మా మద్యం దందాకు అడ్డు లేరు..! ఆపే వారే లేరు…!

@దసరా పండుగ సందర్భంగా సామాన్యుని జేబు చిల్లు.

@వైన్స్, బెల్ట్ షాపుల కుమ్మక్కుతో ప్రజల ఇబ్బందులు.

@ప్రతి ఒక్క బాటిల్ పైన 40 నుంచేలి 90 రూపాయల వసూళ్లు.
‌ @ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ.

@రెండు ప్రధాన రహదారులపై వాహనదారుల ఇబ్బందులు.

నెక్కొండ, నేటిధాత్రి:

మండలంలోని వైన్స్ బెల్ట్ షాపుల దందా రోజురోజుకు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. మండలంలో నాలుగు షాపులు ఉండగా ఒక్కొక్క షాపు ఏడు గ్రామాలు గా పంచుకొని బెల్ట్ షాప్ ల నిర్వాహకులతో దందాలను కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 10 నుంచి 15 బెల్ట్ షాపులు ఉండగా మండల వ్యాప్తంగా 800 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క బాటిల్ పైన వైన్స్ నిర్వాహకులు 20 రూపాయలు ఎక్కువ తీసుకోగా బెల్ట్ షాప్ నిర్వాహకులు మరో 20 జోడించి ఒక క్వాటర్ పైన 40 రూపాయల చొప్పున వసూలు చేస్తూ దోచినోడికి దోచినంత అనే సామెత ను నెక్కొండ బెల్ట్ షాప్ ,వైన్ షాపుల నిర్వాహకులు నిరూపిస్తున్నారు. తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన దసరా పండుగ సందర్భంగా మద్యం దుకాణంలో ఉండవలసిన మద్యం అధిక రేట్లకు విక్రయించే బెల్ట్ షాపు వారికి వైన్స్ ఓనర్లు విక్రయించి వైన్సులలో మాత్రం చల్ల చల్లటి బీర్లు లేవని నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం నెక్కొండ మద్యం ప్రియులను ఇబ్బందులకే గురిచేసిందని చెప్పవచ్చు. కానీ బెల్ట్ షాపులలో బీర్లు ఒక్కొక్క బాటిల్ పైన 40 నుండి 60 రూపాయల వరకు తీసుకోవడం జరిగిందని వెంటనే సంబంధిత ఎక్సైజ్ శాఖ వారు స్పందించి మండల వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వారిని కోరుతున్నారు. ‌. @బాటిల్లపై స్టిక్కర్లు వేస్తున్నాం రైడింగ్లు చేస్తున్నాం…! మండలంలోని నాలుగు వైన్ షాపులు ఏర్పడగా ఒక్కొక్క షాపు ఏడు గ్రామాలను పంచుకొని ఒక్కొక్క వైన్ షాప్ ఒక రకమైన కోడ్ గల స్టిక్కర్ ను అంటించి బాటిల్ పై 20, 40, 60, 80, రూపాయల అధిక రేట్లకు బెల్ట్ షాపు నిర్వాహకులకు అమ్ముతుండగా బెల్ట్ షాప్ వారు వైన్ షాప్ నిర్వాహకులు ఇచ్చిన రేట్లును అధికం చేస్తూ మద్యం ప్రియుల జేబుకు చిల్లు పెడుతుండడం గమనార్థం. ఇలా వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాప్ వారికి అధిక రేట్లకు అమ్మిన తర్వాత తమ సిబ్బందితో బెల్ట్ షాపుల పై రైటింగ్ లు నిర్వహిస్తూ సక్రమంగా తమ షాపు దగ్గర తీసుకున్న స్టాక్ మాత్రమే అమ్మే విధంగా ఈ వైన్స్ షాప్ రైడర్స్ బెల్ట్ షాపులను తనిఖీలు నిర్వహిస్తుండడం చర్చనీ అంశంగా మారింది. ‌. ‌ ఇదంతా జరుగుతున్న కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ. ‌. ‌. నెక్కొండ మండలంలో వైన్స్ మరియు బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక రేట్లకు అమ్ముతున్న వైన్స్ లలో సిట్టింగ్ పర్మిషన్ లేకున్నా ఎక్సైజ్ శాఖ వారు మాత్రం చూచి చూడనట్టు ఉండడంతో ఎక్సైజ్ శాఖ పై ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా వెంటనే ఎక్సైజ్ శాఖ కు సంబంధించిన అధికారులు స్పందించి అధిక రేట్లకు అమ్మిన షాపుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‌. @వాహనదారులకు ఇబ్బందిగా మారిన మద్యం దుకాణాలు ‌. నెక్కొండ కు ప్రధాన రహదారులైన వరంగల్ మరియు నర్సంపేట రోడ్లలో వైన్ షాపులతో వాహనదారుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైన్స్ షాపులలో సిట్టింగ్ లేకపోయినా అధికారుల అండదండలతో వైన్స్ ఓనర్లు సిట్టింగ్ నిర్వహించడం పట్ల వైన్ షాపుల ముందు వందల సంఖ్యలో వాహనాలు నిలపడంతో రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు ప్రమాదాలకు గురికావడం జరుగుతుంది .

భద్రాచలంలో ఘనంగా ప్రపంచ అనస్థీషియా డాక్టర్ల దినోత్సవ వేడుకలు

భద్రాచలం నేటి ధాత్రి

డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ ( ప్రభుత్వ వైద్యులు, భద్రాచలం )

ప్రపంచ అనస్థీషియా డాక్టర్ల దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో భద్రాచలం లో ఉన్నటువంటి అనస్థీషియా డాక్టర్లందరూ ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ కోటిరెడ్డి చరవాణి లో మాట్లాడుతూ భద్రాచలం లోని అనస్థీషియా డాక్టర్లు మరియు భద్రాచలం లోని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.
డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ సర్జరీలు జరిగేటప్పుడు అనస్థీషియా డాక్టర్ల యొక్క ప్రమూఖ్యత మరియు వారి విలువైన సేవలు గురించి కొనియాడారు.
డాక్టర్ మల్లేష్ మాట్లాడుతూ అనస్థీషియా రంగంలోని వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోని వారి యొక్క వెలకట్టలేని పాత్ర గురించి గుర్తు చేశారు.
డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ ఆంగ్ల అక్షరమాల లో A మొదటి వరస లో ఎలా ఉంటుందో, ప్రపంచంలోని అనస్థీషియా వైద్యులు మొదటి వరసలో ఉండి మానవాళికి సేవలు అందిస్తున్నారు అని తెలిపారు.
డాక్టర్ శివరామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలోని డాక్టర్స్ అందరి యొక్క ఆయువుప్రామాణాలతో పోలిస్తే అనస్థీషియా వైద్యులు తొందరగా మృత్యువాత పడుతున్నా కానీ, మానవాళి క్షేమం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పాటు పడుతున్న అనస్థీషియా వైద్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రేజరర్ డాక్టర్ సురేష్ కుమార్ భద్రాచలం లోని అనస్థీషియా వైద్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసారు.
ఈ కార్యక్రమంలో అనస్థీషియా వైద్యులు అబ్దుల్ లతీఫ్ , నిఖిత, రమేష్ చంద్ర, లోకేష్, మల్లేష్, శివరామకృష్ణప్రసాద్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రేజరర్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గున్నారు.
ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు, సిటీ స్టైల్ జిమ్ సభ్యులు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.

మెగా హెల్త్ క్యాంపు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాల జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామంలో బుధ వారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అపోలో ఎన్ఎస్ఆర్ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ గోపాలపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది గ్రామంలోని ప్రజలందరికీ బీపీ,షుగర్, బ్లడ్ టెస్ట్, ఈసీజీ మరి అనేక టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, క్యాంపు ఇన్చార్జి సుమన్ రావు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఏక్ రవీందర్ నీల మహేందర్ ఏక్ స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.

పీఎం జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ తోనే మన్యం గ్రామాల అభివృద్ధి.

16 అక్టోబర్ 2024

జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి
అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు)

మన రాష్ట్రం నుండి పీఎం జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ క్రింద 878 గ్రామాల ఎంపిక చేయడం , ఈ పథకం
ద్వారా రానున్న ఐదేళ్లలో ఐదువేల కోట్లు వచ్చే అవకాశం ఉందని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం పట్ల గిరిజన గ్రామాలకు మంచి రోజులు రానున్నాయని అరకులో బుధవారం నాడు జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) హర్షం వ్యక్తం చేశారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తాగునీరు, రోడ్లు రహదారి సౌకర్యాలు,పక్కా గృహాల నిర్మాణం వల్ల గిరిజన గ్రామాలకు మహార్దశ పట్టనున్నదని, దేశవ్యాప్తంగా కనీస సౌకర్యాలు లేని గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని వచ్చే నెలలో ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు, యావత్ ఆదివాసి సమాజం ప్రధాని నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని, ఈ సందర్భంగా కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) కొనియాడారు,

ఈ పథకం కింద నవంబర్ నుండి పనులు ప్రారంభిస్తున్నందున సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం
సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం కింద మన రాష్ట్రంలో 18 జిల్లాల పరిధిలో 878 గ్రామాలు ఎంపిక అయ్యాయని, దేశవ్యాప్తంగా ఈ పథకానికి వచ్చే ఐదేళ్లలో 79 వేల కోట్లు ఖర్చు చేయనున్నారని,
కనీసం 500 జనాభా ఉండి అందులో 50% గిరిజనులు ఉన్న రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చించనున్నారని , గిరిజన గ్రామాల అభివృద్ధికి ఐదువేల కోట్ల వరకు మన రాష్ట్రానికి అందే అవకాశం ఉందన్నారు.

ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో 25 రకాల అభివృద్ధి పనులు చేపడతారని, రహదారులతో పాటు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం, రక్షిత మంచి నీరు, విద్యుత్ విద్య,వైద్య సౌకర్యాలు, నూతన గృహ నిర్మాణం , గ్యాస్ కనెక్షన్లు, మారుమూల ప్రాంతాలకు టెలిఫోన్ సౌకర్యం, పాఠశాలలు, అంగన్వాడి
కేంద్రాలు, మార్కెట్ , ఇలా 25 రకాల సదుపాయాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ
ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మిషన్ అంత్యోదయ సర్వేలో భాగంగా ఇప్పటికే
కేంద్రం 878 గ్రామాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు ప్రాథమిక జాబితాను పీఎం గతి శక్తి పోర్టల్లో ఉంచిందని దీన్ని ఆయా శాఖల అధికారులు పరిశీలించి ఆయా పనులు చేపట్టేందుకు అనుమతులు కోరుతూ అక్టోబర్ నెలలోపు నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని
అధికారులను కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) ఈ సందర్భంగా కోరారు.

దుమ్మగూడెం..నందుల చలక పేరుతో రేగుబల్లిలో నడుపుతున్న ఇసుక ర్యాంపు లో మళ్లీ మొదలైన అధిక లోడు లారీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
భద్రాచలం నేటి ధాత్రి

ఇప్పటికైనా సంబంధిత అధికారులు రవాణా అధికారులు స్పందిస్తారా లేదా?

రేగుబల్లి ఇసుక ర్యాంపులో లోడ్ అవుతున్న ప్రతి లారీలో ఐదు నుంచి పది టన్నుల ఇసుకను ఎక్కువగా వేస్తున్నారు.

ఇసుక లోడ్ అయ్యేది రేగుబల్లిలో కానీ బరువు చూసేది మాత్రం పాల్వంచలో అంట?

అంతేకాకుండా కొసమెరుపు ఏమిటంటే ఆన్లైన్లో డిడి కట్టి వచ్చిన లారీ ఓనర్లు మరియు డ్రైవర్ల దగ్గర లోడింగ్ చార్జి పేరుతో 2500 నుంచి 3000 వసూలు చేస్తున్న ఆంధ్ర ఇసుక కాంట్రాక్టర్..

గ్రామపంచాయతీ అభివృద్ధికి లారీ వాళ్ల దగ్గర నుంచి 200 మరియు ఇసుక ర్యాంపు మెయింటినెన్స్ అని మరో 200 వసూలు చేస్తున్నారని లబోదిబోమని మొత్తుకుంటున్న లారీ ఓనర్లు మరియు డ్రైవర్లు

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రేగుబల్లి ఇసుక ర్యాంపులు జరిగే అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు

కొయ్యూరులో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్.

డిఎస్పి రామ్మోహన్ రెడ్డి

మలహార్ రావు. నేటిధాత్రి :
భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని కొయ్యూరులో కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లైసెన్సులు, నెంబర్ ప్లేట్ లేని బైకులను స్వాధీనం చేసుకొని యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అదేవిధంగా గుడుంబా, గంజాయి, సైబర్ క్రైమ్రై నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున రావు ఎస్సై వడ్లకొండ నరేష్, పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

మద్యంతాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జైలుశిక్ష.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపుతూ ఇటీవల పోలీసుల వాహన తనిఖీలో పట్టుబడిన నలుగురు వ్యక్తులకు కోర్టు
ఐదు రోజుల జైలు శిక్ష,1000 రూపాయలు జరిమాన విధించినట్లు నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నర్సంపేట పరిధిలో వాహనాలు తనకు నిర్వహిస్తుండగా
నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్ కు చెందిన చింతకింది సురేందర్,ఇందిరానగర్ కు చెందిన మహమ్మద్ అహ్మద్,అలాగే సర్వాపురంకు చెందిన దారా అరుణ్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామానికి చెందిన
మాలోత్ సంతోష్ లు మద్యంతాగి వాహనాలు నడుపుతూ పట్టు పడ్డారు.
వారిని నర్సంపేట కోర్టులో హాజరుపరచగా నర్సంపేట సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కొత్త లక్ష్మీనారాయణ ఈ నలుగురికి ఐదు రోజుల జైలు శిక్ష ఒక్కరికి 1000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కొరకు ఆర్టీవో సిఫారస్సు చేస్తామని సీఐ హెచ్చరించారు.

తొర్రూరు పట్టణంలో పిచ్చి కుక్కల స్వైరా విహారం

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి

ఒకేరోజు అంబేద్కర్ నగర్ లో అయిదుగురిని కరిచిన వైనం

ఉపయోగంలో లేని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్

పట్టించుకోని అధికారులు, పాలకులు

భయబ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు

సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సామజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు

తొర్రూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో పిచ్చికుక్కలు ఒకేరోజు అయిదుగురిని కరిచిన సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. అందులో చిన్నపిల్లలు నలుగురు, పెద్దలు ఒకరు, రెండు మేకలను మూరగుండ్ల రుద్రదీప్(4),మంగళపల్లి చరిష్మా (2),హర్షిత్(2),ఫాయిదా (3),మంగళపల్లి అనిల్ (30) అత్యంత దారుణంగా కరిచాయి. చిన్న పిల్లాడిని జుట్టు పట్టుకొని కరుస్తున్నాయని అడ్డుకోబోయిన అనిల్ కూడా కరిచాయ్. పట్టణ కేంద్రంలో పిచ్చికుక్కలు రోజురోజుకి పెరుగుతున్న మున్సిపాలిటీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.ఈలాంటి దారుణమైన ఘటనకు కారకులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న మున్సిపల్ అధికారులు, పాలకులు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు.

కుక్కల పెరుగుదలను నివారించడం కోసం గతంలో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ lo తూ తూ మంత్రాంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దానిని ఉపయోగించకుండా చోద్యం చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు, పాలకులు.ఇప్పటికైనా పట్టణ ప్రజల కోసం సరైన చర్యలు తీసుకోవాలని సామజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు డిమాండ్ చేశారు.

జమ్మికుంట ట్రాన్స్కో సబ్ డివిజన్ పరిధిలో బదిలీలు

జమ్మికుంట ;నేటిధాత్రి
జమ్మికుంట మండలం ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో బదిలీలలో భాగంగా ఏయ్ తనువుల రవీందర్ ట్రాన్స్ఫర్ టు హెచ్డి మీటర్స్ కరీంనగర్ సాంబయ్య లైన్ ఇన్స్పెక్టర్ తనువుల ట్రాన్స్ఫర్ టు జమ్మికుంట టౌన్ పుల్లూరి సంపత్ కుమార్ బిస్గిరి షరీఫ్ టు ట్రాన్స్ఫర్ తాడికల్ సబ్స్టేషన్ వైద్య శ్రీనివాస్ లైన్మెన్ వావిలాల టు ట్రాన్స్ఫర్ ఎలుబాక సబ్స్టేషన్ కోడెం రాజబాబు అసిస్టెంట్ లైన్మెన్ శాయంపేట టు ట్రాన్స్ఫర్ జమ్మికుంట టౌన్ పెంగిలి రవీందర్ జేఎల్ఎం విలాసాగర్ టు ట్రాన్స్ఫర్ రాసపల్లి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయినట్టు ట్రాన్స్కో శాఖ తెలియపరిచింది

ముత్తారం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం
మచ్చుపేట గ్రామంలో కోట సతీష్ కుటుంబమును మరియు కోట శ్రీనివాస్ కుటుంబమును
హరిపురం గ్రామంలో అడ్డూరి రాజమ్మ ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శించి
లక్కారం గ్రామపంచాయతీ ఖాజిపల్లె గ్రామంలో అగ్గు మధునమ్మ మరణించగ భారతీయ దేహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమం లో ఓడేడ్ మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య మాజీ సర్పంచ్ నూనే కుమార్ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

మందు బాబులకు అడ్డాగా.. ప్రభుత్వ కళాశాల..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో మందు బాబులకు ప్రభుత్వ కళాశాల అడ్డగా మారింది. వారం రోజులపాటు దసరా సెలవులు ఉండడం.. సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులు కళాశాలకు వచ్చి మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో పాఠశాల విద్యార్థులు వాటిని చూసి అవాక్కయ్యారు. కళాశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మందుబాబులు అడ్డాగా మారిందన్నారు. మందుబాబుల ఆగడాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కళాశాలకు ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.

డాక్టర్ బి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

స్థానిక డాక్టర్ బి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా. ఏ. పి.జె. అబ్దుల్ కలాం జయంతిని కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్. డా. సుకన్య మాట్లాడుతూ భారతదేశ రక్షణ వ్యవస్థను బలపరచడం కోసం ఎంతో కృషిచేసి మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా పేరుగాంచారని, రాష్ట్రపతిగా ఉంటూ అతి సాధారణ జీవితాన్ని గడిపి ప్రజారాష్ట్రపతిగా ఖ్యాతిగడించారని, అబ్దుల్ కలాం జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సదాశివయ్య, నందకోషోర్, మాధురి, ప్రవీణ్ మరియు కళాశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

కరీంనగర్, నేటిధాత్రి:

ఈనెల 27న స్వేరోస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరిగే స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ వాల్ పోస్టర్లను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పర్లపెల్లి మనోజ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో స్వేరోస్ షానగర్ గ్రామ అధ్యక్షులు పర్లపెల్లి కిరణ్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ లు తోట రవి, గునుకొండ వెంకటనర్సయ్య, ప్రజాసంఘ నాయకులు సైండ్ల కరుణాకర్, చిరుత ఎల్లయ్య, పెంటి శంకర్, స్వేరోస్ నాయకులు వెంకటేష్, గోపిచంద్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

ఆ ఇద్దరు ఎంత ‘సంతోష’పెట్టారు?..ఈ నలుగురు ఏం పాపం చేశారు!?

https://epaper.netidhatri.com/view/405/netidhathri-e-paper-16th-october-2024%09

`ఆ నాలుగు రోహౌజ్‌లు ఎందుకు కూల్చారు!

`ఈ రెండిరటినీ కూల్చకుండ ఎందుకు ఆపారు?

`ఆ రెండిరటికి సమయమెందుకిచ్చారు!

`ఉన్నఫలంగా ఈ నలుగురిని ఎందుకు రోడ్డు మీద పడేశారు?

`ఆ ఇద్దరికెందుకు ఇంకా సమయమిస్తున్నారు.

`చిత్రపురి కూల్చి వేతల్లో కిరికిరిలెందుకు పెట్టారు.

`కూల్చివేతల్లో వ్యత్యాసం ఎందుకు చూపించారు.

`ఆ ఇద్దరి మీద వున్న మమకారం ఏమిటి?

`ఈ నలుగురి మీద లేని కనికరానికి కారణమేమిటి?

`ఆ మాజీ ఎమ్మెల్సీకి రో హౌజ్‌ ఎలా వచ్చింది.

`చిత్రపురిలో ఈ మతలబు ఏమిటి?

`చిత్రపురి సొసైటీలో బంధువుకు రోహౌజ్‌ కేటాయింపేమిటి?

`కూల్చివేతలో అ ఇద్దరికి మినహాయింపేమిటి?

`పదిహేను రోజుల గడువు దాటి పాతిక రోజులౌతోంది.

`ఆ రెండు కూల్చివేతలలో ఇంత కాలం జాప్యమేమిటి?

`సొసైటీ సెక్రటరీకి ఒక రూలు…ఆ నలుగురికి మరో రూలా?

`చిత్రపురిలో రాజకీయ నాయకుడికి రో హౌజ్‌ కేటాయింపేమిటి?

`బినామీ ఆస్థులు ఎంత కాలం దాస్తారు?

`నిబంధనలకు తూట్లెందుకు పొడుస్తున్నారు!

`ఆ రెండు కూల్చివేతలు ఆగడంలో అదృశ్య శక్తులెవరు?

`మణికొండ మున్సిపాలిటీని శాసిస్తున్నదెవరు?

`హైడ్రా తరహా కూల్చివేతలు జిల్లాల్లోనూ సాగుతున్నాయి!

`మణికొండ బుల్డోజర్లు ఆ రెండు రోహజ్‌ల వైపు ఎందుకు వెళ్లనంటున్నాయి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తవ్వినా కొద్ది చిత్రపురి హౌజింగ్‌ సొసైటీలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు బైటపడుతూనే వున్నాయి. కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తూనేవున్నాయి. చిత్ర పురి అంశం కొత్తదికాదు. దానిలో వున్న అగాదాలకు అంతం లేదు. అంతు లేదు. ఇంతకాలం వెలుగులోకి రాని అనేక అంశాలు నేటిధాత్రి వెలుగులోకి తెస్తూనే వుంది. నేటిధాత్రి రాసిన వరుస కథనాలతో చిత్రపురిలో జరిగిన అనేక అవకతవకలు బైటపడుతూనే వున్నాయి. తాజాగా రోహౌజ్‌ల విషయంలో కూడా సరికొత్త అంశాలు కనిపిస్తున్నాయి. చిత్రపురిలో 225 రోహౌజ్‌లకు అనుమతులున్నాయి. కాని అవి కార్మికుల కన్నీటీ మీద నిర్మాణం చేసుకున్నవి. చట్టపరమైన అనుమతులున్నాయని చెప్పుకున్నా, కార్మికుల కష్టం దోచుకున్న పాపుల పాపాలకు సాక్ష్యాలు. అయితే 225 రోహౌజ్‌లతోపాటు ఓ ఆరు రోహౌజ్‌లు అదనంగా నిర్మాణం చేశారు. 225 రో హౌజ్‌లకు పర్మిషన్లు వున్నాయంటున్నారు. కాని మరో ఆరు రో హౌజ్‌లకు ఎలాంటి అనుమతులు అసలే లేవు. అక్కడ ఆ కట్టడాలకు ఎలాంటి అవకాశం లేదు. కాని నిర్మాణాలు చేశారు. రోహౌజ్‌లను నిర్మాణం చేసుకున్నారు. ఈ విషయాన్ని నేటిదాత్రి వెలుగులోకి ఎప్పుడో తెచ్చింది. దాంతో మణికొండ మున్సిపాలిటీ రంగంలోకి దిగింది. ఆరు రోహౌజ్‌ల కూల్చివేతకు రంగం సిద్దం చేసింది. కాని నాలుగు రో హౌస్‌లు మాత్రమే కూల్చి వేసింది. మరో రెండు రో హౌస్‌లను కూల్చివేయలేదు. ఆ రెండు ఎవరివని నేటిధాత్రి ఆరా తీస్తే అసలు విషయాలు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని గతంలోనే మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అదికారిని నేటిదాత్రి ప్రశ్నించడం జరిగింది. ఆ నలుగురు చేసిన పాపం ఏమిటి? కూల్చని ఇద్దరు చేసిన పుణ్యం ఏమిటని నిలదీయడం జరిగింది. కొంత సమయం కావాలని ఆ రెండు రో హౌజ్‌లకు చెందిన యజమానులు కోరడంతో కనికరించామని చెప్పారు. అయితే ఎంతకాలం తర్వాత కూల్చివేతలు జరగొచ్చన్నదానిపై కూడా స్పష్టత కోరడం జరిగింది. ఓ పది హేను రోజుల సమయం ఇచ్చేందుకు అంగీకరించినట్లు అదికారులు చెప్పారు. కాని ఆ పదిహేను రోజుల సమయం ఎప్పుడో పూర్తయింది. అదనంగా మరో పాతిక రోజులు కూడా పూర్తవుతోంది. కాని రెండు రోహౌజ్‌ల జోలికి ఇంకా వెళ్లడంలేదు. కారణమేమిటని ఆరాతీస్తే ఒక రోహౌజ్‌ గత ప్రభుత్వంలో కీలకమైన నాయకుడుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం పేరుతో నాయకుడైన ఆ నాయకుడు బిఆర్‌ఎస్‌ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వుండేవారు. ఉద్యమ సమయంలో ఒంటికాలిపై లేస్తూ కాంగ్రెస్‌, బిజేపి, తెలుగుదేశం పార్టీలను ఉతికి ఆరేస్తుండేవారు. ఎప్పుడూ టివి చర్చల్లో ఎక్కువగా కనిపిస్తూ వుండేవారు. తెలంగాణపై కార్యాచరణలో కొంత దూకుడుగా కనిపించేవారు. అలా టివిలలో కనిపించిన నాయకుడు వక్త మాత్రమే. ఆయనకు సినీ రంగంలో ఎలాంటి సంబంధం లేదు. కనీసం టెలివిజన్‌ రంగంతో కూడా అనుబంధం లేదు. నటుడు అసలే కాదు. కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన నోరేసుకొని సినిమా వాళ్లను బెదిరించిన సందర్భాలు అనేకం వున్నాయి. తర్వాత కాలంలో ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఐదేళ్లలో సంపన్నుడయ్యారు. అలాగే చిత్రపురిలో కూడా వేలు పెట్టాడు. ఏం చేస్తారో నాకు తెలియదు..నాకు ఒక రోహౌజ్‌ కావాలన్నాడు. అంతే చిత్ర పురి హౌజింగ్‌ సొసైటీలో అనధికారికంగా రోహౌజ్‌ నిర్మాణం చేసి ఆ నాయకుడికి ఇచ్చేశారు. కాని ఇంత కాలం వరకు ఆ రోహౌజ్‌ ఆ నాయకుడికి అన్న సంగతి లోకానికి తెలియకుండా మేనేజ్‌ చేశాడు. బినామీ పేరు మీద ఇల్లు రాయించుకున్నాడు. ఆ బినామీ కూడా ఎవరని నేటిదాత్రి ఆరా త తీసింది. బిఆర్‌ఎస్‌ నాయకుడికి బావమర్ధిపేరు మీద వుందన్న సంగతి తెలిసింది. తన పేరు బైటకు రాకుండా రోహౌజ్‌ను తన బావమర్ధి పేరన లాభం పొందారు. అక్రమంగా నిర్మాణం చేసిన రోహౌజ్‌లను మున్సిపాలిటీ కూల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆరు రోహౌజ్‌లలో నాలుగు కూల్చేశారు. కాని మిగిలిన రెండు రోహౌజ్‌లను ముట్టుకోవడానికి అదికారులు వెనకుడుగు వేస్తున్నారా? లేక భయపడుతున్నారా? అదీ కాకుండా ఆ రెండు రోహౌజ్‌ల పెద్దలు టైన్‌ ప్లానింగ్‌ను సంతోషపెట్టారా? అన్న చర్చ మొదలైంది. ఒక రో హౌజ్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడి కాగా మరో కూల్చని రోహౌజ్‌ ఒక దొరదంటున్నారు. ఆయన చిత్రపురి సొసైటీకి సెక్రెటరీగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. సెక్రెటరీ కావడంతోనే దొర రోహౌజ్‌ కూల్చివేత ఆగింది. ఇక్కడ కూడా రోహౌజ్‌ నిర్మాణంలో బంధుత్వమే కీలక భూమిక పోషించిందని తెలుస్తోంది. చిత్రపురి సొసైటీకి చెందని అతి కీలకమైన వ్యక్తికి దొర సమీప బంధువే కావడం గమనార్హం. అంటే సినీపెద్దల బంధుగణమే కాదు, సొసైటీ పెద్దల బంధువులు కూడా ఆవాసాలు అక్రమంగా నిర్మాణాలు సాగించుకున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు దోచుకున్నట్లు చిత్రపురి భూమిని బకాసులై పంచుకున్నారు. ఈ రెండు రోహౌజ్‌ల కూల్చివేత ఆగిపోవడానికి ఎంతకు మేనేజ్‌ చేసుకున్నాడన్నదే తెలియాల్సివుంది. కూల్చివేతల్లో ఎక్కడైన అదికారులు లాలూచీ పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక కూడా చేశారు. అది ఆ హెచ్చరిక కేవలం హైడ్రాకే వర్తిస్తుందని అదికారులు అనుకున్నారో ఏమో కాని ఆ రెండు రో హౌజ్‌లను కూల్చివేయకుండా ఆపేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలు హైడ్రా పరిధి కట్టడాలకు మాత్రమే అని నిర్ధారించుకున్నారో ఏమోగాని మణికొండ మున్సిపల్‌ అదికారులు ఆ రెండు రో హౌజ్‌ల మీదకు బుల్లోజర్లు తీసుకెళ్లడానికి ముందూ వెనకు ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఆ రెంటిపైకి వెళ్తే తమ బండారం ఎక్కడ బైట పడుతుందో అని టౌన్‌ ప్లానింగ్‌ అదికారి వెనుకడుగు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రోహౌజ్‌లను కూల్చివేసినా వాటి యజమానులు బైటకు రాలేదు. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేకపోయారు. కాని ఈ రెండు రోహౌజ్‌లు కూల్చే శక్తి సంబంధిత అదికారికి లేకుండా పోవడానికి కారణం ఆ ఇద్దరూ పవర్‌ పుల్‌ కావడంతో ఆగిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై టౌన్‌ ప్లానింగ్‌ అదికారి సమాదానం చెబుతారా? లేక మౌనం వహిస్తారా? కూల్చివేతలకు సిద్దమౌతారా? అన్నది తేలాల్సివుంది. కారణం ఏదైనా ఆ రెండు రోహౌజ్‌లు అక్రమమే. వాటి కూల్చివేత సక్రమమే. అయినా వెనుకుడుగు అన్నది ఎందుకు పడుతుందన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. వాటిని కూల్చివేయాల్సిన అవసరం వుంది. చిత్రపురిలో అసలు రోహౌజ్‌ల నిర్మాణమే ఒక అన్యాయం. అక్రమం. ఒక రకంగాచెప్పాలంటే దుర్మార్గం. కార్మికుల కోసం ప్రభుత్వం ఎంతో ఉదారంగా భూమిని కేటాయిస్తే అందులో రాబందులు దూరిపోయాయి. కనీసం కార్మికుల కోసం నిర్మాణం జరిగిన అప్పార్టుమెంట్లలో న్యాయం జరగలేదు. అనుయాకులు, అనుచరల పేరు మీద ప్లాట్లు దక్కించుకున్నవారు దక్కించుకున్నారు. పదిహేనేళ్ల క్రితం వున్న సభ్యులకే సరిగ్గా అక్కడ దిక్కులేదు. ఇంకా రెండు ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం చేస్తామంటున్నారు. అవి మొదలయ్యేదో…ఎప్పుడు పూర్తయ్యేదో…కార్మికులకు న్యాయం జరిగేదెంతో తెలియని అయోమయ పరిస్దితి. అదలా వుంటే సినీ పెద్దలు గద్దలై వాలి ఓ పద్నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాటిలో అక్రమంగానే ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్న కారణంతో నిర్మాణాలు జరిగినా అవి సక్రమమేం కాదు. కార్మికులు భూమిని లాక్కొని రోహౌజ్‌లు నిర్మాణం చేసుకోవడం ఎవరికీ సమ్మతం కాదు. కాని నోరులేని కార్మికులు అన్యాయాన్ని భరించారు. అక్రమాలను చూస్తూ ఊరుకున్నారు. ఇక్కడ గోల చేస్తే సినిమాల్లో అవకాశాలు రావని భయపడ్డారు. కూలీ దొరక్కపోతే కడుపు మాడుతుదంని నోరు మూసుకున్నారు. కార్మికుల బలహీనత సినీ పెద్దలకు వరమైపోయింది. కార్మికులకు శాపంగా పరిణమించింది. ఓ వైపు కార్మికుల ఉసురు పోసుకుంటూనే మరో వైపు చిత్రపురిని రాబంధుల రాజ్యం చేసుకొని దోచుకున్నారు. రోహౌజ్‌ల పేరుతో కోట్ల స్ధిరాస్ధులను ఆక్రమించుకున్నారు. రాబంధులకన్నా మేమేం తక్కువ అని నిరూపించుకున్నారు.

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అప్పగించిన ఎస్ఐ.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల గ్రామానికి చెందిన టేకు లక్ష్మయ్య కి చెందిన మొబైల్ ఫోను మరియు ముచ్చిని పర్తి గ్రామానికి చెందిన గుండివేటి రాజిరెడ్డికి చెందిన మొబైల్ ఫోన్లను తిరిగి అప్పగించిన చిట్యాల ఎస్ఐ ఈ శ్రావణ్ కుమార్
చిట్యాల గ్రామానికి చెందిన టేకు లక్ష్మయ్య తను మూడు నెలల క్రితం చిట్యాల నుంచి భూపాలపల్లి బస్సులో వెళుతున్న క్రమంలో గుర్తు లేని వ్యక్తులు తన మొబైల్ ఫోన్ చోరీ చేశారని చిట్యాల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా అట్టి మొబైల్ ని సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఈరోజు గుర్తించి తిరిగి అప్పగించారు
-ముచినిపర్తి గ్రామానికి చెందిన గుండెవేటి రాజిరెడ్డికి చెందిన మొబైల్ ఫోను తను ఆరు నెలల క్రితం తన ఇంటి ముందు తన మొబైల్ ఫోన్ పెట్టి ఇంట్లోకి వెళ్లి వచ్చే క్రమంలో తన మొబైల్ ఫోన్ కనబడట్లేదని చిట్యాల పిఎస్ లో దరఖాస్తు ఇవ్వగా అట్టి మొబైల్ ని ఈరోజు గుర్తించి తిరిగి అప్పగించిన చిట్యాల పోలీస్ఇట్టి మొబైల్ లను గుర్తించడానికి కృషి చేసిన చిట్యాల సిబ్బంది కొమల, మమత,లాల్ సింగ్ లను అభినందించిన చిట్యాల ఎస్సై జి శ్రవణ్ కుమార్

ఎన్ ఎచ్ -44 నందు ఆక్సిడెంట్స్ (బ్లాక్ స్పాట్స్) జరిగే ప్రదేశాలను పరిశీలించిన

జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్….

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా లోని బాలానగర్ నుండి అడ్డకల్ వరకు వున్న నేషనల్ హైవే -44 పై ఆక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే ముఖ్యమైన బ్లాక్ స్పాట్స్ (బ్లాక్ స్పాట్స్ ) ను నెషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ ఎచ్ ఎ ఐ ) అధికారులు మరియు పోలీసు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్.సందర్శించరు..
నేషనల్ హైవే-44 పై చాలా ఆక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కొలిపోతున్నారు కావునా ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకి మరియు ఎన్ ఎచ్ ఎ ఐ అధికారులకి ప్రమాద నివారణ సూచనలు జారీ చేశారు.

1. స్పీడ్ కంట్రోల్: గరిష్ట వేగ పరిమితిని అమలు చేయడం. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను సీసీటీవీల ద్వారా గుర్తించి జరిమానాలు విధించడం.
2. సిగ్నల్స్ మరియు హెచ్చరికలు: ప్రమాదకరమైన మలుపులు, అడ్డగూడులు, స్కూల్ జోన్, రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్ ఏర్పాటు చేయడం.

3. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మెరుగుపరచడం: రోడ్డు క్వాలిటీని మెరుగుపరచడం మరియు గుంతలను సమయానికి సరిచేయడం.

4. సీట్బెల్ట్ మరియు హెల్మెట్ ఉపయోగం: సీట్బెల్ట్ మరియు హెల్మెట్ ధరించడం వంటి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. దీనిని అమలు చేయడానికి సర్విలెన్స్ ఇంకా పోలీసు పర్యవేక్షణ పెంచడం.
5. ప్రమాద నివారణ కార్యక్రమాలు: డ్రైవర్లకు అవగాహన సదస్సులు, ప్రమాదాల నివారణపై శిక్షణ తరగతులు నిర్వహించడం.
6. మెడికల్ ఫెసిలిటీలు: హైవేలపై అత్యవసర మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఎంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచడం.
7. సీసీటీవీ మరియు ట్రాఫిక్ మానిటరింగ్: కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టడం.
8. మద్యం సేవించి వాహనం నడపడం నివారణ: మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, రోడ్డు పక్కన శిక్షణ పరీక్షలు నిర్వహించడం.
ఈ చర్యలు అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించి భద్రతను మెరుగుపరచవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు, డీసీఆర్ బీ డీఎస్పీ రమణారెడ్డి, నేషనల్ హైవే అథారిటీ (ఎన్ ఎచ్ ఎ ఐ ) అధికారులు, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు..

జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.

జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ డిమాండ్*

చిట్యాల, నేటి దాత్రి :

మంగళవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా దేశాయి పేటలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం సిగ్గు చేటన్నారు.తన బార్య సావిత్రి బాయ్ పూలే ద్వారా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించిన గొప్ప మేధావి అని కొనియాడారు. హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. మహానీయుల విగ్రహలను గతంలో ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించక పోవడం వల్ల ఈసంఘటన జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు వెంటనే దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌల్కోండ సురేష్ అంబేద్కర్ యువజన సంఘం మండల మాజీ అధ్యక్షుడు బొడ్డు ప్రభాకర్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి బొట్ల ఆనందం నాయకులు నేరేళ్ళ సమ్మయ్య వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు రమేష్ రవి పోషయ్య తదితరులు పాల్గొన్నారు

పాఠశాల భవనాన్ని కూల్చిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్ డిమాండ్

కాటారం, నేటిదాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గల తరగతి గది భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా కూల్చివేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న గ్రామస్తులతో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశారు. చిదినేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్లు కలిసి భవనం కూల్చివేతకు పాల్పడ్డారని, జిల్లా కలెక్టర్ ను, జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ముందస్తు అనుమతులు లేకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ఆయన ప్రశ్నించారు. శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వ భవనాలను కూల్చాలంటే సంబంధిత శాఖ అధికారుల సమగ్ర సమాచార నివేదిక మేరకు మాత్రమే చర్యలు చేపట్టాల్సి ఉండగా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా భవనాన్ని కూల్చడం చట్ట విరుద్ధ చర్యగా బొడ్డు స్మరన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చివేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సదరు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరన్ డిమాండ్ చేశారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి

హసన్ పర్తి / నేటి ధాత్రి

వర్ధన్నపేట నియోజక వర్గం హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజయ్య ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకుని వర్ధన్నపేట నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం చేశారు. వీరి వెంట బిజెపి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కాజీపేట దర్గా చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు

పర్వతగిరి నేటి ధాత్రి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ పాల్గొని చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అతి సార, శ్వాస కోశ వంటి రోగాల నుండి దూరంగా ఉండవచ్చని సూచించారు. జిల్లా స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ మలినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ స్నానం కన్నా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అతి ముఖ్యమని అన్నం తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో బాగా రుద్ది శుభ్రపరచుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పాక శ్రీనివాస్ , ఎంఈఓ జి. లింగారెడ్డి పంచాయతీ కార్యదర్శి రఘు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..

error: Content is protected !!
Exit mobile version