పెంచిన బస్సుపాస్ చార్జీలు వెంటనే తగ్గించాలి.
కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్. రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బస్సులపై చార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని రామాయంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చాలామంది నిరుపేదలే బస్సులపై ప్రయాణం చేస్తూ చదువుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో బస్ పాస్టర్ పై అమాంతం చార్జీలు పెంచడం వల్ల నిరుపేద విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు….