ఎస్సై ప్రమోద్ కుమార్
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం ఎస్ఐ ప్రమోద్ కుమార్ మరియు తన సిబ్బంది మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ కూడలి బస్టాండులో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయివిక్రయించినకల్తీకల్లు అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెబుతూ సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, గంజాయి వాడకం జిల్లా నుండి మండలం నుండి పల్లెలకుచాప కింద నీరులా కూడా పాకిందని యువత తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వారి పిల్లల్ని గమనిస్తూ ఉండాలని గంజాయి తాగే వారిలో మత్తు అనేది నరాల వ్యవస్థ పై పని చేస్తుందని ఇంత ముందు ఎప్పుడు లేని విధంగా విపరీతమైన ఆకలి విపరీతమైన నవ్వు వస్తుంటాయని ఇటువంటి మార్పులు ఏవైనా చోటు చేసుకుంటే వెంటనే సంప్రదించాలని వారికి అవసరానికి మించి డబ్బులు ఇవ్వకూడదని తెలుపుతూ ప్రస్తుతం గంజాయిని అనేక రకాలుగా చాక్లెట్ల రూపంలో మిల్క్ షేక్ ల రూపంలో అమ్ముతున్నారు కనుక తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, గ్రామాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్న సమాచారం ఉన్న సేవిస్తున్న సమాచారం ఉన్న వెంటనే తెలియపరచాలని మన యువతను రక్షించుకోవా ల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.