పరకాల నేటిధాత్రి
మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు తిక్క శీను మాదిగ ఆధ్వర్యంలో గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏకు శంకర్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటిసారి తానే వర్గీకరణ చేస్తానని అవసరమైతే గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి రెండు నెలలు గడుస్తున్న చేయకపోగా కమిటీలు కమిషన్ల పేర్లతో కాలయాపన చేస్తూ మాదిగలను నమ్మించి మోసం చేయడం గ్రూప్-1 గ్రూప్-2 తో పాటు డిసెంబర్ నాటికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ లేకుండానే వాటిని పూర్తిచేసే పనిలో ఉన్నారని మాదిగల ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తూ మహాజన నేత మంద కృష్ణ మాదిగ తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలో భాగంగా ఈ నెల 26 న ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మ యుద్ధ మహసభను జిల్లా లోని ప్రతి ఒక్క మాదిగ విద్యార్థి మరియు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో
కామిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోర్ర రాజయ్య,శ్రీపతి ఐలయ్య,మాజీ వార్డ్ మెంబర్ జేరిపోతుల రాజు,తిక్క భద్రయ్య,నాగయ్య,దిలీప్,రఘుపతి,యశ్వంత్,వినయ్,రాకేష్ మాదిగ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాదిగల ధర్మ యుద్ధ మహసభను విజయవంతం చేయండి-ఏకు శంకర్ మాదిగ
