తంగడపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో మిషన్ భగీరథ పైపులు పలగడం వలన నీటి కొరత అప్పుడప్పుడు రావడంతో గ్రామప్రజలు నీటి కొరత ఎదుర్కోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మధుకర్ పై అధికారులతో మాట్లాడి శాశ్వతపరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరారు బోరు ఉన్న స్థలంలో గ్రామపంచాయతీ అధికారులతో మాట్లాడి బోర్ స్టార్ట్ చేపించి ప్రజలకు నీటి సౌకర్యం అందేలా చర్యలు తీసుకున్నారు అలాగే బోరు లేని ఏరియాలో గ్రామపంచాయతీ నుండి వాటర్ ట్యాంకర్ ను పంపుతున్నామని గ్రామపంచాయతీ అధికారులు తెలియజేశారు ఎలాగైనా నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమే దిశగా సంబంధిత అధికారులు కానీ నాయకులు గానీ చొరవ తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం మృతి చెందిన జంగపే ల్లి. బాబు అకాల మరణం చెందగా చెల్లించిన పోలీసులు వారి కుటుంబానికి సంతాపం తెలియజేసి వారికి తోచినంతగా50 కేజీల బియ్యం అందించిన తంగళ్ళపల్లి పోలీసులు చనిపోయిన కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం పట్టణంకి చెందిన వారు ఆరోగ్యం బాగొలేక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాటికి సంబంధించిన బిల్లులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయగా వారికి చెక్కులు రావడం జరిగింది. అట్టి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా సంబంధిత వారికి అందజేసారు.
శిల్పినగర్ కాలనీ చెందిన ఉపేందర్ కు 60000 వేల రూపాయల చెక్కను అందజేసినందుకు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి, గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
పరకాల నేటిధాత్రి మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు తిక్క శీను మాదిగ ఆధ్వర్యంలో గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏకు శంకర్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటిసారి తానే వర్గీకరణ చేస్తానని అవసరమైతే గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి రెండు నెలలు గడుస్తున్న చేయకపోగా కమిటీలు కమిషన్ల పేర్లతో కాలయాపన చేస్తూ మాదిగలను నమ్మించి మోసం చేయడం గ్రూప్-1 గ్రూప్-2 తో పాటు డిసెంబర్ నాటికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ లేకుండానే వాటిని పూర్తిచేసే పనిలో ఉన్నారని మాదిగల ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తూ మహాజన నేత మంద కృష్ణ మాదిగ తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలో భాగంగా ఈ నెల 26 న ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మ యుద్ధ మహసభను జిల్లా లోని ప్రతి ఒక్క మాదిగ విద్యార్థి మరియు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కామిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోర్ర రాజయ్య,శ్రీపతి ఐలయ్య,మాజీ వార్డ్ మెంబర్ జేరిపోతుల రాజు,తిక్క భద్రయ్య,నాగయ్య,దిలీప్,రఘుపతి,యశ్వంత్,వినయ్,రాకేష్ మాదిగ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
`తక్కువ సంఖ్యలో వున్న యూనియన్ తో చర్చలతో ఏం సందేశమిస్తున్నారు.
`కమీషనర్ తో చర్చలకు హజరైన యూనియన్ లీడర్లే వేల కోట్ల బకాయిలు న్నారు.
`డిఫాల్టర్లకు వడ్లు ఇవ్వము అని మళ్లీ వారితోనే చర్చలు జరిపడాన్ని సబ్ కమిటీ ఎలా సమర్థించుకుంటుంది.
`సబ్ కమిటీ నిర్ణయం మిల్లర్ల మధ్య మరింత దూరం పెంచదా!
`ఆధిపత్యపోరుకు దారి తీయదా!
`హాలు చిన్నదన్న సాకుతో రా రైస్ మిల్లర్లను దూరం పెడుతారా!
`వారిని కూడా పిలిచి మాట్లడలేరా!
`కమీషనర్ నిర్ణయం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది.
`మంత్రులను రాజకీయంగా ఇబ్బందుల పాలు చేస్తుంది.
`మిల్లర్ల తో మాట్లాడితేనే వారి సమస్యలు మంత్రులకు తెలుస్తుంది.
`కమీషనర్ మాత్రమే జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది.
`ప్రతిపక్షాలకు మళ్ళీ ఆయుధమిచ్చినట్లౌతుంది.
`ప్రభుత్వం విమర్శల పాలౌతుంది.
`పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
`రెండు రకాల మిల్లర్ల సమావేశం మంత్రుల సాక్షిగా జరగాలి.
`ఏక కాలంలో ఒకే వేదికపై సమస్యలు వినాలి.
`రా రైస్ మిల్లర్ల సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
`మిల్లర్ల వ్యవస్థలో ఆధిపత్య దోరణికి పుల్ స్టాప్ పడాలి.
`మొత్తంగా ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు కావాలి.
`మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.
`దళారులు దోచుకుపోకుండా చూడాలి.
`మిల్లర్ల మధ్య విభజన లేకుండా సమన్వయపర్చాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో జరిపే చర్చల్లో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. మిల్లర్ల మధ్య అగాధాలకు కారణమౌతున్నాయి. వారి మధ్య దూరం మరింత పెంచేందుకు దారి తీస్తున్నాయి. తెలంగాణలో మిల్లర్లు రెండు రకాలు. మిల్లర్లతో సబ్ కమిటీ సాగించిన చర్చల్లో వారిని కలుపుతున్నారా? విడదీస్తున్నారా? అన్న సందేహాన్ని మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కమీషనర్ చర్యలు పరోక్షంగా సబ్ కమిటీకి చెడ్డపేరు తెచ్చేలా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రా రైస్ మిల్లర్లు, బాయిల్డ్ రైస్ మిల్లర్లు వున్నారు. రెండు దశాబ్ధాల క్రితం వరకు బాయిల్డ్ రైస్ మిల్లులే తెలంగాణలో ఎక్కువగా వుండేది. కాని ఇప్పుడు రా రైస్ మిలర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రా రైస్ మిల్లుల సంఖ్యతో పోల్చితే బాయిల్డ్ రైస్ మిల్లులు నాలుగో వంతు కూడా వుండవు. కాని యూనియన్ మాత్రం బాయిల్డ్ రైస్ మిల్లర్ల చేతిలోనే వుంది. ఆ విషయంలో ఎప్పుడూ రా రైస్ మిల్లర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచిన సందర్భంలో బాయిల్డ్ రైస్ మిల్లర్లను మాత్రమే పిలిచారు. వారితో కమీషనర్ చర్చలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రా రైస్ మిల్లర్లు మాతో సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అప్పుడు కమీషనర్ చెప్పిన సమాధానం విని రా రైస్ మిల్లర్లు ఆశ్యర్యపోయారట. మిల్లర్లతో సమావేశానికి అవసరమైన హాలు చిన్నది కావడం వల్ల బాయిల్డ్ రైస్ మిల్లర్లను మాత్రమే ఆహ్వానించడం జరిగిందన్నారట. పైగా ఒకటి రెండు రోజుల్లో రా రైస్ మిల్లర్లతో కూడా సమావేశం వుంటుందని చెప్పి పంపించారట. కాని ఇంత వరకు రా రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి పిలుపు రాలేదు. సబ్ కమిటీ పేరుతో ఎలాంటి సమచారం అందలేదంటున్నారు. అసలు సమావేశానికి హాలే సమస్య అయినప్పుడు ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. ఏ హోటల్‌లోనైనా సమావేశం నిర్వహించుకోవచ్చు. మిల్లర్లతో ప్రభుత్వం జరిపే చర్చల్లో రహస్యం ఏమీ లేదు. రహస్య మంతనాలు చేసేదేమీ వుండదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎక్కడైనా మిల్లర్లతో సమావేశం నిర్వహించుకోవచ్చు. అంతే కాదు ప్రజా భవన్‌లో వేలాది మంది కూర్చునే హాల్స్ కూడా వున్నాయి. అక్కడ ఏర్పాటు చేసినా సరిపోయేది. కాని కేవలం హాల్ పేరు చెప్పి రా రైస్ మిల్లర్లను సబ్ కమిటీ పిలవకపోవడాన్ని రా రైస్ మిల్లర్లు తప్పు పడుతున్నారు. తమకు ప్రభుత్వంలో గుర్తింపు లేదా? అని ఆందోళన చెందుతున్నారు. రేపే మీతో సమావేశం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన కమీషనర్ నుంచి ఇంత వరకు ఎలాంటి సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రైతులు రైతువేదికల వద్ద వడ్లు అమ్ముతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇంకెప్పుడు తమతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం బకాయిదారులైన మిల్లర్లకు వడ్లు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది. దానిపై అధికారిక ప్రకటన కూడా చేసింది. మళ్లీ డిఫార్టర్లు ఎక్కువగా వున్న బాయిల్డ్ రైస్ మిల్లర్లనే చర్యలకు ఆహ్వానించడం వెనుక ఉద్దేశ్యమేమిటని రా రైస్‌మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలకు హాజరైన బాయిల్డ్ రైస్ మిల్లర్ల ప్రతినిధులే డిఫార్టర్లలో వున్నారని అంటున్నారు. సబ్ కమిటీతో సమావేశమైన మిల్లర్లు నాయకులే ప్రభుత్వానికి వేల కోట్లు బాకీ వున్నారన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారితో చర్చలు జరిపి ప్రభుత్వం ఏం సందేశం పంపుతోందని రా రైస్ మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి బాకీ పడిన మిల్లర్లలో ఎక్కువ శాతం బాయిల్డ్ రైస్ మిల్లర్లే అధికంగా వున్నారని తెలుస్తోంది. ఎక్కువగా వున్న రా రైస్ మిల్లర్లలో తక్కువ డిఫాల్టర్లు వుంటే, తక్కువ సంఖ్యలో వున్న బాయిల్డ్ రైస్ మిలర్లలో ఎక్కువ డిఫాల్టర్లు వున్నారని అంటున్నారు. అలాంటి సమయంలో అసలు డిఫాల్లర్లను చర్చలకు పివడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరపాలనుకుంటే రెండు రకాల మిల్లర్లతో ఏక కాలంలో సమావేశం నిర్వహించాలి. కాని కేవలం బాయిల్డ్ రైస్ మిల్లర్లనే సమావేశానికి ఆహ్వానించడంతో రా రైస్ మిల్లర్ల మీద అపోహలు ఏర్పడే ప్రమాదముంది. డిఫార్టర్లు రా రైస్ మిల్లర్లు వున్నారనే సంకేతాలు వెళ్లే అవకాశం వుంది. అందుకే తాము కూడా ప్రభుత్వంలో జరిగే చర్చల్లో పాల్గొంటే ఈ విషయం సబ్ కమిటీకీ తెలిసేదని రా రైస్ మిల్లర్లు వాపోతున్నారు. ఇక్కడ కూడా తమకు అన్యాయమే జరగడం బాదాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి చేసిందా? లేక తెలియక చేసిందా? అదే స్పష్టతనివ్వాలని కోరుతున్నారు. కమీషనర్ మిల్లర్లకు పిలుపులో ఈ వివక్షత ఎందుకు ప్రదర్శించారన్నదానిపై వివరణ కావాలని రా రైస్ మిల్లర్ల కోరుతున్నారు. ఈ సీజన్‌లో ఇక రా రైస్ మిల్లర్లతో సమావేశం లేదని చెప్పదల్చుకుంటే ఆ విషయమైనా స్పష్టంగా చెప్పాలని కోరుతున్నారు. ఒక వేళ మిర్లర్లలో రెండు రకాలు వున్నాయని తెలిసినా, యూనియన్ పరంగా ఒకే వర్గాన్ని పిలిస్తే సరిపోతుందని అనుకున్నారా? లేక ఆ యూనియన్‌లోనే అన్ని రకాల మిల్లర్లు వున్నారన్న సమాచారంతో చర్చలకు పిలిచారా? తెలియాల్సిన అవసరం వుందన్నారు. ఎందుకంటే అటు రా రైస్ మిల్లర్ల సంఘం వేరు. ఇటు బాయిల్డ్ రైస్ సంఘం వేరుగా వున్నాయి. ఏ రకమైన మిల్లర్లు వారి సమస్యలను వ్యక్తం చేస్తారు. వారి వారి సమస్యలు వేరుగా వుంటాయి. ఒకరి సమస్యలు మరొకరు ప్రస్తావించే అవకాశం వుండదు. రాదు. అలాంటప్పుడు రెండు యూనియన్లకు ఏక కాలంలో పిలుపులు రావాల్సి వుండే. కాని రాలేదు. ప్రభుత్వానికి రా రైస్ మిల్లర్లు తమను కూడా చర్చలకు పిలవాలని కోరారు. అయినా ప్రభుత్వం నుంచి గాని, సబ్ కమిటీ నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. రేపు మీతో సమావేశమౌతామని కమీషనర్ చెప్పి ఇప్పటికి వారం రోజులు దాటిపోతుంది. అయినా ఎలాంటి స్పందన రాలేదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా సబ్ కమిటీ సమావేశం మూలంగా రెండు యూనియన్ల మధ్య మరింత దూరం పెరిగే అవకాశం వుంది. ఇది తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇరు వర్గాలకు నష్టమే జరుగుతుంది. పైగా రెండు యూనియన్ల మధ్య అగాధానికి దారి తీస్తుంది. ఆధిపత్యపోరుకు మరింత ఆజ్యం పోసినట్లౌతుందంటున్నారు. ప్రభుత్వం రెండు యూనియన్ల మధ్య సయోధ్య కుదిర్చాల్సిన సమయంలో సబ్ కమిటీతో జరిగిన చర్చలకు బాయిల్డ్ రైస్ మిల్లుల సంఘానికే ప్రాధాన్యతనిచ్చినట్లైంది. వారికి పెద్ద పీట వేసినట్లైంది. ఇది రెండు యూనియన్లపై ప్రభావం చూపుతుందని రా రైస్ మిల్లర్లు అంటున్నారు. నిజానికి మిల్లర్ల సమస్యలు మంత్రులకు రాజకీయ నాయకులకు తెలుస్తుంది. కాని కమీషనర్‌కు తెలిసే అవకాశం లేదు. మంత్రులకు నేరుగా మిల్లర్లతో ప్రజా సంబంధాలు, రాజకీయ సంబంధాలుంటాయి. దాంతో ఎప్పటికప్పుడు వారి వారి సమస్యలు మంత్రుల దృష్టికి వెళ్ల అవకాశం వుంటుంది. మిల్లర్లతో సమావేశంలో కమీషనర్ మాత్రమే జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాన్ని మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రతిపక్షాలకే ప్రభుత్వమే ఆయుధం అందించినట్లౌతుంది మిలర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వం విమర్శలపాలౌతుంది. పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం వుంది. రెండు రకాల మిల్లర్ల యూనియన్ ప్రనిధులతో ఏక కాలంలో మంత్రుల సాక్షిగా సబ్ కమిటీ సమావేశం సాగాలని రా రైస్ మిల్లర్లు కోరుతున్నారు. కేవలం బాయిల్డ్ రైస్ మిల్లర్ల సమస్యలు ఒక్కటే తెలుసుకుంటే సరైంది కాదు. రా రైస్ మిల్లర్ల సమస్యలు కూడా అదే వేదిక మీద తెలుసుకుంటే బాగుండేందని అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే మిల్లర్ల మధ్య వుండే ఆధిపత్యపోరుకు కూడా తెరపడే అవకాశం వుండేంటున్నారు. రెండు రకాల మిల్లర్ల ఏక కాల సమావేశంలో అసలు బకాయి దారులు ఎవరు? ఎవరెవరు ఎంతెంత బకాయిలు వున్నాయన్న సంగతి కూడా అప్పుడే వెలుగులోకి వచ్చే పరిస్దితి వుండేది. కాని సబ్ కమిటీని తప్పు దోవ పట్టించి ఇలాంటి సమావేశం నిర్వహించడం మూలంగా బకాయిలు పేరుకుపోయిన వారిలో భయం లేకుండాపోయే ప్రమాదం వుంది. అందువల్ల ఇప్పటికైనా సబ్ కమిటీ గాని, కమీషనర్‌గాని రా రైస్‌మిల్లర్లను కూడా పిలిచి చర్చలు జరిపితే బాగుంటుందని వారు కోరుతున్నారు.
పెద్దంపేట పంకెన ఇసుక క్వారీల నుండి అంబడ్ పెళ్లి గ్రామ మధ్య నుండి లారీలు వెళ్లడం తో ప్రమాదాలు జరిగి మృతి చెందడం జరుగుతుందని పాత రహదారిని బైపాస్ ఏర్పాటు చేసి లారీలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ మరియు తహసిల్దార్ లకు వినతి పత్రం అందించారు.మహాదేవపూర్ ఉమ్మడి మండలం లో నూతన మండలం పలిమెల గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్దంపేట, పంకెన, ఇసుక క్వారీల నుండి అధిక లారీలు అంబటి పెళ్లి గ్రామం మధ్యనుండి వెళ్లడంతో ఇప్పటికే ప్రమాదాలు జరిగి మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది అని, అలాగే అధిక లారీలు వెళ్లడంతో గ్రామంలో పిల్లలు పెద్దలు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందని, గ్రామస్తులు కలెక్టర్ మరియు తాసిల్దార్ లకు ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు. అంబడ్ పెల్లి గ్రామానికి సంబంధించి పాత రహదారి ని బైపాస్ రోడ్డు గా మార్చి ఇసుక లారీలు వెళ్లే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్ తహసిల్దార్లకు వినతి పత్రం ఇచ్చిన వారిలో గ్రామస్తులు, సూర్యనారాయణ, గుజ్జుల శంకర్, దామరకుంట శ్రీనాథ్, అమృత సంతోష్ ,పినిగాని దేవేందర్, వావిలాల దేవేందర్, బింగిరి రవి, పత్తి మల్లేష్ ,తో పాటు ఇతర గ్రామస్తులు ఉన్నారు
రైతులకు ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా పంటలు సాగవు తున్నాయి. ఎస్సారెస్పీ కాలువ అనేక మండలాల గుండా ప్రయాణించి పంటలకు నీరు అందుతుంది. మండలంలో రైతులు వాన కాలం,యాసంగి లో కాలువలద్వారా వచ్చే నీటితో చెరువులు నింపి సాగునీరు అందిస్తున్నారు కానీ మండల పరిధిలోని ఎస్సారెస్పీ 31 దాని ఉపకాల్వల అద్వా నంగా మారాయి ప్రధాన ఉప కాలువలు మరమ్మత్తులకు గురికాకపోగా పిచ్చిమొక్కలు పెరగడంలో సాగునీరు సాఫీగా పారడం లేదు.ఎస్సార్ ఎస్పీ కాలంలో దాదాపుగా 20 కిలోమీటర్ల మీద విస్తరించి ఉంది నిర్వాహన సక్రమంగా లేకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనం ఇస్తుంది అలాగే చాలా చోట్ల సీసీ లేని దెబ్బతిండి కొన్ని చోట్ల మొక్కలు ఎక్కువగా పెరిగిన చెట్లను కొట్టి కాలువల పడేశారు కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలు నిలిచిన మట్టి తొలగించేందుకు అధికారాలను దృష్టి సాధించలేక పోతున్నారు అధికారుల పర్యవేక్షణ కూడా రైతులు ఆరోపిస్తున్నారు వెంటనే మరమ్మత్తులు చేపట్టి కాలువల పూడికతీసి పిచ్చి మొక్కలను తొలగించి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఒకవేళ ఇలా జరగకపోతే పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
రైతులు సొంత డబ్బులతో మరమ్మత్తు పనులు
రైతులు సొంత డబ్బులతో పంట పొలాలకునీరు అందాలని కాలువ మరమ్మత్తు పనులు చేపట్టారు. కాలువ మధ్యలో రంద్రము పడి వృధాగా పోతున్న నీటిని ఎండిపోతున్న పంటల వైపు తరలించారు.
కాలువ మరమ్మతుచేసి నీరు అందేలా చూడండి
కాలువలను శుభ్రం చేయాలి
మూసికే అశోక్ రైతు శాయంపేట మండలం
రైతులు వానకాలం యాసం గిలో ఎస్సారెస్పీ నీరు ఈసారి ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది కానీ కాలువలు సరిగ్గా లేవు కాలువలో మట్టి పిచ్చి మొక్కలు పెరిగి, కొన్ని చెట్లను కొట్టి కాలువలో పడేయడం జరిగింది కాలువలు పరిస్థితి బాగాలేదు. ఎస్సాఎస్పి కాలువల్లో చెత్తా చెదారంతో పాటు కాలువలో మట్టిపూడిక పైరుకుపోయింది. కాలువలను శుభ్రం చేయించాలి దెబ్బతిన్న పలుచోట్ల మరమ్మతులు చేయించాలి. దీంతో కాలువలో చెట్లు పెరిగి పంట పొలాలకు నీరు అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువను శుభ్రం చేయించి నీళ్లు అందేటట్లు చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేశారు. .
పోలీస్ అమర వీరుల స్మరించుకుంటూ పోలీసు ఫ్లాగ్ డే ను నిర్వహించే కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు కవాతు మైదానము నందు జరిగే స్మృతి పరేడ్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జోగులాంబ జోన్ డి ఐ జి ఎల్.ఎస్.చౌహన్, ఐపీఎస్ పాల్గొన్నారు.
పరేడ్ అనంతరం డి ఐ జి మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని,వారి స్ఫూర్తి నిత్యం మనతో ఉంటుందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని డీఐజీ తెలిపారు. 30 సంవత్సరాల కిందట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా వుండేదని, అప్పటిలో పోలీసులు విధి నిర్వహణలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు అని కొనియాడారు.
అమరవీరుల త్యాగాలను అనుక్షణం స్మరించుకోవాలి..
జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్…
గత సంవత్సర కాలంలో దేశంలో అమరులైన 214 మంది పోలీసు అధికారులు ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి దేశ రక్షణ కోసం అమరులయ్యారని అన్నారు.ఈ పోలీసు అమరవీరుల త్యాగాలను మనమందరం అనుక్షణం స్మరించుకుంటూ దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆకాంక్షించారు. అనంతరం అమరవీరుల స్మారక స్థూపంనికి డి ఐ జి, విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయెందిర బాయి, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ లతో నివాళులు అర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి అమరులైన వారికుటుబలతో డి ఐ జి, కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కలిసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలున్నా వారి కుటుంబ సభ్యులను తెలుసుకోని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదనంతరం పోలీసు కవాతు మైదానము నుండి స్వర్గీయ పరదేశి నాయుడు చౌక్ (1 టౌన్ పీస్ ) వరకు అమరులైన వారి త్యాగాలను సమృచుకుంటూ, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్ స్పీ వెంకటేశ్వర్లు,జైల్ సూపరింటెండెంట్ వెకటేశం,డీసీఆర్ బీ డీఎస్ స్పీ రమణా రెడ్డి, ఏఆర్ డీఎస్ స్పీ శ్రీనివాసులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ప్రత్యేక ప్రాధాన్యత
ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి
పరకాల నేటిధాత్రి తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి దళిత జాతికి చెందిన ప్రొఫెసర్ యాదగిరికి మరియు నియామకమైన వారు దళిత జాతికి చెందిన వారిని వైస్ ఛాన్సలర్ గా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్బంగా చంద్రమౌలి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటిరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ప్రజాసంక్షేమ పథకాలతో మరియు ఎస్సీ సంక్షేమం కోసం మంచి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దళితులకు ప్రాధాన్యతనిస్తూ,ఇకముందు కూడా ప్రజా పాలనతో ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే త్వరలో రాబోయే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం ఎస్టీ సెల్ కన్వీనర్ పాలకుర్తి శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు పూరెల్ల సూర్యం,గోవింద సురేష్,ఒంటీరు వరుణ్, మడికొండ సంపత్,ఒంటేరు సుధాకర్,మడికొండ చంగల్, మేకల దేవరాజ్,తిక్క రామకృష్ణ,బొచ్చు రవికుమార్, ఎం.డి యాకూబ్ పాషా, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు కనకదుర్గ కాలని కి చెందిన బర్ల లలితమ్మ కుమారుడు బర్ల హర్ష వర్ధన్ ఇటీవల అనారోగ్య కారణాల బారినపడి మరణించిన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఆ కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకుల చేత ఆర్థిక సహాయాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ తెలియజేశారని పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పేర్కొన్నారు ఆర్థిక సహాయాన్ని అందించిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, రెండో వార్డ్ కౌన్సిలర్ ఫుల్లురి సుధాకర్, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, బొడ్డు వెంకటేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం నిజాంపేట మండల కేంద్రము లో పర్యటించారు. బచ్చురాజ్ పల్లి, రజక్ పల్లి, కల్వకుంట, కె.వేంకటాపూర్ గ్రామాల్లో సోసిటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మెదక్ జిల్లా వ్యాప్తంగా 478 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం ధాన్యానికి 500 రూ,, బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఆఖరి ధాన్యం వరకు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, పంజా మహేందర్, నసిరుద్దీన్, మారుతి ,లింగం గౌడ్, లక్ష్మా గౌడ్ ,సత్యనారాయణ రెడ్డి, లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ,రైతులు పాల్గొన్నారు.
ఇటీవలే పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన మండలంలోని కొండాపురం శివారు మేకల తండాకు చెందిన లాకావత్ శ్రీను కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం శ్రీను కుటుంబానికి 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులో శ్రీను పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ శ్రీను కుటుంబానికి అండగా నిలవాలని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరడంతో శ్రీను కుటుంబానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూతనందించామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలతో సంబంధం లేకుండా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. పేద విద్యార్థిని, విద్యార్థులకు విద్య, వైద్యం కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థికంగా ఆదుకునేందుకు తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. తండాలకు, గ్రామాలకు కావలసిన అవసరాలు సౌకర్యాలను గుర్తించి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్షణికావేశాలతో విలువైన ప్రాణాలను బలిచేసుకుని తల్లిదండ్రులకు కడుపు కోత ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. లకావతు శ్రీను చావుకు కారణమైన నిందితులు ఎంతటి వారినైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. లాకావత్ శ్రీను కు జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకూడదని, సమస్యను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. పేద కుటుంబాల అందరికీ ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపురం మాజీ సర్పంచ్ లాకావత్ కాళు రామ్ నాయక్, యూత్ నాయకులు లాకావత్ సురేష్ నాయక్, మొగుళ్ళ కుమార్, లాకావత్ సోమన్న తో పాటు మృతుడి కుటుంబ సభ్యులు, తండా పెద్దలు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు అమరవాది గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, అభివృద్ధి పనులు సత్వరమే జరిపించేందుకు చొరవ తీసుకోవాలని సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఐదవ వార్డ్ కౌన్సిలర్ జిలకర మహేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జిలకర మహేష్ మాట్లాడుతూ… డిఎంఎఫ్టి నిధులనుండి 59 లక్షల రూపాయలు 2023వ సంవత్సరంలో సిసి రోడ్ల, డ్రైనేజీల నిర్మాణాలకు మంజూరయ్యాయని, ఆర్ అండ్ బి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించిన పనులు జరిపించడం లేదని అందువలననే సోమవారం మంచిర్యాల కలెక్టర్ కు పనులు జరిపించేలా చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందించడం జరిగిందని పేర్కొన్నారు.
స్థానిక వరంగల్ జిల్లా ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ ని ప్రజాసంఘాల,విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ని కలిసి జిల్లాలో డిఎంహెచ్వో గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ లో మెరిట్ ఉన్న వ్యక్తుల వద్ద లంచాలు తీసుకోవడం,అంతేగాక పల్లె వెలుగు పోస్టింగ్ కోసం డాక్టర్ల నుండి డబ్బులు తీసుకోవడం, కంటి వెలుగు ప్రోగ్రాంలో ప్రతి యూనిట్ కు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసే దానిలో పూర్తిస్థాయిలో వాహనాలు కేటాయించకుండా అవినీతికి పాల్పడడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రి రెన్యువల్ కోసమని డాక్టర్ల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరిగింది, గ్రామాలలోని ఆర్ఎంపి ల వద్ద డబ్బులు వసూలు చేయడం, వీటన్నింటిలో బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మరియు సూపర్డెంట్ లను వెంటనే సస్పెండ్ చేయాలని రెగ్యులర్ డిఎంహెచ్వో ను నియమించాలని కోరగా బదులుగా కలెక్టర్ 24 గంటల్లో విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు అనంతరం ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…తడుగుల విజయ్ మాదిగ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు కట్ల రాజశేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బొట్ల నరేష్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి కల్లెపెల్లి సురేష్ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి మాడ రంజిత్ టీజీవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడపాక రాజేందర్ డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి రఫీ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయలేదని కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా ఇవ్వాలని మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెదక్ – హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతు రాజ్యమా రాక్షస రాజ్యమా.. రైతుబంధు రాకపోయే.. కల్యాణ లక్ష్మి పెళ్లిళ్లకు తులం బంగారం ఏమాయె… మహిళలకు 2500 అసలుకే లేదాయే… అని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లి అయితే ఒక్క లక్ష ఒక్క వెయ్యి పదహరు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటికి ఒక్క మహిళలకు కూడా ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మహిళలకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా, డిసిసి మాజీ చైర్మన్ ఎస్ నరేందర్ రెడ్డి, డిసిసి వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, సీనియర్ నాయకులు సంతోష్ కుమార్, కాశీనాథ్, ముత్యం ప్రవీణ్ కుమార్, మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు, రవితేజ రెడ్డి , బాగా రెడ్డి, వేమారెడ్డి, చిన్న ఘనపూర్ మాజీ సొసైటీ చైర్మన్ రంగారెడ్డి, సోమ నర్సింలు, ఆరే రవీందర్, నెల్లి కిష్టయ్య, రత్నయ్య, ఆంజనేయులు, తలారి దుర్గేష్ కొల్చారం మండలం మాజీ సర్పంచులు , ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మండలం కేంద్రంలో బీజేపి ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ జన్నే మొగిలి హాజరై పార్టీ అభిమానులకు సభ్యత్వాలు చేసి మాట్లాడుతూ దేశంలో గత పదేళ్లుగా మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని దేశ రక్షణ కు చేపట్టిన చర్యలను ప్రోత్సహిస్తూ, 2047 వరకు దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ సభ్యత్వాలు తీసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సభ్యత్వ నమోదు మండల ఇంచార్జ్ దుగ్యాల రాంచందర్, కో ఇంచార్జ్ కూర సురేందర్ రెడ్డి అంకాల స్వామి, పింగిలి శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఈ రోజు హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కలెక్టర్ ని ఆహ్వాణించిన అనంతరం పెరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలోని సాయుధ దళ పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘవిద్రోహశక్తులచే పోరాడి చనిపోయిన పోలీస్ పోలీసు అమర వీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని,శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించి ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించడంలో ఎల్లప్పుడు పోలీస్ శాఖ ముందు ఉంటుందని అన్నారు.శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటమే ప్రధాన కారణమని అన్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందని తెలిపారు.ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని,శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం నిరంతరం కాపలా కాస్తుంటారాని ఎండ,వాన,పగలు,రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగల్ని కూడా త్యజించి,ప్రజల కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలని సైతం పణంగా పెట్టి సంఘ విద్రోహశక్తులచే పోరాడి వీరమరణం పొందిన పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి,గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని తెలిపారు.అక్టోబర్ 21 అంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.1959లో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇదని తెలిపారు.ఈ సమరంలో 10 మంది జవాన్లు అమరులయ్యారని,1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులోని అక్షయచిన్ ప్రాంతంలో సుమారుగా 16,000 అడుగుల ఎత్తులో తీవ్రమైన చలిలో కాపలా కాస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లు, దురాక్రమణకు ప్రయత్నించిన చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి వీర జవాన్లు ప్రాణాలర్పించడం జరిగిందని తెలిపారు.అప్పటినుంచి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు.పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనo.పోలీసుల త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి,సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో,సేవాభావంతో పని చేస్తుందని అన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి చెప్పారు.అమర వీరులయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో అమరులయిన 214 మంది పేర్లను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్ చదివి వినిపించారు.అనంతరం జిల్లా కలెక్టర్,ఎస్పీ గార్లతో పాటు అక్కడ పాల్గొన్న అధికారులంతా అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.సాయి మనోహర్,డిఎస్పీలు చంద్రభాను,రెహమాన్,మల్లయ్యస్వామి,రవీందర్ రెడ్డి,సతీష్ కుమార్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మరియు సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,పోలీస్ కార్యాలయ సిబ్బంది,స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ పరిధిలోని గట్టు గూడెం గ్రామం లో జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము వెంకటేష్ ఉపాధ్యక్షులు గోవింద్ వెంకట్ ల ఆధ్వర్యంలో 30 గిరిజన కుటుంబాలు వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎటపాక మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలో లోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరియు ఆశయాలు వారి యొక్క నాయకత్వ పట్టిమ మీద నమ్మకంతో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరుతా ఉన్నారు అని ఒక నీతి నిజాయితీ గల నాయకుడుకు అండగా ఉండాలని ప్రజలంతా ఈరోజు భావిస్తున్నారని ఎటపాక మండలంలో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నామని కొద్ది కాలంలోనే ఎటపాక మండల వ్యాప్తంగా అధిక సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము వెంకట్ ఉపాధ్యక్షులు మోల సతీష్ మంద సుబ్రమణ్యం గోవింద వెంకట్ కార్యదర్శులు కుంజా అర్జున్ గల్లా శివకుమార్ డేగల రాఘవ కాకటి శశాంక్ కొమ్ము మహేష్ ఎస్కే సాయి దాసరి మహేష్ నవీన్ మహేష్ పదం శ్రీను గ్రామ పటేల్ పద్దం రాజు పద్దం శ్రీను సరియo కోటేష్ పద్దం రామకృష్ణ పద్దం లక్ష్మినర్స్ పెనుబలి సురేష్ పదం మహేష్ పదం రాములు నాగరాజు పెనుబల్లి వెంకటేష్ పద్దం చంటి పదం రాము అధిక సంఖ్యలో జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
చర్ల ఆస్పత్రి ఆవరణ0లో నిర్మించిన శవ పరీక్ష కేంద్రాన్ని తక్షణమే ఓపినింగ్ చెయ్యాలి
లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
CPIML మాస్ లైన్ (ప్రజాపంధా) పార్టీ చర్ల మండల కమిటీ
సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో చర్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో నిర్మించిన శవపరీక్ష కేంద్రాన్ని తక్షణమే ఓపెనింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ ఎన్నో ప్రజా పోరాటాల ఫలితంగా చర్ల మండలానికి శవపరీక్ష కేంద్రంన్నీ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు స్పందించి శవపరీక్ష కేంద్రాన్ని నిర్మించినందుకు అధికారులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కానీ శవ పరీక్ష కేంద్రం నిర్మించి ఆరు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఓపెనింగ్ చేయకపోవడం అనేది సరైన పద్ధతి కాదు అని వాపోయారు ప్రభుత్వం వైద్యాధికారులు చర్ల మండలంలోని ప్రజలు శవ పరీక్ష కేంద్రం నిర్వహణలో లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని అన్నారు మరణించిన మృతదేహానికి శవపరీక్ష చేయవలసి వచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని వాహనంలో వేసుకొని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లి ఒక రోజు మొత్తం అక్కడ ఉంచి పోస్టుమార్టం చేయించి మరణించిన మరుసటి రోజు ఇంటికి తీసుకువచ్చి దహన మరియు ఇతర కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది బంధువులకు అత్యంత వేదన కలిగించేటువంటి విషయం అని అంతే కాకుండా చర్ల మండలం పోలీస్ యంత్రాంగానికి కుడా ఎంతో సమస్యగా ఉంటు0దనీ అన్నారు కాబట్టి ఈ పరిస్థితిని వైద్య ఉన్నత అధికారులు అర్థం చేసుకోవాలి తక్షణమే వారం రోజుల్లో ఈ శవ పరీక్ష కేంద్రాన్ని ఓపెనింగ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ పార్టీ మండల నాయకులు చెన్నం మోహన్ , నరసింహ, పార్టీ నాయకులు రేగా ఆంధ్రయ ,జములు, గౌర్ల నాగమణి, పురటి సుశీల, గూడపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
మణుగూరు టౌన్.నేటి యువతకు స్ఫూర్తిదాయకం భార్గవి సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా ప్రశంస కష్టాలను కన్నీళ్లను దిగమింగుకొని అమ్మ ఆశీస్సులతో నిన్న సింగరేణి యాజమాన్యం ప్రకటించిన నూతన బాహ్య ఉద్యోగ ఫలితాలలో సింగరేణి మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) ఎక్స్ టర్నల్ అధికారిగా ఉద్యోగం సాధించిన మణుగూరు కు చెందిన భార్గవి …వివరాల్లోకి వెళితే మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన కుంచపు పద్మ రాజేందర్ దంపతుల (వడ్డెర) కుమార్తె భార్గవి కి తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే తండ్రి రాజేందర్ అనారోగ్యంతో చనిపోయాడు. అయినా తల్లి పద్మ అధైర్య పడక ఎవరిని చేయి చాచి అడగక కూలి నాలీ చేసుకుని మరియు మణుగూరు ఓసి లో కాంట్రాక్ట్ వర్కర్ గా కూడా పనిచేసి ఏకైక కుమార్తె భార్గవిని బీటెక్ మైనింగ్ చేయించింది. భార్గవి స్థానిక భరత్ విద్యానికేతన్ లో పదవ తరగతిలో తొంబయి శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైంది, స్థానిక కృష్ణవేణి జూనియర్ కాలేజీలో తొంబయి మూడు పాయింట్ రెండు శాతంతో ఇంటర్ పాస్ అయ్యింది. అనంతరం కొత్తగూడెం కేఎస్ఎమ్ మైనింగ్ పాఠశాలలో బీటెక్ మైనింగ్ చదివి 8.56 సిజిపిఏ తో ఉత్తీర్ణురాలైంది. చిన్నతనంలోనే భర్త చనిపోయినా కూడా అధైర్య పడక కూలి చేసుకుని తన తల్లి తన ఉన్నతికి ఎంతగానో శ్రమిస్తున్న అంశాన్ని మనసులో పెట్టుకొని భార్గవి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని సింగరేణి మైనింగ్ అధికారిగా ఉద్యోగం సాధించడం పట్ల పలువురు తల్లి కూతుళ్లను అభినందిస్తున్నారు. కరోనా సమయంలో సైతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన కుమార్తె భార్గవి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పద్మ పడిన తపన అమ్మ త్యాగానికి నిదర్శనం అని భార్గవి కూడా తన తల్లి ప్రోత్సాహంతో మైనింగ్ అధికారిగా ఉద్యోగం సాధించడం నేటి యువతకు ఎంతగానో స్ఫూర్తిదాయకం అని సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా అభినందించారు. ఈ సందర్భంగా భార్గవికి పలువురు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.