తల్లి ఆశయాల నెరవేర్చిన తనయురాలు భార్గవి

పేదరికంలో కష్టాలను కన్నీళ్లను దిగమింగుకొని అమ్మ ఆశీస్సులతో సింగరేణి మేనేజ్మెంట్ (మైనింగ్) ట్రైనీ అధికారిగా

ఉద్యోగం సాధించిన మణుగూరు కు చెందిన భార్గవి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

మణుగూరు టౌన్.నేటి యువతకు స్ఫూర్తిదాయకం భార్గవి సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా ప్రశంస
కష్టాలను కన్నీళ్లను దిగమింగుకొని అమ్మ ఆశీస్సులతో నిన్న సింగరేణి యాజమాన్యం ప్రకటించిన నూతన బాహ్య ఉద్యోగ ఫలితాలలో సింగరేణి మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) ఎక్స్ టర్నల్ అధికారిగా ఉద్యోగం సాధించిన మణుగూరు కు చెందిన భార్గవి …వివరాల్లోకి వెళితే మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన కుంచపు పద్మ రాజేందర్ దంపతుల (వడ్డెర) కుమార్తె భార్గవి కి తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే తండ్రి రాజేందర్ అనారోగ్యంతో చనిపోయాడు. అయినా తల్లి పద్మ అధైర్య పడక ఎవరిని చేయి చాచి అడగక కూలి నాలీ చేసుకుని మరియు మణుగూరు ఓసి లో కాంట్రాక్ట్ వర్కర్ గా కూడా పనిచేసి ఏకైక కుమార్తె భార్గవిని బీటెక్ మైనింగ్ చేయించింది. భార్గవి స్థానిక భరత్ విద్యానికేతన్ లో పదవ తరగతిలో తొంబయి శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైంది, స్థానిక కృష్ణవేణి జూనియర్ కాలేజీలో తొంబయి మూడు పాయింట్ రెండు శాతంతో ఇంటర్ పాస్ అయ్యింది. అనంతరం కొత్తగూడెం కేఎస్ఎమ్ మైనింగ్ పాఠశాలలో బీటెక్ మైనింగ్ చదివి 8.56 సిజిపిఏ తో ఉత్తీర్ణురాలైంది. చిన్నతనంలోనే భర్త చనిపోయినా కూడా అధైర్య పడక కూలి చేసుకుని తన తల్లి తన ఉన్నతికి ఎంతగానో శ్రమిస్తున్న అంశాన్ని మనసులో పెట్టుకొని భార్గవి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని సింగరేణి మైనింగ్ అధికారిగా ఉద్యోగం సాధించడం పట్ల పలువురు తల్లి కూతుళ్లను అభినందిస్తున్నారు. కరోనా సమయంలో సైతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన కుమార్తె భార్గవి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పద్మ పడిన తపన అమ్మ త్యాగానికి నిదర్శనం అని భార్గవి కూడా తన తల్లి ప్రోత్సాహంతో మైనింగ్ అధికారిగా ఉద్యోగం సాధించడం నేటి యువతకు ఎంతగానో స్ఫూర్తిదాయకం అని సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా అభినందించారు. ఈ సందర్భంగా భార్గవికి పలువురు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు

KUNCHAPU BHARGAVI
D/o Kunchapu padma
Gandhi bomma center,Manuguru
Post:MANAGEMENT TRAINEE(MINING), E-2 GRADE (External)
Btech: MINING
8.56cgpa[KSM-kothagudem]
Ssc: 90%[Bharath vidyani kethan-manuguru]
Inter:93.2%[Krishnaveni junior College-manuguru]

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version