ఓంకార్ వర్ధంతి పక్షోత్సవాలను జయప్రదం చేయాలి.

# ఎంసీపీఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్.

నర్సంపేట,నేటిధాత్రి :

మార్క్సిస్ట్ మేధావి, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు అమరజీవి మద్దికాయల ఓంకార్16వ వర్ధంతి పక్షోత్సవాలను జయప్రదం చేయాలని ఎం సి పి ఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో అమరజీవి, అసెంబ్లీ టైగర్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 16 వ వర్ధంతి పక్షోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓంకార్ రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమైనదని,అలాగే తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ వర్ధంతి పక్షోత్సవాలను అక్టోబర్ 17 నుండి 31 వరకు డివిజన్ వ్యాప్తంగా సభలు, సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఓంకార్ చరిత్రను నేటి తరానికి తెలియజేసి చైతన్య పరుస్తామని పేర్కొన్నారు.వర్ధంతి ప్రారంభ సభ గీసుగొండ మండలం మచ్చాపురం వద్దగల ఓంకార్ 125 అడుగుల స్మారక స్తూపం వద్ద ప్రారంభమవుతుందని, ముగింపు సభ ఈ నెల చివరలో నర్సంపేటలో ఉంటుందని తెలిపారు. మచ్చాపూర్ లో జరిగే ప్రారంభ వర్ధంతి సభకు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కుసుంబ.బాబురావు, వంగల రాగసుధ, కొత్తకొండ రాజమౌళి, కలకొట్ల యాదగిరి, కేశెట్టి సదానందం, గాజుల వెంకటయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version