హనుమకొండ లోని ఉమ్మడి జిల్లా కోర్టులో శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ జరిగినది. ఇట్టి సందర్భంగా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320f రీజన్-1, వినూతన క్లబ్ హనుమకొండ గారి ఆధ్వర్యంలో కక్షిదారులకు 350 ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మల గీతాంబా గారు, హనుమకొండ జిల్లా ప్రధాన కోర్టు ఇన్చార్జ్ అండ్ మొదటి అడిషనల్ జిల్లా న్యాయమూర్తి బి.అపర్ణాదేవి గారు మరియు డి.ఎల్.ఎస్.ఎ న్యాయమూర్తి ఉపేందర్ గారు మరియు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ క్షామ దేశ్ పాండే గారు పాల్గొన్నారు. వీరితోపాటు ఇరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు వినూతన క్లబ్ ప్రెసిడెంట్ జయ శ్రీ, సెక్రటరీ డేవిడ్ రాజ్ కుమార్, ట్రెజరర్ డయాన్ శ్రీనివాసన్, జానకి ఇందిరా, సంతోష్, డిస్ట్రిక్ట్ లైన్ కే. వెంకట్ రెడ్డి, రమాదేవి మరియు న్యాయవాదులు నర్సింగరావు, సిరిమల్ల అరుణ, కొత్త రవి, నిర్మల జ్యోతి, ప్రవీణ్ సదానందం ఆహారపు పోట్లాలు మరియు మంచినీళ్ల ప్యాకెట్స్ ను పంచిన వారిలో ఉన్నారు.
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యూ) ఏర్పడి అక్టోబర్ 12,13 తేదీలతో 50 వసంతాలు (సంవత్సరాలు) పూర్తి చేసుకోబోతున్నాఈ సందర్భంగా గోడపత్రికలను గుండాల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల నందు పిడిఎస్ యూ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జె గణేష్ మాట్లాడుతూ భారత జాతీయ ఉద్యమ నాయకుల మరియు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు చేగువేరా ల స్ఫూర్తితో 1974లో ఏర్పడిన విద్యార్థి సంఘం పిడిఎస్ యూ గత 50 సంవత్సరాలు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలుకొని నేటి రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల చేతుల్లో తిరుగుబాటు శక్తిగా నిలిచింది. సమాజంలో ఎంతో మంది ప్రగతిశీల వాదులను తయారు చేసింది విద్యా కాషాయీకరణ, ప్రైవేటు, కార్పోరేటికరణలను వ్యతిరేకిస్తూ నాణ్యమైన విద్య, అందరికీ సమానమైన విద్య కై పోరాటాలను కొనసాగిస్తుంది. ఈ తరుణంలో 50 వసంతంలు పుర్తి చేసుకుంటున్నా సందర్భంగా జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో సదస్సులు సమావేశాలను నిర్వహించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు రామకృష్ణ. అఖిల. దీపిక. వివేక్. శ్యామల తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఇతర సంఘాలు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే లాభాల వాటా సాధ్యమైందనే విషయాన్ని యువ కార్మికులకు వివరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓ సి 3 గనిలో ఏఐటీయూసీ పిట్ సెక్రటరీఎల్. శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ సంవత్సరం వచ్చిన లాభాల మీద అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ అసలు విషయాలను కార్మికులకు వివరించాలని కోరారు. చెప్పడం కొంతమంది ఇతర సంఘ నాయకులు పని కట్టుకొని ఏఐటియుసిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం జరుగుతుందని, దాన్ని యువ కార్మికులకు తెలిసే విధంగా వివరించాలని అన్నారు.కొన్ని సంఘాలు కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే ఏఐటియుసి పై బురద చల్లే కార్యక్రమం చేస్తుందన్నారు. అలాంటి సంఘాలు సింగరేణిలో నామరూపాలు లేకుండా చేయాలని కార్మిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు పొందుతు న్నటువంటి లాభాలు కేవలం ఏఐటియూసి ఘనత మాత్రమే మరొక సంఘానికి లాభాల పై మాట్లాడే అర్హత లేదు అని ఉద్ఘాటించారు. కొత్తగా వచ్చిన యువతరం కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. కార్మికుల హక్కులను సాధించే, కాపాడే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ మాత్రమే, కార్మిక లోకం కోసం తమ యొక్క ప్రాణ త్యాగాలకైనా వెనకడుగు వేయని సంఘం ఏఐటీయూసీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మధుగాని విజేందర్,వైస్ ప్రెసిడెంట్ మాతంగి రాంచందర్ , బ్రాంచ్ కమిటీ సభ్యులు నూకల చంద్రమౌళి వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ అజయ్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు,సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్స్ కమిటీ సభ్యులు,టెంపుల్,క్యాంటీన్ కమిటీ సభ్యులు, షిఫ్ట్ ఇంఛార్జిలు, అసిస్టంట్ షిఫ్ట్ ఇంఛార్జిలు, కార్యకర్తలు,కార్మిక పాల్గొన్నారు.
విద్యుదాఘాతంలో కాడెద్దులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మూలమర్రితండ గ్రామ పంచాయతీ శివారు వ్యవసాయ క్షేత్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధిత కౌలు రైతు భూక్య బిచ్చ కథనం ప్రకారం…మూలమర్రితండాకు చెందిన కౌలు రైతు భూక్య బిచ్చ వ్యవసాయ పనుల నిమిత్తం తన కాడెద్దులను తొలుకుని వెలుతున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రాల డొంకదారికి ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ తీగకు ఎద్దులు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్కు గురైన కాడెద్దులు అక్కడి అక్కడే మృతి చెందాయి. మృతి చెందిన కాడెద్దుల విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని, వ్యవసాయం చేసే అదును సమయంలో ఎద్దులను కోల్పోవడం తమకు చేయి విరిగినంతా పనయిందని కౌలు రైతు దంపతులు బిచ్చ, లింగమ్మ బోరున విలపించారు. తమను ప్రభుత్వం ఆధుకోవాలని బాధిత కౌలు రైతు దంపతులు వేడుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా లోని విద్యారంగా సమస్య పరిష్కరించాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ డిఈఓ ను కలవడం జరిగింది, చిట్యాల మండలం వెంకటరావుపల్లి లో ఉన్న ప్రైమరి స్కూల్ సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు కానీ అక్కడ ఉపాధ్యాలు కొరత వాళ్ళ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ పాఠశాల్లో ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని డిఈఓ ని కోరడం జరిగింది అదేవిదంగా ప్రవైట్ విద్యసంస్థ అధిక ఫీజ్ లు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవలని అదే విదంగా అన్ని పాఠశాలలు సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబిఎస్ఎఫ్ పక్షాన కోరడం జరిగింది.
షాహిద్ భగత్ సింగ్ 117 వ జయంతి వేడుకలను చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని భంగా గ్రామంలో భగత్ సింగ్ గారు జన్మించారు యుక్త వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు 1926 సంవత్సరంలో నౌ జవాన్ భారత్ సభను స్థాపించి ఇంకివిలాబ్ జిందాబాద్ అనే నినాదంతో యువకులలో విప్లవ భావాలను రేకెత్తించాడు. జెపి స్కండర్ అనే ఆంగ్లేయ పోలీస్ ఆఫీసరును కాల్చి చంపాడు అందుకు జైలుకు వెళ్లాడు ఈ విధంగా తన జీవితాన్ని స్వాతంత్రం కోసం అర్పించాడు ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరు భగత్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ సేవకు సమాజ సేవకు అంకితమై తల్లిదండ్రులకు సమాజానికి పాఠశాలకు పేరుతోలని కోరారు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* తెలిపారు. శనివారం చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో జిల్లా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అండ్ అలిమ్ కో కంపెనీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల రిజిస్ట్రేషన్* కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని దివ్యాంగుల రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన నిబంధనల ప్రకారం కొంత మేర మాత్రమే దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ళు, స్కూటీలు ఇవ్వడం జరిగిందని ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాటరీ సైకిళ్ళు, స్కూటీలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. రాబోయే 1.40 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లలో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఉంటుందని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీకృష్ణ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు,
శ్రీ శరణ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
చిట్యాల మండలంలోని జూకల్ గ్రామంలో హన్మకొండ కు చెందిన శ్రీ శరణ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యే కు పూల బొకే లు ఇచ్చి, శాలువాలు కప్పి సన్మానం చేశారు.
– పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద… పనులు చేపట్టేది ఎప్పుడు…?
– తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…
– ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా…?
కొల్చారం, ( మెదక్ ) నేటి ధాత్రి :-
అసలే వానకాలం.. ప్రమాదం.. తెలిసిన పట్టించుకోని అధికారులు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద గుంతల గుంతల మాయంగా మారిన రోడ్డు.. చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితేనే గుంతలో నీరు నిండి వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిసిన కూడా ఉన్నత అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం అని పలురు వాపోతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెదక్ – సంగారెడ్డి ప్రధాన జాతీయ రహదారి గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డును ఉన్నత అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వాహనదారులు సిగ్గు పడుతున్నారు. గుంతలు గుంతలుగా పడి ఎన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం ఎంతవరకు సమంజసం. ఏదైనా ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ వద్ద శనివారం రోజున మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారందరికీ ధ్రువపత్రాలను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో, ఎంపీఓ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి శాలువా కప్పి సత్కరించారు. అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని ప్రభుత్వం ద్వారా ఆర్థిక ఆర్జీలు పెట్టుకోగా వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఎంపీఓ శ్రీపతి బాపూరావు, తహసిల్దార్ వనజా రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నడికూడ,నేటిధాత్రి: ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ చుక్క రత్నాకర్ ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పార్టీ జెండా దిమ్మేలు,శిలాఫలకాల పరిరక్షణ కమిటీ స్టేట్ ఇన్చార్జిగా నియమించారు. నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన చుక్క రత్నాకర్ మహారాజ్ డి.ఎస్.పి ఉద్యమ ప్రస్థానం గత 15 సంవత్సరాల నుండి విశారదన్ మహరాజ్ నాయకత్వంలో ఉద్యమ, మరియు పార్టీ ఆదేశాల ప్రకారం నియమ నిబంధనలకు లోబడి క్రమశిక్షణతో జిల్లాలో పనిచేసి పార్టీని విస్తరించిన పనిని గుర్తించి ఈరోజు గౌరవప్రదమైన బాధ్యతకి నియమించిన గౌరవనీయులు డా,,విశారదన్ మహారాజ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ,రత్నాకర్ మహారాజ్ కి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన ధర్మ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ కోడేపాక ప్రతాప్.ఈ కార్యక్రమంలో బుస్స తిరుపతి,మేకల ప్రవీణ్, దినేష్,క్రాంతి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన చిగురుమామిడి రాజయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఫోటోకు పూల దండేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు రాజయ్య గారి చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జీఎస్సార్ పూలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా ఉంటానని అధైర్య పడొద్దని అన్నారు ఎమ్మెల్యే వెంట గ్రామ కమిటీ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు
ఐసిడిఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలోని నర్సంపేట – 4 అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్ల భారతి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల పోషణ మాసం సందర్భంగా పోషణ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు సిడిపివో మధురిమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 వ వార్డు కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ అంగన్వాడీ కేంద్రంలో అన్ని కార్యక్రమాలు ఆదర్శవంతంగా చేపడుతున్నారని అన్నారు.కలెక్టర్ మంజూరు చేసిన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవ రెడ్డితో మాట్లాడి వెంటనే నిర్మాణ పనులు చేపట్టేటట్లు చొరవ చూపిస్తానని హామీ ఇచ్చారు.సిడిపివో మధురిమ,ఏసిడిపివో హేమలతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, పోషణ లోపం నుంచి విముక్తులను చేయడం, రక్తహీనతను తగ్గించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా ఐసిడిఎస్ ముందుకు సాగుతుందని ఐసిడిఎస్ లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భిణీ, బాలింత స్త్రీలు విధిగా వచ్చి అంగన్వాడి కేంద్రంలో ఒక పూట భోజనం చేసి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని సూచించారు. అంగన్వాడీ టీచర్స్ చెప్పే ప్రతి విషయాలను పాటించాలని తెలిపారు. సీనియర్ సిటిజెన్సు ఐసిడిఎస్ లో భాగమని వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు.సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా 37 మంది సీనియర్ సిటిజన్స్ కు శాలువాలు కప్పి సన్మానించారు. సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా టీహెచ్ఆర్ పిల్లల తల్లి బొల్లు శ్రావణి బాలామృతంతో తయారుచేసిన కేక్ ను సీనియర్ సిటిజన్ తో కట్ చేయించారు. ఇఎంఏ మహిళా అధ్యక్షురాలు,గైనకాలజిస్ట్ డాక్టర్ భారతి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సన్మానించబడిన 37 మంది సీనియర్ మహిళలకు క్యాంపు చేపట్టి పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు మూడు నెలల పాటు ఉచితంగా అందిస్తామని,దశలవారీగా సీనియర్ మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు చేస్తానని హామీ ఇచ్చారు.
36 మంది మహిళలు వివిధ పోషకాలతో కూడిన వంటకాలు తయారు చేసి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. వంటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు,అలాగే ప్రీ స్కూల్ పిల్లలకు గేమ్స్ నిర్వహించి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమ, ఝాన్సీరాణి,హెల్త్ ఎడ్యుకేటర్ మార్త, మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ పావని, జెండర్ స్పెషలిస్ట్ హర్షిత, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత, మాజీ కౌన్సిలర్ వాసం కరుణ, సీనియర్ సిటిజన్ మండల కాంతమ్మ, ఇమ్మడి మంజుల, మాజీ వార్డ్ మెంబర్ తక్కల్లపల్లి ఉమ,ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు అడ్డగట్ల భాగ్య, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ లావన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్, అంగన్వాడీ టీచర్స్ గొర్రె రాధ,బత్తిని శిరీష,ఎండీ గౌసియా, వాణి, ఆయా సునీత,ఏఎల్ఏంఎస్సి సభ్యులు గడ్డం భవాని, చార్ల మౌనిక, పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ క్యాతం తేజశ్రీ,ఆర్పి రజిత,ఆశా కార్యకర్తలు రాజమణి, రమ,తల్లులు, పిల్లలు,సీనియర్ సిటిజన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏదైనా కూడలిలో ఏర్పాటు చేయాలనీ బీజేపీ నాయకుల డిమాండ్
పరకాల నేటిధాత్రి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరకాల కూడలిలో ఏర్పాటు చేయాలని పరకాల బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా మార్త బిక్షపతి మాట్లాడుతూ దేశం కోసం కృషి చేసి ప్రపంచమే గుర్తించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత పాలకుల అలసత్వంతో పరకాలలో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు ముందుకు రావడం స్వాతిస్తున్నామని కానీ ఆ విగ్రహాన్ని ఏదో మూలన ఏర్పాటు చేయకుండా కూడలిలో ఏర్పాటు చేసి ఆ కూడలికి గాంధీ చౌక్ గా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్,తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, భూపాలపల్లి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు సయ్యద్ గాలిప్, పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్,ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య,సీనియర్ నాయకులు పావుశెట్టి శ్రీనివాస్,మహిళా మోర్చా అధ్యక్షురాలు వెలిశెట్టి శారద తదితరులు పాల్గొన్నారు.
భారత విద్యార్థి ఫెడరేషన్ జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులోనే ఈ దేశం కోసం ఊరుకోయ్యోలను సరసాలను ముద్దాడిన భగత్ సింగ్ నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని వారన్నారు. ఈ దేశంలో ఒక దిక్కు మతోన్మాద విధానాలు మరో దిక్కు సావర్కర్ లాంటి దేశద్రోహుల చరిత్ర ను పాఠ్యాంశాలలో లిఖిస్తున్న కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టే అటువంటి కుట్రను, వ్యతిరేకించాలంటే నిజమైన దేశభక్తుడు అయినటువంటి భగత్ సింగ్ లాంటి పోరాట జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది అన్నారు . అదేవిధంగా పుస్తకాల నుండి దేశ చరిత్ర నీ తొలగిస్తూ ఈ దేశాన్ని అజ్ఞానంలో నెట్టే ప్రయత్నంలో ఈ కేంద్రంలో కూడా బీజే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు . ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద విద్యార్థులకు విద్య అందరిని, ద్రాక్షల తయారవుతుందన్నారు. ఈ దేశంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యావ్యత్రిక విధానాలకు వ్యతిరేకంగా పోరావలసిన అవసరం ఉందని వారు అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించి సెప్టెంబర్ 27న నిర్వహించిన హలో విద్యార్థి చలో హైదరాబాద్ విద్యార్థి మహాగర్జన ధర్నా కార్యక్రమం సందర్భంగా ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వంపై అక్రమ అరెస్టను తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నరేష్ కోటేష్ స్వామి చరణ్ వంశీ అర్జున్ శివ కేశవులు తదితరులు పాల్గొన్నారు
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు గురుకుల విద్యా JAC పిలుపు మేరకు శనివారం TTREITA ఆధ్వర్యం లో చాక్ డౌన్, పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులు విధులకు హాజరై తరగతిగది బోధన, కార్యాలయ పనులను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. * అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు శాశ్వత భవనాలను సమకూర్చాలి * అన్ని గురుకులాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి * 0 1 0 పద్ధు ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలి * గురుకులలో నిధుల లోటు తీర్చడానికై ఆర్థిక శాఖ ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి * పెండింగ్ బిల్లులను సత్వరం విడుదల చేయాలి * అశాస్త్రీయమైన కొత్త టైం టేబుల్ ఉపసంహరించుకుని 9 నుండి 4:30 వరకు గల పాత టైం టేబుల్ ను పునరుద్ధరించాలి * నైట్ స్టే, హాలిడే డ్యూటీలు చేసిన టీచర్లకు సిసిఎల్ లేదా వీక్ ఆఫ్ ప్రకటించాలి * ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు చేర్చి కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి * ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పాఠశాల ప్రిన్సిపల్ ద్వారా గురుకులం సెక్రటరీకి మెమొరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, వైస్ ప్రిన్సిపల్ నరసింహ, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ భవాని తో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం గణపురం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రఅంబేద్కర్ యువజన సంఘం పిలుపుమేరకు తేదీ 29,- 9 2024 రోజున జరగబోయే 48వ వార్షికోత్సవ సభ విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 1955 సంవత్సరంలో ఏర్పాటుచేసిన షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1977 సెప్టెంబర్ 21న 2014లో తెలంగాణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని కావున 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి కొత్త పాత సంఘాల అనుబంధ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులు గౌతమ బుద్ధ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నారాయణ గురు సాహు మహారాజ్ బీర్సా ముండా భాగ్యరాజు వర్మ ఫాతిమా గార్ల చరిత్రను యువజన బహుజనులకు చెప్పి వారిని చైతన్యం చేయాలని అవసరం కార్యకర్తలపై ఉన్నదని బహుజన రాజ్య స్థాపనకు ముందడుగు వేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం మండల అధ్యక్షుల సన్నాయిల వెంకటేష్ ములుగు జిల్లా ఎరుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ పాలకొండ భాస్కర్ చిలువేరు ఉదయాకర్ దూడపాక పున్నం మూల రఘు రెంటాల సదానందం కృష్ణ అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఎస్టియూ జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆశాస్త్రీయమైన రేషలైజేషన్ నిబంధనలు మార్చాలని ఎస్టియు టిఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి డిమాండ్ చేశారు, శనివారం రాష్ట్ర జాక్టో పిలుపు తొర్రూరు మండలంలోని హరిపిరాల హైస్కూల్లో జీవో ఎంఎస్ నెంబర్ 25కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించడం సరైనది కాదన్నారు, ఆశాస్త్రీయమైన రేషలైజేషన్ నిలిపివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బి, వెంకటేశ్వరరావు, అనురాధ, ఉపాధ్యాయులు రవి, మధుకర్, రాజేశ్వర్, కుమార్, సంపత్, చంద్ర ప్రకాష్ , మహేందర్ ఆంజనేయులు, పిడి రాజు, నిమ్మల రవి, జి శ్రీనివాస్ , దర్గయ్య, తదితరులు పాల్గొన్నారు
స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ జయంతి,వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిమొగిలిచర్ల సందీప్,పిడీఎస్యు డివిజన్ అధ్యక్షులు కొమ్ము కరవి డిమాండ్ చేశారు. నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ 117 వ జయంతిని పురస్కరించుకొని కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ చింతకుంట్ల వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.అనంతరం మొగిలిచర్ల సందీప్,కొమ్ముక రవి మాట్లాడుతూ భగత్ సింగ్ అతి చిన్న వయసులో దేశ స్వాతంత్రం కోసం ఊరికాంబాన్ని ముద్దాడిన గొప్ప మహనీయుడని అలాంటి మహనీయుని యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో అందరికీ విద్యా ఉపాధి కలగాలని లక్ష్యంతో పోరాడుతామని తెలిపారు.భగత్ సింగ్ యొక్క అడుగుజాడల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ జయంతి కార్యక్రమంలో కాలేజీ యుఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు సాత్విక్ ,రాజు,వెంకటేష్,మహేష్,రాణి, సమత,మమత,సరిత,రాజేందర్, మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
పరకాల నేటిధాత్రి సెయింట్ గాబ్రియేల్ స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయిక్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)విద్యార్థినిలు 9,10 తరగతులకు చెందిన ఏకు.తేజశ్విని,బి.అనూష ఫుట్బాల్ జట్టుకు ఎంపికయ్యారు.జిల్లా స్థాయి పోటీలకు ఎన్నికైన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది శాలువాలతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిలువేరు సురేందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరం అని క్రీడలు శారీరక ఉల్లాసంతో పాటు మానసిక దృఢత్వాన్ని కలిగిస్తాయని తెలిపారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను వారు అభినందించారు అలాగే క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు. అందరూ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని,తదుపరి సంవత్సరం విద్యార్థులందరూ క్రీడల్లో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఉన్నత పాఠశాల(బాలుర) ప్రధానోపధ్యాయులు చిలువేరు సురేందర్ ఉన్నత పాఠశాల బాలుర ఉపాధ్యాయులు ఎండి షేక్ దావుద్,దొమ్మటి భద్రయ్య,పి.సుచరిత,ఓ.భాగ్యమ్మ,కే అరుణ,స్వప్న,పి.శ్రీనాథ్, డి.నాగయ్య,ఎం.బిక్షపతి,జి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివంగత బాలకిష్టయ్య విగ్రహం దగ్గర రోడ్ చిన్నగా ఉన్నది ఈరోడ్ లో బారి వాహనాలు లారీలు ఇతర రాష్ట్రాల లారీలు రోడ్డుపై నిలబెట్టి సరుకులు దింపడంవల్ల బాటసారులకు ప్రజలకు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషాసెల్ నెంబర్ 83 281 58 949 ఆందోళన వ్యక్తం చేశారు . భారీ వాహనాలు కమాన్ చౌరస్తాలో రోడ్డుపై ఆపడం వల్ల కమాన్ చౌరస్తా దివంగత మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణయ్య విగ్రహం నుండి ఇందిరా పార్క్ వరకు రోడ్డు జామ్ అవుతుందని అదేవిధంగా మజీద్ రోడ్డు డాక్టర్ బాలకృష్ణయ్య షాపింగ్ కాంప్లెక్స్ వరకు రోడ్డు జామ్ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .గతంలో ట్రాన్స్పోర్ట్ లోడింగ్ లారీలు ఇతర వాహనాలు ఉదయం ఏడు గంటల వరకే అన్లోడింగ్ చేసేవారని ఆ తర్వాత వాహనాలు రోడ్డుపై నిలిపి సరుకులు దింపడం పోలీసులు నిషేధించారని ఆయన గుర్తు చేశారు . ప్రస్తుతం వనపర్తి లో ఆ పరిస్థితి లేదని వెంటనే పోలీస్ అధికారులు చర్యలు తీసుకొని రోడ్లపై ట్రాన్స్పోర్ట్ వాహనాలు భారీ వాహనాలు ఇతర రాష్ట్రాల వాహనాలు నిలపకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఖాదర్ పోలీసులకు ఒకప్రకటనలో విజ్ఞప్తి చేశారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.