అంగన్వాడి కేంద్రంలో పిల్లల పెరుగుదల పై అవగాహన కార్యక్రమం.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కోసుర్ పల్లి చిట్యాల ఫోర్త్ కేంద్రాలను గురువారం రోజున అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతుల బాలింతల గృహ సందర్శనలు చేసి తల్లులకి కుటుంబ సభ్యులందరికీ గర్భవతి దశ నుండి రెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇవ్వవలసిన ఆహార పదార్థాలు వ్యక్తిగత శుభ్రత త్రాగే నీరు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు టీ కాలు బరువులు తీయించుకోవడం చేయడంవల్ల తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు, అలాగే ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలని సూచించి తల్లి పిల్లల బరువులు తీసి గ్రోత్ కార్డులను ఉపయోగించి పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి మూడు సూచికల ద్వారా తెలుసుకోవాలని గ్రోత్ కార్డ్స్ పై అవగాహన కల్పించనైనది, ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సుజాత భాగ్యలక్ష్మి తల్లులు పాల్గొన్నారు

మృతి చెందిన చుంచు సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని దేవన్నపేట లో గత 3 నెలల క్రితం గుండె పోటుతో మృతి చెందిన చుంచు సురేష్ కుటుంబానికి పేదల‌ పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరు పేదలకు ఏ కష్టం వచ్చిన అన్నా అంటే నేను ఉన్నానంటు ముందుకు అడుగు వేసె యువనేత సూరం రాజు జన్మదినం సందర్భంగా ఆటో‌ డ్రైవర్ సురేష్ కుటుంబాన్ని పరామర్శించి వారి పిల్లల చదువుల నిమిత్తమై తన వంతు సహాయంగా 10000/- పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో సూరం రాజు తో పాటూ పలువురు పాల్గొన్నారు.

సైకిల్ యాత్రతో భద్రాచలం బయలుదేరిన హనుమాన్ స్వాములు.

నర్సంపేట,నేటిధాత్రి :

దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములు దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడితో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరారు.41 రోజుల మండల
దీక్షలు నియమనిష్ఠలతో చెప్పట్టిన హనుమాన్ మాలధారణ స్వాములు
గుజిలే రాము, తాటికొండ వెంకన్న చారి, ఐలాపురం శ్రీకాంత్ చారి, మనోజ్ చారి ముసుకు మధుకర్ లు గురువారం దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడులతో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరినట్లు వారు పేర్కొన్నారు.వచ్చే నెల 1 న హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కల్గిన భద్రాచలం వెళ్లి ఇరుముడి సమర్పిస్తామని తెలిపారు.

వేములవాడ రాజన్నకు ‘వెలిచాల ‘పది లక్షల విరాళం

వేములవాడ నేటి ధాత్రి

తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం,దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రూ.10లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాల యాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తాను దేవస్థానానికి ఉడతా భక్తిగా రూ.10 లక్షల రూపాయలు విరాళాన్ని అందిస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారంఈ మేరకు బుధవారం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయ అధి కారులకు రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.

మందుబాబుల నిరక్ష్యం తో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

బ్లోయర్ తో మంటలు ఆర్పి వేసిన అటవీ అభివృద్ధి సంస్థ సిబ్బంది

జైపూర్ , నేటి ధాత్రి:

మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో బుధవారం సాయంత్రం మందు బాబుల నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్లాంటేషన్ లో మంటలు చెలరేగి పొగలు వస్తున్నాయని జైపూర్ కు చెందిన స్థానికులు కొందరు అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ వాచర్ సాయికిరణ్ కు సమాచారం ఇచ్చారు.ఆ తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు వెంటనే మిగిలిన వాచర్ లను పిలిపించి సంఘటనా స్థలానికి వెళ్లి ఫైర్ బ్లోయర్ ల సహాయంతో మంటలను అర్పివేసి ప్లాంటేషన్ ను, అటవీ ప్రాంతాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ సందర్బంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసిన వాచర్ లు శంకర్ సాయికిరణ్ లను అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారిణి సాగరిక లు అభినందిoచారు. వీరు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యం సేవించిన మైకంలో సిగరెట్ లు తాగి నిర్లక్ష్యంగా పడేయడం వల్లనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని అన్నారు.

ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

జెండా ఆవిష్కరణ చేసిన బందు సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

2024 మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా , మెట్టుకొండ లక్ష్మి జండా ఆవిష్కరణ చేయగా,బందు సాయిలు అధ్యక్షతన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్ మాట్లాడుతూ భారత కార్మిక ఉద్యమ చరిత్రలో సిఐటియు ఆవిర్భావం ఒక చారిత్రక అవసరఘట్టం. 1970 మే 30న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఆవిర్భవించింది. నేటికీ( 2024 మే 30 ) 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జాతీయ కార్మిక ఉద్యమ నేతలు కామ్రేడ్ బి టి రణ దివే, కామ్రేడ్ పి రామ్మూర్తి తొలి అధ్యక్ష, కార్యదర్శులు. ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతిబసు ఉపాధ్యక్షులుగా ఉన్నారు.ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియును దేశవ్యాప్త కార్మిక సంఘంగా స్థాపించి ముందుకు నడిపారు దేశంలో మతోన్మాద కార్పొరేట్ విధానాల సవాల్ నేపథ్యంలో వారి వారసత్వాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తర బాధ్యత మనపై ఉంది. 2024 మే 30 సిఐడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక వర్గాన్ని మరింత చైతన్యం చేయాల్సి ఉన్నది. నాటి నుండి నేటి వరకు భారత కార్మికు ఉద్యమానికి పాలకవర్గాల నుండి అనేక సవాలు ఎదురయ్యాయి. వాటిని ఎదిరిస్తూ నేటికీ 22 దేశవ్యాప్త సమ్మెల్లో పోట్లాదిమంది కార్మిక వర్గాన్ని సమీకరిస్తూ కార్మికోద్యమం ముందుకు పోతున్నది. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరిట దాడి. పెట్టుబడుల సేకరణ పేరిట పనుల తగ్గింపు నిబంధనల సడలింపు కార్మిక చట్టాలను సరళం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం. బిజెపి వాజ్పేయి కాలంలో ప్రైవేటీకరణ మరింత వేగం పెట్టుబడుల ఉపసంహరణ కోసం కమిటీ ఏర్పాటు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 2021 నాటికి కార్పోరేటికరణ దూకుడుగా కొనసాగింది. ఎయిర్ ఇండియా బాల్కో సిఎంసి హిందుస్థాన్ జింకు హెచ్టిఎల్ మారుతి ఉద్యోగుల లిమిటెడ్ హిందుస్థాన్ యూనివర్స్, బిఎస్ఎన్ఎల్ ఇండియన్ పెట్రోల్ కెమికల్స్ ఐడిఎఫ్సి లాంటి అనేక సంస్థల్లో ప్రైవేటీకరణ కొనసాగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మూల స్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కార్మికు ఉద్యమం మీద కార్మిక ఐక్యత పై తీవ్ర దాడి కొనసాగింది.
కార్మిక చట్టాల సవరణలు
కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం తీసుకువచ్చారు హైర్ అండ్ ఫైర్ సిస్టం (వాజ్పేయి కాలం నుండి ) 2024 నరేంద్ర మోడీ కార్మిక హక్కులపై మరింత దాడి. నాలుగు లేబర్ కోట్లు పార్లమెంటులో 2019 20లలో ఆమోదింప చేసుకున్నారు 29 కేంద్ర చట్టాలను రద్దు చేశారు. ఎనిమిది గంటల పని దినం కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కు సమ్మె హక్కును కార్మిక శాఖ పనితీరు, అసంఘటిత కార్మికుల హక్కులు స్కీం వర్కర్ల హక్కులు కాల రాయబడ్డాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాల సవరణలకు ప్రయత్నం.గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర. ఎఫ్ టి ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టం తీసుకువచ్చారు. 30% అప్రెంటీసులను అనుమతించారు. మోడీ కాలంలో ప్రభుత్వ సంస్థలపై దాడి మరింత ఉధృతం చేశారు. కులం మతం మస్తిత్వ భావజాలంతో కష్టజీవులు ఐక్యతను భంగం చేసి భావోద్వేగా రాజకీయాలు కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి బిజెపి రాజకీయ ప్రయోజనాలకు కాపాడుకోవడానికి కుటిల యత్నాలు. మతాన్ని రాజకీయాలకు వాడుకుంటూ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నది. రాజ్యాంగం కల్పించిన హక్కుల పై దాడి చేస్తున్నది. ఉదాహరణ వాక్ స్వాతంత్రం, పత్రిక స్వేచ్ఛ, రిజర్వేషన్స్ కోల్పోవడం. సి ఏ ఏ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్, సిఐటియు సీనియర్ నాయకులు వెలిశెట్టి రాజయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి వంగాల విజయలక్ష్మి, ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి శేఖర్, మరియు తదితర కార్మికులు పాల్గొన్నారు

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ. మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రీధర్ బాబు ఎనలేని కృషి చేశారని, అధికారం చేపట్టాక రాష్ట్ర మంత్రిగా ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లూరి సమ్మయ్య, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, చల్ల రేణుక, కొరిమిళ్ళ రజిత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల మల్లేష్ గౌడ్, పైడిపల్లి రమేష్, సహదేవ్, లక్ష్మారెడ్డి, కెవి అశోక్, సమ్మయ్య,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

అందెశ్రీ…ఎందుకీ కిరికిరి!

https://epaper.netidhatri.com/view/280/netidhathri-e-paper-30th-may-2024%09

-పాటే తెలంగాణ ప్రాణం.

– పాటే తెలంగాణ వేదం.

-పాటే తెలంగాణ జీవం.

-పాటే తెలంగాణ ఆత్మ గౌరవం.

-పాటే తెలంగాణ కీర్తి పతాకం.

-పాటే తెలంగాణ నవ జీవన వేదం.

-పాటే ఉద్యమ స్పూర్తికి ఊపిరి.

-పాటే తెలంగాణ జీవనాడి.

-పాటే తెలంగాణ పోరాట చైతన్య దీప్తి.

-పాటే తెలంగాణ అస్థిత్వ ఆర్తి.

-పాటే నిరంతర పోరాట దివిటి.

-ఆ పాటకు కొత్త రాగమెందుకు!

-ఆ పాటకు కొత్త సొగసులెందుకు!

-తెలంగాణ హృదయాలనేలిన పాటకు కొత్త గొంతులెందుకు.

-తెలంగాణ ఆకలిని ఎగతాలి చేసిన వారి చేతుల్లో పెట్టడమెందుకు!

-ఒక్కటైన తెలంగాణ సమాజంలో కొత్త అలజడెందుకు?

-మన హృదయాలలో పదిలంగా ఉన్న పాటకు గాయాలెందుకు?

-జనగీతాన్ని నడి బజారులో నిలబెట్టి నాటకాలెందుకు?

-జయజయహే అని పాడుకున్న నోటికి కొత్త నొప్పులు లెందుకు?

-పాటకు మళ్ళీ పురిటినొప్పులెందుకు?

-ఉద్యమ కాలంలో ఎగిరిన పతాకకు ఈ మరకలెందుకు!

-ఉద్యమాన్ని జీవితం చేసిన పాట కొత్తగా పట్టమెందుకు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ సమాజం దేనినైనా సహిస్తుంది. కాని ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడదు. ఆకలినైనా ఎదిరిస్తుంది. అంతస్తులను లెక్క చేయదు. కాని ఆత్మ స్ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోదు. అది తరతరాలుగా వస్తున్నది. ఆ గర్వం, దైర్యం, ఆ ఆత్మాభిమానం ఈ మట్టిలోనే వున్నాయేమో? అనిపిస్తుంది. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ…పాటల దాహమెక్కువ. ప్రపంచంలో తెలంగాణకు మించిన సాహిత్యాధారాలు మరే ప్రాంతానికి లేవు. ఏ ప్రాంతంలో తెలంగాణలో వున్నన్ని జనపదాలు లేవు. తెలంగాణలో పల్లె పాటలే కాదు, బతుకమ్మ పాటలున్నాయి. చైతన్యగీతాలున్నాయి. అందుకే తెలంగాణ పాట పుట్ట. సాహిత్యానికి గుట్ట. అవును తెలంగాణకు పాటే ప్రాణం. ఆ పాటే జీవం..జీవితం. ఆ మాట నుంచి వెలువడే శబ్దమే తెలంగాణకు ఊపిరి. ఆ పాట వింటూ కష్టం మర్చిపోతాడు. ఆ పాట వింటూ తనకు ఎదురైన కష్టం గురించి తెలుసుకుంటాడు. ఆ పాట వింటూ తనను ఎవరు మోసం చేశారో తెలుసుకుంటాడు. ఆ పాట వింటూనే తనకు అన్యాయం చేస్తున్న వారి మీద తిరగబడతాడు. ఇదీ తెలంగాణకు వున్న ప్రత్యేకమైన జీవన విధానం. ఇక్కడ ఆకలికి కూడా కోపమెక్కువ. ఆకలికి కూడా పాటలంటే మక్కువ. ఆకలి దహిస్తున్నా పాటతో కడుపునింపుకుంటాడు. కడుపు రగిలిపోతున్నా పాటే అందుకుంటాడు. ఇంతటి గొప్పగుణమున్న స్ధలం మన తెలంగాణ. అలాంటి తెలంగాణ పాటపై తెలంగాణ రగులుతోంది. పాట పరాయి గొంతులో పలికేందుకు తెలంగాణ సమాజం ఇష్టపడనంటోంది. తెలంగాణ పాట మనల్ని కాదన్న సమాజం నుంచి కొత్త బాణీలుతో కొత్త రూపు దిద్దుకోవడాన్ని తెలంగాణ సమాజం అడ్డుకుంటోంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఎదిరించడం, తెగించడం. తెలంగాణలో ఎదిరించని సందర్భం లేదు. తెగించని కాలం లేదు. రాజుల కాలంలో కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్కలు తిరుగుబాటు కాలం చూశాం. ఇప్పటికీ ఆ వీర వనిత పౌరుషం తల్చుకుంటున్నాం. వారి వీరత్వానికి, అమరత్వాన్ని దైవత్వంగా కొలుస్తున్నాం. మనల్ని మనం స్పూర్తి పొందుతున్నాం. అంతటి గొప్ప గడ్డ మన తెలంగాణ.

ఈ మట్టిలోనే పౌరుషం వుంది. ఈ మట్టిలోనే పాట పుట్టింది. ఈ మట్టి పరిమళాన్నే పాట అద్దుకున్నది. ఈ మట్టిలోనే పాట పురుడుపోసుకొని ప్రపంచాన్ని ఏలింది. అంతగొప్పటి పాటలకు మన తెలంగాణ వేదికైంది. తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో కొన్ని వేల పాటలు. నైజాం వ్యతిరేక పోరాటంలో కొన్ని వందల పాటలు. తెలంగాణ తొలి దశలో కొన్ని వేల పాటలు. తెలంగాణ మలిదశలోనూ మరెన్నొ పాటలు..ఆ పాటలే నేటి తెలంగాణ అస్దిత్వ ఆనావాలు. చరిత్రకు సాక్ష్యాలు. ముందుతరాలకు బాటలు. తెలంగాణలో పుట్టె పల్లె పదాల మట్టిపరిమళం అద్దుకున్నాయని చెప్పడానికి అనేక సాక్ష్యాలున్నాయి. గొర్రెల కాపరులు కూడా అప్పటికప్పుడు కైగట్టి పాటలు పాడుతుంటారు. అంతో రాగయుక్తంగా రక్తి కట్టిస్తుంటారు. అందుకే పాటల పోరాటాల గడ్డ మన తెలంగాణ. పాలకుల నిబద్దతను ప్రశ్నించే పాటలైనా, తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించే పాటలైన తెలంగాణకే సొంతం. భక్తికైనా, రక్తికైనా ఎదిరించే శక్తికైనా తెలంగాణ పాటే మూలం. గడ్డ పార మొన కూడా పాట పాడుతుంది. మట్టినెత్తే పార కూడా పాటల రాగం తీస్తుంది. అది శ్రమశక్తి నుంచి వచ్చే నినాదమై తెలంగాణను తట్టిలేపుతుంది. చీకటిని చీల్చే దివిటి కూడా వెలుగు పాట పాడుతుంది. అంతటి మహత్తు తెలంగాణ పాటకుంది. తెలంగాణ నేలకున్నది. ఈ గాలిలో, ఎండిన ఆకుల్లో, పారే ఏరులో, వాగులో వంకలో కూడా పాటను చూసే మనసున్న నేల మన తెలంగాణ. మాటకు పౌరుషం నింపేది తెలంగాణ పాట. సమాజాన్ని నిద్రలేపేది తెలంగాణ పాట. నిద్రానంలో వ్యవస్ధను తట్టిలేపేది తెలంగాణ పాట. మనకణకణాల్లో, నరనరాల్లో ఉరకలెత్తించి, ఉత్తేజాన్ని నింపేదే తెలంగాణ పాట. అది అమ్మ పాటైనా..తెలంగాణ తల్లి నేర్పే తిరుగుబావుటా పాటైనా తెలంగాణ పాటకే ఎక్కడైనా పట్టం. అదే తెలంగాణకు గొప్ప వరం.

ఇంత గొప్ప పాటలో ఒకటైన జయజయహే తెలంగాణ…అన్న అందెశ్రీ పాట ఒకటి. ఈ పాట ఒక్కటే తెలంగాణ కోసం కొట్లాడలే..ఈపాట ఒక్కటే తెలంగాణ తేలే..ఈ పాట ఒక్కటే తెలంగాణను ఉరకలెత్తించలేదు. కాకపోతే అందరూ నా పాట అనుకున్నారు. ఆ పాటను మనసులో నింపుకున్నారు. రాసిన అందెశ్రీని గుండెల్లో పెట్టుకున్నారు. కవిగా ఆయనకు గొప్ప స్దానమిచ్చారు. తెలంగాణ కాళిదాసుగా కీర్తిస్తున్నారు. మరి అలాంటి అందెశ్రీ ఇప్పుడు వివాదాలు మూట గట్టుకుంటున్నాడు. జయజయహే తెలంగాణ..అన్న పాట ఆయన రాసిందే అయినా, అది ప్రజల హృదాయాలలో ఎప్పుడో పదిలమైపోయింది. ఇప్పుడు ఆ పాట అందెశ్రీది కాదు..తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఆత్మగౌరవానిది. తెలంగాణ ఆత్మది. ఏ కవి అయినా రాసే వరకే తన పాట. అది జనంలోకి వెళ్లిందంటే అదిజనం పాట…ఇప్పటికిప్పుడు ఆ పాట మరోసారి ఆవిష్కరించుకోవడం, తెలంగాణ గేయంగా ప్రకటించుకోవడాన్ని అందరం స్వాగతించాం. సంతోషించాం. ఎందుకంటే అందెశ్రీ రాసిన పాట జయజయహే తెలంగాణ పాట లేకుండా తెలంగాణ ఉద్యమం సాగలేదు. కాకపోతే ఈ ఒక్కపాటే తెలంగాణ ఉద్యమం కాదు. తెలంగాణ ఆత్మకు ఈ పాటొక్కటే అనడం సరైంది కాదు. గద్దర్‌ అమ్మా తెలంగాణమా..అన్నపాట తెలంగాణ సమాజాన్ని ఉరకలెత్తించింది. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా?..అన్న పాట తెలంగాణనే కాదు, ఆ పాట విన్న ప్రపంచాన్ని కన్నీటిసాగరం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పాటలకు అంతులేదు. అంతం లేదు. అయినా అందెశ్రీ పాటకు ఎంతో గౌరవం దక్కింది. తెలంగాణ సమాజమే ఆ పాటను రాష్ట్ర గీతం కావాలని కోరుకున్నది. కాకపోతే దానిలోకొత్త బాణీల పేరుతో పొరుగు రాష్ట్ర సంగీత దర్శకుడుతో పాడిరచినా తెలంగాణ అభ్యంతరం చెప్పాలిన పనిలేదు. కాని తెలంగాణలో కీరవాణికన్నా గొప్ప సంగీత దర్శకుడు లేడని అందెశ్రీ అనడం యావత్‌ తెలంగాణ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఇలాంటి వ్యాఖ్య అందెశ్రీ నుంచి వుస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఇటీవలే పాట అమ్ముడుపోయిందంటూ ఓవేదిక మీద ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నతో పంచాయితీ పెట్టుకున్నంత పనిచేశాడు. తన అక్కసునంతా వేదిక మీద వెళ్లగక్కే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కూడా ఇలాగే అందరి చేత తనమీద వున్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పైగా మరో ఆడియోలో అక్కమొగుడా..అమ్మ మొగుడా? అంటూ అందెశ్రీ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు తెలంగాణలో తన పాటకు కైగట్టే సంగీత పరిజ్ఞానే లేడన్నంత మాట్లాడిన అందెశ్రీ, మరో వివాదాన్ని తన తలకు చుట్టుకున్నాడు. ఏది ఏమైనా తెలంగాణలో అధ్భుతమైన గాయకులున్నారు. తెలంగాణ పాటకు ప్రాణం పోసిన వారున్నారు. పరాయి వాళ్లు పాడితే తెలంగాణ పాటకు జీవం వుండదా? అంటే వుండదు. అవును ఎందుకుంటే ఈనాడు రామోజీరావు తీసిన పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ అనే సినిమాలో ఊరు మనదిరా…ఈ వాడ మనదిరా! అనే పాట ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు. ఆయన కొన్ని వేల పాటలకు ప్రాణం పోశారు. కాని ఆయన పాడిన ఆ పాటలో జీవం లేదు. అదే పాటను ఎర్రసైన్యం సినిమాలో వందేమాతరం శ్రీనివాస్‌ పాడితే తెలంగాణ అంతా దద్దరిల్లింది. అదీ తెలంగాణ ఆత్మ…ఒకనాడు తెలంగాన సినిమాలో నటించేందుకు ఏ నటుడు ముందుకు రాలేదు. పాట పాడేందుకు ఏ గాయకుడు ముందుకు రాలేదు. తెలంగాణ ఉద్యమాన్నే ఆంద్రాకు చెందిన మేదావులు సహించలేదు. ఇప్పుడు వారి గొంతులో జీవం వుట్టిపడేలా గానం కోరుకోవడం మాత్రం తెలంగాణ సమాజం ఇష్టపడడం లేదు. ప్రభుత్వం కూడా అందెశ్రీ వ్యక్తిగత వివాదంలో అబాసు పాలు కావొద్దు. పాటకు గౌరవం ఇచ్చే దశలో ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల వ్యతిరేకతను మూట గట్టుకోవద్దు.

విత్తనాల షాపుల్లో తనిఖీలు

ముత్తారం :- నేటిధాత్రి

ముత్తారం మండలంలోని ముత్తారం,ఓడేడు గ్రామాలలో విత్తనాల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్,పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మధునయ్య తనిఖీలు చేశారు.షాపులలో సంబంధించిన లైసెన్స్,స్టాక్ రిజిస్టర్,విత్తనాల ఇన్వాయిస్ పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని తెలిపారు.

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన నేండుగురి సురేష్ వయసు 32 సంవత్సరాలు తండ్రి పేరు నేండుగురి బాపు ఇతను ప్రతిదినము కూలి పని చేస్తూ జీవితము కొనసాగించేవాడు. మద్యానికి బానిస అయ్యి సోమవారం రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతు బుధవారం రోజున మరణించడం జరిగింది. జైపూర్ మండలం ఎస్సై నాగరాజు పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మీరిచ్చే పరిహారం సరిపోదు.

తాసిల్దార్ కు రైతులు వినతి పత్రం అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయం లో నేషనల్ హైవే లో భూములు కోల్పోతున్న రైతులు బుధవారం రోజున తహసీల్దార్ ను భూములు కోల్పోతున్న రైతులు కలిసి తన బాధను చెప్పుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరిచ్చే పరిహారం సరిపోదు. మరియు భూమి కోల్పోతున్న ఒక్కో ఎకరా బహిరంగ మార్కెట్ లో ఉన్నట్టు రూ 4000000 లు చెల్లించాలి అని. మాకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూములు కోల్పోతున్న రైతులు పాల్గొన్నారు.

గీత కార్మికుల పట్ల పాలకుల నిర్లక్ష్యం

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి :

వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నల్లబెల్లికి చెందిన మేడగొని రమేష్ గౌడ్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవషాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తెలంగాణా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ బుదవారం పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులస్థులలో 12 శాతం ఉన్న గౌడులను ఎన్నిక లప్పుడు ఓట్లేసే యంత్రాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.రాజు గౌడ్ కు ఎక్సయిస్ శాఖ,బీసీ కార్పొరేషన్ నుండి ఎక్స్ గ్రేషియా,హాస్పిటల్ ఖర్చుల కొరకు దరఖాస్తు చేయడం జరుగుతుందన్నారు. గత ఆరు నెలలుగా గాయపడిన, చనిపోయిన గీత కార్మికులకు పెండింగ్ ఎక్స్ గ్రేషియా, హాస్పిటల్ ఖర్చులు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికైన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించాలని, కార్పొరేషన్ కు 500 కోట్లు నిధులు కేటాయించాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రాజు గౌడ్ ను పరా మర్శించిన వారిలో తిప్పని రవీందర్ గౌడ్, నేరెళ్ల రమేష్, గాజర్ల భద్రయ్య, పోలుదాసరి బిక్సపతి, గాజర్ల సారంగపాణి, గాజర్ల అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.

వరంగల్-1 డిపోలో డయల్ యువర్ డిఎం.

# డిపో మేనేజర్ వంగల మోహన్ రావు
వరంగల్,నేటిధాత్రి :

టి.ఎస్.ఆర్.టి.సి వరంగల్-1 డిపోలో ప్రయాణికుల సౌకర్యార్ధం గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు.గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9959226047 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారుఎం
హైదరాబాద్,నిజమాబాద్,సిద్ధిపేట, పాలకుర్తి,తరిగొప్పుల రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని డిపో మేనేజర్ కోరారు.ఈరూట్లలో ఏమైనా సమస్యలు ఉంటె నేరుగా 9959226047 ఫోనులో సంప్రదించాలని కోరారు.

కల్తి విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్

నేటి ధాత్రి యాదాద్రి చౌటుప్పల్ :

మండల కేంద్రంలో పలు విత్తన డీలర్ షాపులను స్క్వాడ్ బృందాల హెడ్ బి వెంకటేశ్వరరావు ఏ డి ఏ ఆలేరు, వ్యవసాయ అధికారి అరుణకుమారి మరియు స్వప్న లతో కలిసి అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి మరియు పోలీసు బృందాలతో తనిఖీ చేశారు .పలు విత్తన షాపుల్లో వారికి సంబంధించిన కొన్ని కంపెనీల లేబుల్ పరిశీలించారు వాటికి సంబంధించిన తేదీలు గడువు కాలము పూర్తిగా లేని వాటికి సంబంధించిన క్రయ విక్రయాలు నిలుపుదల చేస్తూ వారికి నోటీసులు ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విత్తనాలు కొన్న తరువాత రసీదును కాలి ప్యాకెట్ను దానికి సంబంధించిన లేబుల్ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు గ్రామాలలో ఎవరైనా విడిగా పత్తి విత్తనాలు అమ్మితే వారి పైన కఠి చర్యలు తీసుకుంటామన్నారు కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే పిడి యాక్ట్ పెడతామని తెలియజేశారు

ఎంపీ వద్దిరాజు సేవాభావం

Date 29/05/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సేవాతత్పరత, మంచితనాన్ని కొనియాడుతూ ప్రముఖ రచయిత కందకట్ల రామకృష్ణ “మన లీడర్-మన రవన్న”అనే పాట రాశారు.ఈ పాటను మైదం జ్యోత్స్న,ఏం.డీ.రహీమల సహకారంతో ప్రముఖ గాయకుడు ఇనుగుర్తి(ఓరుగంటి)మధు పాడారు.ఈ సందర్భంగా రూపొందించిన బ్రోచర్ ను బుధవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మధు,ఆయన మిత్రులు క్రాంతి కుమార్,దీపక్ తదితరులను ఎంపీ రవిచంద్ర అభినందించారు.అలాగే, ఎంపీ వద్దిరాజు మెగా కమల ఏరోబిక్స్&డాన్స్ ఫ్లోర్ 9వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు.హనుమకొండ అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో జూన్ 8,9వతేదీలలో జరిగే వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా క్రాంతి కుమార్ ఆహ్వానించగా,అందుకు ఎంపీ రవిచంద్ర సానుకూలంగా స్పందించారు.

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కి ఘన సన్మానం చేసిన జైపూర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు

జైపూర్, నేటి ధాత్రి:

చెన్నూరు నియోజవర్గ పర్యటనలో భాగంగా జైపూర్ మండల్ ఇందారం లో కాబోయే మంత్రివర్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కి సాల్వాతో సాధారణ స్వాగతం పలికిన జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాసుద్దీన్ వారితో మండలంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో చర్చించి ఎన్నికల కోడ్ వలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోలేకపోయాం . రైతులకు అండగా ఉంటాం చెన్నూరు నియోజవర్గానికి సంబంధించిన రైతుల వడ్ల విషయంలో సుల్తానాబాద్, పెద్దపల్లి రైస్ మిల్లుల దగ్గర కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ప్రతి రైతు వడ్ల ప్రభుత్వం తీసుకుంటుంది. జైపూర్ మండలంలో సుమారు 95 శాతం వడ్లు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది . రైతుల బాధ పడాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది. గ్రామాలలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరిద్దాం స్థానిక నాయకులు వాటిపై దృష్టి పెట్టాలని కాబోయే మంత్రివర్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్ జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆసంపల్లి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్త శ్రీనివాస్, ఎంపీటీసీ ఆర్కే సంతోష్, మాజీ ఎంపిటిసి సుంకరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిప్పగుర్తి దుర్గయ్య, ఎస్కే షరీఫ్, బేధ మల్లేష్ ,మున్నాభాయ్ ,ప్రశాత్ టేకుమట్ల ఉపసర్పంచ్ గుడిగందుల సాగర్ ,మారుతి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

పోలీస్‌ ప్రతిష్టను దిగజారిస్తే సహించేది లేదు

# వరంగల్ పోలీస్ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా.
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

పోలీస్‌ విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజాచ్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, ఎస్‌.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి పలుఅంశాలపై అధికారులతో చర్చించడంతో పాటు, వచ్చే నెల 4వ తారీఖున ఏనమాముల మార్కేట్‌లో నిర్వహబడే పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావు నిర్వహించేందుకుగా తీసుకోవాల్సిన పోలీస్‌ బందోబస్తుతో పాటు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘలకు పాల్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులతో ముచ్చటించడంతో పాటు, చేపట్టాల్సి ముందస్తూ చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పలుసూచనలు చేశారు. అధే విధంగా జూన్‌ 9 న నిర్వహించబడే గ్రూప్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకుగాను పోలీస్‌పరంగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీస్‌ అధికారులను అడిగితెలుకున్నారు. వర్షకాలం సమీపిస్తున్న వేళ రైతులు నకీలీ విత్తనాల బారీన పడకుండా స్థానిక పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా నకీలీ విత్తనాల విక్రయాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు ఈ సమావేశంలో సూచించారు.


అనంతరం పోలీస్‌ కమిషనర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్‌ అధికారి నీతినీజాయితీతో విధులు నిర్వహించాల్సి వుంటుందని. ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ వారి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్లుగానే సాధరణ ప్రజలకు సరైన న్యాయం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థకు సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయని,అలాగే నకిలీ విత్తనాల నియంత్రణకై పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, రైతులకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనపై వుందని చెప్పారు. రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూసేందుకైనా నకిలీ విత్తనాలను అరికట్టడం పోలీస్‌ అధికారులు మరింత శ్రమించాల్సిన అవసరం వుందని అన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వున్న ప్రజలు ముందుగా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, మీ ఫిర్యాదుపై సరైన న్యాయం జరగని పక్షంలో మాత్రమే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాలని, ముఖ్యంగా పోలీస్‌ కమిషనర్‌ ఎదైనా ఫిర్యాదు చేయాలనుకునేవారు ఫిర్యాదుదారులు 8712685070 వాట్సప్‌ నంబర్‌కు మీ ఫిర్యాదులను పోస్ట్‌ చేయడం ద్వారా ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేశారు. అనంతరం పార్లమెంట్‌, ఉప ఎమ్మెల్సీ ఎన్నికలను సజావు నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్‌ అధికారులకు పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేసారు. ఈ సమావేశంలో డిసిపిలు అబ్దుల్‌బారీ, రవీందర్‌, ఏఎస్పీ అంకిత్‌, అదనపు డిసిపిలు రవి, సంజీవ్‌,సురేష్‌కుమార్‌తో పాటు ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌.ఐలు పాల్గోన్నారు.

ముంబైలో గంజాయి నిందితుడు అరెస్ట్

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పట్టుబడి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్న గంజాయి నిందితుడు రత్న విలాస్ ను ముంబైలో చండీవాలి ప్రాంతంలో అరెస్టు చేసినట్లు చందుర్తి ఎస్ఐ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు, గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన రత్న విలాస్ గంజాయిని విక్రయిస్తూ పట్టుబడి స్టేషన్ నుంచి తప్పించుకుని ముంబైకి పారిపోయాడు అని తెలిపారు. నమ్మకమైన సమాచారంతో పోలీసులు ముంబై కి వెళ్లి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పెద్దకొకోడెపాకలో హనుమాన్ నగర సంకీర్తనలు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని పెద్దకొడపాకలో హనుమాన్ మాలాదారుల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారులన్నీ శ్రీరామ నామాలు జపిస్తూ పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఊరు ఊరంతా శ్రీరామ నామంతో మారు మోగింది. అందులో ఒక బాలస్వామికి హనుమాన్ వేషధారణ వేసి కన్నుల విందుగా ఊరేగింపుగా భజనలు చేస్తూ వీధుల్లో తిరగడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది గ్రామస్తులు అంత ఇండ్లను శుద్ధి చేసుకుని మహిళలు హనుమాన్ స్వాములకు మంగళహారతులు ఇచ్చి పాడి పంటలు బాగుండాలని గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

జర్నలిస్టు తమ్మిశెట్టి వైద్యానికి రూ.10 వేల ఆర్థిక సహాయం.

29.05.2024.
ఖమ్మం

తక్షణమే స్పందించిన
టీయూడబ్ల్యూయుజె (టీజేఎఫ్)

తమ్మిశెట్టి ఆరోగ్య పరిస్థితిపై అల్లం నారాయణ వాకబ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో ఖమ్మంలోని శ్రీకృష్ణ హాస్పిటల్ లో అపస్మారక స్థితిలో అడ్మిట్ అయ్యారు.

ఆయన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని
టీయూడబ్ల్యూయుజె
(టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవిలు …తమ్మిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి,
ఆయన సతీమణి రమదేవికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు.

తమ్మిశెట్టి ఆరోగ్య పరిస్థితిపై అల్లం నారాయణ వాకబ్

అలాగే ప్రెస్ అకాడెమీ మాజీ చైర్మన్ టీయూడబ్ల్యూయుజె వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ,ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్,జాయింట్ సెక్రెటరీ మేకల కళ్యాణ్ చక్రవర్తి తమ్మిశెట్టి ఆరోగ్య పరిస్థితిపై వాకబ్ చేశారు.

జిల్లా నాయకత్వం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి వెంకటేశ్వర్లు ఆరోగ్యం మెరుగు పడేలా చూసుకోవాలని కోరారు.

error: Content is protected !!
Exit mobile version