జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట పట్టణంలో నివాసముంటున్న మేడిపల్లి శ్రీయాన్షి (4) గుండె పోటుతో మృతి చెందింది.భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడి పల్లి గ్రామానికి చెందిన రాజు జమున దంపతులకు ఇద్దరు పిల్లలు .జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కూతురు ఒక కొడుకు ఉన్నారు.మేడిపల్లి శ్రీయాన్షి మంగళవారం కండ్లు తిరుగుతున్నాయి అంటూ అస్వస్థతకు గురికాగా హనుమకొండ లోని ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. పుట్టిన సమయంలోనే చిన్నారికి గుండెలో హోల్ ఉందని దాన్ని గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు తెలిపారు. చిన్నతనంలోనే గుండెపోటు రావడం పట్ల పలువురు దిగ్బాంతిని వ్యక్తం చేశారు.