హనుమకొండ జిల్లాకు చేరుకున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ

హనుమకొండ, నేటిధాత్రి :

గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ హనుమకొండ చేరుకుందని జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హనుమకొండ వేయి స్తంభాల గుడి వద్ద నుండి సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిషోర్ ఝా తో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు
ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి వరంగల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ & కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్, వరంగల్ జిల్లా అథ్లెటిక్ సెక్రటరీ&రాష్ట్ర జనరల్ సెక్రటరీ సారంగపాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారి సంతోష్ మరియు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, వరంగల్ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *