ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయండి

రైతుల సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ ధ్యేయం..

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కు వారంటీ లేని హామీలు ఇచ్చినది.

పదేళ్ల కెసిఆర్ పాలనలో అభివృద్ధి.. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో కరువు..

కెసిఆర్ సంక్షేమం
బికెయంఆర్ అభివృద్ధి..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయం.

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను పొందిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

సోమవారం రోజు గద్వాల నియోజకవర్గం లో కె.టి దొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దర్శించుకుని దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించరు. అనంతరం
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కె.టి దొడ్డి మండల లో ఎన్నికల ప్రచారంనిర్వహించారు.
ఎమ్మెల్యే కి ఎంపీ అభ్యర్థి కి ప్రజాప్రతినిధులు నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ లో సాధ్యం కానీ అభివృద్ధి కార్యక్రమాలు పదేళ్ల తెలంగాణ పాలనాల్లో కేసీఆర్ నాయకత్వంలో సాధ్యం కావడం జరిగింది. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం కావడం జరిగింది. కెసిఆర్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అనేకమైన సంక్షేమ పథకాలను ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు కేసీఆర్ ని గర్వంగా చెప్పారు.
గతంలో ఈ ప్రాంతంలోని రైతులు జీవనోపాధి కోసం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వంటి ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పరిస్థితి ఉండేది. కెసిఆర్ పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు 24 గంటల కరెంటు సాగునీరు అందించి ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందించి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్లీ 100 రోజుల్లో కరువు ఏర్పడింది. నీళ్లు లేక కరెంటు లేక పంటలు ఎండిపోవడం పరిస్థితి వచ్చింది.
రైతులకు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు 15000 ఇస్తాను ఇయ్యలేదు ఊరికి సబ్సిడీ 500 రూపాయలు ఇయ్యలేదు రైతులకు రైతు మూలం రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఇంతవరకు చేయలేదు‌. కాబట్టి రైతులు పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి గెలిపించాలని కోరారు.

ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ..

నేను నడిగడ్డ వాసి పుట్టిన బిడ్డ పదేళ్లలో కెసిఆర్ పాలనలో గురుకులాల సంక్షేమం కోసం కేసీఆర్ సహకారంతో కార్యదర్శిగా పనిచేసే పది లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తుని తీర్చిదిద్దడం జరిగింది. నేడు ఆ విద్యార్థులు అతుస్థాయిలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ఇదేవిధంగా మంచి ఉన్నత స్థాయికి స్థాయికి ఎదిగే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినది అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలకు మోసం చేసి అధికారం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి హామీ గ్యారెంటీలను అమలు చేయలేక పోయినది. కేవలం మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ప్రలోభాలు పెట్టడం జరిగింది ఎన్నో ప్రభుత్వంలో అధికార పదవిలను ఇస్తామని మాటలు చెప్పడం జరిగింది. వాటన్నిని వాటిని కాదని కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందని కెసిఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా కెసిఆర్ ఆశీస్సులతో పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తే నాగర్ కర్నూల్ లో గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీ తరఫున ప్రశ్నించే గొంతుగా నిలబడి గద్వాల నియోజకవర్గంలో ప్రపంచ చిత్రపటంలో అభివృద్ధి చెందే విధంగా నా వంతు కృషి చేస్తానని. విద్యారంగం అభివృద్ధి కొరకు రైతుల అభివృద్ధి కొరకు అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కొరకు ప్రతిరోజు కృషి చేస్తానని తెలిపారు.
త్వరలోనే మే 13వ తేదీన జరగబోయే నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో కారు గుర్తు పైన ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, సత్యం రెడ్డి, శ్రీధర్ గౌడ్, చక్రధర్ రావు, ఎంపీపీలు మనోరమ్మ, ప్రతాప్ గౌడ్, రాజారెడ్డి, జెడ్పిటిసి లు రాజశేఖర్,పద్మ వెంకటేశ్వర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉరుకుందు, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ రఘ కుమార్ శెట్టి , మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version