మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు

భూపాలపల్లి నేటిధాత్రి

మండలం కేంద్రంలో బీజేపి ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ జన్నే మొగిలి హాజరై పార్టీ అభిమానులకు సభ్యత్వాలు చేసి మాట్లాడుతూ దేశంలో గత పదేళ్లుగా మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని దేశ రక్షణ కు చేపట్టిన చర్యలను ప్రోత్సహిస్తూ, 2047 వరకు దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ సభ్యత్వాలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
కార్యక్రమంలో సభ్యత్వ నమోదు మండల ఇంచార్జ్ దుగ్యాల రాంచందర్, కో ఇంచార్జ్ కూర సురేందర్ రెడ్డి అంకాల స్వామి, పింగిలి శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version