నేటి ధాత్రి
అడ్డ గూడూరు:-
పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న నివారణ టీకాలను పశువులకు వేయించుకోవాలని రైతులతో, పశుపోషకులతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి. కృష్ణ అన్నారు అడ్డగూడూరు మండల కేంద్రంలోని పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం పశువులకు గాలికుంట వ్యాధుల సోకకుండా నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వి కృష్ణ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి అనేది ప్రమాదకరమని ఈ వ్యాధి సోగిన పశువులకు నోటిలో,కాళ్లలో పుండ్లు ఏర్పడి మేత మెయ్యక నడవలేని స్థితిలో పశువులు ఉంటాయన్నారు. రైతులు, పశుపోషకులు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించి వ్యాధి సోకకుండా కాపాడుకోవాలని అన్నారు. అడ్డగూడూరు మండల కేంద్రంతో పాటు పరిసరాల్లో ఉన్న గ్రామాలలో ఈనెల 15 నుంచి నవంబర్14 వరకు నెల రోజులపాటు పశు వైద్య సిబ్బంది గ్రామాలలో పర్యటించి ఆవులు, ఎద్దులు, గేదెలకు ఉచిత గాలికుంటూ టీకాలు వేస్తారని అన్నారు. పశువులకు టీకాలు వేయించిన రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలని పశు వైద్య సిబ్బందికి తెలియజేశారు. ఈ యొక్క అవకాశాన్ని రైతులు, పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పశు వైద్యాధికారి అనిల్ రెడ్డి, వీఎల్ఏ శ్రీరాములు , వి ఏ ఈశ్వరయ్య , గోపాలమిత్ర (సీనియర్ ) బండి కొమరయ్య, రైతులు, పశు పోషకులు తదితరులు పాల్గొన్నారు