూడా రైతుభ‌రోసా ఇస్తాన‌ని రేవంత్ న‌మ్మ‌బ‌లికాడు. రైతు కూలీల‌కు ఏడాదికి 12 వేలు ఇస్తాన‌ని అన్నాడు. కౌలు రైతుల‌కు రైతు భ‌రోసా రాలేదు. తొలిసారి మోస‌పోతే మోసం చేసినోడిది త‌ప్పు. రెండోసారి కూడా వాడి చేతిలో మోస‌పోతే మ‌న‌ది త‌ప్పు అయిత‌ద‌ని కేటీఆర్ అన్నారు.
వైట్ కాల‌ర్ వ‌ర్క‌ర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిల‌ర్ ఉండాల్నా..
తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, వెకిలి ప‌నులు చేసుడు కాంగ్రెస్ అభ్య‌ర్థి ల‌క్ష‌ణం. దందాలు చేయ‌డం, బెదిరించ‌డం వంటి కేసులు న‌మోదైన‌ట్లు కాంగ్రెస్ అభ్య‌ర్థి అఫిడ‌విట్‌లో ఉన్నాయి. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ అఫిడ‌విట్‌లో 56 క్రిమిన‌ల్‌ కేసులు ఉన్నాయి. ఆడ‌పిల్ల‌ల ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, అనుమ‌తి లేకుండా అమ్మాయిల‌ ఫోన్ నంబ‌ర్ల‌ను ఫేస్‌బుక్‌లో పెట్టిన కేసులు, బ్లాక్ మెయిల్ చేసిన కేసులు.. ఇలా 56 క్రిమిన‌ల్ కేసులు ఉన్న మ‌హానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబ‌ట్టి అభ్య‌ర్థుల గుణ‌గ‌ణాలు చూడాలి. మండ‌లిలో వైట్ కాల‌ర్ వ‌ర్క‌ర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిల‌ర్ ఉండాల్నా ఆలోచించండి. ఈ ఒక్క సీటుతో గ‌వ‌ర్న‌మెంట్ రాదు.. పోదు. కానీ బీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలిస్తే న‌ర్సంపేట యువ‌త త‌ర‌పున రేపు మండ‌లిలో గ‌ల్లా ప‌ట్టి అడిగే ప‌రిస్థితి మాత్రం ఉంట‌ది. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, నోటిఫికేష‌న్లు ఎక్క‌డా అని అడిగే హ‌క్కు ఉంట‌ది. నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే వాయిస్ ఉంట‌ది అని కేటీఆర్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని రైతు బిడ్డ‌లుగా, విద్యావంతులుగా గ్ర‌హించి బీఅర్ఎస్ అభ్యర్థికి ఓటేయ‌క‌పోతే న‌ష్ట‌పోయేది మీరే అని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోపోయిన,జాబ్ క్యాలెండ‌ర్, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి ఇవ్వ‌క‌పోయినా ప‌ట్ట‌భ‌ద్రులు మాకు ఓటేశారని ప్రభుత్వం అనుకుంతుందని తెలిపారు.ఎన్నికల హామీలో ఒక్క ప‌రీక్షకు కూడా ఫీజు ఉండ‌ద‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు టెట్ ఫీజు రూ. 400 ఉండే. ఇప్పుడు రూ. 2 వేలు అయింది. మ‌ళ్లీ వాళ్ల‌కు ఓటేస్తే టెట్ ఫీజు రూ. 20 వేలు చేయ‌రా..? ఆలోచించండి గ్రాడ్యుయేట్ మేధావులను అడిగారు. ప‌దేండ్ల‌లో తెలంగాణ‌లో ఎంతో ప్ర‌గ‌తి సాధించాం. కొత్త జిల్లాలు, మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్లు, తండాలు గ్రామ‌పంచాయ‌తీలు అయ్యాయి. ఐటీ ఎగుమ‌తులు పెరిగాయి. ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయని తెలంగాణ తొలి ఐటి పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

#రాకేష్ రెడ్డి,తీన్మార్ మల్లన్న మధ్య తేడా చూడాలి.

ప్రస్తుతం జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, నిత్యం పచ్చి అబద్దాలతో బూతులు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ల మధ్య ఉన్న తేడాను గ్రాడ్యుయేట్స్ గుర్తించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వంలో
గతంలో నేను చేసిన అభివృద్ధి కనబడుతున్నదన్నారు.నేను తెచ్చిన ఆ అభివృద్ధి నిధులు ఖర్చులు చేయకుండా వృదా చేస్తున్నారని, నిధులు లాప్స్ కాకముందే పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, బీఆర్ఎస్ నాయకులు రవీందర్ రావు,
నాయకులు సతీష్ రెడ్డి,జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న,ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి,మున్సిపల్ చైర్మన్ రజినీ కిషన్,వైస్ చైర్మన్ వెంకట రెడ్డి,రాయిడి రవీందర్ రెడ్డి, ఎన్ఆర్ఐ శానబోయిన రాజ్ కుమార్, సుంకరి సంతోష్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రాడ్యుయేట్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వాషింగ్ మిషన్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి గ్రామానికి చెందిన బిటుకు లచ్చయ్య కుటుంబం వేరే గ్రామానికి వెళ్లడంతో బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా మంటలతో అంటుకోవడం జరిగింది విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గమనించి అప్రమత్తమై మంటలు చల్లార్చి చూడగా షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఇంటిలో మంటలు చెలరేగాయని తెలిసింది దీంతో ఆ కుటుంబానికి దాదాపు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందిని తెలిపారు.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.

మాదారి భాగ్య రెడ్డి వర్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి : మాదారి బాగ్యా రెడ్డి వర్మ ఆశయ సాధన కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు
భాగ్య రెడ్డి వర్మ 136 వ జయంతి ఉత్సవాలను బుధవారం ఐ.డి. ఒ.సి. ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం అధికారికంగా ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, సంఘ నాయకులు భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదారి భాగయ్య దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని విద్య ద్వారానే దళితులు ఆత్మగౌరవం, అభివృద్ధి సాధించగలరనే విశ్వాసంతో హైదారాబాద్ లో దళితుల కొరకు 30 పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. హిందూ సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనం పై అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. సమాజంలో ఉన్న జోగిని, దేవదాసి, వెట్టిచాకిరి వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో మార్పు కొరకు కృషిచేశారని తెలిపారు. ఆది ఆంధ్ర సభ నిర్వహించి దళితులను, అణగారిన వర్గాల ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.
భాగ్యరెడ్డి వర్మ సూచించిన బాటలో పయనించిన జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రాజారాం ప్రకాశ్ తన చక్కటి పాట ద్వారా భాగ్యరెడ్డి వర్మ జీవిత కథను వివరించారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి నుషిత, జిల్లా అధికారులు, సంఘము నాయకులు గంధం నాగరాజు, గిరిరాజా చారి, టి. వెంకటస్వామి కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నవధాన్యాల సాగుతో భూమికి ఎంతో మేలు

ముత్తారం :- నేటిధాత్రి

నవధాన్యాలను సాగు చేయడం ద్వారా జీవవైవిద్యం పెరిగి భూమికి ఎంతో మేలు జరుగుతుందని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ కేశవాపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ క్షేత్ర పరిశీలకులు చెల్కల యుగేందర్,రాజశేఖర్ లు తెలిపారు.బుధవారం ముత్తారం మండలంలోని దర్యాపూర్ గ్రామంలో బిసిఐ క్షేత్ర పరిశీలకులు మాట్లాడుతూ నవధాన్యాలు భూమిలో చల్లిన సుమారు 20 రోజుల నేలలో కలియదున్నడం వలన నత్రజని స్థిరీకరించబడుతుందని,భూసారం పెరుగుతుందని,నేల గుల్లబారి మిత్ర పురుగులు వృద్ధి చెంది జీవవైవిద్యం పెరగడంలో దోహదపడతాయని,నేలలో తేమ శాతం పెరిగి,మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ పియూ మేనేజర్ సాయి ప్రకాష్ రెడ్డి,రైతులు రాపెల్లి రాజయ్య,మందల కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ గా తీన్మార్ మల్లన్న ను గెలిపించాలి-సోదా రామకృష్ణ

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న-కొయ్యడ శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి
ప్రజల అభిమానం గెలిచిన వ్యక్తి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిపించాలని పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోద అనిత రామకృష్ణ న్యాయవాదులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరకాల కోర్టు ఆవరణలో న్యాయవాదులను మున్సిపల్ చైర్ పర్సన్ సోద అనిత రామకృష్ణ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)అభ్యర్థిత్వాన్ని బలపరిచి అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరామకృష్ణ మాట్లాడుతూ తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల గొంతెత్తి పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నత యమే లక్ష్యంగా పనిచేసే లక్షలాది ప్రజల గుండెల్లో కొలువై తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు.పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఒక విప్లవ కెరటం అని ఎగసిపడే అగ్నిజాల ఉద్యమకారుడని అంతేగాక పీడిత ప్రజల పక్షాన గర్జించే సింహం అంటూ తన గొంతు ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రజలకు అండగా నిలబడే వ్యక్తిని గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వరరావు,ఎండి రంజాన్ అలీ,న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి,లక్కం శంకర్,షాబిర్, వెంకటరమణ,రాజేందర్,రాజు, రాజేందర్,రమేష్,సురేష్,వేణు యాదవ్,సూర్యం,రమేష్,రఫీ, ప్రవీణ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని రకాల వడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలి

మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కొండు బానేష్

మంచిర్యాల, నేటి ధాత్రి :

తెలంగాణ రాష్ట్రంలో 60శాతం దొడ్డు వడ్లను పండిస్తున్న రైతాంగాన్ని ద్రుష్టిలో కి తీసుకొని క్వింటాకు 500బోనస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాన కాలం సీజన్లో సన్న వడ్లను 500రూపాయలు బోనస్ ప్రకటించటం, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని సన్న రకాల వడ్లను సేకరించాలని తీసుకున్న నిర్ణయము హర్షనీయం 25రకాల సన్న వడ్లను పండించ టానికి రైతాంగం కృషిని కొనసాగిస్తున్నారు.
హెచ్ ఎం టి – జె ఎస్ ఆర్ మహేంద్ర బి పి టి రకాలు కూడా ఎకరానికి 25,28,30, క్వింటాలు దిగుబడి వస్తుంది. సన్న రకాల వడ్లకు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో మార్కెట్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే పంట రాగానే పచ్చి వడ్లనే మిలర్స్ ఎం ఎస్పీ కంటే ఎక్కువగా ధర పెట్టికొనుగోలు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలలో మార్కెట్ లో దొడ్డు రకం వడ్లను సాగుచేస్తున్న రైతాంగం సాగు ఖర్చు తక్కువగా ఉంటుంది. అని వాతావరణం ఎట్లా ఉన్నా పండించు కునే అవకాశాలు ఎక్కువగా వస్తుంది అన్న ఆలోచనతో సాగు చేయడం జరుగుతుంది.ఈ పంట ను ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు.తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పటం హర్షనీయo దొడ్డు రకాల సాగుపై తెలంగాణలో అన్ని జిల్లాలలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వారిని చైతన్య వంతం చేయటం ద్వారా ఏ ఏ ప్రాంతాలలో సన్న రకాలు సాగు చేయాలి దీనిపై పూర్తి అవ గాహన కల్పించడానికి ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి. 60శాతం ప్రస్తుతం దొడ్డు రకాలు సాగు చేయటం జరిగింది. క్రమక్రమంగా లాభసాటిగా ఉన్న సన్న రకాల ను పండించ టానికి ప్రభుత్వం రైతాంగంలో అవగాహన కల్పించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి.ప్రస్తుతం దొడ్డు రకం వడ్లకు 500బోనస్ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏ ఐ కే ఎస్)
మంచిర్యాల జిల్లా కార్యదర్శికొండు బానేష్ కోరారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలి

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ అనుచిత వాక్యాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు బిజెపి నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు ఇవే మా సవాళ్లు ఖబడ్దార్ మీరు చేసినటువంటి అనుచిత వాక్యాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు న్యాయం చేసే పార్టీ 75% వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనడం జరిగినది తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినది దొడ్డు బియ్యం 90 శాతం ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలు సన్న బియ్యం తినాలని ఆలోచన తోటి రైతులను ఉత్తేజిస్తూ 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని రైతులు కూడా గమనిస్తూ గత పది ఏళ్ల కెసిఆర్ పాలనలో రైతుకు అన్యాయం తప్ప న్యాయం జరగలేదు. వాళ్లు ప్రభుత్వాన్ని కోల్పోవడం వల్ల మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈసీ వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఇలాంటి ధర్నాలు చేయొద్దని వాళ్లను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్ నాయకులు మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డిసిసి మెంబర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీకాంత్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆసంపల్లి శివకుమార్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్.

చిట్యాల, నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ మాట్లాడుతూ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి-తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.అని,
చదువుకున్న యువత,విద్యావేత్తలు అలోచించి ప్రజా సమస్యల పై ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న ని గెలిపించుకుందాం.యువత దేశానికీ వెన్నెముక,యువత రాజకీయల్లోకి రావాలి సరైన నాయకుడు తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాలిఅని.భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మరియు భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షులు-అయితే ప్రకాష్ రెడ్డి సూచనలమేరకుక్లస్టర్ పరిధిలోని మరియు చిట్యాల మండలంలోని పట్టభద్రులందరికి ఈ నెల 27 న జరగబోయే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నకు* మీ మొదటిప్రధాన్యత ఓటువేసి అధికమెజారిటీతో గెలిపించేవిధంగా తోడ్పడాలి అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తాం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు బుధవారం రోజు మండల కేంద్రంలోని 33/11 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే విజిట్ చేశారు అనంతరం సబ్ స్టేషన్లో ఉన్న లాక్ బుక్స్ ను తనిఖీ చేసి, ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అవి సరికాదని అన్నారు. కరెంటు కోతలు ఎక్కడా లేవని, గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలు నాశనం అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా చేస్తే ఊరుకునేది లేదన్నారు నిరంతర విద్యుత్ సరఫరా కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్ మండల వైస్ ఎంపీపీ విడుదనేని అశోక్ గణపురం సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి చోట మియా ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ వార్డ్ మాజీ మెంబర్ మండ అశోక్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు దూడపాక దుర్గయ్య సీనియర్ నాయకులు శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

రసూల్ పల్లి అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. కవిత బుధవారం రోజున సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలలో వయసుతో సమానంగా కావాల్సిన అవసరమైన ఎదుగుదలని బరువు మరియు ఎత్తు కొలతలను చూసి తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. పిల్లలు చేసిన ఫ్రీ స్కూల్ కార్యక్రమాలను పరిశీలించి అవసరమైనటువంటి సూచనలను తెలియజేయడం జరిగింది. వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాటించవలసిన ఆహార నియమాల గురించి, వడదెబ్బ నుంచి రక్షించుకోవాల్సినటువంటి నియమాలను గురించి, అలాగే కావాల్సినటువంటి పోషక విలువలతో కూడిన ఆరోగ్య పౌష్టికాహారం గురించి పిల్లలకు వారి తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. అలాగే అంగన్వాడి టీచర్లకు ఆయాలకు బాలింతల పట్ల, పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్ .కవిత, అంగన్వాడి టీచర్లు, బాలింతలు, పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో పర్యవేక్షణ

జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో మరియు ఇందారం, ముదిగుంట గ్రామపంచాయతీలను బుధవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి .వెంకటేశ్వరరావు సందర్శించడం జరిగింది. జైపూర్ మండల కేంద్రంలోని గ్రామాలలోని సెగ్రిగేషన్ షెడ్ లను సందర్శించి కంపోస్ట్ పిట్ లో కంపోస్ట్ ఎరువును తయారి విదానమును పరిశీలించి, కంపోస్ట్ పిట్ నందు వానపాములు బ్రతికి ఉండేలా చూడాలని సూచించడం జరిగింది. కంపోస్ట్ ఎరువు తయారు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, తయారు చేసిన కంపోస్ట్ ఎరువును నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనం లోని మొక్కలకు వినియోగించాలని మరియు కంపోస్ట్ ఎరువును విక్రయించి అట్టి రూపాయలను గ్రామ పంచాయితీ సాధారణ నిధిలో జమచేయాలని పంచాయితీ కార్యదర్శులకు సూచించడం జరిగింది. గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, రోడ్లపై ప్లాస్టిక్ లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురుగు కాలువలను శుభ్రం చేయుట, గ్రామ పంచాయితీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామ పంచాయితిలను పరిశుభ్రంగా ఉండే విదంగా చూసుకోవాలని పంచాయితీ కార్యదర్శులకు సూచించడం జరిగింది. సేకరించిన డ్రై వేస్ట్ ను, ప్లాస్టిక్ వస్తువులను విక్రయించి అట్టి రూపాయలను గ్రామ పంచాయితీ సాధారణ నిధిలో జమచేయాలని సూచించడం జరిగింది‌. మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శి డి.వెంకటేశ్వర్ రావు. జైపూర్ మండలం పంచాయతీ అధికారి జి.అనిల్ కుమార్, ముదిగుంట గ్రామపంచాయతీ కార్యదర్శి పి.సురేష్, జైపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్,
మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది ఉన్నారు.

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

*రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కార్మిక శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రామారావు పేట లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, బెల్లంపల్లి మండలాధికారి రాజవ్వ తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతుల సంబంధిత వివరాలు విక్రయించిన ధాన్యం వివరాలను ప్రభుత్వం అందించిన ట్యాబ్ల్ లలో నమోదు చేయాలని, అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, వేసవి తాపం నుండి విముక్తి కలిగించే విధంగా నీడను, ఇతరత్రా మౌలిక సదుపాయాలను కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన గన్ని సంచులు, వర్షా బావ పరిస్థితుల దృశ్యం ధాన్యం తడవకుండా టార్పల్లిలను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యమును ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు కేటాయించిన మేరకు తరలించే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ సభావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ ఇన్చార్జ్ అధికారి హరికృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వనపర్తి లో మాజీ బిసి ఎమ్మెల్యే దివంగత జయరాములు స్మారకార్థం 24న బీసీ సదస్సు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి మాజీ బీసీ ఎమ్మెల్యే ఈనెల 24న 39వ వర్ధంతి సందర్భంగా నివాళుల కార్యక్రమం ఆయన ఘాటు వద్ద వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉంటుందని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు . వనపర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు బీసీ ల సనాయకులు అన్ని కుల సంఘాల నాయకులు ప్రజలు విద్యావంతులు హాజరుకావాలని పిలుపునిచ్చారు . మాజీ ఎమ్మెల్యే దివంగత జయ రాములు రాములు గారి స్మారకార్థం ఈ నెల 24న ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రాష్ట్ర జేఏసీ నాయకులు రాష్ట్ర లంబాడి పోరాట సమితి అధ్యక్షులు అన్ని కుల సంఘాల నాయకులు ఐక్యవేదిక నాయకులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో జయరాములు పేరుతో ఉన్న గెస్ట్ హౌస్ ను పంచాయతీరాజ్ కార్యాలయానికి ఇచ్చారని వెంటనే మార్చి వనపర్తి మాజీ బీసీ ఎమ్మెల్యే దివంగత జయరాములు పేరుతో ఉన్న పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ మార్చాలని జిల్లా కలెక్టర్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు

సబ్సిడీపై జీలుగ విత్తనాలు.

వరి కొయ్యలను కాల్చకూడదు.
మండల రైతులకు ఏ.ఓ .సూచన.
మహా ముత్తారం నేటి ధాత్రి.
జీలుగా విత్తనాలు వాడి భూసారం పెంచుకోవాలని మహా ముత్తారం మండల రైతులకు ఏ.ఓ తెలియజేశారు. మహముత్తారం మండల రైతులకు 60 శాతం సబ్సిడీపై జీలు గ విత్తనాలు పంపిణీ చేయడానికి పిఎసిఎస్ మహా ముత్తారంవద్ద బస్తాలు అందు బాటలో ఉంచడం జరిగింది తెలియజేశారు.30 కిలోల బస్తా పూర్తి ధర 2.790 రూపాయలు ఉంటుంది కానీ సబ్సిడీ పై రైతు చెల్లించవలసిన ధర 1. 116 మాత్రమేనని తెలియజేశారు .ఇట్టి విత్తనాలు కావలసిన రైతులు ఆధార్ మరియు పట్టా పాస్ బుక్ తో రైతు వేదిక వద్ద ఏఈఓ తో పర్మిట్ నెంబర్ తీసుకొని పిఎసిఎస్ మహాముత్తారం కార్యాలయంలో బస్తాలు తీసుకోగలరు .అదేవిధంగా జి లుగా విత్తనాలు వాడడం వలన భూసారం పెరుగుతుందని రసాయన ఎరువుల ఖర్చు తగ్గించవచ్చునని మరియు మంచి దిగుబడి సాధించవచ్చునని తెలియజేశారు .అదేవిధంగా యాసాంగిలో వరివేసిన రైతులు పంట కోత అనంతరం మిగిలిన వరి కొయ్యలను నేలలోనే కచ్చితంగా కలియ దున్ని భూసారం పెంచుకోవాలని తెలియజేశారు కలియ దున్నిన తర్వాత త్వరగా కుల్లడానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పెట్ వాడాలని తెలియజేశారు అలా కాకుండా వరి కోయ్యలను కాల్చితే
భూములు చెడుగా మారతాయని తెలియజేశారుకావున ఏ ఒక్క రైతు కూడా వరి కొయ్యలనుకాల్చకూడదని రైతులకుసూచించారు.

ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద చేయూత

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనీకి చెందిన ఆవునూరి వెంకటి అనే నిరుపేద వ్యక్తి ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి జారి పడడంతో వెంటనే అతనిని వరంగల్ లోని యం.జి.యం ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి రెండు పక్కటెముకలు , వెన్నెముక విరిగిందని మూడు నెలలు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వెంకటిది చాలా నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి, ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు..ఈ విషయాన్ని ఆర్కేపీ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ కు స్థానికులు మీడియా ప్రతినిధులు తెలపడంతో యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ సోషల్ మీడియా ద్వారా 5000రూపాయల విరాళాలు సేకరించి ఆ డబ్బులతో 50kgల బియ్యం, నిత్యావసర సరకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ గాండ్ల సమ్మన్న కోక్కుల సతీష్ ల చేతుల మీదుగా ఆ కటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో యువత ప్రధాన కార్యదర్శి జంగపల్లి మల్లయ్య సలహదారు బింగి శివకిరణ్, యువ నాయకులు సంగ రవి యాదవ్,గోనె రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు..

మానవత్వం చాటుకున్న కేటీఆర్..

ఆక్సిడెంట్‌కు గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన కేటీఆర్

వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించాడు.

రైతుల వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

వనపర్తి నేటిదాత్రి:
రైతులు ప్రజలు విద్యార్థులు ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందని టిఆర్ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి నందిమల్ల అశోక్ సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి జోహేబ్ హుస్సేన్ చిట్యాల రాము వనపర్తి లో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారి చేతుల మీదగా కాంగ్రెస్ పార్టీ రైతుల మేనిఫెస్టో డిక్లరేషన్ విడుదల చేసిందని అన్నారు . వడ్లకు 500 జొన్నలకు 330 చెరుకు 8 30 ఎండుమిర్చి పసుపు 550 పప్పు లకు 350 మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలంగాణ రాష్ట్రంలో వర్షానికి తడిసిన వడ్లను ఒక్క గింజ కూడా వదలకుండా పండించిన వాటిని కొనాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలు అయ్యాయని కరెంటు కోతలు లేకుండా నివారించాలని రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు రైతులు పండించిన వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వకుండా కుట్ర చేస్తుందని వారు మండిపడ్డారు వెంటనే రైతులకు బోనస్ రుణ మాఫీ విద్యు విద్యుత్తు కోతల్ లేకుండా 24 గంటల విద్యుత్ ను అమలు చేయాలని వారు కోరారు టి ఆర్ ఎస్ ప్రభుత్వంలో రైతులకు పరిశ్రమలకు గృహాలకు విద్యుత్ కోత లేకుండా చేసిందని వారు గుర్తు చేశారు

వనపర్తి లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభం అయ్యాయని గురువారం నాడు ఉదయం 10.50 కి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం స్వామి వారి ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వహి నిర్వాహకులు న్యాయవాది ధార వెంకటేష్ దాచ లక్ష్మీనారాయణ దాచ శివకుమార్ లగిశెట్టి శ్రీకాంత్ నూకల విజయ్. క్రాంతి ట్రాన్స్ పోర్టు ఈపూరి వెంకటేష్ నూకల నాగరాజ్ చిట్యాల నరసింహ ఆలయ పురోహితులు వెంకటేశ్వర శర్మ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే స్వామి వారి పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని తీర్థ ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించాలని వారు కోరారు

వల్లెంకుంట గ్రామ యువకుడు కుక్కల బారినుండి జింకను కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పగింత.

గ్రామ యువకుడు కొండ సాగర్.

నేటిధాత్రి. మలహార్ రావు,
మండలంలోని వల్లెంకుంట గ్రామ పరిధిలో అడవిలో నుంచి ఉదయం సుమారు 7గంటల ప్రాంతంలో జింక వచ్చింది. వచ్చిన జింకను వీధి కుక్కలు వేంబడించగా దానిని గమనించిన హమాలి సభ్యులు అక్కడే సెంటర్ పనినిర్వహిస్తున్న సమయంలో కొండ సాగర్ సెంటర్ ఇన్చార్జి సహకారంతో అందరు కలిసి కుక్కల నుండి జింకను కాపాడిl మాజీ సర్పంచ్ శనిగరం రమేష్ కు ఇంటిమెట్ చేయగా సర్పంచ్ ఫరెస్ట్ రేంజర్ అధికారులకు ఫోన్ చేయగా అక్కడికి ఫారెస్ట్ అధికారులు చేరుకొని జింకను స్వాధీనం చేసుకోవడం జరిగినది. ఇట్టి విషయంలో ఫారెస్ట్ అధికారిలు గ్రామస్తులను, యువకుడు కొండ సాగర్ ను అభినందించడం జరిగినది.

ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 

నర్సంపేట ,నేటిధాత్రి :

వరంగల్,నల్గొండ,ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 

మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టభద్రులను కోరారు. నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు నుంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి,ఖమ్మం నల్గొండ,వరంగల్,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషకరం అని అన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో నుండి ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైనికుల పనిచేస్తూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసే విధంగా సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, నర్సంపేట దుగ్గొండి,నల్లబెల్లి మండలాల అధ్యక్షులు బానోత్ లక్ష్మణ్ , ఏర్రెల బాబు,చిట్యాల తిరుపతి రెడ్డి,పలువురు నాయకులు,పట్టభద్రులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version