చెల్పూర్ 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఘనంగ జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ లో 10 వ తరగతి 2004-2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనము, ఈ కార్యక్రమం లో గురువులని పూలు చల్లుతు స్టేజ్ మీదకి ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి
హజరైన అప్పటి ఉపాధ్యాయులు
మరియు విద్యార్థిని విద్యార్థులు
రిటైర్డ్ ఉపాధ్యాయులు నరహరి మధుసూదన్ రెడ్డి, శాస్త్రి , పాఠశాల హెడ్ మాస్టర్ అశోక్ కుమార్, ఓ సారయ్య , పి సత్యనారాయణ రావు, రాజి బాపు, సుధాకర్, ఏ సాంబయ్య, పట్టాభి , ఎల్ గణపతి , ఎన్ శ్రీధర్, వి సంపత్ , సదాశివుడు గార్లతో పాటు అప్పుడు చదువుకున్న సుమారు 63 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు మాట్లాడుతూ ఆ రోజుల్లో టీచర్ కనబడితే గౌరవంగా నమస్కారాలు చేసేవాళ్ళము గురువులు చెప్పిందల్లా క్రమశిక్షణ గా చేసేవాళ్లం టీచర్ క్లాస్ లో లేనప్పుడు అల్లరితో క్లాస్ రూమ్ మార్మోగేది టీచర్ క్లాస్ రూముకు రాగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండేది ఆ రోజుల్లో 26 జనవరి 15 ఆగస్టు జెండా పండుగల కు ఆటలు పాటలు ఉండేవి పోటీల్లో విజయం సాధించిన వారికి ప్రైజులు ఇచ్చేవారు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి సంతోషంగా స్కూలుకు వచ్చేవాళ్ళం 2004 2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది పదవ తరగతి అయిపోయి 20 సంవత్సరాలు కావస్తుంది గురువులకు నాతోటి విద్యార్థి విద్యార్థులకు ఈ సమ్మేళనానికి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్నారు, ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు వచ్చినవారు పొనగంటి సతీష్ .దొంగల నవీన్ రెడ్డి, యాషం రాజేష్, బీరెల్లి రాజు, గరిగెల రాజు కుమార్, అల్లం వేణు, వేల్పూగొండ శ్రీనివాస్, చుక్క రాము, శైలజ , స్రవంతి, జ్యోతి, స్వప్న, హసీనా , అర్చన , కంచర్ల కుమార్, ఎర్ర కుమార్, దండు సుమన్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version