రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్యే వివేక్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కౌన్సిలర్ పార్వతి విజయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసి ముందుకెళ్తానని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టి పి సి సి కార్యదర్శి రఘునాథరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.