జమ్మికుంట పట్టణంలో నివాసముంటున్న మేడిపల్లి శ్రీయాన్షి (4) గుండె పోటుతో మృతి చెందింది.భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడి పల్లి గ్రామానికి చెందిన రాజు జమున దంపతులకు ఇద్దరు పిల్లలు .జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కూతురు ఒక కొడుకు ఉన్నారు.మేడిపల్లి శ్రీయాన్షి మంగళవారం కండ్లు తిరుగుతున్నాయి అంటూ అస్వస్థతకు గురికాగా హనుమకొండ లోని ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. పుట్టిన సమయంలోనే చిన్నారికి గుండెలో హోల్ ఉందని దాన్ని గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు తెలిపారు. చిన్నతనంలోనే గుండెపోటు రావడం పట్ల పలువురు దిగ్బాంతిని వ్యక్తం చేశారు.
చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న చందుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది.మొదటి బహుమతి శ్రీనివాస్ స్ట్రైకర్స్ ,రెండో బహుమతి సాయి ఎలేవన్ గెలుచుకున్నాయి. ఇట్టి బహుమతులను, బహుమతుల దాత బద్దం తిరుమల రెడ్డి అందించారు.ముఖ్యఅతిథిగా గుర్రం తిరుమల్ సిఐ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బద్దం తిరుమలరెడ్డి పుల్కం మధు, యాకోబు. హమీద్ ,తిరుపతి అజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
చందుర్తి మండల రైతులకు విజ్ఞప్తి, చందుర్తి మండలం లో రోడ్లకు ఇరువైపుల వరి ధాన్యం పోయకూడదని చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ G. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇలా రోడ్డుకి ఇరువైపులా ఆరబోసిన వరి ధాన్యంతో యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పొందారు, కావున ఇలాంటి చర్యలు మళ్లీ పునరవృతం కాకుండా ఉండటానికి మండల రెవెన్యూ అధికారులు సూచించిన స్థలంలో వరి ధాన్యం ఆరబోయాలని సూచించారు. చందుర్తి నుండి గోవిందారం వెళ్లే మార్గంలో ఆరబోసిన వరి కుప్పలను ఎమ్మార్వో తో పాటు చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్లు సందర్శించి రైతులకు తగిన సూచనలు చేశారు. కావున ఇట్టి విజ్ఞప్తి ని అతిక్రమించి ఎవరైనా రోడ్లకు ఇరువైపుల వరి ధాన్యం పోసినచో చట్టారీత్యా చర్యలు తీసుకోబడును అని జి వెంకటేశ్వర్లు చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లోని భీష్మ నగర్ అంగన్వాడీ కేంద్రంలో బి సుజాత అంగన్వాడి టీచర్ ఏర్పాటు చేసిన గ్రోత్ మేళా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఐసిపిఎస్ కోఆర్డినేటర్ తిరుపతి హాజరైనారు ఈ కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్ హాజరైపిల్లల బరువు ఎత్తులు తీయించుకోవడం గర్భవతులు బాలింతలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చి భోజనం చేయాలని సూచించారు హెల్త్ సూపర్వైజర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు ఇప్పించాల్సిన టీ కాలు సక్రమంగా ఇప్పించాలని డెలివరీ అయ్యే గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలని వివరించారు తిరుపతి మాట్లాడుతూ లేబర్ కార్డు ప్రతి ఒక్క మహిళ మీ సేవకు వెళ్లి తీయించుకున్నచో ఆ కుటుంబంలో పిల్లలకు పెళ్లి చేసిన డెలివరీ రెండు కాన్పులకు 30 వేల చొప్పున వస్తాయని అలాగే చదువు మానేసిన బాల కార్మికులు ఉన్నట్లయితే హాస్టల్ లో చేర్పించి విద్యను కొనసాగించేలా చూస్తామని 18 సంవత్సరాలు నిండే వరకు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయరాదని తెలియజేసి అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సుజాత అంగన్వాడి టీచర్ ముగ్గురు గర్భవతులకు శ్రీమంతాలునలుగురు పిల్లలకు అక్షరాభ్యాసం అందరి చేతుల మీదుగా చేయించి 38 మంది పిల్లల బరువు ఎత్తులు తీయడం జరిగింది, ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ కళ్యాణి భవాని గారు అధిక సంఖ్యలో మహిళలు పిల్లలు హాజరైనారు
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన బయోమాస్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించేల ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కంపెనీ ఆవరణలో కార్మికులు నిరసన చేయడం జరిగింది, అదేవిధంగా కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ గత 20 నెలలుగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ( పి.పి.ఏ) ముగిసిందని కంపెనీని మూసి వేయడం జరిగింది ఈ యొక్క పవర్ ప్లాంట్ ను తెరిపించాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ కి మరియు స్థానిక శాసనసభ్యులు కు పలు మార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ మరియు ఐడి హబ్ ఏర్పాటు కోసం హాజీపూర్ మండలంలో సుమారుగా 300 ఎకరాల భూములను కూడా సేకరించామని పరిశ్రమలు స్థాపించే వాళ్ళు ముందుకు రావాలని ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహకరిస్తామని స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా ప్రకటించడం అడిగింది కేవలం శాలివాహన పవర్ ప్లాంట్ నకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఇప్పించినచో ప్రభుత్వం నుండి ఎలాంటి పెట్టుబడును ఆశించకుండా కంపెనీలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం జరుగుతుంది, దీనివల్ల సుమారుగా 300 మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము వెంటనే స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వం ద్వారా కంపెనీకి పవర్ పర్చేస్ అగ్రిమెంటు ఇప్పించే విధంగా కృషి చేసి 300 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాజీ అధ్యక్షులు చెట్టి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కాయితి శ్రీనివాస్ పెంట సత్యం ఊడెం రవిశంకర్ ఆసరి రాజయ్య ఎస్ తిరుపతి మానెం శ్రీశైలం బొలిశెట్టి తిరుపతి ఆసరి పోషం, మరియు కార్మికులు పాల్గొన్నారు
రామయంపేట మండలం రాయల పూర్ గ్రామానికి చెందిన వడ్ల పవన్ కుమార్ వ్యవసాయ శాఖ నందు మండల వ్యవసాయ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం పొందడం జరిగింది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 148 మంది మండల వ్యవసాయ అధికారులను నియమించింది అందులో భాగంగా రాయిలాపూర్ గ్రామానికి చెందిన వడ్ల పవన్ కుమార్ మండల వ్యవసాయ అధికారిగా మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస విడిచే వరకు ఎర్రజెండా పక్షాన పోరాడిన బోడిసె సత్తయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు సైనికులా పనిచేయాలి అనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో సత్తయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామంలో ప్రజా అవసరాల కోసం ప్రజల హక్కుల సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాలలో సత్తయ్య కీలక పాత్ర పోషించారు అని గుర్తు చేశారు . ఆయన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు . ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే వారని ఆయన వారినికొనియాడారు. ఈ కార్యక్రమంలో డోలు దెబ్బ వ్యవస్థాపకులు మాల్గా యాదయ్య , దొండ ఎంకన్న , బోడిసె నరసింహ , బోడిసె మహేందర్ , శివ , బండారి మల్లేశం , బండారి బీరప్ప , అండాలు , కుటుంబ సభ్యులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .
ఇటీవలే వెలువబడిన డీఎస్సీ ఫలితాల్లో ఎస్ జి టి ఉపాధ్యాయుని గా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన తమ్మలి రవీందర్ ఎన్నికైన సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఆవరణలో యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన యువకులు రవీందర్ ను సన్మానించారు.. ఈ సందర్భంగా రవీందర్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ హనుమకొండ చేరుకుందని జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హనుమకొండ వేయి స్తంభాల గుడి వద్ద నుండి సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిషోర్ ఝా తో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి వరంగల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ & కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్, వరంగల్ జిల్లా అథ్లెటిక్ సెక్రటరీ&రాష్ట్ర జనరల్ సెక్రటరీ సారంగపాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారి సంతోష్ మరియు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, వరంగల్ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన, నాసిరకం కోడిగుడ్ల?..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని అంగన్ అంగన్వాడి కేంద్రాలలో ఏదో ఒకచోట కుళ్ళిపోయిన నాసిరకం గుడ్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వాటిలో చిన్న పిల్లలు గర్భిణీలు బాలింతలకు కుళ్ళిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు.వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా, సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై పలు విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ ఇచ్చే మామూళ్లకు ఆశపడే జిల్లా అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. గుడ్లు, పాలతో పాటు పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇస్తోంది. గుడ్డు నుంచి పోషకాలు బాగా అందాలంటే దాని బరువు 44 గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు ఉండాలని సూచించింది. ఒక ట్రే లో ఉన్న గుడ్ల బరువు దాదాపు కిలోన్నర ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 30 గ్రాముల కన్నా తక్కువ బరువున్న, కుళ్లిన గుడ్లను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని గుడిమల్కాపూర్ అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు కోడి గుడ్డు ఇవ్వగా అవి పూర్తిగా కుళ్ళిపోయి ఉండడంతో ఆ గ్రామంలోని బాలింతలు కుళ్ళి నా గుడ్లను చూసి అవ్వక్కయ్యారు. జిల్లా లో నెల రోజుల క్రితం కూడా ఇలాగే కుళ్ళిన కోడి గుడ్డు కలకలం రేపింది.ఇప్పటికైనా అధికారులు గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
# ఎంసీపీఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్.
నర్సంపేట,నేటిధాత్రి :
మార్క్సిస్ట్ మేధావి, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు అమరజీవి మద్దికాయల ఓంకార్16వ వర్ధంతి పక్షోత్సవాలను జయప్రదం చేయాలని ఎం సి పి ఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో అమరజీవి, అసెంబ్లీ టైగర్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 16 వ వర్ధంతి పక్షోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓంకార్ రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమైనదని,అలాగే తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ వర్ధంతి పక్షోత్సవాలను అక్టోబర్ 17 నుండి 31 వరకు డివిజన్ వ్యాప్తంగా సభలు, సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఓంకార్ చరిత్రను నేటి తరానికి తెలియజేసి చైతన్య పరుస్తామని పేర్కొన్నారు.వర్ధంతి ప్రారంభ సభ గీసుగొండ మండలం మచ్చాపురం వద్దగల ఓంకార్ 125 అడుగుల స్మారక స్తూపం వద్ద ప్రారంభమవుతుందని, ముగింపు సభ ఈ నెల చివరలో నర్సంపేటలో ఉంటుందని తెలిపారు. మచ్చాపూర్ లో జరిగే ప్రారంభ వర్ధంతి సభకు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కుసుంబ.బాబురావు, వంగల రాగసుధ, కొత్తకొండ రాజమౌళి, కలకొట్ల యాదగిరి, కేశెట్టి సదానందం, గాజుల వెంకటయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 16.10.2024న భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చల్ల గుళ్ళ నాగేశ్వరరావు . కేఎస్ ఎల్వి ప్రసాద్ . డి కృష్ణమూర్తి ,సుబ్బయ్య చౌదరి, రాజబాబు ,శివప్రసాద్, ఐలయ్య, రాజు తదితరులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి పెన్షనర్స్ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు , MLA డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి మీకు తప్పనిసరిగా స్థలాన్ని కేటాయిస్తానని భవన నిర్మాణానికి కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, కొండిశెట్టి కృష్ణమూర్తి, వెంకటరెడ్డి, ఎండి నవాబ్, రత్నం రమాకాంత్. తిరుపతిరావు. రమేష్ గౌడ్ బొంబోతుల రాజీవ్, తదితర నాయకులు పాల్గొన్నారు, బందు వెంకటేశ్వరరావు అధ్యక్షులు. కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి. డి కృష్ణమూర్తి కోశాధికారి భద్రాచలం
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినివిద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు వసతులు కల్పించాలని అలాగే ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు లైట్లు ఫ్యాన్లు సౌకర్యం కల్పించాలని ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి వారి అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ఇతర వసతులు ఎలా ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తి గా ఉన్న తరగతిగది భవనాన్ని త్వరగా పనులు చేపట్టి పూర్తిచేయాలని దీనిపై సంబంధిత అధికారులకు ఆదేశించారు పాఠశాలలో కొత్తగా 6 గదులు నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని టాయిలెట్స్ కాంపౌండ్ వాల్ దగ్గర పరిశుభ్రంగా ఉంచాలని వెంటనే దానికి సంబంధించిన మరమ్మత్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇట్టి తనిఖీల్లో ఎంఈఓ రాజు ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ వెంకటేశ్వర స్వామి తదితరులు ఉన్నారు
దాదాపు 30 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేలు చేయని పని ఎన్నికై పది నెలల్లో ఎంఎల్ఏ సత్యం ప్రత్యేక శ్రద్ధతో నరసింహులపల్లె, ముప్పిడి నరసయ్యపల్లె గ్రామపంచాయతీలకు బీటీ రోడ్డు కొరకై సీఆర్ఆర్ నుండి 3.28 లక్షల నిధులు మంజూరు చేయించిన చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్ నాయకులు తోట మల్లారెడ్డి, పబ్బతి తిరుపత్తి రెడ్డి, గ్రామప్రజల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైస్ మిల్ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన ల్యాండ్ గంగాధర మండలం కొండయ్యపల్లి రెవెన్యూ పరిధిలోని ఆరు ఎకరాల భూమిని రైస్ మిల్లు కొరకు అలాట్మెంట్ చేయాలని బుధవారం రోజున కరీంనగర్ లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వినతి పత్రం అందజేసిన గంగాధర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాలగౌడ్. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, డైరెక్టర్లు బెజ్జంకి కళ్యాణ్, పెంచాల చందు, బైరి సంపత్ తదితరులు పాల్గొన్నారు
ప్రమాదవసత్తు రోడ్డు ప్రమాదం లో మరణించిన నాయిని స్వామి కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి జడ్చర్ల శాసన సభ్యులు డాక్టర్ చర్లకోలా లక్ష్మారెడ్డి పరామర్శించరు..
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మొదం పల్లి గ్రామానికి చెందిన బాలానగర్ మండల యూత్ వింగ్ నాయకులు,మొదం పల్లి మాజీ వార్డ్ సభ్యులు నాయిని స్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అట్టి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నాయిని స్వామి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని భరోసా అందిచారు.. వారి మృతికి సంతాపం తెలిపిన ఆయన తన వంతు సహాయంగా 1,00,000/- రూపాయలను, బిఆర్ఎస్ పార్టీ తరుపున 2,00,000/- ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మొదం పల్లి గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొని నాయిని స్వామి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు..
ఎంసిపిఐ(యు)పార్టీ వ్యవస్థాపకులు, ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
యంసిపిఐ(య)రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నర్సంపేట/హైదారాబాద్,నేటిధాత్రి :
భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య),యంసిపిఐ(య) వ్యవస్థాపకులు అసెంబ్లీ టైగర్ నర్సంపేట మాజీ శాసన సభ్యులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అమరులై ఈ నెల 17 నాటికి 16 సంవత్సరాలు పూర్తి కానున్నది.కామ్రేడ్ ఓంకార్ ఉమ్మడి నల్లగొండ ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. తన 14వ యేటనే గ్రామంలో భూస్వాములు పెత్తందారులు నాటి నైజాం పరిపాలనలో ఖాసీం రజ్వి సేనలు కొనసాగిస్తున్న దోపిడి, వెట్టిచాకిరి, బానిసత్వానికి, మహిళలపై సాగిస్తున్న దారుణ ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో చేరి గెరిల్లా శిక్షణ పొందారు.అనంతరం దళ సభ్యుడిగా, దళ నాయకుడిగా, ఏరియా దళ కమాండర్‌గా నైజాం రజాకారు, భూస్వామ్యశక్తుల ఆగడాలపై మడమతిప్పని పోరాటం కొనసాగించారు. ఆ పోరాటంలో భూస్వాముల భూములను పేద ప్రజలకు పంచడంలో ప్రముఖపాత్ర పోషించారు. కామ్రేడ్ ఓంకార్ ఉద్యమ పోరాటకాలంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి ప్రాంత పోరాటాలలో ఆదివాసీలతో మమేకమై నిర్వహించిన పోరాట పాత్ర గణనీయమైనది. పోరాట విరమణ తరువాత పార్టీ నిర్ణయం మేరకు వరంగల్ జిల్లాలో నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, 1964లో మార్క్సిస్టు పార్టి నిర్మాణంలో,1984 నుండి పార్టి వ్యవస్థాపకనేతగా అమరత్వం పొందేవరకు యంసిపిఐ(యు) పార్టీ నిర్మాణంలో ఓంకార్ ప్రధాన భూమిక పోషించారు. 1972లో నర్సంపేట శాసనసభ స్థానం నుండి 1994 వరకు వరుసగా ఐదు సార్లు గెలుపొందారు. 22 సంవత్సరాలు శాసనసభ్యునిగా బడుగు, బలహీన, పీడిత ప్రజల గొంతుక అయినందుకు ప్రజలే కామ్రేడ్ ఓంకార్ ను ‘‘అసెంబ్లీ టైగర్’’ అని సంబోధించారు.ఇది సహించలేని భూస్వామ్య గూండాలు, నాటి కాంగ్రేస్, పీపుల్స్ వార్ నక్సలైట్లు అనేక సార్లు హత్యాప్రయత్నం కావించారు. 1979 ఆగష్టు 14 వ తేదీన మానుకోటలో రాత్రి బహిరంగసభలో మాట్లాడి బోజనం చేయటానికి ఒక కామ్రేడ్ ఇంటికి వెలుతున్న ఓంకార్ ను భూస్వామ్య గుండాలు కత్తితో పొత్తికడుపులో పొడిచారు. ఓల్డ్ యం యల్ ఎ క్వార్టర్స్ లో తనపై బాంబులు విసిరారు. సాదిరెడ్డిపల్లిలో మాటు కాసిన విషయం బయటకు రావడంతో ఓంకార్ క్షేమంగా బయటపడ్డారు. 1984 డిసెంబర్ 19 వ తేదీన పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాత్రి బహిరంగ సభలో అన్నారం షరీఫ్ గ్రామంలో మాట్లాడుతున్న సమయంలో స్టెన్ గన్ తో కాల్పులు జరుపుతున్న సమయంలో అప్పుడే ఓంకార్ కు పూల మాల వేయడానికి వచ్చిన 10 సంవత్సరాల బాలునికి బుల్లెట్ తగిలింది. స్టెన్ గన్ కాల్పుల్లో తీవ్రంగా గాయాలు తగిలి వెన్నుపూసలో బుల్లెట్ దిగి ప్రాణాపాయం నుంచి ఓంకార్ బయటపడి రష్యా దేశానికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. అప్పటి బుల్లెట్ వెన్నుపూసలో ఉండి తీయలేని పరిస్థితి నుంచి వారు మరణించే వరకు బుల్లెట్ ఆ మహనీయుని శరీరంలోనే ఉండి పోయింది.1989 డిసెంబర్ 25 న దుగ్గొండి మండలం రేబల్లె గ్రామంలో రాత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్న ఓంకార్ పై ఏకె 47 ధరించిన గుండాలు ( పీపుల్స్ వార్) ఆకస్మికంగా జరిపిన కాల్పుల్లో తృటిలో ఓంకార్ తల తిప్పటంతో వెంట్రుక వాసి కుడి చెవి వెంబడి బుల్లెట్ దూసుకుపోగా తమ నాయకున్ని రక్షించుకోవాలని గుండాలను ప్రతిఘటన చేసిన కామ్రేడ్ కత్తి సాంబయ్య, సిరి బొమ్మల లక్ష్మినారాయణలు బుల్లెట్ దెబ్బలకు అక్కడికక్కడే మరణించారు. కామ్రేడ్ ఓంకార్ మృత్యుంజయుడిగా ప్రజల పక్షాన నిల్చారు. అంతటి మహత్తర పోరాట చరిత్ర కలిగిన కామ్రేడ్ ఓంకార్ 4వ తరగతి వరకు చదివిన తన జైలు జీవితంలో రహస్య జీవితంలో ఇంగ్లీషు, ఉర్దూ,హిందీ తదితర బాషలపై పట్టు సాధించారు. భారతదేశ వ్యవస్థను, కమ్యూనిస్టు ఉద్యమ స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసిన కామ్రేడ్ ఓంకార్ దేశంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, నూటికి 93 శాతం ఉన్న బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని, ఏ బూర్జువ పార్టీ, ప్రజలకు ప్రత్యామ్నాయం కాదు కమ్యూనిస్టు-సామాజిక శక్తుల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయ మార్గమని భావించారు. మార్క్సిజం ద్వారా వర్గ నిర్మూలనను సాధించాలని,అంబేద్కర్ ఆలోచన విధానంతో అసమానతను రూపుమాపాలని, బహుజనులకు రాజ్యాధికారం రావాలని 1984 నుండి అనేక ప్రయత్నాలు కొనసాగించారు. వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ ఉందని, ఆదివాసి గిరిజనులకు స్వయంపాలన కల్పించాలని తను జీవించి ఉన్నంత కాలం పోరాడారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, ఆత్మహత్యలు, హత్యాచారాలు, హింసతో పాటు కుల`మత బేధాలు, ప్రాంతీయ తత్వాలను పాలకవర్గాల అనైతిక రాజకీయ విధానాలతో పెంచి పోషిస్తున్నారు. సెక్యులరిజం పేరుతో కాంగ్రేస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రైవేటీకరణ సరళీకరణ ఆర్ధిక దోపిడితో పాటు కుల-మత తత్వాలను పెంచి పోషించింది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో మూడవసారి కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి కూడ తన మతభావజాలాన్ని పెంపొందించుకుంటూ మైనార్టి మతాలపై,దళిత,గిరిజన,అట్టడుగు వర్గాలపై మనువాద పాలన పేరుతో దాడులకు పూనుకుంటూ వస్తుంది. గత పాలకవర్గం లాగానే కార్పోరేట్, పెట్టుబడిదారి వర్గాలకు దేశ సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెట్టింది. తన మతోన్మాద, పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను ప్రశ్నించిన వారిపై ఫాసిజంతో దురహాంకరపూరితమైన ఉన్మాద చర్యలకు పూనుకుంటుంది. ఎన్నికల కమీషన్, న్యాయ వ్యవస్థ, ఈడి, సిబిఐ లాంటి స్వతంత్ర వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని దేశ రాజకీయ వ్యవస్థలను కలుషితం చేస్తుంది మానవ హక్కులను హరిస్తున్న శక్తులకు అండగా ఉంటుంది దానిలో భాగంగా నే ఆదివాసీ హక్కుల నేత ఫాథర్ స్టాన్ స్వామిని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ సాయిబాబాలపై చేయని కుట్రకేసుల్లో ఇరికించి వారి మరణానికి కారణం అయింది. ఒకే బాష, ఒకే మతం, ఒకే దేశం అంటూ ఒకే ఎన్నికల పేరుతో జమిలి ఎన్నికలు విధానానికి ఒడిగట్టి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ విలువలను సమాధి చేస్తుంది. అనేక ఆంక్షల నేపధ్యంలో సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన గత బిఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రేస్‌లు కూడ రాష్ట్ర అభివృద్ధి పేరుతో కేంద్రంలోని బిజెపి చేసిన తప్పుడు చట్టాలను, ప్రజావ్యతిరేక విధానాలను బలపరుస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ఫాసిస్టు, మనువాద విధానాలకు, సెక్యూలర్ ముసుగులో ఉన్న కాంగ్రేస్ విధానాలకు వ్యతిరేకంగా కార్పోరేట్, పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను కొనసాగిస్తున్న దోపిడి పాలకవర్గాల పాలనలో సమస్త హక్కులు కోల్పోతున్న శ్రామిక వర్గ ఐక్య పోరాటాల బలోపేతానికి మార్క్సిజమే మార్గదర్శిగా, తరతరాలుగా అసమానలతో అణిగి మనిగి ఉన్న భారత సమాజాన్ని అంబేద్కర్ ఆలోచన విధానంతో రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమానత్వాన్ని, బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించాలని కాంక్షిస్తూ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16 వర్ధంతి కార్యాక్రమాన్ని యంసిపిఐ(యు) రాష్ట్ర వ్యాప్తంగా 2024 అక్టోబర్ 17నుండి 31 వరకు “‘ప్రస్తుత రాజకీయాలు మార్క్సిజం ` అంబేద్కర్ ఆలోచన విధానం” అనే అంశంపై జరుపుతున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపునిస్తుంది. ప్రారంభ సభ: ఈ నెల 17 న, ఉదయం 11 గం॥లకు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురం గ్రామం కామ్రేడ్ ఓంకార్ 125 అడుగుల స్థూపం వద్ద నిర్వహణ జరుగుతుంది.
రచయిత.. *గాదగోని రవి రాష్ట్ర కార్యదర్శి సెల్ నెంబర్ 7396072718*
*భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టి (ఐక్య),యంసిపిఐ(య) తెలంగాణ రాష్ట్ర కమిటి. 1-8-742/2/ఎ, ఓంకార్ భవన్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్*
పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న నివారణ టీకాలను పశువులకు వేయించుకోవాలని రైతులతో, పశుపోషకులతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి. కృష్ణ అన్నారు అడ్డగూడూరు మండల కేంద్రంలోని పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం పశువులకు గాలికుంట వ్యాధుల సోకకుండా నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వి కృష్ణ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి అనేది ప్రమాదకరమని ఈ వ్యాధి సోగిన పశువులకు నోటిలో,కాళ్లలో పుండ్లు ఏర్పడి మేత మెయ్యక నడవలేని స్థితిలో పశువులు ఉంటాయన్నారు. రైతులు, పశుపోషకులు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించి వ్యాధి సోకకుండా కాపాడుకోవాలని అన్నారు. అడ్డగూడూరు మండల కేంద్రంతో పాటు పరిసరాల్లో ఉన్న గ్రామాలలో ఈనెల 15 నుంచి నవంబర్14 వరకు నెల రోజులపాటు పశు వైద్య సిబ్బంది గ్రామాలలో పర్యటించి ఆవులు, ఎద్దులు, గేదెలకు ఉచిత గాలికుంటూ టీకాలు వేస్తారని అన్నారు. పశువులకు టీకాలు వేయించిన రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలని పశు వైద్య సిబ్బందికి తెలియజేశారు. ఈ యొక్క అవకాశాన్ని రైతులు, పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పశు వైద్యాధికారి అనిల్ రెడ్డి, వీఎల్ఏ శ్రీరాములు , వి ఏ ఈశ్వరయ్య , గోపాలమిత్ర (సీనియర్ ) బండి కొమరయ్య, రైతులు, పశు పోషకులు తదితరులు పాల్గొన్నారు
చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి …
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నసుల్లాబాద్ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తయారు చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం అన్నారు.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ గ్రామంలోని పెద్ద చెరువు దగ్గర మత్సశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి బుధవారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని పెద్ద చెరువులోకి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పెద్ద చెరువు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే పెద్ద చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా తయారు చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజు గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మత్స్యకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
@వైన్స్, బెల్ట్ షాపుల కుమ్మక్కుతో ప్రజల ఇబ్బందులు.
@ప్రతి ఒక్క బాటిల్ పైన 40 నుంచేలి 90 రూపాయల వసూళ్లు. @ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ.
@రెండు ప్రధాన రహదారులపై వాహనదారుల ఇబ్బందులు.
నెక్కొండ, నేటిధాత్రి:
మండలంలోని వైన్స్ బెల్ట్ షాపుల దందా రోజురోజుకు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. మండలంలో నాలుగు షాపులు ఉండగా ఒక్కొక్క షాపు ఏడు గ్రామాలు గా పంచుకొని బెల్ట్ షాప్ ల నిర్వాహకులతో దందాలను కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 10 నుంచి 15 బెల్ట్ షాపులు ఉండగా మండల వ్యాప్తంగా 800 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క బాటిల్ పైన వైన్స్ నిర్వాహకులు 20 రూపాయలు ఎక్కువ తీసుకోగా బెల్ట్ షాప్ నిర్వాహకులు మరో 20 జోడించి ఒక క్వాటర్ పైన 40 రూపాయల చొప్పున వసూలు చేస్తూ దోచినోడికి దోచినంత అనే సామెత ను నెక్కొండ బెల్ట్ షాప్ ,వైన్ షాపుల నిర్వాహకులు నిరూపిస్తున్నారు. తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన దసరా పండుగ సందర్భంగా మద్యం దుకాణంలో ఉండవలసిన మద్యం అధిక రేట్లకు విక్రయించే బెల్ట్ షాపు వారికి వైన్స్ ఓనర్లు విక్రయించి వైన్సులలో మాత్రం చల్ల చల్లటి బీర్లు లేవని నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం నెక్కొండ మద్యం ప్రియులను ఇబ్బందులకే గురిచేసిందని చెప్పవచ్చు. కానీ బెల్ట్ షాపులలో బీర్లు ఒక్కొక్క బాటిల్ పైన 40 నుండి 60 రూపాయల వరకు తీసుకోవడం జరిగిందని వెంటనే సంబంధిత ఎక్సైజ్ శాఖ వారు స్పందించి మండల వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వారిని కోరుతున్నారు. . @బాటిల్లపై స్టిక్కర్లు వేస్తున్నాం రైడింగ్లు చేస్తున్నాం…! మండలంలోని నాలుగు వైన్ షాపులు ఏర్పడగా ఒక్కొక్క షాపు ఏడు గ్రామాలను పంచుకొని ఒక్కొక్క వైన్ షాప్ ఒక రకమైన కోడ్ గల స్టిక్కర్ ను అంటించి బాటిల్ పై 20, 40, 60, 80, రూపాయల అధిక రేట్లకు బెల్ట్ షాపు నిర్వాహకులకు అమ్ముతుండగా బెల్ట్ షాప్ వారు వైన్ షాప్ నిర్వాహకులు ఇచ్చిన రేట్లును అధికం చేస్తూ మద్యం ప్రియుల జేబుకు చిల్లు పెడుతుండడం గమనార్థం. ఇలా వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాప్ వారికి అధిక రేట్లకు అమ్మిన తర్వాత తమ సిబ్బందితో బెల్ట్ షాపుల పై రైటింగ్ లు నిర్వహిస్తూ సక్రమంగా తమ షాపు దగ్గర తీసుకున్న స్టాక్ మాత్రమే అమ్మే విధంగా ఈ వైన్స్ షాప్ రైడర్స్ బెల్ట్ షాపులను తనిఖీలు నిర్వహిస్తుండడం చర్చనీ అంశంగా మారింది. . ఇదంతా జరుగుతున్న కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ. . . నెక్కొండ మండలంలో వైన్స్ మరియు బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక రేట్లకు అమ్ముతున్న వైన్స్ లలో సిట్టింగ్ పర్మిషన్ లేకున్నా ఎక్సైజ్ శాఖ వారు మాత్రం చూచి చూడనట్టు ఉండడంతో ఎక్సైజ్ శాఖ పై ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా వెంటనే ఎక్సైజ్ శాఖ కు సంబంధించిన అధికారులు స్పందించి అధిక రేట్లకు అమ్మిన షాపుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. . @వాహనదారులకు ఇబ్బందిగా మారిన మద్యం దుకాణాలు . నెక్కొండ కు ప్రధాన రహదారులైన వరంగల్ మరియు నర్సంపేట రోడ్లలో వైన్ షాపులతో వాహనదారుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైన్స్ షాపులలో సిట్టింగ్ లేకపోయినా అధికారుల అండదండలతో వైన్స్ ఓనర్లు సిట్టింగ్ నిర్వహించడం పట్ల వైన్ షాపుల ముందు వందల సంఖ్యలో వాహనాలు నిలపడంతో రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు ప్రమాదాలకు గురికావడం జరుగుతుంది .
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.