వనపర్తి నేటిదాత్రి :
చిట్యాల రోడ్డులోని డబుల్ బెడ్రూంలో నివసించే పత్రిక విలేకరి మహమ్మద్ నిరంజన్ కూతురు సానియా ఇంటర్ ఒకేషనల్ లో 960 మార్కులు సాధించిన నేపథ్యంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టౌన్ కార్యదర్శి రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉమా, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, చత్రూ నాయక్, శివకుమార్, రాములు తదితరులు ఘనంగా సన్మానించారు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి లో నిరుపేద కుటుంబంలో పుట్టిన విద్యార్థినీ, విద్యార్థులు చాలామంది ఉన్నారని, వారు తెచ్చుకున్న మార్కులు వారి కుటుంబానికి కాక వనపర్తికి కూడా గర్వకారణమని అన్నారు
