ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్
హన్మకొండ, నేటిధాత్రి:
కె .ఎల్.ఎన్ రెడ్డి కాలనీ ,మరియు పోచమ్మ మైదాన్ లో నూతనంగా ప్రారంభించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల కు ఇంటర్ బోర్డు నుండి ఎలాంటి అనుమతి లేదు , అయినప్పటికీ అల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల ను మోసం చేస్తూ హన్మకొండ లో ని కే. ఎల్. ఎన్ రెడ్డి కాలనీ లో మరియు వరంగల్ పోచం మైదాన్ బ్రాంచ్లలో అడ్మిషన్లు చేసుకుంటూ ప్రజలకు మోసం చేస్తున్నారు, ఎలాంటి కార్పోరేట్ కలశాలు ప్రజలకు మోసం చేస్తున్న ఇరు జిల్లాల డి.ఐ.ఈ.ఓ లు ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యానికి వత్తాసు పలకడం సిగ్గుచేటని హకీమ్ నవీద్ అన్నారు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆల్ఫోర్స్ కళాశాల కి సంబంధించిన ఈ బ్రాంచలలో అడ్మిషన్లు తీసుకొని తమ పిల్లలు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.త్వరలో ఇట్టి విషయంపై ఇంటర్మీడియట్ సెక్రటరీ గారి దృష్టి కి తీసుకువెళ్తామని ఆయన అన్నారు.

