# డీఎంహెచ్ వో డాక్టర్ అల్లెం అప్పయ్య
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లాలో మాత శిశు మరణాలు జరగకుండా చూడాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య అన్నారు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు ఆసుపత్రిలో ప్రతి మంగళ గురు వారాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమo వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలు రోగుల ద్వారా ఆరా తీశారు. అనంతరం వైద్యులు సూపర్వైజర్లు సిబ్బందితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు కొత్తగా జనవరి 2024 నుండి నూతనంగా నిర్వహిస్తున్న బాలింతల ఆరోగ్య సంరక్షణ మరియు శిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాలు రేటును తగ్గించాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలిపారు ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను 45 రోజులు కనీసం 6 నుంచి 7 సార్లు సందర్శించి, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ స్టేట్ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక బాలింత మరణం సంభవించిందని రాబోయే రోజుల్లో ఇలాంటి మరణాలు జరగకుండా వైద్యులు సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు అవగాహన చేయాలని సూచించారు.
మండల కేంద్ర ంలోని ఇద్దరు బాలింతల ఇంటికి వెళ్లి వారి యొక్క తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు సూచనలు చేసి మందులను అందజేశారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాతా శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ రిషిత, డాక్టర్ భవ్య, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కర్, పిహెచ్ఎన్ఓ శోభ, ఏఎన్ఎంలు స్వప్న, కనకలక్ష్మి, ఆశా కార్యకర్తలు సరోజన, మాధవి, సౌజన్య, శోభ, కవిత, సంపూర్ణ ,ఇందిర తదితరులు పాల్గొన్నారు.