డి ఐ ఈ ఓ కార్యాలయం ఎదుట ధర్నా
హనుమకొండ, నేటిధాత్రి :
అనంతరం ఎ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ… హన్మకొండ జిల్లా నగరం లోకల్ నారాయణ జూనియర్ కళాశాల విద్యాశాఖ నుండి 38290 కోడితో 31-3-58/8 హౌస్ నెంబర్ తో కోమటిపల్లి లో అనుమతి ఉంటే అదనంగా గోపాలపుర్ లో రెండు కో బ్రాంచులు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలు నారాయణ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) అనుమతి ఉంటే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ లోకల్ నారాయణ జూనియర్ గర్ల్స్, కళాశాల, నారాయణ జూనియర్ బాయ్స్ కళాశాల పేర్లతో కళాశాల నిర్వహిస్తూ ప్రభుత్వ నియమాలను పాటించని లోకల్ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కూడా పట్టించుకోకుండా చోద్యంగా చూస్తున్న విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ నియమాలు పాటించని లోకల్ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ప్రశాంత్ వినయ్ రాజు ప్రసాద్ రాకేష్ రోషన్ తదితరులు పాల్గొన్నారు.