గొల్లపల్లి నేటి ధాత్రి:
మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గొల్లపల్లి సెక్టర్, ఇబ్రహీం నగర్ సెక్టర్ పరిధిలోని సివియర్ ఆ క్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎస్ ఏ ఎం) మాడే ట్రీ ఆక్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎం ఏ ఎం) తక్కువ బరువు గల పిల్లలకి వైద్యాధికారి నరేష్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిడిపిఓ వీరలక్ష్మి మాట్లాడుతూ ఎస్ ఏ ఎం, ఎం ఏ ఎం పిల్లలు తరచుగా అనారోగ్యాలకు గురి అవుతారు, కాబట్టి వాళ్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి అంగన్వాడి కేంద్రంలో పిల్లల బరువులు ఎత్తులు చూయించి అంగన్వాడి పాఠశాల పిల్లలు వారి యొక్క పెరుగుదల ఆరోగ్యం కొరకు అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పౌష్టికాహారం గుడ్లు, పాలు, బాలామృతం , బాలామృతం ప్లేస్ పిల్లలకు నిత్యం అందించాలని పౌష్టికాహారం తీసుకున్నప్పుడే పిల్లలు యొక్క పెరుగుదల, బలంగా, పిల్లలు ఉంటారని పౌష్టికాహారం పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ఆరోగ్యంగా బాగుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, వైద్యాధికారి నరేష్, సూపర్వైజర్లు జానకి, జ్యోతి, అంగన్వాడి టీచర్లు హెల్త్ సిబ్బంది పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.