నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

డి ఐ ఈ ఓ కార్యాలయం ఎదుట ధర్నా

హనుమకొండ, నేటిధాత్రి :

అనంతరం ఎ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ… హన్మకొండ జిల్లా నగరం లోకల్ నారాయణ జూనియర్ కళాశాల విద్యాశాఖ నుండి 38290 కోడితో 31-3-58/8 హౌస్ నెంబర్ తో కోమటిపల్లి లో అనుమతి ఉంటే అదనంగా గోపాలపుర్ లో రెండు కో బ్రాంచులు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలు నారాయణ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) అనుమతి ఉంటే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ లోకల్ నారాయణ జూనియర్ గర్ల్స్, కళాశాల, నారాయణ జూనియర్ బాయ్స్ కళాశాల పేర్లతో కళాశాల నిర్వహిస్తూ ప్రభుత్వ నియమాలను పాటించని లోకల్ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కూడా పట్టించుకోకుండా చోద్యంగా చూస్తున్న విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ నియమాలు పాటించని లోకల్ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ప్రశాంత్ వినయ్ రాజు ప్రసాద్ రాకేష్ రోషన్ తదితరులు పాల్గొన్నారు.

వాహనాలు కడుగుతూ కలుషితం చేస్తున్న త్రాగునీరు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ కొమ్ముగూడెం లోని ఆర్ డబ్ల్యు ఎస్ బోరు త్రాగునీరు కలుషితమవుతుందని స్థానిక తాజా మాజీ వార్డ్ మెంబర్ జాగటి వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం బోరు పరిసర ప్రాంతంలో నీటి వసతి కొరకు బిగించిన నాల్లాను నివాస ప్రాంత ప్రజల అవసరాలకు వినియోగించుకునే సమయంలో అడ్డుగా వచ్చి ట్రాక్టర్లు బైకులు కడుగుతున్నారని ఆరోపించారు.నీటి వసతిని అనుగుణంగా వినియోగించుకోకుండా వాహనాలు కడిగి నీటిని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బోర్ కేసింగ్ సరైన ఎత్తులో లేక వ్యర్థ నీరు మళ్లీ బోరులోకి చేరి త్రాగు నీరు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నదని వివరించారు.అదనంగా బోర్ కేసింగ్ బిగించి,బోర్ చుట్టూ గద్దె నిర్మాణం చేపట్టి త్రాగునీరు కలుషితం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

పద్మశాలి యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా కృష్ణ ప్రసాద్

నేటి దాత్రి కమలా పూర్(హన్మకొండ)

అఖిల భారత పద్మశాలి యువజన విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన పోరండ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పెగడపల్లి గ్రామానికి చెందిన కందికట్ల ప్రశాంత్ ను నియమిస్తూ అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం శనివారం నియామక పత్రాలను అందజేశారు. మర్రిపెల్లిగూడెం చేనేత సహకార సంఘం అధ్యక్షునిగా,కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గా పనిచేసిన పోరండ్ల కృష్ణ ప్రసాద్ గత రాజకీయ అనుభవంను దృష్టిలో ఉంచుకొని పద్మశాలి యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి నూతనంగా అధ్యక్షునిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం తెలిపారు.యువజన అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం,రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్,రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్ ,ప్రధాన కార్యదర్శి దాసి వెంకటేశ్వర్లు, కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్,పోరండ్ల రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు పద్మశాలీల సమస్యల సాధన కోసం కుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు.

పిల్లలు ఆరోగ్యంగా ఎదగడం ముఖ్యం

గొల్లపల్లి నేటి ధాత్రి:

మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గొల్లపల్లి సెక్టర్, ఇబ్రహీం నగర్ సెక్టర్ పరిధిలోని సివియర్ ఆ క్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎస్ ఏ ఎం) మాడే ట్రీ ఆక్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎం ఏ ఎం) తక్కువ బరువు గల పిల్లలకి వైద్యాధికారి నరేష్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిడిపిఓ వీరలక్ష్మి మాట్లాడుతూ ఎస్ ఏ ఎం, ఎం ఏ ఎం పిల్లలు తరచుగా అనారోగ్యాలకు గురి అవుతారు, కాబట్టి వాళ్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి అంగన్వాడి కేంద్రంలో పిల్లల బరువులు ఎత్తులు చూయించి అంగన్వాడి పాఠశాల పిల్లలు వారి యొక్క పెరుగుదల ఆరోగ్యం కొరకు అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పౌష్టికాహారం గుడ్లు, పాలు, బాలామృతం , బాలామృతం ప్లేస్ పిల్లలకు నిత్యం అందించాలని పౌష్టికాహారం తీసుకున్నప్పుడే పిల్లలు యొక్క పెరుగుదల, బలంగా, పిల్లలు ఉంటారని పౌష్టికాహారం పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ఆరోగ్యంగా బాగుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, వైద్యాధికారి నరేష్, సూపర్వైజర్లు జానకి, జ్యోతి, అంగన్వాడి టీచర్లు హెల్త్ సిబ్బంది పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల చనిపోయిన తిర్మలాపూర్ గ్రామానికి చెందిన తోట ఎల్లయ్య, జడల పేట గ్రామానికి చెందిన గొర్రె రాజయ్య, నైన్ పాక గ్రామానికి చెందిన నాగుల శంకరయ్య కంచర్ల చంద్రయ్య కుటుంబాలను శనివారం రోజున పరామర్శించిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఆయన వెంట టిఆర్ఎస్ మండల నాయకులు శ్రీనివాస్ నాయక్ మాజీ ఎంపీటీసీ పిట్ట సురేష్ నల్ల దేవేందర్ రెడ్డి మిన్నపురం రమేష్ గొర్రె మల్లేష్ సాంబయ్య తదితరులు ఉన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ(ఎం) నేత సోమయ్య

కార్యదర్శులు ఎన్నికైన సీతారాములు, నాగేశ్వరరావు

హామీలు మరిస్తే అధోగతే

గత పాలకుల తప్పిదాలు పునరావృతం కావద్దు సీపీఐ(ఎం) నేత పీ.సోమయ్య

కారేపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిస్తే అధోగతి పాలుకాక తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పీ.సోమయ్య హెచ్చరించారు. కారేపల్లి మండలం మాణిక్యారం`1,2, గ్రామశాఖల సమావేశం శుక్రవారం రేపాకుల లాలయ్య నగర్‌లో జరిగింది. ఈసభలో పీ.సోమయ్య మాట్లాడుతూ అధికారంలోకి రావటానికి బూర్జువా పార్టీలు హామీ గుమ్మరించటంలో వాటిని అమలులో షరతులు పెట్టటం అసంపూర్తిగా అమలు చేయటం సర్వసాధారణంగా మారిందని విమర్శించారు. రైతు రుణమాఫీ రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. పెట్టుబడుల కాలం కావటంతో రైతులు ఒత్తిడికి గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల చేసిన దప్పిదాలను పునరావృత్తం అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. చౌకదుకాణాలను బలోపేతం చేయటం ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులను అందించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల బాధలను వదిలేసి మందిరాలు మతం అందిపుచ్చుకుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మైనార్టీలు బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూరాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలులో ఆరంభశూరత్వం కనపిస్తుందని విమర్శించారు. గిరిజన గిరిజనేతర పోడు సమస్యకు పరిష్కారం రాలేదని సీతారామ ప్రాజెక్టు నీరు కారేపల్లి మండలానికి అందేలా వైరా ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మాణిక్యారం`మొట్లగూడెం బీటీ రోడ్డు వెంటనే చేపట్టాలని పదోతరగతి పరీక్షాకేంద్రాన్ని మాణిక్యారంలో ఏర్పాటు చేయాలని పేదలందరికి పక్కా గృహాలు ఇవ్వాలని రేషన్‌ కార్డులు ఇవ్వాలని అర్హులకు పెన్షన్‌ ఇవ్వాలని మహాసభలోతీర్మానాలు చేశారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ పతాకాన్ని సీనియర్‌ నాయకులు రేపాకుల వీరభద్రం ఎగరవేశారు. కార్యదర్శులుగా కరపటి సీతారాములు పోతర్ల నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మెరుగు సత్యనారాయణ మండల కార్యదర్శి కే.నరేంద్ర నాయకులు వజ్జా రామారావు దాసరి మల్లయ్య కొండబోయిన ఉమావతి కొత్తూరి రామారావు ధారావత్‌ వస్రాం పాయం వరలక్ష్మి. రేపాకుల వీరమ్మ కల్తీ రామచంద్రు వడ్డూరి వీరబాబు పండగ కొండయ్య కుర్సం శ్రీను దమ్మాలపాటి ప్రభాకర్‌ కాటేపల్లి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ డాక్టర్ గా న్యూరో సర్జన్ సందీప్ బోయిల

డాక్టర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3వ ఐకాన్స్ హెల్త్ కేర్ అవార్డ్స్ – 2024 ఉత్తమ డాక్టర్ ప్రశంసా పత్రన్నీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ కి చెందిన పాలమూరు న్యూరో సర్జన్ డాక్టర్ సందీప్ బోయిల కు దక్కింది.శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సందీప్ బోయిలను సన్మానించారు.. ఈ కార్యక్రమం లో జడ్చర్ల మాజీ ఉపసర్పంచ్ డి.శ్రీనివాసులు, మాజీ వార్డు సభ్యులు మాజీ మూడ డైరెక్టర్ వై.జి.ప్రీతం, మాజీ వార్డు సభ్యులు టి.విజయభాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.కృష్ణారెడ్డి, పి.కాశీ విశ్వనాథ్, మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు..

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీ

జమ్మికుంట: నేటి ధాత్రి
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు స్థానిక వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులచే పదివేల సీడ్ బాల్స్ తయారు చేసి చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు రామిడి శ్రీనివాస్ మాట్లాడుతూ అడవుల పెంపకానికి ఉద్దేశించి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారుచేసి అక్టోబర్ 2న ఫారెస్ట్ ఏరియాలో వెదజల్లుతామని తెలిపారు. దేశంలో చెట్లను నాటడం కన్నా అడవుల నరికివేత అధికంగా ఉన్నందున ప్రతి పౌరుడు బాధ్యత గా వ్యవహరించి చెట్లను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లంకి రమేష్, చందా రవీందర్,మహిళా అధ్యక్షురాలు అయిత స్వాతి, రామిడి విజయలక్ష్మి, నవ్య మరియు కళాశాల ప్రిన్సిపల్ కె. రాజిరెడ్డి , అధ్యాపక బృందం పాల్గొన్నారు.

మడిపల్లి లో గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో గ్రామ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గీత పారిశ్రామిక సహకార సంఘం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఓల్లాల రాజ భాస్కర్ ,ఉపాధ్యక్షులుగా నాగపూరి కిరణ్, డైరెక్టర్లుగా ల్యాదల్ల కృష్ణమూర్తి, నేరెళ్ల కృష్ణమూర్తి, ఉమ్మ గాని సారంగం, మాచర్ల సదానందం, బోనగాని శ్రీనివాస్, నాగపూర్ తిరుపతి, పంజాల మల్లేష్, లను ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గీత కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడతానని అధ్యక్షులు ఓల్లాల రాజభాస్కర్ తెలిపారు.

ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించాలి

మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు
జమ్మికుంట: నేటిధాత్రి
పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలని మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో వావిలాల పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతినిత్యం కార్మికులు వివిధ రకాలైన డ్రైనేజీ పనులు చేస్తూ ఉంటారని, కార్మికులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తూ పనులు చేయాలని, పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ కార్మికుల పైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అలాంటి కార్మికులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. అనంతరం హుజరాబాద్ లో పనిచేస్తున్న డి.ఎస్.ఆర్.సి కౌన్సిలర్ బత్తుల బబిత మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన ప్రతి ఒక్కరు అవగాహనను కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెడు వేసినాలకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ కు సంబంధించిన కరపత్రాన్ని పంపిణీ చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్ పైన సందేహాలు ఉన్నట్లయితే 1097 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవాలని తెలిపారు .ఈ సందర్భంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. హుజూరాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు వైద్య శిబిరాన్ని పరిశీలించి కార్మికులకు సూచనలు ఇచ్చారు . ఈ వైద్య శిబిరంలో వైద్యులు ఫరహానుద్దిన్ ,చందన, మేనేజర్ రాజిరెడ్డి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రసాద్ గౌడ్, జమ్మికుంట హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, దిడ్డి నరేందర్, సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, ఏఎన్ఎంలు మంజుల, వనజ రాధా, మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు

దేవరకద్ర యం ఈ ఓ బలరాం..

లక్ష్మీ పల్లి లో విద్యార్థులకు ఏక రూప దుస్తుల పంపిణీ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ.. క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని
దేవరకద్ర మండల విద్యాధికారి పి.బలరాం అన్నారు.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నూతన యం ఈ ఓ గా బాధ్యతలు స్వీకరించిన బలరాం శనివారం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల తరగతి బోధన, తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల హెచ్ ఎం ఎం.ఏ. బాసిద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో యంఈ ఓ, బల రాం మాట్లాడుతూ, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గుణాత్మక మైన విద్యతో పాటు అక్షయ పాత్ర ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.పాఠ్యపుస్తకాలు రెండు జతల ఏక రూప దుస్తులు సైతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ల ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యా బుద్దులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధుల తో పాటు ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారంతో లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ప్రగతికి చేస్తున్న కృషిని వివరించారు. కాగా మండల విద్యాధికారి బాధ్యతలు స్వీకరించిన తదుపరి లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన యంఈ ఓ, బలరాం ను ఈ సందర్భంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ యం లు , ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ ఎం లు బాసిద్, మురళీధర్ ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ , ఎస్.కల్పన, ఆస్ర ఖాద్రి, దోమ శంకర్, సుజాత, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

వీణవంక తాసిల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్

జమ్మికుంట: నేటిధాత్రి
వీణవంక మండల తాసిల్దారుగా గుర్రం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తాసిల్దారుగా పనిచేసిన లక్ష్మణ్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ కు బదిలీ కాగా శ్రీనివాస్ గౌడ్, వీణవంకకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రజలుసమస్యలుఉన్నట్లయితే నేరుగాతాసిల్దార్కార్యాలయంకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి భూమి విషయంలో రైతులకు సందేహాలు ఉన్నట్లయితే తన వద్దకు వచ్చి పరిష్కార మార్గాల గురించి చర్చించినట్లయితే వారికి అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేస్తూ ముందుకు పోతామని, పైరవీకారులకు ఆస్కారం లేకుండానే తన వద్దకు వచ్చిన సమస్యలను వారి ముందే పరిష్కరిస్తానని తెలిపారు. గతంలో కలెక్టరేట్లో, డి ఆర్ డి ఏ లో పనిచేయడం జరిగిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీణవంక తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించారు.

అశ్రునయనాల మధ్య విజేందర్ అంతిమయాత్ర.

@జనసంద్రోహంగా మారిన చింత నెక్కొండ.
@ నర్సంపేట ప్రజల నోటిలో నాలుకలా..


@కడసారి వీడ్కోలు పలికిన బాల్యమిత్రులు, కుటుంబ సభ్యులు ,పోలీస్ ఉన్నత అధికారులు.

వరంగల్ / పర్వతగిరి,నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దబ్బట విజేందర్ శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో వరంగల్ నుండి తొర్రూరుకు బైక్ పై వస్తుండగా మార్గం మద్యలో మామునూరు సమీపంలో ప్రమాదానికి గురై మృతు ఒడిలోకి జారుకున్నాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ నుండి తొర్రూర్ కు బైక్ పై వస్తున్న విజేందర్ గుర్తుతెలియని వాహనం ఢీకొని మామునూరు సమీపంలో గాయాలపాలు అయ్యాడని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తొర్రూరు ఎస్సై మరియు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విజేందర్ ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండ లోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే విజేందర్ మృతి చెందాడని వైద్యులు తెలపగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.

శోకసముద్రంలో మునిగిన చింత నెక్కొండ.

విజేందర్ ఇక లేడు అనే వార్తను చింత నెక్కొండ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు చిన్ననాటి నుండి గ్రామస్తులతో పంచుకున్న ప్రేమ అనురాగాలు చిన్ననాటి స్నేహితుల ఆప్యాయతల నడుమ విజేందర్ అంతక్రియలు శోక సముద్రంలో కొనసాగాయి. అంతేకాక పక్క మండలమైన నెక్కొండ లోని చిన్ననాటి స్నేహితుల కన్నీటి జాలల మధ్య విజేందర్ పై ఉన్న ప్రేమ అనురాగాలతో కంటినీరు వరదయ్య పారింది. చింత నెక్కొండ లోని గల్లి గల్లి కి విజేందర్ అమరహే అనే నినాదాలు మిన్నంటాయి. విజేందర్ కడసారి చూపు కోసం నర్సంపేట, నెక్కొండ, తొర్రూర్ ప్రజల కన్నీటితో విజేందర్ అంతక్రియలు చింత నెక్కొండ స్మశాన వాటికలో శుక్రవారం రాత్రి ముగిసాయి.

అంతిమయాత్రలో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారులు.

కానిస్టేబుల్ విజేందర్ అంతిమయాత్రలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని విజేందర్ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

నర్సంపేట ప్రజల నోటిలో నాలుకలా..

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ 9 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ విజేందర్ ప్రజల నోట్ల నాలుకలా అయ్యాడు.అందరినీ ఆప్యాయంగా పరికరించే కానిస్టేబుల్ ప్రమాదంలో మరణించాడనే సమాచారంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.తనతో కలిసి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నివాళులు అర్పించారు.

వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రోగులకు వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే..ఆసుపత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డా.శ్రీకాంత్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..
పలు విభాగాలకు స్వయంగా వెళ్లి రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యచికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే..
డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, చికిత్స అందజేయాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముక్కిరాల మదువంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, కాంగ్రెస్ నాయకులుచిలుకలరాయకోమురు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్తే సత్వరమే న్యాయం జరుగుతుందనే భావన రావాలి

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి….

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామగుండం పోలీస్ కమిషనర్(సీపీ )ఎం శ్రీనివాస్‌ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కమిషనర్‌ శ్రీనివాస్‌ సిబ్బందికి సూచించారు. రికార్డులను పరిశీలించారు.పోలీస్‌ అధికారులు, సిబ్బంది పనితీరు,వారి సమస్యల గురించి రామకృష్ణాపూర్ ఎస్సై ని అడిగితెలుసుకున్నారు. కాలనీలు, గ్రామాల్లో జరిగే నేరాలపై ఆరా తీశారు. డయల్‌ 100 కాల్స్‌పై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్‌పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. మహిళలు, పిల్లలు, సీనియర్‌ సిటిజన్‌లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళితే సత్వరమే న్యాయం జరుగుతుందనే భావన ప్రజలకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ లు ఉన్నారు.

కె.ఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఓదెలు మాదిగ డిమాండ్.

చిట్యాల నేటిదాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నీరుల మాధవ్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తూ ఏబిసిడి వర్గీకరణ కోసం తన కుటుంబాన్ని పట్టించు కోకుండా ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా ఎంచుకొని 30 సంవత్సరాల సుదీర్ఘకాలం పోరాట ఫలితమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశమంతా మాదిగలు మాదిగ ఉపకులాలు గర్వించదగ్గ విషయమని తెలుసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు తెలుసుకోవాలని చిట్యాల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలుమాదిగ డిమాండ్ చేశారు ,మందకృష్ణ మాదిగ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని కె ఆర్ నాగరాజు మాట్లాడాలని అన్నారు, మంద కృష్ణ మాదిగ ఒక శక్తి ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల పోలీసు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయి ఒక ఎమ్మెల్యే అయినవు
మాల ఉద్యోగస్తుల సమావేశంలో మాదిగలను కించేపర్చేలా ఏ బి సి డి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు వెంటనే రాజీనామా చెయ్యాలి అనిడిమాండ్ చేశారు
వర్ధన్నపేట నియోజకవర్గంలో మాలల ఓట్లు 6000 ఉంటే మాదిగల ఓట్లు 60000 వేలు ఉన్నవి ఒక్క మాలలే ఓట్లేస్తే గెలిచినా అనడం సిగ్గుచేటని ఎమ్మెర్పీఎస్ నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు…
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలతో ఇచ్చిన ఏబీసీడీ వర్గీకరణ తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుచేటని మాదిగల పట్ల వివక్షత చూపిన ఎమ్మెల్యే నాగరాజు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు… మరియు అంబేద్కర్ వాదిని అని చెప్పుకునే ఎమ్మెల్యే నాగరాజు అంబేద్కర్ సామాజిక న్యాయా సూత్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఒక మాలవర్గమే రిజర్వేషన్ ఫలాలు తినాలని మాట్లాడడం సిగ్గుచేటని ఆయన అంబేద్కర్ వాది కాదని దీన్ని బట్టి రుజువైంది ఇప్పటికైనా అంబేద్కర్ వాదులు అని చెప్పుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా దళిత గిరిజనులారా అన్ని పార్టీలో ఉండే మాదిగ మాదిగ ఉప కులాల నాయకులారా అప్రమత్తం కండి చైతన్యవంతులై బూటకపు మాటలు చెప్పే నాయకులను తరిమికొడదాం భవిష్యత్ కార్యచరణ రూపొందిద్దాంఅని అన్నారు,

పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిది

మరిపెడ నేటి ధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని గాలివారిగూడెం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని మరిపెడ సముదాయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత రావు అన్నారు.గాలివారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలంగా పనిచేసి ఇటీవల బదిలీ పై వెళ్ళన ఉపాధ్యాయులు గుగులోతు వెంకన్న, లింగాల మహేష్ గౌడ్,ఫైజుద్దీన్,బాలు గార్లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేశారని,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయుల కృషి మరువలేనిది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి,గాలివారిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.వెంకన్న,బి.మురళీధర్,
వీరన్న,విద్యార్థినీ,విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

రామన్న పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం

ఇందిరమ్మ రాజ్యం లోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది..

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఇందిరమ్మ రాజ్యం లోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం, రామన్న పల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం రోజు ఆయన ప్రారంభించరు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామస్థాయి లోనే ‌బీజం పడాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో పదవతరగతి, ఇంటర్ మరియు డిగ్రీ చదివిన యువతకు త్వరలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ యశోద, పిఆర్ఎఇ సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై. అచ్చన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, నాయకులు శ్రీశైలం యాదవ్, రఘుపతి రెడ్డి, యాదన్న యాదవ్, గోపాల్, కృష్ణయ్య, అంజి, చంద్రయ్య , తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కండువా కప్పుకున్న కౌన్సిలర్ పార్వతి విజయ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్యే వివేక్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కౌన్సిలర్ పార్వతి విజయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసి ముందుకెళ్తానని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టి పి సి సి కార్యదర్శి రఘునాథరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా భగత్ సింగ్ జన్మదిన వేడుకలు

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ
జిల్లా కమిటీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

భగత్ సింగ్ 117 వ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఏంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భగత్ సింగ్ జన్మదిన వేడుకలలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జయంతి కార్యక్రమంలో భగత్ సింగ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూనుగు మీసాల వయసులోనే ఉరికంభం ఎక్కి 23ఏళ్లకే దేశం కోసం తన ప్రాణం అర్పించిన భగత్ సింగ్ ఒక గొప్ప విప్లవ కారుడు అని, దేశం కోసం యువత దేశం భద్రత కోసం ముందు వరుసలో నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయు జిల్లా కన్వీనర్ చంద్రగిరి శంకర్ ఏఐఎస్ఏ భూపాలపల్లి జిల్లా సెక్రటరీ శీలపాక నరేష్ తాటికొండ రాకేష్, రాజు మధు, సురేష్ విద్యార్థి నాయకులు పాల్గొనడం జరిగింది.

error: Content is protected !!
Exit mobile version