ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి….
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనర్(సీపీ )ఎం శ్రీనివాస్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కమిషనర్ శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. రికార్డులను పరిశీలించారు.పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు,వారి సమస్యల గురించి రామకృష్ణాపూర్ ఎస్సై ని అడిగితెలుసుకున్నారు. కాలనీలు, గ్రామాల్లో జరిగే నేరాలపై ఆరా తీశారు. డయల్ 100 కాల్స్‌పై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్‌పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్‌లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళితే సత్వరమే న్యాయం జరుగుతుందనే భావన ప్రజలకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ లు ఉన్నారు.