జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మహమ్మద్ అంకూస్*
ప్రజల్లో ఉనికిని కోల్పోతున్న ప్రతిసారి కెసిఆర్ ప్రజలను రెచ్చగొట్టి, చిచ్చు పెట్టి దుమారం రేపడం అలవాటు, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎటువంటి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మిళ్లు స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కెసిఆర్ వైఖరి తేటతెల్లమైపోయింది. రాష్ట్రాన్ని విపరీతమైనటువంటి ధోరణిలో వివిధ రూపాల్లో దోచుకొని రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోకుండా దొరల పాలన కుటుంబ పాలన కొనసాగించి లక్షల కోట్ల దోచుకొని మళ్లీ నేడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను కవులను కళాకారులను మేధావులను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ విషయంలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడం అనేది తన వైఖరికి నిదర్శనం. తాను అధికారంలో ఉన్నప్పుడు తన కూతురు కవిత బతుకమ్మ పాటకు రహమాన్ తో సంగీతం సమకూర్చితే ఏమీ లేదు, ఆంధ్రవాళ్ళైనా మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పజెప్పితే ఏమీ లేదు, చిన్న జీయర్ ట్రస్టుకు విరాళంగా 12కోట్ల భూమి ని ఇవ్వటం, విశాఖ శారదా పీఠం కి 2కోట్ల భూమి విరాళం ఇస్తే ఏమీ లేదు, ఆనంద్ సాయి తో యాదాద్రి టెంపుల్ కి డిజైన్ చేయింస్తే ఏమిలేదు, హీరోయిన్ సమంత ని బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే తప్పు లేదు,జై తెలంగాణ అనని నాయకులను తన క్యాబినెట్ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తే ఏమీ లేదు, రాష్ట్రం వచ్చేంతవరకే ఆంధ్ర,తెలంగాణ వచ్చింది కాబట్టి మనమంతా ఒక్కటే, తెలుగు వారమంతా ఒకటే అని శుద్ధపూస ముచ్చట్లు చెప్పిన కేసీఆర్ “తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం”అన్నట్టుగా నేడు జయ జయహే తెలంగాణ పాటకు సంబంధించి కీరవాణిని సంగీత దర్శకునిగా పెట్టుకుంటే ఆంధ్ర వాడిని సంగీత దర్శకుడుగా పెట్టుకుంటారా…? అనేటువంటి విషయాన్ని ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి విజ్ఞులమైనటువంటి మనము ఆలోచించాలి కదా పది సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి కవులను, కళాకారులను పట్టించుకోలేదు, రాష్ట్ర గీతాన్ని పట్టించుకోలేదు ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొడుతుంటే తెలంగాణ ప్రజలం గొర్రెలము కాదు పిచ్చోళ్ళం కాదు కాబట్టి విజ్నులమైనటువంటి ప్రజలు గుర్తించి సెంటిమెంటు రాజకీయాలు చేసి బ్రతకాలనుకునే వారికి బుద్ధి చెప్పి విజ్ఞులుగా ఆలోచిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గమనించాలి. కెసిఆర్ ఫ్యామిలీకి కావాల్సింది రాజకీయం ప్రజలను రెచ్చగొట్టడం.మనకు కావలసింది రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రజల పాలన, కెసిఆర్ పాలన రాచరికం, కుటుంబ పాలన మనం చూసాం ఇంకా వారి సెంటిమెంట్ ముచ్చట్లు నమ్మి మనం సపోర్ట్ చేస్తే “నమ్మి నానపెడితే పుచ్చి బుర్రలైనట్లు”గా ఉంటది మన పరిస్థితి కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా తెలంగాణను సర్వనాశనం చేసి లక్షల కోట్లు దోచుకున్న వారు చెబితే మనం వినే పరిస్థితుల్లో లేము అనేటువంటి విషయాన్ని గ్రహించాలని వేడుకుంటున్నాం.