రైతులకు రైతుబంధు ఇవ్వాలని.. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా..

– రైతుబంధు రాకపోయి…

– కల్యాణ లక్ష్మి పెండ్లిలకు తులం బంగారం ఏమాయే…

– ప్రతి మహిళలకు 2500 రూపాయలు అసలుకే లేదాయే…

– కొల్చారం మండలం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆవేదన.

కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:-

కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయలేదని కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా ఇవ్వాలని
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెదక్ – హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం
చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతు రాజ్యమా రాక్షస రాజ్యమా.. రైతుబంధు రాకపోయే.. కల్యాణ లక్ష్మి పెళ్లిళ్లకు తులం బంగారం ఏమాయె… మహిళలకు 2500 అసలుకే లేదాయే… అని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లి అయితే ఒక్క లక్ష ఒక్క వెయ్యి పదహరు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటికి ఒక్క మహిళలకు కూడా ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మహిళలకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా, డిసిసి మాజీ చైర్మన్ ఎస్ నరేందర్ రెడ్డి, డిసిసి వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, సీనియర్ నాయకులు సంతోష్ కుమార్, కాశీనాథ్, ముత్యం ప్రవీణ్ కుమార్, మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు, రవితేజ రెడ్డి , బాగా రెడ్డి, వేమారెడ్డి, చిన్న ఘనపూర్ మాజీ సొసైటీ చైర్మన్ రంగారెడ్డి, సోమ నర్సింలు, ఆరే రవీందర్, నెల్లి కిష్టయ్య, రత్నయ్య, ఆంజనేయులు, తలారి దుర్గేష్ కొల్చారం మండలం మాజీ సర్పంచులు , ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *