అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

గుండాల సిఐ రవీందర్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :


మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మండలంలోని దామెర తోగు గ్రామాన్ని గుండాల సీఐ రవీందర్ విజిటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం
అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లును గోప్యంగా ఉంచుతా
మన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి
ఇబ్బందులకు గురికావద్దని హెచ్చరించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను అర్ధంతరం చేసు
కోవద్దని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు తమ ఊబిలోకి దించుతూ వారి స్వలాభం కోసం అమయాకులను బలికొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిస్టులను తరిమి కొట్టాలని అన్నారు.అదేవిధంగా వారోత్సవాల కల్వర్ట్స్ ను కూడా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ పోలీస్ సిబ్బంది మంగయ్య, వెంకటేశ్వర్లు, స్పెషల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు

శ్రీరాంపూర్, (మంచిర్యాల )నేటి ధాత్రి:

డిజెఎఫ్ యూనియన్ కార్యాలయం కొరకు గురువారం రోజున శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు సానుకూలంగా స్పందించిన జిఎం సంజీవరెడ్డి ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్ధన్, మెరుగు సతీష్, పులి మధునేష్, నేరెళ్ల నరేష్ గౌడ్ ఉన్నారు.

జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు బిట్స్ విద్యార్థుల ఎంపిక

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన ఎస్జిఎఫ్ఐ మండల స్థాయి క్రీడోత్సవాలలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు అండర్ 14 మరియు అండర్ 17 విభాగంలో కబడ్డీ,ఖో ఖో క్రీడలలో 11 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిండి యుగేందర్ తెలియజేశారు.ఎంపికైన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ,క్రీడల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం, మానసిక శారీరక ఉద్దీపనలను అందిస్తాయని,ఆటలు విద్యాపరమైన అనుకరణ లేదా మానసిక పాత్రను నిర్వహించడానికి తోడ్పడతాయని తెలియజేశారు.

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

గంగాధర నేటిధాత్రి :

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగాధర లో చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ ఏ. సత్యనా రాంజనేయ మాట్లాడుతూ సాకలి ఐలమ్మ గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేసిన వీర మహిళా చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
అనంతరం ఎన్ఎస్ పి.ఓ.(NSS P.O)
ఎల్. సురేష్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం పేదల విముక్తి కోసం పోరాటం సలిపిన మహా వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు అనేక మంది స్త్రీలను మేల్కొల్పి దున్నేవారికి భూమి దక్కాలని, సమాజంలో అసమాన తలను తొలగించాలని తన జీవితకాలం ఉద్యమం కొనసాగించారు. ఆమె అందించిన పూర్తి సహకారం నేటి మహిళా లోకానికి ఎంతగానో తోడ్పడుతుందని, చాకలి ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు నడవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ బండి రవిని పరామర్షించిన నాయకులు

నేటిధాత్రి, దేశాయిపేట

గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతానికి చెందిన సీనియర్ రిపోర్టర్ (టీవి5) బండి రవి తండ్రి బండి కుమారస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, గురువారం 14వ డివిజన్ కు చెందిన ఎన్టీఆర్ నగర్, ఎస్ ఆర్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు బండి రవితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బండి రవిని పరామర్శించిన వారిలో వివిధ పార్టీల నాయకులు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, ఈర్ల రాజేందర్, కొత్తకొండ రాజు, పసులాది మల్లయ్య, ఉప్పునూతల రాజు, అంకేశ్వరపు సతీష్, తదితరులు ఉన్నారు.

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మోడీ ప్రభుత్వం

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా

భూపాలపల్లి నేటిధాత్రి

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ప్రజల్లో చీలిక తీసుకువస్తూ మతతత్వ రాజకీయాలను పెంచి పోషిస్తుందని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజు అన్నారు.

జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా సదస్సుకు పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా పాల్గొని మాట్లాడుతూ.
దేశ రాజకీయాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బిజెపి ప్రభుత్వం గౌరవించడం లేదని ప్రజల హక్కుల్ని నిరాకరిస్తుందని సామ్రాజ్యవాదులకు దాసోహమై పరిపాలన చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలోనూ మద్దతు శక్తుల ప్రమాదం జరిగిందని అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దానికి నిదర్శనం అన్నారు. బిజెపి ఎదుగుదలకు బిఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ అనుసరించిన ఆర్థిక విధానాలను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తుందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ అంటేనే కమ్యూనిస్టులు, గుర్తుకు వస్తారని అలాంటి ఈ గడ్డపై వామపక్ష శక్తులు బలహీన పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కమ్యూనిస్టులు బలోపేతం కావాలని, లిబరేషన్ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ విధమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్లాలని రమేష్ రాజా అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసే చర్యలు మానుకోవాలని ప్రజా అనుకూల పరిపాలన చేయాలని ఏఐసీసీటియు రాష్ట్ర కార్యదర్శి రొయ్యల రాజు అన్నారు. స్వరాష్ట్ర ఏర్పడి పదేళ్ల కాలం పూర్తయిందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచిందని, సుమారుగా 8 లక్షల కోట్ల అప్పు పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకూడదని, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బిజెపి ప్రమాదాన్ని ప్రజా పోరాటాల ద్వారా అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు చంద్రగిరి శంకర్, ప్రజా సంఘాల నాయకులు శీలపాక నరేష్, రవి, రాకేష్, ప్రకాష్, రాము, లక్ష్మణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కు నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించరు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… తెలంగాణ ఉత్పకారిణి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్రా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. చాకలి ఐలమ్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న జరుపుకుంటారు. చాకలి ఐలమ్మ తెలంగాణా ప్రాంతంలో జాతిపరమైన విముక్తి పోరాటంలో ప్రముఖంగా నిలిచిన మహిళా నాయకురాలు. ఆమె తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో, జమీందారీ వ్యవస్థ మరియు నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక న్యాయం కోసం ప్రతీకగా నిలిచారు.
ఆమె జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ, ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటారు, ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో, మహిళా సాధికారత మరియు సామాజిక న్యాయం కోసం ఆమె అందించిన కృషిని గుర్తు చేసుకుంటారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, ఆర్ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్ బీ డీఎస్పీ రమణా రెడ్డి, ఎ ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్, ఎస్ బి ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఆర్ ఐ.కృష్ణయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

జమ్మికుంట:నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రపరిధిలోనిఅభాదిజమ్మికుంట బి సి కాలనీలో డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 77మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.5 గురు జ్వర పీడితులను గుర్తించి వారికి ఆర్ డీ టి కిట్స్ ద్వారా డెంగీ మరియు మలేరియా నిర్దారణ పరీక్షలు చేసినారు.అదేవిధంగా డాక్టర్ చందన ఆధ్వర్యంలో జమ్మికుంట కృష్ణాకాలనీ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమములో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి నారు. శిబిరం నకు వచ్చిన 63 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినారు. 3 గురు జ్వర పీడితులకు రక్త నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకొరకు ల్యాబ్ కి పంపించినారు. అదేవిధంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే సందర్భముగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల మరియు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో వైద్య శిబిరాలు, స్వచధనం పచ్చదనం, శ్రమధానం, మొక్కలు నాటడం కార్యక్రమాములను నిర్వహించడం జరిగినది. పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ నిషేధం అవగాహన కల్పించడం జరిగింది. సీజనల్ వ్యాధుల పై, వ్యక్తి గత పరిశుభ్రత పై మరియు పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించనైనది. ఈ కార్యక్రమాలలో డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చందన, డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఫర్హానుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్ వైజర్స్ అరుణ, రత్న కుమారి, రామక్రిష్ణ ల్యాబ్ టెక్నీషియన్, శ్రీధర్ ఫార్మసిస్ట్, సాయికుమార్ స్టాఫ్ నర్స్, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, Anms సరళ, సజీదాపర్వీన, రమ, వాణిశ్రీ మరియు ఆశకార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు

జమ్మికుంట నూతన ఎంఈఓ కు ఘనసన్మానం.

జమ్మికుంట: నేటి ధాత్రి

జమ్మికుంట మండల విద్యాధికారి గా బాధ్యతలు తీసుసుకున్న శ్రీమతి మంతెన.హేమ లత ను ఎస్ టి యు జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రజాక్ పాషా ప్రధానకార్యదర్శి పురుషోత్తం మూర్తి, అదనపు ప్రధానకార్యదర్శి శ్రీ కోట శ్యామ్ కుమార్ , జిల్లా నాయకులు శెట్టి రాజమౌళి,దేవునూరి రఘు , మండల అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ మెడుదల నాగరాజు, నాయకులు కుర్ర సమ్మయ్య, లోకిని తిరుపతి, శ్రీనివాస్,మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ సేవలు మరువ లేనివని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్అన్నారు.
గురువారంచండూరు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ జయంతిని సిపిఎం చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల పెత్తందారులకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ జన్మించారు అని, పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో అయిలమ్మకు బాల్య వివాహం జరిగిందని ఆయన అన్నారు.వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడం, వీరి కులవృత్తిగా చాకలి వృత్తిని నిర్వహించేవారని ఆయన అన్నారు.. 1940 నుండి 1944 కాలంలో విసునూర్ దేశ్ముఖ్ మరియు రజాకార్లకు వ్యతిరేకంగా ఎర్ర జెండా పట్టింది చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.. అగ్రకులాల స్రీలు వారిని కూడా దొర అని పిలిపించుకునేవారి వారి సంస్కృతికి చరమగీతం పాడారు అయిలమ్మ అని, ఈభూమి నాది పండిన పంట నాదని, దొర ఎవ్వడు అని, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి దక్కించుకోగలర ని ఆయన అన్నారు. ఆనాడు చాకలి ఐలమ్మ విష్ణుర్ దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డిల గూండాలను కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత బట్టి తరిమికొట్టారని ఆయన అన్నారు.జనగామ తాలూకా ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభలను పెట్టి ఎర్రజెండా చేపట్టి దొరల ఆధిపత్యాన్ని ఊరూరాచాటి చెప్పారనిఆయన అన్నారు. తెలంగాణ తొలి దశ స్వాతంత్ర పోరాటంలో, భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అనివారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులుకట్ట లింగస్వామి,సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,వెంకటేశం,సిపిఎం నాయకులుఈరటి వెంకన్న, హమాలి యూనియన్ నాయకులు కావలి వెంకన్న, పుల్కరం అంజయ్య, శేఖర్, జగన్, బొమ్మర గోని లింగస్వామి, కుమార్, పుల్కరం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఎమ్మార్వో రోడ్డులో టీయూఎఫ్ఐడిసి నిధులతో ఫేజ్ 5 కింద సుమారు రూ.140 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పి సీఈఓ, జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపనలు చేశారు. రూ.30 లక్షలతో కారల్ మార్క్స్ కాలనీ లో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, రూ. 50 లక్షలతో పోలీస్ స్టేషన్ రోడ్డులో రోడ్డుకిరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చివరగా, రూ.60 లక్షలతో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుండి ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డులో బీటీ రోడ్డు వైడనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ తో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. సదరు గుత్తేదారు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ వెంక రాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి 24 వ వార్డు కౌన్సిలర్ శిల్ప అనిల్ దాట్ల శ్రీనివాసు కో ఆప్షన్ సభ్యుడు ఇర్ఫాన్ అశోక్ పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

బయ్య స్వామి దంపతులకు స్వదేశాగమన శుభాకాంక్షలు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాశీబుగ్గ మాజీ కార్పొరేటర్లు బయ్య రాజ్యలక్ష్మి – స్వామి దంపతులు, స్వల్ప విరామం నిమిత్తం నాలుగు నెలలు అమెరికాలో ఉన్న తమ కుమారుడు మధుబాబు వద్దకు వెళ్లి చికాగో, వాషింగ్టన్, కాలిఫోర్నియా మొదలగు రాష్ట్రాలలోని ముఖ్యమైన పర్యాటక స్థలాలను సందర్శించి అమెరికా యాత్రను విజయవంతంగా ముగించుకొని తిరిగి నేడు మాతృదేశానికి విచ్చేయుచున్న సందర్భంగా వారికి ఫోన్ ద్వారా స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియచేసిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ దడువాయి యూనియన్ నాయకులు కందికొండ రాజేందర్, నేటిధాత్రి పత్రిక వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ కందికొండ గంగరాజు. ఈ నెల 28, శనివారం ఉదయం బయ్య స్వామి దంపతులు ఇండియాకు వస్తున్న సందర్భంగా పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఫోన్ చేసి స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియచేశారు.

సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారిపై సిపిఐ రాస్తారోకో

ఎల్కతుర్తి – సిద్దిపేట హైవే కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోండి

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్

బీమదేవరపల్లి, నేటిదాత్రి :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం జాతీయ రహదారిపై బీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల సిపిఐ నాయకులతో కలిసి హైవే నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం బీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం శివారు వద్ద ప్రధాన రహదారిపై సిపిఐ ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రామయ్య పేట నుండి ఎల్కతుర్తి చేపట్టిన నూతన జాతీయ రహదారి 765 నెంబరు హైవే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నత్తనడక పనులు, నాణ్యతను పాటించడం లేదని, తద్వారా రోడ్డు నిర్మాణం పూర్తి కాకముందే రోడ్డుపైన గుంతలు,రోడ్డు ద్వంసం అవుతున్నదన్నారు. కాంట్రాక్టు పనులు దక్కించుకుని సంవత్సరాలు గడుస్తున్నా పనులు సకాలంలో పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము వహిస్తున్నాడని, తద్వారా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మద్యం సేవించి ఓవర్ స్పీడ్ తో నడుపుతున్న వాహనాలు ఈ రోడ్డుపైన అనేక ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినారు.రోడ్డు పై కంకర తేలి, దుమ్ము, దూళీతో సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ హైవే పై ఓవర్ లోడ్ వాహనాలు నియాంత్రిచాలని, రోడ్డు సకాలంలో పూర్తి కాకపోవడంతో నిత్యం జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు నిర్వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు కాంట్రాక్టర్ ను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్ ,జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఊటుకూరి రాములు,కర్రె లక్ష్మణ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విలీన గ్రామాల అభ్యర్థులకు న్యాయం చేయండి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల పరిధిలో రేషన్ షాపు ల నిర్వాహకుల నియామకానికి గత నెల 29 తేది నాడు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో సిరిసిల్ల విలీన గ్రామాలైన రగుడు,చంద్రంపేట, చిన్నబోనాల, ముష్టిపల్లి, పెద్దుర్, సర్ధపూర్ గ్రామాలు కూడా కలవు. కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అర్హులు అందరు అప్లై చేసుకోవాలని తెలిపారు. వ్రాత పరీక్ష తదుపరి ఇంటర్వ్యూ పద్ధతుల ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది. అయితే విలీన గ్రామాల అర్హత కలిగిన అభ్యర్థులు అందరు అప్లై చేసుకున్నారు. వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ లకు హాజరైనారు, తీరా చూస్తే గ్రామంలోని స్థానిక అభ్యర్థులకు కాకుండా సిరిసిల్ల పట్టణంలోని గ్రామ స్థానికతలేని వ్యక్తులకు షాప్ లు కేటాయిస్తున్నట్లు ప్రకటన వెలువరించడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిరిసిల్ల విలీన గ్రామాల కౌన్సిలర్ లు అందరు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లో అభ్యర్థి చౌకధరల దుకాణం యొక్క గ్రామ నివాసి అయి ఉండవలెను అని పేర్కొన్నారు. కానీ గ్రామ నివాసి కానటువంటి వారిని ఎంపిక చేశారు. మా గ్రామంలో అర్హులైన అభ్యర్థులు ఉండగా ఇతరులకి కేటాయించడాన్ని విలీన గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ అన్నారు. ఈ నిర్ణయం ద్వారా మా గ్రామాలలోని నిరుద్యోగులైన అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కనుక విలీన గ్రామాల రేషన్ షాపులను గ్రామాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు కేటాయించాల్సిందిగా కలెక్టర్ ని కోరగా పరిశీలిస్తామని చెప్పారనీ అన్నారు.ఈ కార్యక్రమంలో విలీన గ్రామాల నాయకులు పోచవేని ఎల్లయ్య, పాతూరి రాజిరెడ్డి, బుర్ర మల్లికార్జున్ గౌడ్, ఒగ్గు రాజేశం, ఎరవెల్లి రమణారావు, నర్మేట ప్రభుదాస్, ఎల్లం లు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు

జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతీ నగర్ లో రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు . అనంతరం నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ అమెనస్పూర్తి గా తీసుకొని ముందుకు వెళ్తామని ,చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పేరు పెట్టినందుకు అలాగే ఐలమ్మ మనవరాలు ఇయిన శ్వేత గారికి ప్రభుత్వం హోదా కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జమ్మికుంట మునిపల్ చేర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు మాకు అండగా ఉంటూ చాకలి ఐలమ్మ విగ్రహానికి సహాయం చేస్తూ ప్రత్వం తరుపున కార్యక్రమం జరిపించినట్లు వెల్లడించారు . అదేవిధంగా కొత్తపల్లి, జమ్మికుంట పట్టణంలోని చాణిక్య డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, కౌన్సిలర్ పొన్నగంటి సారంగపాణి, అధ్యక్షుడు సదానందం, వైస్ ప్రెసిడెంట్ రాచమల్ల రవి, ప్రధానకార్యదర్శి బూరుగుపల్లి .రాము, పసునూరి .మల్లికార్జున్, బూరుగుపల్లి కిరణ్ ,ధర్ముల శంకర్ ,కాసుల.కిరణ్, కుమార్, ఓజ్జ్ శ్రీనివాస్, ముప్పు రాయబోసు, పూసల శ్రీనివాస్ , పసునుటీ ఐలయ్య, ఎల్కాపేలి శ్రీనివాస్.,చిన్నింటి నాగేందర్, పైతరి రామచందర్ ,సంపత్ శ్రీకాంత్, నాగరాజు, రాకేష్ రాజేష్ చందు.సదానందం మహేందర్ ,రమేష్. సంపత్ తదితరులు ఉన్నారు.

తక్షణమే రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో వెయ్యాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చెయ్యాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) మండల అధ్యక్షులు బచ్చల సారన్న డిమాండ్ చేశారు. గురువారం గుండాల మండల కేంద్రంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్) మండల కమిటీ సమావేశంలో తను మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిందని ఈ వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం అయిందని ఆరోపించారు. వర్షకాలం ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నప్పటికీ రైతు భరోసా రైతుల ఖాతాలో వేయకపోవడంతో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేక ప్రైవేట్ వ్యాపారస్తులని ఆశ్రయించాల్సి వచ్చిందని రైతు భరోసా పథకం ద్వారా వెంటనే ఎకరాకు 7500 రూపాయలు రైతు ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పథకం నత్త నడకన నడుస్తుందని తక్షణం రెండు లక్షల రూపాయలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు మొక్కజొన్న, వరి పంటకు 50 వేల రూపాయలు, మిర్చి పత్తి పంటలకు లక్ష రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ నాయకులు జిల్లా నాయకులు కొమరం సీతారాములు, గడ్డం లాలయ్య, మరియు మండల నాయకులు ఈసం మంగన్న, పాయం ఎల్లన్న, కల్తీ మల్లన్న, వాగబోయిన సుందర్రావు, పర్షిక పొట్టయ్య, గోగ్గల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన తప్పుడు ఉత్తర్వులను రద్దు చేయాలి

మాపై దాడి చేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలి

రైతులు చీర్ల లక్ష్మి పోచిరెడ్డి లచ్చిరెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామం రైతులు చీర్ల లక్ష్మి పోచిరెడ్డి తండ్రి పేరు లచ్చిరెడ్డి బొమ్మ పూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 98 భూమి విస్తీర్ణం 2.4 గుంటలు భూమిలో దాదాపు 1998 సంవత్సరం నుండి కాస్త చేసుకుంటున్నాము బొమ్మపూర్ వాస్తవులు కంకణాల అరుణ భర్త రవీందర్ రెడ్డి పేరుపై భూమి సర్వేనెంబర్ నమోదయింది రికార్డులో ఉన్న సర్వే నెంబర్లు వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ కోరుతున్నాం బొమ్మపూర్ గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ చేయడం జరిగింది గ్రామస్తులు ఈ భూమి లచ్చిరెడ్డి లక్ష్మి వాళ్లకే చెందుతుందని గ్రామస్తులు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ భూమి కేసు హైకోర్టులో పిటిషన్ వేసినాము కానీ కంకణాల అరుణ రవీందర్ రెడ్డి ఈ భూమి మా పేరుపై పహాని నఖలిలో ఉంది అని జిల్లా అడిషనల్ కలెక్టర్ చెప్పడం జరిగింది దానితో జిల్లా అడిషనల్ కలెక్టర్ నిజ నిర్ధారణ తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఉత్తర్వులను మహాదేవపూర్ స్థానిక ఎస్సైకి ఇవ్వడం జరిగింది. దానితో మా భూమిని పైకి ఎస్సై వచ్చి 70 వేల రూపాయల ఆస్తి నష్టం చేసినారు కావున వెంటనే జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి మాపై దాడి చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని పోచిరెడ్డి లచ్చిరెడ్డి లక్ష్మి రైతులు కోరుతున్నాం

నిబంధనలకు విరుద్ధంగా రేగుబల్లి ఇసుక ర్యాంపు నిర్వహణ.

భద్రాచలం నేటి ధాత్రి

అవినీతి మయంగా రేగుబల్లి ఇసుక ర్యాంపు.

ఆధారాలు ఇచ్చిన అధికారుల చర్యలు శూన్యం.ఓ ప్రముఖ వ్యక్తి మధ్యర్తిత్వంలో ర్యాంపు నిర్వహణ.
అంతా డొల్లే.. అయినా పట్టించుకోని అధికారులు.
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు చర్యలు తీసుకోవాలి

భద్రాచలం నియోజకవర్గం లోని దుమ్మగూడెం మండలం రేగు బల్లి గ్రామంలో ప్రభుత్వం నందలుచలక గ్రామపంచాయతీ లోని కొంతమంది గిరిజన వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న ఇసుక సొసైటీకి ర్యాంపు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ర్యాంపు వరదలకు ముందు నుండి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఇసుక వ్యాపారులు భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వ్యక్తి కలిసి గిరిజనుల వద్ద నుండి ర్యాంపు తీసుకొని నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్ నెలలోనే నియమ నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదిలోకి ప్రోక్లైన్ల ద్వారా ఇసుకను తవ్వి లారీలలో ఒడ్డు పైకి చేర్చి డంపు చేస్తున్నారని అప్పటి తాసిల్దార్ దుమ్ముగూడెం వారికి పూర్తి ఆధారాలతో తెలియజేసిన పట్టించుకున్న పాపాన పోలేదు. లారీల ద్వారా తమ ఇష్టం వచ్చినట్లు ఒడ్డు పైకి చట్ట విరుద్ధంగా వందలాది ట్రిప్పులను తోలి అక్రమ మార్గంలో స్టాక్ ఏర్పరచుకుంటే దానికి ఇప్పుడు ప్రభుత్వం అమ్ముకోవడానికి అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. గిరిజనులకు జీవనోపాధి కొరకై ఇచ్చిన ఇసుకరాంప్ ను గిరిజనేతర వ్యక్తులు అక్రమ మార్గంలో నడుపుతూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నా టిఎస్ఎండిసి, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం చూస్తుంటే అందరికీ ఆమ్యామ్యాలు అందాయనే ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలే కొన్ని రోజులుగా ఇసుక రాంపులలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనే కథనాలు దర్శనమిస్తున్న అధికారులు ర్యాంపుల నిర్వహణపై తగు శ్రద్ధ చూపడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే ఈ ఇసుక ర్యాంపు పై సమగ్ర విచారణ చేసి బినామీలపై కఠిన చర్యలు తీసుకొని గిరిజన ప్రజలకు న్యాయం చేకూర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండల కేంద్రంలో తెలంగాణ తొలి భూపోరా టానికి నాంది పలికిన వీర వనిత చాకలి(చిట్యాల) ఐలమ్మ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గురువా రం ఐలమ్మ జయంతి సంద ర్భంగా మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అందరికీ ఆదర్శమని అన్నారు. గడీల వ్యవస్థపై గలమెత్తి పోరాడిన ఐలమ్మ బహుజన అత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు.నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకొని. అవినీతి అన్యాయంపై పోరాడాల న్నారుఈ కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు చిందం రవి, నిమ్మల రమేష్, మారపెల్లి వరదరాజు, రాజేందర్, మార్కండేయ,బాసాని రవి, చిరంజీవి,రాజయ్య,భిక్షపతి, వెంకటరమణ,వీరన్న, తిరుపతి శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల ఫోరం (టఫ్) మండలశాఖ అధ్యక్షునిగా తంగేళ్ల భాస్కర్

నల్లబెల్లి, నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం నల్లబెల్లి మండల శాఖ అధ్యక్షునిగా మలిదశ ఉద్యమకారుడు తంగెళ్ల భాస్కర్ , ప్రధాన కార్యదర్శిగా కొయ్యడ కుమారస్వామి, కోశాధికారిగా ఓదెల రవి, అధికార ప్రతినిధిగా పల్లికొండ రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టఫ్ జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్, రాష్ట్ర నాయకులు ఆకుల సాంబరావు పేర్కొన్నారు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తంగేళ్ల భాస్కర్ మాట్లాడుతు ఉద్యమకారుల హక్కులు నెరవేరేదాకా నిరంతరం కృషి చేస్తానని మండలంలోని తెలంగాణ ఉద్యమకారులను సంఘటితం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన విధంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పెన్షన్ సౌకర్యం లాంటి పథకాలను వర్తింపజేసేదాకా పోరాటాన్ని ఉదృతం చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు అన్నగారిన వర్గాల అధ్యక్షుడు పరికి కోర్నేల్ మాదిగ, తెలంగాణ ఆకలి కేకల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల పవన్, గోనెల నరహరి, మామిండ్ల చిన్న ఐలయ్య, కొత్తగట్టు ప్రభాకర్, బొట్ల సారయ్య, పెద్ద బోయిన కొమురయ్య, నానభోయిన పోషాలు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version