అనారోగ్యంతో శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుడు మృతి

మంచిర్యాల నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ లో బాయిలర్ వర్కర్ గా 20 సంవత్సరాలుగా పనిచేసిన గంగుల శ్రీనివాస్ వయసు 48 అనే కార్మికుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన వైద్యం చేయించుకోలేక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. చికిత్స పొందుతూ బుధవారం రోజున తుదిశ్వాస విడిచారు.
శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ పవర్ ప్లాంట్ క్లోజ్ చేసి గత 18 నెలలు కావస్తున్న, యాజమాన్యం క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేసినందువల్లే, కార్మికుడు చనిపోయాడు, యాజమాన్యం కార్మికులకు  రావలసిన బెనిఫిట్స్ సకాలం చెల్లించి ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని ఆరోగ్యం బాగు చేసుకునేవాడని తెలియజేశారు. శాలివాహన పవర్ ప్లాంట్ యాజమాన్యం బెనిఫిట్స్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే గంగుల శ్రీనివాస్ అనే కార్మికులు మృతి చెందాడు అతని కుటుంబమునకు, కార్మిక చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కాకుండా అదనంగా 20 లక్షల రూపాయలు చెల్లించాలని భారతీయ మజ్దూర్  సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము.

స్కూలు గ్రాండ్ కు వినియోగించిన వివరాలు క్యాష్ బుక్ నందు వెంటనే నమోదు చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గురువారం అమ్మ ఆదర్శ పాఠశాల పనుల యొక్క పర్యవేక్షణలో భాగంగా జిల్లా విద్యాధికారి ఏం వెంకటేశ్వర చారి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ నగిన సతీష్ కుమార్ తో కలిసి గుండాల మండలంలోని పాఠశాలలను సందర్శించారు.
ఈ తనిఖీలో భాగంగా ఎంపీపి ఎస్ మోదుగుల గూడెం పాఠశాల సందర్శించినప్పుడు ఆ పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ కొరకు ఏర్పాటుచేసిన ట్యాంక్ సరిగా లేదని దానికి వెంటనే సరి చేయాలని సూచించారు.
ఎంపీపీ ఎస్ , ముక్తి గుంపు పాఠశాలలో రిపేర్లు అవసరం ఉన్నప్పటికీ ఎస్టిమేషన్ పెట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఎంపీపీ ఎస్ , పడుగొనిగూడెం పాఠశాలలో స్కూల్ గ్రాండ్ వినియోగంపై రికార్డులు చూపకపోవడం పై షోకాజు నోటీస్ జారీ చేశారు.
జడ్పీ హెచ్ఎస్ , గుండాల పాఠశాల కాంప్లెక్స్ కు సంబంధించి అన్ని రికార్డులు పరిశీలించి, ఖర్చు వివరాలు సరిగా నమోదు చేయాలని, నిధులు దుర్వినియోగం జరిగినచో శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తర్వాత మండలంలో అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని, ప్రతి పాఠశాలకు ట్యాబు ను ఇవ్వడం జరిగిందని, ఫ్రీ గా డేటా కూడా అందిస్తున్నామని వాటిని ఉపయోగించి రిపోర్టింగ్ వెంటనే చేయాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఏంఈఓ కృష్ణయ్య, ఏంఎన్ ఓ పార్వతమ్మ ,ఏం ఐఎస్ ,సీసీఓ లు, సిఆర్ పి లు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గోన్నారు.

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యం

ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7 నుండి జరుగే మాదిగల జన సభలను జయప్రదం చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ కోరారు.ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా మాదిగల జన సభలను విజయవంతం చేయాలని బుధవారం వరంగల్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మైస ఉపేందర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే ఏకైక లక్ష్యంగా మాదిగలు ఎంహెచ్ పిఎస్ సంఘం పనిచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల జనజాతర సభలు జూన్ నెల నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.మాదిగల జన జాతర సభను ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే తేదిని త్వరలో ప్రకటిస్తామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకులు కార్యకర్తలు కార్యక్రమం విజయవంతం చేయడానికి సిద్దపడాలని కోరారు.

కోర్టు కేసులో ఉన్న భూమిలో అక్రమంగా బోర్లు నిబంధనలకు నీళ్లు,వాల్టా చట్టానికి తూట్లు

పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించని పోలీసులు

కూకట్పల్లి మే 30 నేటి ధాత్రి ఇంచార్జ్

అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో పాటు అక్రమాన్ని సక్రమం చేసుకునే విధంగా వివాదంలో ఉన్న భూమిలో 6 బోర్లు వేసి కోర్టును కూడా తప్పు దోవ పట్టిస్తున్న సంఘటన 1007 సర్వే నంబర్ లో బయటపడింది.
వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా బోర్లు వేసిన పట్టించుకునే నాథుడు కరువయ్యారు.వాల్టా చట్టానికి నిబం ధనలకు తూట్లు పడుతూ అక్ర మంగా బోర్లు వేసినా సంబంధిత అధి కారులు స్పందించడం లేదు.చట్టాన్ని చేతిలోకి తీసుకుని రౌడీ మూకల కను సైగల్లో అక్రమంగా ఒకే చోట ఆరు బోర్లు వేసిన సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి అవినీతికి నిదర్శనం. నిబంధనల ప్రకారం బోర్లు వేయాలంటే రెవెన్యూ అధికారులచే వాల్టా చట్టం కింద అనుమతి తీసుకో వాల్సి ఉంటుంది. అయితే రెవెన్యూ అధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా బోర్లు వేయడం చట్ట విరుద్ధం.కూకట్ పల్లి మండలంలో
ని ఖైతలాపూర్ సమీ పంలో గల 1007 సర్వేనెంబర్లో దాకా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తోపాటు మరి కొందరికి 36 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమి గత కొన్ని సంవత్స రాలుగా కోర్టు కేసులో ఉంది. అయితే ఎన్నికల కోడ్ లో ఉద్యోగులు బిజీబి
జీగా ఉండగా అక్రమ దారులు రౌడీల సహకారంతో ఒకే చోట ఆరు బోర్లు వే యడం విశేషం.ఈ విషయమై ఓ వర్గం వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసు అధికారులు ఏం మాత్రం సహ కరించడం లేదని తెలుస్తోంది.గత ప్రభు త్వ హాయంలో అవినీతికి మరిగిన అధికారులు ప్రస్తుత ప్రభుత్వంలో సైతం అక్రమాలు జరిగినప్పటికీ పట్టించుకోక పోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడు తుంది.తమ భూమిలో అక్రమంగా ఆరు బోర్లు వేసారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా వాటిని సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అయితే పోలీస్ ప్రొటెక్షన్ కోసం రెవెన్యూ అధికారులు ఫిర్యాదుదా రున్ని అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రొటెక్షన్ కోరాల్సిందిగా సూచిం చారు. అక్రమంగా వేసినారు బోర్లను
సీజ్ చేసేందుకు రెవెన్యూ అధి కారులు సుముఖంగా ఉన్నప్పటికీ పోలీ సులు మాత్రం రెవెన్యూ అధికారు లకు సహకరించకపోవడం పోలీసు అధి కారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. గత ప్రభుత్వంలో అధికా రపక్షం వారికి పూర్తి మద్దతు తెలిపిన పోలీసు అధికారులు ప్రస్తుతం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక పోవడం బట్టి చూస్తే ఇంకా ఈ రాష్ట్రం
లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికా రంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నారన్న సందే హం వ్యక్తం అవుతుంది.ఇప్పటికైనా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చసి అక్రమంగా బోర్లు వేసిన వారిపై చర్యలు తీసుకున్నందుకు ఆదేశాలు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు.

చెల్పూర్ కేటీపీపి డైరెక్టర్ను కలిసిన కార్మిక సంఘం

జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోతం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్-58 జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోత్తం ఆద్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న అర్టీజన్ కార్మికుల సమస్యలు గురించి ఈ రోజు విద్యుత్ సౌదా లో డైరెక్టర్ హెచ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ వారిని మర్యాద పూర్వకంగా కలిసి కెటిపిపి లోని అర్టీజన్ కార్మికులు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అర్టీజన్ కార్మికులకు వసతి గృహాలు సినియారిటి జాబితా చేసి పదోన్నతులు కల్పించి, యూనిఫాం మరియు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి సంవత్సరం సబ్బులు, సరుపులు, క్లాత్ లు అందించాలని వినతిపత్రం అందజేశారు త్వరలో వీటన్నింటినీ పరిసీలన చేసి అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రిజినల్ కార్యనిర్వాహక అధ్యక్షులు మామిండ్ల నాగరాజు, సభ్యులు లక్కం విజేందర్, బొమ్మకంటి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

పరకాల నేటిధాత్రి
అమ్మ ఆదర్శ పాఠశాలలో మంజూరు చేయబడిన పనులను పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు పూర్తి చేసి అందంగా ముస్తాబు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.గురువారం పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే పరకాల ఉర్దూ మీడియం పాఠశాలలో పనులు అసంపూర్తిగా ఉన్నవాటిని వెంటనే పూర్తి చేసి పంంపిస్తే వెంటనే బిల్లులు చెల్లించడం జరుగుతుందని పనులు పూర్తి అయిన పాఠశాలలో పేయింటింగ్ చేసిన తర్వాత బెంచీలు కుర్చీలు తదితర సామగ్రిని సరఫరా చేస్తామని అన్నారు.కాంపౌండ్ వాల్ ఉన్న పాఠశాలల్లో లోపల మంచి మొక్కలు నాటి అందంగా తీర్చి దిద్దాలని అన్నారు.అనంతరం ఎరువులు విత్తనాల దుకాణాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.రైతులకు నఖిలీ విత్తనాలు అమ్మరాదని ఒకవేళ ఏవైనా పిర్యాదులు వస్తే దుకాణాదారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మండల వ్యవసాయ శాఖ అధికారిని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది తో తనఖీలు చేయించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డాక్టర్.వెంకటనారాయణ,రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ కె నారాయణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు,తహసీల్దార్ ఏ.వీ భాస్కర్,మున్సిపల్ కమీషనర్ నరసింహ,మండల విద్యాశాఖ అధికారి రమాదేవి, ఐకేపి ఏపియం క్రాంతి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.ఓ.ఏలు,టి.యల్.యఫ్ లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

బస్సు షెల్టర్ లు ఏర్పాటు చేయండి సారూ

ఆర్కేపి అంటే అధికారులకు, నాయకులకు చులకనేనా…?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. మహిళలలు బస్సులలో ప్రయాణించాలంటే ముందుగా వారు ప్రయాణించే ప్రాంతాలలో బస్సు షెల్టర్లు ఉండాలి, కానీ అందుకు భిన్నంగా రామకృష్ణాపూర్ పట్టణంలో ఎక్కడ చూసినా బస్సు షెల్టర్ లేక మహిళలు, ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
రామకృష్ణాపూర్ పట్టణం నుండి బెల్లంపల్లి, గోదావరిఖని ఏరియాలకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సులలో, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తుంటారు కానీ ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కడ కూడా బస్సు షెల్టర్లు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాండ్ లు ఉన్నా సరే అవి నిరుపయోగంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేపి అంటే అధికారులకు, నాయకులకు చిన్నచూపేనా ..? అని పుర ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.ఇక మంచిర్యాలకు అయితే బస్సు సౌకర్యం లేక కొన్ని సంవత్సరాలే గడుస్తోంది.బస్సు సౌకర్యం ఉన్న ప్రాంతాలలో బస్ షెల్టర్ లు లేవు.పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న బస్ స్టాండ్ నిరుపయోగంగా,శిధిలావస్థలో ఉండడంతో ప్రయాణికులంతా రోడ్డు పక్కననే నిలబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ చౌక్ వద్ద ఉన్న బస్ స్టాండ్ రోడ్డుకు దూరంగా ఉండటంతో బస్సులు,ప్రైవేట్ వాహనాలు అటు వైపుకు వెళ్ళని కారణంగా ఆ బస్ స్టాండ్ షెట్టర్స్ ను మున్సిపాలిటీ అధికారులు అద్దె ప్రాతిపదికన అద్దెకు ఇవ్వడంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. ఒకవేళ అట్టి బస్ స్టాండ్ లో ఉన్న షట్టర్స్ ను కాళీ చేయించి ప్రయాణికులకు అనువుగా ఉంచి బస్సులు నడిపిస్తే రాత్రి వేళల్లో బస్సు స్టాండ్ లో ప్రయాణికులు ఉండరు కాబట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందనే అభిప్రాయం ప్రయాణికుల్లో ఉన్న నేపథ్యంలో అట్టి బస్సు స్టాండ్ షట్టర్స్ ను మున్సిపాలిటీ అధికారులు అద్దె ప్రాతిపదికన కొనసాగిస్తేనే ఆదాయం సమకూరుతుంది అని పుర ప్రజలు మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాజీవ్ చౌక్ లో రోడ్డు పక్కననే బస్ షెల్టర్ ను ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు అనువుగా రోడ్డుకు పక్కనే ఉండటంతో ఎండాకాలమైనా, వానాకాలమైన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విధంగా బస్సు షెల్టర్ లను సంబంధిత అధికారులు చొరవతీసుకొని ఏరియా ఆసుపత్రి, రాజీవ్ చౌక్, అంగడి బజార్, యూనియన్ (ఆంధ్రా) బ్యాంక్, రామాలయం ఏరియాలలో బస్సులు ఆగే ప్రదేశాల్లో బస్ షెల్టర్ లు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నారు. ప్రయాణికులంతా బస్ షెల్టర్ లు ఏర్పాటు చేయండి సారూ అని వేడుకుంటున్నారు.

జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు లో అధికారులు తమ బాధ్యత ను జాగ్రత్తగా నిర్వహించాలి

వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి జిల్లా జూన్ 4న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోమార్కెట్ యార్డులో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విధులు కేటాయించిన అధికారులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తహసిల్దార్, ఉప తహశీల్దార్లను ఆదేశించారు.
గురువారం ఉదయం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ, సలహాలు, సూచనలు ఇచ్చారు.అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో పూర్తి చేయాలని అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్డీఓ పద్మావతి, తహశీల్దార్లు రమేష్ రెడ్డి, ఆర్. పాండు నాయక్, శ్రీనివాస్, మదన్ మోహన్ , ఉప తహశీల్దార్లు ఇతర సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

హనుమాన్ మాల స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం

అన్నదాత బోనాల రాజమౌళి దంపతులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం కట్ట పైన శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో జూన్ ఒకటవ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు వేణుగోపాల చార్యుల తో బోనాల రాజమౌళి దంపతులు హనుమాన్ విగ్రహానికి చందనంతో జిల్లేడు మాలతో తమలపాకుల పండ్లు తో కలిపి పూజ కార్యక్రమం జరిపిన తర్వాత గుడి ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత బోనాల రాజమౌళి ఉమారాణి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ మహా అన్నదాన కార్యక్రమానికి హనుమాన్ స్వాములు గ్రామం లోని ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు

బాలింతల మరియు శిశు మరణాలు జరగకుండా చూడాలి

# డీఎంహెచ్ వో డాక్టర్ అల్లెం అప్పయ్య

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లాలో మాత శిశు మరణాలు జరగకుండా చూడాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య అన్నారు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు ఆసుపత్రిలో ప్రతి మంగళ గురు వారాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమo వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలు రోగుల ద్వారా ఆరా తీశారు. అనంతరం వైద్యులు సూపర్వైజర్లు సిబ్బందితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు కొత్తగా జనవరి 2024 నుండి నూతనంగా నిర్వహిస్తున్న బాలింతల ఆరోగ్య సంరక్షణ మరియు శిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాలు రేటును తగ్గించాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలిపారు ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను 45 రోజులు కనీసం 6 నుంచి 7 సార్లు సందర్శించి, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ స్టేట్ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక బాలింత మరణం సంభవించిందని రాబోయే రోజుల్లో ఇలాంటి మరణాలు జరగకుండా వైద్యులు సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు అవగాహన చేయాలని సూచించారు.
మండల కేంద్ర ంలోని ఇద్దరు బాలింతల ఇంటికి వెళ్లి వారి యొక్క తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు సూచనలు చేసి మందులను అందజేశారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాతా శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ రిషిత, డాక్టర్ భవ్య, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కర్, పిహెచ్ఎన్ఓ శోభ, ఏఎన్ఎంలు స్వప్న, కనకలక్ష్మి, ఆశా కార్యకర్తలు సరోజన, మాధవి, సౌజన్య, శోభ, కవిత, సంపూర్ణ ,ఇందిర తదితరులు పాల్గొన్నారు.

జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

వనపర్తి నేటిదాత్రి :

జాన్ 2న జేరి గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఘన oగా నిర్వహిం చే o దు కు అన్ని
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ యం.నగేష్ అధికారులను కోరారు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం అదనపు కలెక్టర్ యం. నగేష్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నద్ధత పై సమీక్ష నిర్వహించారు.అధికారులకు అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో పూర్తి చేయాలని ఏర్పాట్లలో పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు.

సెంటిమెంటుతో ప్రజలను రెచ్చగొట్టుడు కెసిఆర్ కు అలవాటే

జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మహమ్మద్ అంకూస్*

ప్రజల్లో ఉనికిని కోల్పోతున్న ప్రతిసారి కెసిఆర్ ప్రజలను రెచ్చగొట్టి, చిచ్చు పెట్టి దుమారం రేపడం అలవాటు, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎటువంటి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మిళ్లు స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కెసిఆర్ వైఖరి తేటతెల్లమైపోయింది. రాష్ట్రాన్ని విపరీతమైనటువంటి ధోరణిలో వివిధ రూపాల్లో దోచుకొని రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోకుండా దొరల పాలన కుటుంబ పాలన కొనసాగించి లక్షల కోట్ల దోచుకొని మళ్లీ నేడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను కవులను కళాకారులను మేధావులను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ విషయంలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడం అనేది తన వైఖరికి నిదర్శనం. తాను అధికారంలో ఉన్నప్పుడు తన కూతురు కవిత బతుకమ్మ పాటకు రహమాన్ తో సంగీతం సమకూర్చితే ఏమీ లేదు, ఆంధ్రవాళ్ళైనా మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పజెప్పితే ఏమీ లేదు, చిన్న జీయర్ ట్రస్టుకు విరాళంగా 12కోట్ల భూమి ని ఇవ్వటం, విశాఖ శారదా పీఠం కి 2కోట్ల భూమి విరాళం ఇస్తే ఏమీ లేదు, ఆనంద్ సాయి తో యాదాద్రి టెంపుల్ కి డిజైన్ చేయింస్తే ఏమిలేదు, హీరోయిన్ సమంత ని బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే తప్పు లేదు,జై తెలంగాణ అనని నాయకులను తన క్యాబినెట్ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తే ఏమీ లేదు, రాష్ట్రం వచ్చేంతవరకే ఆంధ్ర,తెలంగాణ వచ్చింది కాబట్టి మనమంతా ఒక్కటే, తెలుగు వారమంతా ఒకటే అని శుద్ధపూస ముచ్చట్లు చెప్పిన కేసీఆర్ “తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం”అన్నట్టుగా నేడు జయ జయహే తెలంగాణ పాటకు సంబంధించి కీరవాణిని సంగీత దర్శకునిగా పెట్టుకుంటే ఆంధ్ర వాడిని సంగీత దర్శకుడుగా పెట్టుకుంటారా…? అనేటువంటి విషయాన్ని ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి విజ్ఞులమైనటువంటి మనము ఆలోచించాలి కదా పది సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి కవులను, కళాకారులను పట్టించుకోలేదు, రాష్ట్ర గీతాన్ని పట్టించుకోలేదు ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొడుతుంటే తెలంగాణ ప్రజలం గొర్రెలము కాదు పిచ్చోళ్ళం కాదు కాబట్టి విజ్నులమైనటువంటి ప్రజలు గుర్తించి సెంటిమెంటు రాజకీయాలు చేసి బ్రతకాలనుకునే వారికి బుద్ధి చెప్పి విజ్ఞులుగా ఆలోచిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గమనించాలి. కెసిఆర్ ఫ్యామిలీకి కావాల్సింది రాజకీయం ప్రజలను రెచ్చగొట్టడం.మనకు కావలసింది రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రజల పాలన, కెసిఆర్ పాలన రాచరికం, కుటుంబ పాలన మనం చూసాం ఇంకా వారి సెంటిమెంట్ ముచ్చట్లు నమ్మి మనం సపోర్ట్ చేస్తే “నమ్మి నానపెడితే పుచ్చి బుర్రలైనట్లు”గా ఉంటది మన పరిస్థితి కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా తెలంగాణను సర్వనాశనం చేసి లక్షల కోట్లు దోచుకున్న వారు చెబితే మనం వినే పరిస్థితుల్లో లేము అనేటువంటి విషయాన్ని గ్రహించాలని వేడుకుంటున్నాం.

సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మరమ్మతులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలసి మహముత్తారం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పాఠశాలల్లో జరుగుతున్నమరమ్మతు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలా వస్థలో ఉన్న ప్రభుత్వ బడులు ఆధునికతను సంతరించుకొని విద్యార్థులకు ఆహ్లాదకరంగా తయారు చేయడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు అనుకూలంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముందుగా మహముత్తారం మండలం కోనంపేట గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 3.94 లక్షల రూపాయలతో చేపట్టిన మరమ్మతులను, కొత్త ముత్తారం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 3. 84 లక్షలతో చేపట్టిన పనులు, మహముత్తారం గ్రామంలోని కెజిబివి పాఠశాలలో 6.30 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేపట్టిన గ్రామ
సమాఖ్యలతో మాట్లాడుతూ ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 5 వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. ముందస్తుగా 25 శాతం నిధులు మంజూరు చేశామని, చేపట్టిన పనులకు నిధులు సరిపోకుంటే ప్రతిపాదనలు పంపాలని, అదనపు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. పాఠశాలలు పున: ప్రారంభానికి ముందు పూర్తిస్థాయిలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వివో లను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచి నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చొరవ చూపాలన్నారు. పనుల్లో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహముత్తారం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్న డాక్టర్ క్వాటర్స్ ను సందర్శించి ఆగస్టు 15 లోపు భవన నిర్మాణం పూర్తి అవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం మహముత్తారం లో గల రైతు వేదికలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి మరియు పనులు పూర్తి చేసే గడువును మండలంలోని ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు, కాంట్రాక్టు పనులు చేపట్టిన
వివో లతో సమీక్ష నిర్వహించి పెండింగులో ఉన్న పనులను వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి వారం రోజుల ముందే పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మహముత్తారం మండలంలో మొత్తం 30 పాఠశాలలకు గాను 1.60 లక్షల డెబ్భై వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు రైతు వేదిక ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా కుట్టించిన స్కూలు యూనిఫామ్స్ ధరించిన చిన్నారులు జిల్లా కలెక్టర్ కు పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టిన మహిళలను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ నరేష్, సెక్టోరియల్ అధికారి కిషన్ రావు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎం పి డి ఓ శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ డి ఈ శేషగిరిరావు,
ఏ ఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి

అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి

ప్రైవేటు విద్యాసంస్థలను తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలాచుడాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, సిఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో ప్రైవేట్
విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తించి సీజ్ చేయాలని అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి (ఏఐఎస్ఎఫ్) పక్షాన డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడి అరికట్టే విధంగా ఫ్రీజర్ నియంతను చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగా బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరిగేల కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు,యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటిలు, ల్యాప్ టాప్స్, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని, ఫీజుల పేరిట ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని , ప్రభుత్వం విద్యాశాఖ ఫీజులు నియంత్రణకి కఠిన చట్టాలు అమలు చేసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని లద్దునూరి విష్ణు డిమాండ్ చేశారు.

జమ్మికుంట జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు

జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి

* ప్రభుత్వ రాజముద్రలో చార్మినార్ మరియు ఓరుగల్లు చిన్హన్ని మార్పు చేయటం సిగ్గుమాలిన పని అని అన్నారు **
*వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కు బదులు టీజీగా మార్పు చేయడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు*
రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు* *జమ్మికుంట పట్టణంలోని జెడ్పిటిసి కార్యాలయంలో పత్రిక సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక కొనసాగుతుందని, ఈ సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి,డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పాలన ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాలన మొండి చేయి చూసిందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించిన. ఏఒక్క అంశం కార్యచరణ దాల్చలేదని వారు గుర్తు చేశారు. కేవలం మహిళలకు ఉచిత బాసు ప్రయాణం తప్ప, మరి ఏదీ కూడా కార్యచరణ దాల్చలేదని వారు గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రోడ్డు రవాణాకు వాహనాలల సంబంధించిన టీఎస్ నుండి టీజీ మార్చడం తప్ప వారు చేసింది ఏది లేదని దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని వారి సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ అధికారం ముద్ర ఏర్పాటు చేసిన పది సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు కూడా దానిపైన అభ్యంతరం చేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రాజముద్రలో మార్పులు చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని వారు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలయాపన చేయడానికి ఇవి ఒక కారణాలుగా చూయించి సమయాన్ని వృధా చేయడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని వారు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికల కోడ్ అనంతరం ప్రజా సమస్యల పైన నిరంతరం పాలన చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం వానకాల సీజన్ రాబోతున్న సందర్భంలో విత్తనాలు,ఎరువుల కొరత రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన కూడా తెలంగాణ ద్రోహులు చెప్పిన విధంగానే పనిచేస్తుందని వారి సందర్భంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చి తుగ్లపాలన తలపిస్తుందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని వారు గుర్తు చేశారు.

కరకట్ట నిర్మణ పనులు జరుగుతుండగా పంట పొలాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందగా వారికి ఫోన్లో మాట్లాడి న్యాయం చెస్తానని హామీ ఇచ్చిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలం కునవరం రోడ్ నందు కరకట్ట నిర్మణ పనులు జరుగుతుండగా పంట పొలాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతుండగా వారికి నష్ట పరిహారం చెల్లించాలని కోరగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హైదరాబాద్ లో ఉన్నారు. వారి సమస్యలను స్థానిక నాయకులు రత్నం రమాకాంత్ ఫోన్ ద్వారా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సంఘటన స్థలానికి పర్యవేక్షరించమని తెలియజేశారు. అధికారులు ఫోన్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు కి రైతుల సమస్యలను వివరించగా స్థానిక శాసనసభ్యులు రెండు రోజుల్లో భద్రాచలం చేరుకొని సంఘటనా స్థలానికి వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. దీనితో రైతులు వారి పనులు ప్రారంభించుకోమని కరకట్ట నిర్మాణ కాంట్రాక్టర్ వారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన తెల్లం వెంకట్రావు కి సంబంధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, చిట్టిబాబు, నర్రా రాము, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు…

రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించినందుకు 15 వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన బండారు

వనపర్తి నేటిదాత్రి –
వనపర్తి పట్టణంలో 15వ వార్డు లో పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించినందుకు 15వ వార్డు ప్రజల తరఫున అధికారులకు ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి నేటి ధాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు వర్షం వస్తే ఒక సైడు బీటీ రోడ్డు వెయ్యనందుకు ప్రమాదకరంగా ఉండడంతో 15 అవార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ నేటి ధాత్రి దినపత్రిక దృష్టికి తీసుకపోవడంతో అధికారులు ఎమ్మెల్యే స్పందించి విస్తరణ పనులు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు బండారు మాట్లాడుతూ జెర్రిపోతుల మైసమ్మ నుండి రామా టాకీస్ కొరకు 45 కోట్లతో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి నిధులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయంచారని అట్టి నిధులతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు . ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర డివైడర్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు రామా టాకీస్ ఎదురుగా శ్రీ సాయి ఎలక్ట్రికల్ నుండి ఓల్డ్ యూకో బ్యాంకు క్రాసింగ్ వరక

కొంత భాగం డాం బర్ రోడ్డు వేయకుండా వదిలి వేశారని ఇట్టి రోడ్డును పూర్తిచేయాలని బండారు అధికారులను ఎమ్మెల్యేను కోరారు
గురువారం నాడు రోడ్ల విస్తరణ పనులను మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పరిశీలించార ఈ కార్యక్రమంలో
న్యాయవాది అయిత కృష్ణ మోహన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చీర్ల శ్రీనివాసులు ఠాగూర్ పాపిశెట్టి శ్రీనివాసులు బండారు రాజు వార్డు ప్రజలు ఉన్నారు

మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమం

జమ్మికుంట (టౌన్) నేటిదాత్రి
*కార్యకర్తల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది ఈరోజు జమ్మికుంట పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొలుగూరి సదయ్య గారి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో శివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మరియు వారికి ఆయురారోగ్యాలు దేవుడు ఇవ్వాలని శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు, దేశిని కోటేశ్వర్, రాచపల్లి రమేష్, మొలుగూరి పద్మావతి, కౌన్సిలర్ వీరన్న గౌడ్ దొగ్గల భాస్కర్ ,తిరుపతి శ్రీనివాసు గుల్లి జపాన్, మొలుగూరి సతీష్ చాంద్ పాషా, పోతిరెడ్డి మల్లయ్య, మాధవరావు, శ్రీనివాసు, రాచపల్లి శ్రీనివాస్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు

జిల్లెల్ల గ్రామంలో గరిపెల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న బలగం వేణు

తంగళ్ళపల్లి నే టి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బలగం సినిమా దర్శకుడు వెల్దండ వేణు గ్రామంలోని గరిపెల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మొదటి సినిమా బలగం క్లాప్ ఇదే ఆలయం వద్ద మొదలు పెట్టాననిగుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలందరూ నాకు ఎంతో సహకరించారనిఅందరి గ్రామస్తులతోముచ్చటిస్తూ తన తీపి గుర్తులు గుర్తు చేసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉడుతల తిరుపతి బొడ్డు శ్రీధర్ రాజు పృద్వి పరశురాం తదితరులు పాల్గొన్నారు

నూతన ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణాన్ని ప్రారంభించిన ఎంపీపీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన పార్టీ లైజర్ సీడ్స్ దుకాణం ప్రారంభించిన ఎంపీపీ పడగల మానస రాజు. తంగళ్ళపల్లి మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన సమనపల్లి వెంకటేష్ అనే యువకుడు నూతన దుకాణాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు మందులు అందించాలని రైతులు చల్లగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి గంటలకు సంబంధించి ఎరువులు గాని మందులు గాని అందుబాటులో ఉంచుతూ వారి శ్రేష్కు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి మాజీ డైరెక్టర్ కుర్మా రాజయ్య సవన పెళ్లి బాలయ్య భాస్కర్ రెడ్డి పాక్స్ సీఈవో నరేష్ స్థానిక నేతలు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version